డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరద్వాజుని గ్రంథంలో ఇలా ఉంది.
సర్వేషాం లోహవర్గాణాం గాలనార్థం విశేఃతః
ద్వాత్రింశదుత్తర పంచశతం భస్త్రా ఇతీరితాః
భస్ర్తీకా నిబంధనాఖ్య గ్రంధే సమ్యజ్నిరూపితాః
దీనిని బట్టి ‘్భస్ర్తీకానిబంధనము’ అనే పేరుగల గ్రంథంలో భస్ర్తీకల నిర్మాణ విషయాలున్నాయనీ, ఆ భస్ర్తీకలు అయిదు వందల ముప్ఫై రెండు రకాలనీ, అవి ఎనిమిది వర్గాలుగా వర్గీకరించబడ్డాయనీ తెలుస్తోంది.
క్రీ.శ.9వ శతాబ్దం నాటి రసేంద్రసార సంగ్రహము, క్రీ.శ.11వ శతాబ్దం నాటి శిల్పరత్నం, క్రీ.శ.12వ శతాబ్దం నాటి రసరత్న సముచ్చయం వంటి గ్రంథాలలో ఇనుము, బంగారము మొదలైన లోహాలను చూర్ణం చేసే విధానాలు చెప్పబడి వున్నాయి. లోహాలను చూర్ణం చేయటం ఈనాటికీ కష్టమైనపనే అని గమనించాలి.
విమాన నిర్మాణంలో పనికివచ్చే లోహాల గురించిన వర్గీకరణ భరద్వాజుడి వైమానిక శాస్త్రంలో వుంది. ఆనాడు విమానాలకు వాడిన లోహాలకుండవలసిన లక్షణాల వర్ణనమంతా నేటి వైమానిక లోహాలకు ఇంచుమించు దగ్గరగా వుంది. ఆ విమాన లోహ లక్షణాల వర్ణన ఇలా వుంది.
ఉష్ణంభరోష్ణపోష్ణహన రాజామ్లతృడ్వీరహ పంచఘ్నా గ్నితృడ్
భారహశ్శీతహనో గరళఘ్నామ్లహనో విషంభర - విశల్యకృత్
ద్విజమిత్రశ్చ వాత మిత్రశే్చతీత్యాదిః
పదహారు రకాల వైమానిక లోహ మిశ్రమలు తయారుచేయవచ్చని చెపుతూ, అవి ఉష్ణాన్ని భరిస్తాయి, ఉష్ణాన్ని ప్రవహింపజేస్తాయి, ఉష్ణాన్ని నిరోధిస్తాయి, మెరుస్తూ వుంటాయి, ఆమ్లాలను నిరోధిస్తాయి, అగ్నిని నిరోధిస్తాయి అని ఇలా చాలా లక్షణాలను వర్ణించారు. ఆ మిశ్రమాలను తయారుచేయడానికి అవసరమైన మూసలు అగ్నికుండాలు, భస్ర్తీకలు, యంత్రాలు, దర్పణాల గురించి, వాటిలోని రకాల గురించి విపులంగా చర్చించారు.
లోహాలు అతికించేందుకు, వివిధ ప్రయోజనాలు కోసం (అంటే మెరుపు, నునుపు తుప్పు పట్టకుండా వుండడం, వగైరాలకోసం) రకరకాల లేపనాలు, జిగురులు కూడా క్రీ.శ.ఆరవ శతాబ్దినాటి వరాహ మిహిరుడి బృహత్సంహితలో చెప్పబడ్డాయి.
