డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేదో ‘‘వేదాంతం, వైరాగ్యం’’అని తీసి పారవెయ్యటం సబబుకాదు. ఇది వారి ప్రకృతి సహజీవన సిద్ధాంతానికి ఒక నిదర్శనం. వారి సిద్ధాంతాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం.
ప్రకృతితో, ముఖ్యంగా పంచభూతాలతో, కలిసి మనం సహజీవనం చెయ్యాలి. పాంచ భౌతికమైన ప్రకృతినుంచి మనకు కావలసిన సంపదను తీసుకుని, మనం జీవించవలసి వుంది. ఈ క్రమంలో మనం ప్రకృతిలోని పంచభూతాల సమతౌల్యానికి భంగం కలిగించవచ్చు. ఆమేరకు తగిన జాగ్రత్తలు పాటించవలసి వుంది.
పర్యావరణంలోని వాతావరణం గురించి, దాని కలుషీకరణం గురించి, దాని నివారణ గురించి, ప్రస్తావించే సూక్తాలు, మంత్రాలు, వేదాలలో అనేకం వున్నాయి. వేద సిద్ధాంతం ప్రకారం, ప్రధానంగా మానవజాతి సౌభాగ్యం జలం, వాయువు, ఓషధులు, భూమి, అనే వాటిమీద ఆధారపడి వుంది. అందులోనూ పర్యావరణంలో మానవుడికి ముఖ్యంగా సహకరించేవి జల వాయు భూములు.
వాయుమండలం- అధర్వవేదంలోని 4-25-3వ మంత్రంలో వాయుమండలపు మహత్త్వం పేర్కొనబడి వుంది. అలాగే 4-13-3వ మంత్రం వాయువును ‘‘విశ్వభేషజం’’ (అందరికీ ఔషధం వంటిది) అని పేర్కొంటూ, ఇది ప్రాణవాయువుగా సృష్టికీ, మనిషికీ, ప్రాణాన్ని అందిస్తుందనీ, అపాన వాయువుగా మాలిన్యాలను విసర్జన చేస్తుందని, చెప్పబడి వుంది.
ఋగ్వేదంలోని (10.185-1 నుండి 3)లో వాయువును స్తుతిస్తూ- ‘‘ఓ వాయూ! నీవు అమృతానికి స్థానానివి. నీవు జీవన శక్తులను ప్రసాదిస్తావు. నువ్వు సృష్టికి తండ్రివి, తల్లివి, తోబుట్టువును, మిత్రుడివి! నువ్వు సర్వరోగాలకు ఔషధానివి!’’ అన్నది.
ఋగ్వేదంలో మరో చోట
‘‘యదతో వాత తే గృహే అమృతస్య నిధిర్హితః తేన నో దేహి జీవాసి’’ (8-186-3) (ఓ వాయుదేవతా! నీలో అమృతనిధి దాచబడి వుంది. అందుకే నీవు మాకు దీర్ఘజీవనాన్నిప్రసాదించు) అని వుంది.
అథర్వవేదంలో 8-2-25వ మంత్రం ‘‘ప్రకృతి లేక వాతావరణం స్వచ్ఛంగా వుంటే మానవులు, జంతువులు, పక్షులు సంతోషంగా జీవించగలరు’’- అన్న భావాన్ని ప్రస్తావిస్తోంది.
ఓజోన్ పొర- భూమినీ, దాని వాతావరణాన్ని, భూమిమీది సృష్టినీ, పరిరక్షించే ఓజోన్ పొర ఒకటి ఆవరించి ఉన్నది అని ఆధునిక శాస్తవ్రేత్తలు చెపుతున్నారు.
ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం- భూమిని ఆవరించి వివిధ వాయువులతో కూడిన ఆవరణం, సుమారు 200 మైళ్ళ ఎత్తువరకు వ్యాపించి వుంటుంది. ఇందులో సుమారు 25నుండి 40 కి.మీ. మందం మేరకు ఓజోన్ వాయువు పొర వ్యాపించి వుంటుంది. ఈ పొరలోని వివిధ వాయువుల నిష్పత్తి ఈ విధంగా వుంటుంది.
నైట్రోజన్ (2)=78.08, ఆక్సిజన్ (్జ2)=20.95, ఆర్గాన్ (2)=9.3 కార్బన్ (్ళ్య2)= 03.
నియోన్ (ళ), హీలియమ్ (్హళ), క్రిష్టాన్ (), జెనాన్ (తిళ), ఓజోన్ (్జ3), హైడ్రోజన్ (్హ)- స్వల్ప భాగాలు.
ఈ ఓజోన్ వాయుమండలం భూమికీ, భూమిమీద గల సృష్టికి, భూమి చుట్టూగల వాతావరణానికీ కూడా రక్షణకవచంగా వుంటుంది. రోదసి నుండి భూమి మీదకు ప్రసరించే యాక్టివ్ కిరణాలను వడబోసి, అవరోధించి, సృష్టికి అనుకూలమైన కిరణాలను మాత్రమే నేలకు దింపుతుంది.
ఈ వడబోతను ప్రధానంగా ‘‘ఓజోన్’’అనే మూడు ఆక్సిజన్ పరమాణువులుండే వాయువుచేస్తుంది. కానీ ఆధునిక సమాజంలో పారిశ్రామీకరణ, రసాయనాల వాడకం వగైరాల దుష్ప్రభావం వలన, క్లోరో ఫ్లూరోకార్బన్లు విడుదలై, ఓజోన్ పొరకు గొడుగుమీది గుడ్డకు చిరుగులు పట్టినట్లుగా, అక్కడక్కడా రంధ్రాలు ఏర్పడతాయి. అందుచేత ఈ ‘‘రంధ్రాల’’ ద్వారా సూర్యుడి నుంచి వచ్చే విధ్వంసకర రేడియో ఆక్టివ్ కిరణాలు భూమిమీదకు నేరుగా ప్రసరిస్తాయి.
ఈ కిరణాలవలన భూమిమీది జంతువులకు చర్మరోగాలు రావటం, వృక్షాలకు ఆకులు వగైరా మాడిపోవటం వంటివి జరుగుతాయి. క్రమంగా వృక్ష, జంతుజాలమంతా రోగాల బారినపడి నశిస్తుంది.
ఇంత ప్రాధాన్యం వున్న ఓజోన్ పొరను గురించి మన ప్రాచీనులకు తెలుసా? అంటే ఎంతోకొంత తెలుసని చెప్పాలి. ఎందుకంటే ‘‘ఓజోను’’ అనే పేరుపెట్టకపోయినా, భూమిమీది ప్రకృతిని రక్షించే అంతరిక్ష గతమైన ఒకానొక పొరను గురించిన ప్రస్తావనలు ఋగ్వేదంలోనూ, అథర్వణ వేదంలోనూ కూడా కనిపిస్తున్నాయి.
ఋగ్వేదంలో-
మహత్తదుర్బం స్థవిరమ్ తదాసీత్
యేనావిష్టితః ప్రవివేసిథాపః (10-52-1) అనే మంత్రం వుంది.
అలాగే అథర్వవేదంలో-
‘‘తస్యోత జాయమానస్య ఉల్బ
ఆసీత్ హిరణ్మయః’’ (4-2-8) అనే మంత్రంవుంది.
ఈ రెండు మంత్రాలలోనూ ‘‘ఉల్బం’’అనే పదం వాడబడింది. దానికి ఆవరించి వుండే పదార్థము అని అర్థం. అది రక్షకంగా వుందని కూడా పై మంత్రాలు సూచిస్తున్నాయి. అందువల్ల భూమిచుట్టూ రక్షణకరమైన ఆవరణ ఒకటి వుందని మన మహర్షులకు తెలుసునని నిశ్చయంగా చెప్పవచ్చు.
జలమంతలం:- మన భూమిమీద సర్వచరాచర ప్రాణులు ‘‘జలమండలం’’ మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. కనుక ఈ జలమండలపు సమతౌల్యంలో తేడావస్తే, సృష్టిలోని జీవులన్నీ దెబ్బతినే అవకాశం వుంది.
జల మండలంలో 72శాతం సముద్రం మొదలైన జలవనరులలో వుండే నీరు, ఇది మనుషులు తాగటానికి పనికిరాదు! మిగిలిన దాంట్లోకూడా 3 శాతం మాత్రమే తాగటానికి పనికివస్తుంది. ఈ మూడు శాతం జలంతోనే సృష్టిలోని ఎన్నోరకాల జీవజలాలు తమ జీవయాత్ర సాగిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ ఆధునిక విజ్ఞానం గుర్తించింది. వీటిని గురించి ప్రాచీన భారతీయ దృక్పథం ఏమిటో ఇక పరిశీలిద్దాం.
ఋగ్వేదం (1-23-20) జలం ప్రాధాన్యాన్ని ఇలా ప్రశంసిస్తోంది- నీరే జీవం, అమృతం, ఔషధం, సర్వవ్యాధి నివారణోపాయం, ఆయుర్వృద్ధికరం- అని. ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి