డైలీ సీరియల్

పచ్చబొట్టు-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవేమీ తెలియని రామకృష్ణప్రసాద్ అప్పటికే సగం నిద్రలో ఉన్నారు. వ్యక్తిత్వం గల పౌరులుగా తన బిడ్డలుగా తీర్చిదిద్దానన్న ఆత్మవిశ్వాసమే ఆయనకు అంత మంచి నిద్రను ప్రసాదించింది.
***
హెచ్చరిక-1
హలో ఫ్రెండ్స్!
నా గురించి ఎదురుచూస్తున్నారా? మీ అందరి ఎదురుచూపులను వ్యర్థం చెయ్యను. అందుకే నా ఉద్యమానికి శ్రీకాళహస్తిలో శ్రీకారం చుట్టాను.
మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో అమాయకంగా అన్యాయంగా అత్యాచారానికి బలయిపోయింది ఓ కనె్నపిల్ల. ఆరునెలల క్రితం ‘అనంతం’ ఓ చిన్నారిని రేప్ చేసి నిర్దోషిగా కోర్టునుంచి బయటపడ్డాడు. వీటిని కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత చూడలేకపోవచ్చు. కోర్టుకు సాక్ష్యాధారాలు లభించకపోవచ్చు. దోషి నిర్దోషిగా బయటకు రావచ్చు. కానీ ఈ న్యాయపీఠంపై న్యాయదేవతకు కళ్ళకు గంతలుండవు. ఆమె ఈ భూలోకంలో ఏ తప్పు జరిగినా క్షణాలలో తెలుసుకుంటుంది. అసలువారిని గుర్తిస్తుంది. అతను ఎంతమందిలోవున్నా ప్రతి స్ర్తి గుర్తించి జాగ్రత్తపడేలా చేస్తుంది.
అనె్నం పునె్నం ఎరుగని స్కూలు విద్యార్థిని జ్యోతిని రేప్ చేసి అమాయకపు కబుర్లు చెబుతున్న ‘పరమానందం’పై నా మొదటి వేటు వేస్తున్నా! అతని బుగ్గపై పచ్చబొట్టు వేస్తున్నా! పచ్చబొట్టు ఎలా చెరిగిపోదో అలా నా మాటా ఏనాటికీ చెరిగిపోదు. ఇది ఆరంభం మాత్రమే! అన్నమాట నిలబెట్టుకునే.. మీ
పచ్చబొట్టు
గమనిక:పరమానందం అడ్రెస్- డోర్ నెం.1/11/111, కొత్తపేట శ్రీకాళహస్తి
పేపరు రాగానే ఆ వార్త చదివిన అనే్వష్ వెంటనే అలర్ట్ అయ్యాడు. పరమానందం పారిపోకముందే తను పట్టుకోవాలి. పేపరుకి న్యూస్ నిన్న ఇచ్చి ఉండాలి. రేపు చేసేది వీళ్ళు ముందే నిర్ణయించుకుంటారా? తేల్చుకోవాలి. చప్పుడు కాకుండా డ్రెస్ వేసుకొని బయట గుమ్మాన్ని లాక్ చేసుకొని వెళ్లిపోయాడు. లోపలినుంచి కూడా దానిని ఓపెన్ చేసే సిస్టమ్ ఉండటంవల్ల ఎవరికీ బాధ ఉండదు.
బుగ్గమీద అవతరించిన ‘ఎక్స్’ గుర్తు పచ్చబొట్టును చూసి పారిపోవాలని నిశ్చయించుకొని నగా, నట్రా, డ్రెస్సులు సూట్‌కేసులో సర్దుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చిన అతను అప్రతిభుడయ్యాడు. గుమ్మంలో నిలువెత్తున నిలిచి ఉన్న ఆరడుగుల విగ్రహం అనే్వష్‌ని చూసి-
పేపరు ఉదయానే్న చదివిన ప్రతివాళ్ళూ ఈ వింత చూడటానికి వచ్చేసారు. అప్పటికే టీవీలు, పేపర్ల రిపోర్టర్లు తమ తమ సరంజామాతో ప్రత్యక్షం. ఇలాంటి వాటిని ప్రసారం చెయ్యటానికి ఒక ఛానెల్ ప్రత్యేక కృషి చేస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే!
అనే్వష్ వారిస్తున్నా వినకుండా పరమానందాన్ని చితకబాదారు. ఒంట్లోరక్తం అంతా బయటకు వచ్చి ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో నిజాన్ని బయట పెట్టాడు. తానే ఆ అత్యాచారానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.
నోట్లో గుడ్డలు కుక్కి, ఆ పాపను అనుభవించానని, భయానికి ఆ పిల్ల ప్రాణం పోవటంతో దిక్కుతోచక బావిలో పారేశానని, నేరం తనమీదకు రాకుండా ఉండాలని ముందుగా తనే చూసి రిపోర్టు చేస్తున్నట్లు నాటకమాడానని, క్షమించమని అందరి ఎదుట చేతులెత్తి నమస్కారం పెట్టాడు.
అతన్ని అనే్వష్ అరెస్టు చేశాడు.
మనసులోనే పచ్చబొట్టుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పుట్టి బుద్ధి ఎరిగాక అతని మనసు ఒకరి ఎడల ఇంత వింత అనుభూతికి గురవటం ఇదే మొదటిసారి. పరమానందాన్ని తీసుకెళ్లి స్టేషన్‌లో సెల్‌లో వేసి ఇంటికివచ్చాడు. ఆనందంతో ఆ ఇల్లు ఓలలాడింది.
విద్య స్వీట్స్ చేసి పెట్టింది.
‘‘అమ్మ నిన్న కూడా రాలేదు. ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుందామా అన్నయ్య!’’
‘‘అలాగేలేమ్మా! ఈ రోజు ఆనందంతో నేనేం చేస్తానో నాకే తెలియటంలేదు. వెంటనే ఆ పచ్చబొట్టును చూడాలని పిచ్చి కోరికగా వుంది’.
‘‘నేను చెప్పానా లేదా! పెద్ద వేదాంతం చెప్పావుగా. కాళహస్తిలో విషయాలు పచ్చబొట్టుకి ఎలా తెలుస్తాయని’’.
‘‘తప్పయిపోయింది. క్షమించు తల్లీ! నీ బుర్రకి జరగబోయే విషయాలు తెలుస్తాయి అన్న నిజాన్ని ఆ క్షణాన మరిచిపోవటం నా తప్పే!’’
‘‘అద్గదీ అలారా దారికి’’.
‘‘అన్నయ్య చిన్నపిల్లాడిలా అలా ఒప్పేసుకుంటే విద్య సంబరడిపోతుంది. అలా ఆ అన్నా చెల్లెళ్లను ఎవరైనా చూసినా, వాళ్ల కబుర్లు విన్నా అనే్వష్ అందరినీ గడగడలాడించే ఇన్స్‌పెక్టర్ అని, వైద్యానికే తల్లిలా తలచబడే తల్లి విద్య అని అంటే ఎవరూ నమ్మరు.
ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరూ అంతే!
ఆటలు, పాటలు, అల్లరి అంతా వారి సొంతం.
బంధం, అనుబంధం ఊయలలూగుతాయి వారి మనసుల్లో.
కాలు బయటపెట్టారో ఎవరి వృత్తిలో వాళ్లు కర్తవ్య కిరీటాలే!’’
***
జ్యోతి కేసుతో ‘పచ్చబొట్టు’తేలికగా తీసిపారేసే వ్యక్తికాదని ఋజువయ్యింది. ఆరోజు పేపర్లు వేడివేడి పకోడీల్లా అమ్ముడుపోయాయి. పబ్లిషర్సే, న్యూస్‌పేపర్లవాళ్ళు, విలేకర్లు, ఇన్స్‌పెక్టర్లు అందరూ అలర్ట్ అయ్యారు. ప్రజలలోకూడా భయాందోళనలు చోటుచేసుకున్నాయి.
మగవారిలో ఆడ పిచ్చి ఉన్నవారికి మరింత భయం పెరిగింది. ఏ నిముషాన తమ బుగ్గలపైన ఆ గుర్తుపడుతుందో అని గడగడలాడసాగారు. గుట్టుగా సంసారం చేసుకుంటున్న గృహిణులు తాము తమ భర్తల గుట్టు కప్పిపుచ్చినా ఈ పచ్చబొట్టు బయటపెడుతుందేమో అని కొందరు పరువుకోసం ప్రాకులాడుతుంటే, మరికొందరు సవితులతో చచ్చిపోతున్నాం. మా భర్తలకుకూడా పచ్చబొట్టుపడితే కాళ్ళు కట్టేసినట్లు ఇంట్లో పడి ఉండి, మరో ఆడదాని వంక చూడకుండా ఉంటారని, ఆ ప్రయత్నం కూడా పచ్చబొట్టు చేస్తే ఋణపడి ఉంటామని మనసులోనే దేవతలకి మ్రొక్కినట్లు మ్రొక్కుకుంటున్నారు.
అందరి మాటలలో ఆ రోజంతా పచ్చబొట్టు ఓలలాడింది. కొందరయితే పచ్చబొట్టు పేరున గుడిలో అర్చనలు చేసారు. మరికొందరు పచ్చబొట్టుకి మనసులోనే గుడి కట్టేసారు.
ఆడవాళ్ళు పచ్చబొట్టు మగవాడని, మగవాళ్ళు పచ్చబొట్టు ఆడదని నిర్ధారించుకొనే ప్రయత్నంలో వాదులాటలు ప్రారంభించారు.
విలాసాలకు అలవాటుపడ్డ మగవాళ్ళు ఇలా జరిగితే బయటకువెళ్ళి బ్రతకగలమా అని ఒకటే మధనపడిపోతున్నారు. అలాగని అలవాటుపడిన ప్రాణాన్ని కంట్రోల్‌లో పెట్టగలమా? కుదరదు! ఈ పచ్చబొట్టు ఎవరో తమ ప్రాణాలమీద కోరికల మీద స్వారీచేస్తోంది. పోలీసులు పట్టుకోలేకపోతారా? ఎన్నాళ్ళు సాగుతాయి వీరి ఆటలు?
పోలీసులంటే పెద్ద అభిప్రాయాలు లేనివాళ్ళు కూడా మనసు స్వాంతన చేసుకోవటానికి ఇలా సర్దిచెప్పుకోవటం ఆశ్చర్యమే!
ఇంకా తెలివైనవాళ్ళు పచ్చబొట్టుది కాళహస్తి ప్రాంతం అయి ఉంటుంది. అందుకే వెంటనే పట్టుకోగలిగింది. తమ ఊర్లో జరిగితే ఎలా తెలుస్తుంది? అలా తెలియాలంటే ఎంత నెట్‌వర్క్ ఉండాలి? అదంతా ఏర్పరుచుకోవాలంటే ఎనే్నళ్ళుపడుతుంది? ఈలోపు ఎంజాయ్ చేసేద్దామని కొందరు ఆలోచిస్తే, మరికొందరు కొన్నాళ్ళు ఇలాంటి వాటికి స్వస్తిపలికితే తర్వాత సర్దుమణుగుతుందని అనుకొంటున్నారు. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206