వజ్రలేపము తయారుచేసే విధానం ఇలా వుంది-
ఆమం తిందుకమామం కపిత్థకం పుష్పమపి చ శాల్మల్యాః
బీజాని శల్లకీనాం ధన్వనవల్కోవచాచేతి
ఏతైః సలిల ద్రోణః క్వాధయితవ్యో ష్ట భాగశేషశ్చ
అవతార్యో స్య చ కల్కో ద్రవ్యైరేతైషః సమనుయోజ్యశ్చ
శ్రీవాసకర సగుగ్గులు భల్లాతక కుందురుక సర్జరసైః
అతసీ బిల్వైశ్చ యుతః కల్కో యం వజ్ర లేపాఖ్యః
(పచ్చి తిందుకము, పచిచ్వెలగ, బూరుగు పూలు, అందుగు గింజలు, ధన్వనవృక్షపు బెరడు, వసవేళ్ళు, వీటిని పెద్ద నీటి కుండలో వేసి ఆ నీరు ఎనిమిదో వంతుకు దిగేదాకా కాచాలి. ఆ వచ్చిన కషాయానికి శ్రీవాసకము (టర్పంటైను) అనే వృక్షరసము, మల్లె రసము, సర్జ రసము, అవిశె, మారేడు ఆకులను కలిపి మళ్లీ కాచాలి. ఫలితంగా వచ్చే గుజ్జే వజ్రలేపము)
ఈ వజ్రలేపం గురించే కాక, వజ్ర సంఘాతము అనే మరొక లేపనాన్ని గురించి కూడా విరాహమిహరుడు వివరించాడు.
వజ్రతలం అనే మరొక లేపనం కూడా వుంది. దాని తయారీ విధానం ఇలా వుంది.
గోమహిషాజ విఃణైః ఖుర రోమ్నా మహిష చ్మై గవ్యైశ్చ
నింబ కపిత్థ రసైః సహా వజ్రతలో నామ కల్కో న్యః
ఎద్దు, దున్నపోతు, గొర్రెల కొమ్ములు, వాటి గిట్టలు, వెంట్రుకలు, దున్నపోతు చర్మము, ఎద్దుల యొక్క చర్మము, వీటిని వేప, వెలగ రసాలతో కలిపి కాచగా వజ్రతలం అనే కషాయం తయారవుతుంది.
ప్రాసాద హర్మ్యవలభీ లింగ ప్రతిమాసు కుడ్య కూపేషు
సంతప్తో దాతవ్యో వర్ష సహస్రాయుత స్థారుూ
దీనిని కరిగించి మేడలకు, విగ్రహాలకు, గోడలకు, బావులకు పూయవచ్చును. అలా పూస్తే ఇది పదివేల సంవత్సరాలు స్థిరంగా వుంటుంది.
అలాగే వజ్ర సంఘాతమనే మరొక రకం లేపనం వుంది. దానిని తయారుచేసే విధానం ఇలా వుంది.
అష్టౌ సీసక భాగాః కాంస్యస్య ద్వౌ తు రీతికా భాగః
మయకథితో యోగో యం విజ్జేయో వజ్ర సంఘాతః
దీనిని మయుడు చెప్పాడట! ఎనిమిది పాళ్ళ సీసము, రెండు పాళ్ళ కంచు, ఇత్తడి ఒక భాగము, వీటిని కలిపితే వజ్ర సంఘాతమనే లేపనమేర్పడుతుంది.
ఢిల్లీలలోని ప్రసిద్ధి చెందిన ‘అశోకస్తంభం’ వౌలికంగా ఇసకరాతి స్తంభం! దీనిమీద వజ్ర సంగాత లేపం పూతపోయగా లోహస్తంభం లాగా కనిపిస్తోందని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి. అలాగే బీహారులోని వౌర్యుల కాలంనాటి గుహలలో పూసిన లేపనంవల్ల అక్కడి గోడల ఉపరితలం అద్దంలాగా కనిపిస్తుందట!
మన రాజధాని ఢిల్లీలో ప్రసిద్ధ ఇనపస్తంభం 1600 ఏళ్ళుగా తుప్పు పట్టకుండా చెక్కు చెదరకుండా అలాగే నిలిచి వుంది.
7 మీటర్ల ఎత్తు, ఆరు టన్నుల బరువు కలిగిన ఈ స్తంభం క్రీ.శ.320-540 మధ్య గుప్తరాజుల కలాంలో ఒక విష్ణు ఆలయం ముందు స్థాపించబడింది.
కాన్పూరు ఐఐటిలోని శాస్తజ్ఞ్రులు పరిశోధనలు చేసి, ఇనుము, ఉదజని, ఆక్సిజన్‌ల సమ్మేళనంవల్ల ఏర్పడి మిసావైట్ అనే పలచని పూతవల్ల ఈ ఇనపస్తంభం తుప్పు పట్టకుండా వుందని తేల్చారు. ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి