డైలీ సీరియల్

పచ్చబొట్టు-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా నిరాశపడకురా. ఎవరో ఒకరు రాసి పెట్టే ఉంటారు. వాళ్లు దొరికేదాకానే ఈ వెతుకులాట’’.
‘‘ఏమో! నీ నోటి పుణ్యమా అని ఇది నిశ్చయమయితే అంతకన్నా కావాల్సింది నాకేముంటుంది?’’
‘‘సరేరా! ఇక ఉంటాను’’ అన్నీ సక్రమంగానే జరుగుతాయిలే’’ అని ఆయన భుజం తట్టి ధైర్యం చెప్పి తన ఇల్లు రావటంతో ఆగిపోయారు.
ఆయన సందు తిరిగేదాకా చూసి ఒక నిట్టూర్పు విడిచి మెట్లు ఎక్కటం ప్రారంభించారు.
తాళం తీసుకొని లోపలికి వచ్చి వాలుకుర్చీలో కూర్చున్నాడు.
‘‘మంచినీళ్ళు తెచ్చిమ్మంటావా నాన్నా!’’ అడిగాడు అనే్వష్.
‘‘వద్దు. ఇప్పుడే లేచినట్లున్నావ్’’ అన్నాడు అతని అవతారం చూసి.
భుజంమీద తుండు, చేతిలో బ్రష్, రేగిన జుట్టు అందుకు తార్కాణాలుగా ఎదురుగా కనిపిస్తున్నాయి.
‘‘అవును నాన్నగారూ! రాత్రి డ్యూటీ నుంచీ వచ్చేటప్పటికి ఒంటి గంట అయింది. మా పోలీసు ఉద్యోగానికి ఒక టైము ఉండదుగా’’
‘‘ఊఁ!’’ అంటూ తల పంకించారు. నీతీ, నిజాయితీలకు నిలయంగా తను బ్రతుకుతూ దేశానికి సేవ చేస్తున్నా ఆయనకు తృప్తిలేదు. ఇంకా దేశం కోసం ఎంతో చెయ్యాలన్నదే ఆయన తపన. దాని ఫలితమే ఆయన తన ఏకైక కుమారుణ్ణి మంచి పోలీసు ఆఫీసరుగా నిలబెట్టారు. అంతేకాదు, కూతురు విద్యను దేశ ప్రజలకు ఉచితంగా సేవ చేసే డాక్టరుగా కళ్లముందు నిలుపుకున్నారు. ఇద్దరు రత్నాల్లాంటి బిడ్డలను కన్నారని ప్రతి ఒక్కరి మెప్పు పొందుంటారాయన.
పిల్లలను అందరూ కనగలరు కానీ వారిని తాము కోరుకున్నట్లుగా తీర్చిదిద్దగలగటం మాత్రం కొందరికే సాధ్యం. ఆ భాగ్యం అందరికీ దక్కేది కాదు.
ఆ ఆలోచనలనుంచి బయటకు వచ్చీ రాగానే ప్రొద్దున పేపర్లో చదివిన విషయం గుర్తువచ్చింది.
‘‘అవునూ ఈ రోజు పేపరు చూసావా?’’
‘‘లేదు. బ్రష్ చేసుకొని చూద్దామని. స్పెషల్ న్యూస్ ఏమయినా ఉందా?’’
‘‘ఆఁ! చెప్పేకంటే నువ్వు చదివితేనే మంచిది. మీకంతా మంచి ఫుడ్ దొరికినట్లే’’ అన్నారు నవ్వుతూ.
‘‘అన్నయ్యా! గుడ్ మార్నింగ్’’
విద్య ఆ రోజు పేపరు చేతిలోకి తీసుకుంటూ విష్ చేసింది.
‘‘గుడ్ మార్నింగ్ గుడ్డు పెట్టి మరీ చెప్పాలి. ఇలా ఊరికేకాదు’’ ఉడికించాడు చెల్లిని.
‘‘గుడ్లు పెట్టేది హెన్స్ నాట్ మెన్ అండ్ ఉమెన్’’
‘‘పిచ్చి చెల్లీ. నేను పెట్టనున్నదీ ఆ కోడిగుడ్డునే. ఫ్రిజ్‌లో ఉంది తీసుకొచ్చి మార్నింగ్ ఇస్తే గుడ్ మార్నింగే కదా!’’
‘‘్ఫ! అన్నయ్యా! ఇంత చదువు చదివిన ననే్న రోజూ ఇలాంటి విషయాలలో పడేస్తూ ఉంటావ్.’’
బుంగమూతి పెట్టింది విద్య.
టవల్‌తో ముఖం తుడుచుకుంటూనే చెల్లి దగ్గరకు వచ్చి ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి ‘‘నా బంగారుచెల్లి బుంగమూతిలో మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ఉడికిస్తుంటాను. ఇది తెలిసికూడా మరింత ఉడుక్కుంటూ ఉంటావ్. ఇది మనిద్దరికీ అలవాటేగా!’’
ప్రసాద్‌గారు నవ్వుకుంటున్నారు వాళ్ళిద్దరి సంభాషణలు వింటూ.
చెల్లి చేతిలోని పేపరును తీసుకొన్నాడు.
పేపరులో వార్త చదవగానే అతని భృకుటి ముడిపడింది.
‘‘ఎవరు ఈ పచ్చబొట్టు?’’ ఆలోచనల్లో పడ్డాడు అతను.
అసలు ఈ పచ్చబొట్టు అనేది ముఠానా,
సంస్థా?
స్ర్తియా, పురుషుడా? ఎవరై ఉంటారు. ఎవరయినా వాళ్ళ ఆలోచన చట్టబద్ధమయినది కాదు. సరే చూద్దాం!’’
‘‘అన్నయ్యలుంగారు ఏదో తీవ్ర ఆలోచనలో ఉన్నట్లున్నారు.’’
‘‘అవునురా చిన్నా!’’
అది అతను చెల్లెలికి పెట్టుకున్న ముద్దు పేరు.
‘‘ఈరోజు ఒక కేసు కోర్టులో హియరింగ్ ఉంది. ముద్దాయిని తీసుకువెళ్ళాలి.’’
‘‘పోనీలే నేనీరోజు ఒక్కర్తినీ వెళ్ళిపోతాను హాస్పిటల్‌కి.’’
‘‘వద్దురా! నిన్నక్కడ డ్రాప్‌చేసి నేను వెళతాను. తొందరగా టిఫిన్, స్నానం కానిచ్చెయ్!’’
‘‘అలాగే! అన్నయ్యా అమ్మలేకపోతే బోర్‌గా ఉంది కదూ! అప్పుడే అమ్మ వెళ్ళి పది రోజులయింది’’ దిగులుగా అంది విద్య.
‘‘నువ్వు హాస్పిటల్ నుంచీ వచ్చేటప్పటికి అమ్మ ఇంట్లో ఉంటుంది. వచ్చేస్తున్నానని చెప్పింది. నేనే మీకు సర్‌ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు.’’ అన్నారాయన.
‘‘అమ్మ లేకుండా ఎప్పుడూ ఉండంగా. అందరం కలిసి వెళ్ళకుండా అమ్మ ఒక్కటీ వెళ్ళటం ఏమిటో ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది.’’
‘‘ఇప్పుడే అలా బెంగ పెట్టుకుంటే రేపు పెళ్ళయితే అమ్మను విడిచిపెట్టి ఎలా ఉంటావే?’’
‘‘నేనసలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళితే కదా? ఇక్కడ ఉంటానన్న అతనే్న చేసుకుంటాను.
‘‘సరేలే! ‘యమకింకరుడు’లో లాగా చిరంజీవి లాంటి మొగుడ్ని పట్టుకొస్తా!’’
ఆ మాటకు విద్య కళ్ళు కన్నీటి చెరువులయ్యాయి.
అది చూసి కలవరపడ్డాడు.
‘‘ఏమిటిరా చిన్నా! ఏదో తమాషాకి అంటే నువ్విలా ఏడిస్తే భరించలేను.’’
‘‘పోయిపోయి ఆ సినిమాతో పోలుస్తావేమిటి? అందులో హీరోయిన్ అన్నయ్య చచ్చిపోతాడు. నిన్నలా ఊహించుకోవటంకంటే నేను పెళ్ళిచేసుకోక పోవటమే బెటర్.’’
‘‘పిచ్చి చెల్లీ! ప్రాణంపోవాలని ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది. అది మన చేతిలో లేదు. ఇంత చిన్నదానికి బెంబేలు పడిపోయే నువ్వేం డాక్టరువే తల్లీ!’’
‘‘్ఛ! పో! మా హాస్పిటల్‌లో అందరికంటే నాకే మంచి పేరు ఉంది తెలుసా’’
‘‘అవునవును. మీ హాస్పిటల్ దగ్గర చెరువు ఉందిగా. ఆ మెట్లు చుట్టూ నిన్న గుంపులుగుంపులుగా జనం చేరి మాట్లాడుకుంటున్నారు. ఏమిటా అని చూస్తే విద్య అంత మంచి డాక్టరమ్మ ఎవరూ లేరని.’’
‘‘్ఫ! అన్నయ్యా! నీవన్నీ పరాచికాలే!’’
‘‘పోతున్నా! పోతున్నా! ఎలాగూ స్నానానికి లేవాలిగా. తొందరగా టిఫిన్ రడీ చేసెయ్!’’
అంతవరకూ హాస్యంగా మాట్లాడుకున్న వాళ్ళిద్దరూ చకచకా పనులు ముగించుకొని బయలుదేరుతూ ‘వెళ్ళొస్తాం నాన్నగారండీ’అన్నారు ఒకేసారి.
‘‘అలాగే వెళ్ళిరండి’’ అన్నారు కళ్ళనిండా వాళ్ళిద్దరి రూపాల్ని నింపుకుంటూ.
దేశంకోసం, ప్రజల భద్రతకోసం పోరాడే కాకీ డ్రస్ అంటే ఆయనకు అంతులేని అభిమానం. ఆ డ్రస్సులో తన కుమారుడ్ని చూసి ప్రతి నిముషం నేను ఈ దేశానికి ఎంతోకొంత సహాయపడుతున్నానని తృప్తిపడుతుంటారు. అలాగే విద్య. తెల్లటి మల్లెపూవులా స్వచ్ఛంగా తెల్లచీర కడితే శాంతిదూతే. ఆమె చెయ్యిపడితే ఎలాంటి జబ్బుఅయినా భయపడి పారిపోతుందని ప్రతీతి. ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టర్ ఇలలో దైవమని నమ్ముతారు ఆయన. అందుకే ఆమెను ఆయన ఆశయాలకు అనుగుణంగా డాక్టరును చేసారు. వాళ్ళిద్దరూ క్రిందనుంచీ బై! బై! చెప్పి వెళ్ళిపోయారు. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206