డైలీ సీరియల్

పచ్చబొట్టు-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోపల ఉండిపోయిందేమోనని తాళాలు తెప్పించి చూసారట. ఎక్కడా అది కనిపించలేదని తిరిగి వచ్చేసారు.
రాత్రంతా తెలిసిన వాళ్ళందరికీ ఫోనులు చేస్తూనే ఉన్నారు.
ఏమీ తెలియదంటూనే చాలా చెప్పారు వీళ్ళు అనుకున్నాడు మనసులో.
‘‘అంతేనండీ. మళ్ళీ మా స్నేహితురాలు మాకిక లేకుండాపోయింది’’ ముగ్గురి కళ్ళలో కన్నీరు.
‘బాధ పడకండి! మీ ఫ్రెండ్‌ని నేను తెచ్చివ్వలేను కానీ నేరస్థుడిని మాత్రం పట్టుకొని తీరతాను. మీ స్నేహితురాలికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను!’’
‘‘తప్పకుండా పట్టుకోండి సార్. అతన్ని పట్టుకోవటానికి మేం మీకేం హెల్ప్ కావాలన్నా చేస్తాం. మేమేకాదు మా స్కూలు పిల్లలంతా కదిలి వస్తారు.’’
ఈకాలపు పిల్లలలో చైతన్యం అలాంటిది.
‘‘అలాగే అవసరమయినప్పుడు తప్పక మీ సహాయం తీసుకుంటానని వాళ్ళు ముగ్గురిని పంపించేసాడు.
ప్యూన్ పరమానందాన్ని పిలిచాడు.
అందరు పిల్లలు వెళ్ళిపోయాక గదులన్నిటికీ తాళాలు వేస్తున్నాను సార్. చివరి గది దగ్గిర ఉండగా ‘జ్యోతి’వచ్చింది. అప్పటికే వాళ్ళ క్లాసుకి కూడా తాళం వేసేసాను.
ఇలా క్యారేజీ మరిచిపోయాను అని చెప్పింది.
వెళ్ళి తాళంతీసి ఆ అమ్మాయి క్యారేజీ తీసుకొని వెళ్ళిపోగానే నేను చివరిగది తాళం వేసుకోవటానికి వెళ్ళిపోయాను. ఆ గదికి తాళం వేసి గేటుకు తాళాలువేసి వెళ్ళాను. అంతకుమించి నాకేం తెలియదు.
‘‘ఆ పాప కేరేజీకి వచ్చినప్పుడు స్కూలులో ఎవరూ లేరా?’’
‘‘లేరు సార్. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు.’’
‘‘ఆయాలు.’’
‘‘ఆయాలు ఊడ్చేసాకే నేను తాళాలు వేస్తాను సార్!’’
‘‘జ్యోతి గేటుదాకా వెళ్ళడం నువ్వు చూసావా?’’
‘‘లేదు సార్! గ్రౌండ్‌లో సగం దూరంవెళ్ళటం మాత్రమే చూసాను. ఆ తర్వాత నా పనిలో నేను పడిపోయాను.’’
‘‘ఊఁ!’’అంటూ అతన్ని సాలోచనగా చూస్తూ మరి జ్యోతి శవాన్ని ఎలా చూసావ్?’’
స్కూల్‌లో వెనక ప్రక్కగా ఆ బావి ఉంటుంది సార్. దానిమీద మూతకూడా ఉంటుంది. నేను పై అంతస్థులోకి వెళుతున్నప్పుడు బావి ప్రక్కన వాటర్ బాటిల్ పడి ఉండటం గమనించాను. పిల్లలెవర్నీ అటువైపుకి వెళ్ళనివ్వం. అవి అక్కడ ఎందుకున్నాయా అని అనుమానం వచ్చి వెళ్ళాను.
బ్యాగ్, క్యారేజీ, వాటర్‌బాటిల్ విసిరేసినట్లు పడి ఉండటంతో బావి మూత తీసిచూసాను. ఇంకేముంది ‘‘జ్యోతి’’ శవం. వెంటనే అందరికీ చెప్పాను.
అంతకన్నా నాకే పాపం తెలియదు. ఇలా నన్ను అనుమానిస్తారని తెలిస్తే ఏమీ తెలియనట్లు ఊరుకుండేవాడిని. ఎవరుచూస్తే వాళ్ళే పట్టుబడేవారు.
మంచివాళ్ళకు రోజులుకావు గొణుక్కున్నట్లు అన్నాడు.
ఒక్కసారి ఇతనికి ఏ పాపం తెలియదేమో అనిపించక పోలేదు అనే్వష్‌కు.
వెంటనే సర్దుకొన్నాడు. దొరికేవరకూ అందరూ దొరలే! సాక్ష్యాలు దొరికాయన్నాక వాళ్ళు తమ తప్పు ఒప్పుకొని లొంగిపోతారు. అలా ఎన్ని కేసులు చూడలేదు. కేసు తేలేవరకూ అందర్నీ అనుమానించవలసిందే. ఎవరినీ వదలటానికి లేదు.
యాజమాన్యం తమకి ఏమీ తెలియదని బిక్కమొగం వేస్తున్నారు.
‘‘పరువు, మర్యాదకు ప్రాకులాడేవాళ్ళం. ఇలాంటి తప్పుడు పనులు చేస్తామా? అయినా మా విద్యార్థినులందరూ మా బిడ్డలతో సమానం. అలాగే చూసుకున్నాం. చూసుకుంటాం కూడా. ఏదో శనిగ్రహం మామీద పడినట్లుంది. అందుకే ఈ అపవాదులు.’’
కానీ డ్యూటీ ప్రకారం వాళ్ళను కూడా అరెస్ట్‌చెయ్యక తప్పలేదు.
బెయిల్ మీద బయటకు వచ్చారు.
అందరూ పచ్చబొట్టు గురించి ఆలోచిస్తుంటే అనే్వష్ ఆలోచనలన్నీ ఈ కేసు గురించే.
చిన్న క్లూదొరికినా చాలు. అలాంటిదేమీ కనిపించడం లేదు.
అసలు ఎవరయినా కనిపించకపోతే వెంటనే రిపోర్ట్‌చేస్తే ఫలితం వేరేగా ఉంటుంది. కానీ పబ్లిక్ తమ దగ్గరకు చివర వస్తారు. తమ ప్రయత్నాలు అన్నీ తాము చేసేసుకొని ఇక తామేమీ చెయ్యలేం అన్నప్పుడు తాము కనిపిస్తారు. ఇదంతా జరిగేలోపు తప్పుచేసినవాడు తప్పును కప్పిపుచ్చుకొనే ఏర్పాట్లుఅన్నీ చేసేసుకొని మెల్లగా జారుకుంటాడు. ఇది ఎంతగా చెప్పినా ప్రజలు అర్ధం చేసుకోరు.
జ్యోతి ఆత్మహత్య చేసుకుందా?
మరి ‘మానభంగం’ చేసింది ఎవరు?
మళ్ళీ పరమానందాన్ని పిలిపించాడు.
‘‘నువ్వు స్కూలు తాళంవేసి వెళ్ళేప్పుడు ఎవరయినా చూసారా?’’
‘‘ఏమోనండీ నాకేం తెలుసు? ఎవరు చూసారో? ఎవరు చూళ్ళేదో? వెళ్ళేప్పుడు బడ్డీకొట్టు వెంకయ్యతో మాట్లాడాను. కనుక్కోండి కావాలంటే?’’
‘‘సరే! అక్కడ ఏదయినా తీగ కదులుతుందేమో చూద్దాం’’ అని.
అతని దగ్గరకు వెళ్ళి ‘‘ఆరోజు ఏం జరిగింది?’’ అడిగాడు వెంకయ్యను.
‘‘ఏమో బాబూ! ఆ వేళప్పుడు నాకు బిజీగా ఉంటుంది, స్కూలు వదిలే టైమ్. చాక్‌లేట్లు, లాలీపాప్‌ల రద్దీ.
కాకపోతే స్కూలు తాళం వేసాక నా దగ్గరకు వచ్చి రోజూ సిగరెట్ పెట్టె కొనుక్కొంటాడు పరమానందం. అలాగే రోజూ టైమ్‌కే తాళం వేసేసాడండీ!’’
తను అడగకుండా ఈ మాట ఎందుకు చెప్పాడు..?
‘‘నీకు రోజూ టైమేనని ఎలా తెలిసింది? ఆ రోజు ఆలస్యంగా తాళంవేసి ఉండచ్చుగా!’’
రోడ్డునపోయే ప్రతీవాడూ వాచీ లేకుంటే ననే్న కదండీ అడిగేది టైము. అందుకే నాకు టైము లెక్క తెలుస్తుంది.
కచ్చితంగా చెబుతున్నాడు. ఇక లాభం లేదని అతన్ని వదిలేసి స్కూలు ఎదురుగుండా ఇళ్ళలోని వాళ్ళందరినీ ఎంక్వయిరీ చేసాడు. అందరూ మాకు తెలియదు. మాకు తెలియదు. మేం ఎవ్వరూ ఆ అమ్మాయి రావటం కానీ వెళ్లటంకానీ చూడలేదనే.
ఒకవేళ నిజంగా చూసినా చెప్పరు. సాక్ష్యం అని కోర్టులు చుట్టూ తిప్పుతారేమోనని భయం. పిల్ల ఎలాగూపోయిందని నిర్లక్ష్యం. రేపు వాళ్ళ పాపలకు ఇలా జరగకూడదని కదా తాము పాటుపడేది. ఒక్కరూ సహకరించరు. నీతీ, న్యాయాలను కాపాడాలనే తాపత్రయం అసలు కనిపించదు.
ఏది ఏమయినా జ్యోతి దురదృష్టవంతురాలు. చిన్నతనంలోనే ఈవిధంగా చనిపోవటం ఎవరూ హర్షించనిది.
సరే చూద్దాం! ముందుముందు ఏ ఆధారాలన్నా దొరక్కపోతాయా? తాము హంతకుడిని పట్టుకోలేకపోతామా?
జీపు ఎక్కి పోనివ్వమన్నాడు.
స్టేషన్‌కి వచ్చాక అక్కడ పనులన్నీ చక్కబెట్టుకొని రాత్రికి ఇంటి ముఖం పట్టాడు.
‘‘హాయ్‌ఁ అన్నయ్యా!’’ చిరునవ్వుతో శాంతిదూతలా ఎదురువచ్చింది చెల్లి. అప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా ఆ చిరునవ్వు తుడిచేసింది.
‘‘ఏంటిరా చిన్నా!’’అని పలకరించాడు.
వెళ్ళి నాలుగు చెంబుల నీళ్ళు గుమ్మరించుకొని నైట్‌డ్రస్‌లోకి మారిపోయాడు.

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206