డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ ...17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ మిత్ర బృందం ధైర్యం చెప్పడంతో హరిత కూడా వాళ్ళ ప్రశ్నలకి భయపడకుండా సమాధానాలు చెప్పసాగింది. అయితే వాళ్ళడిగే ప్రశ్నలే ఆమెలో ఎక్కడలేని ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్నాయి.
‘‘నీకెంత మంది బాయ్‌ఫ్రెండ్స్ వున్నారు?’’
‘‘నీ బాయ్‌ఫ్రెండ్ నిన్ను ముద్దుపెట్టుకుంటాడా?’’ అంటూ ర్యాగింగ్ వంకతో వాళ్ళడిగతే ప్రశ్నలకి తల తిరుగుతున్నట్లనిపించిందామెకి. ర్యాగింగ్‌లో కొంత అసభ్యత వుంటుందని తెలుసుగానీ, మరీ ఇలాంటి ప్రశ్నలు వేస్తారని ఆమె అనుకోలేదు.
‘‘అందులో అసభ్యతేముందీ? ఒక వయసు రాగానే అబ్బాయిలు మన గురించీ, మనం అబ్బాయిల గురించీ కుతూహలంగా వుండడం సహజం. ఫ్రాంక్‌గా చెప్పు? నువ్వెప్పుడూ అబ్బాయిల గురించి ఆలోచించలేదా? ఆ కుతూహలమే మనల్ని వాళ్ళతో స్నేహం చేసేలా ప్రోత్సహిస్తుంది. మామూలు పరిచయాలకన్నా ఆ పరిచయం, స్నేహం థ్రిల్లింగ్‌గా వుండడానికి కారణం ఆ జెండర్ డిఫరెనే్స. కాకపోతే మనం రహస్యంగా చెప్పుకునే విషయాలు వీళ్ళు పబ్లిగ్గా మాట్లాడుతున్నారు- అదే తేడా’’ అంది కావేరి.
హరిత ఏదో సమాధానం చెప్పేలోగా ఆమెని మోచేత్తో పొడుస్తూ ‘‘అటు చూడు..’’ అంటూ దూరంగా మగ పిల్లలని ర్యాగింగ్ చేస్తున్న సీనియర్స్‌ని చూపించింది.
గార్డెన్లో దూరంగా పొదల వెనుక గుంపులుగా కూర్చున్న సీనియర్స్ జూనియర్ బాయ్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు. అక్కడ నిలబడ్డ జూనియర్స్ ఎవరి ఒంటిమీదా చొక్కాలు లేవు. పొదల చాటున వుండడంవల్ల గార్డెన్లోకి వెళ్లిన వాళ్ళకి తప్ప మామూలుగా పాసేజ్‌లోంచి వెళ్ళేవారికి కనిపించరు.
హరిత ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూసింది. సీనియర్స్ చెప్పే పిచ్చి చేష్టలన్నీ చేస్తూ అర్థనగ్నంగా నిలబడ్డ అబ్బాయిలని చూస్తుంటే నవ్వొచ్చింది. అంతలోనే ఆమె దృష్టి అక్కడున్న అబ్బాయిల మధ్యనున్న వరుణ్‌మీద పడింది. ముందురోజు తన చేయి లాక్కుని షేక్‌హ్యాండ్ ఇచ్చిన వరుణ్.. చొక్కాలేకుండా, జీన్స్ ప్యాంట్‌ని మోకాళ్ళ వరకూ మడిచి సిగ్గుపడుతూ నిలబడ్డ అతన్ని అలా చూస్తుంటే నవ్వాపుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది హరితకి. సరిగ్గా అదే సమయంలో అతడు కూడా వీళ్ళవైపు చూసాడు. తనని చూసి అతను సిగ్గుపడడం గమనించి హరిత చూపులు తిప్పుకుంది.
‘‘వాళ్ళు ఫీలవుతారు. మనం మరో పక్కకి వెళదాం’’ అని కావేరి అనడంతో వెనక్కి తిరిగారు అందరూ.
వెనక్కి తిరిగి వెళ్ళూ అప్రయత్నంగా కుతూహలంగా ఓరకంట మరొక్కసారి వరుణ్‌ని చూసింది హరిత. సరిగ్గా అదే సమయంలో ఇటు చూసిన అతడి చూపులు హరిత చూపులతో కలిసాయి. హరిత నవ్వుకుంటూ చప్పున తల తిప్పేసుకుంది.
అలా వాళ్ళిద్దరి చూపులూ కలుసుకోవడం, హరిత నవ్వడం, అతడు సిగ్గుపడడం అక్కడ సీనియర్స్‌లో ఒకబ్బాయి గమనించాడు. వరుణ్‌ని దగ్గరికి రమ్మని పిలిచాడు. భయపడుతూనే వరుణ్ అతడి దగ్గరికి వచ్చాడు.
‘‘ఎవర్రా ఆ అమ్మాయి నిన్ను చూసి నవ్వుతోంది?’’
‘‘జూనియర్.. మాతోపాటే జాయినైంది’’
‘‘్ఛ.. అలాగా? నేను మీ మేనత్త కూతురేమోననుకున్నాలే.. పేరేమిటనిరా నేనడిగేది’’.
‘‘తెలీదు’’ అబద్ధమాడాడు.
‘‘పేరు తెలియకుండానే సైట్ కొట్టేస్తున్నావా?’’ మరింత దగ్గరగా వచ్చి వరుణ్ గెడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తుతూ అన్నాడు.
‘‘అలాంటిదేం లేదన్నా’’ అన్నాడు అతడు మరింత భయపడుతున్నట్టు చేస్తూ. సీనియర్స్ ఏం అడిగినా భయభక్తులతో సమాధానం చెప్పాలనీ, వాళ్ళని అన్నా అని సంబోధించాలనీ.. ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాడు ఆ ఒక్కరోజులోనే.
‘‘మరెందుకా అమ్మాయి నిన్ను చూసి అలా నవ్వింది?’’ అన్నాడు.
‘‘నాకు తెలీదు’’ అన్నాడు. నిజానికి అసలామె ఎలా నవ్విందో సరిగా గమనించలేదు. ఇప్పుడు అతడి మాటలవల్ల కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి.
‘‘సీనియర్స్ ముందు అమ్మాయిలకి సైటు కొట్టకూడదన్న విషయం నీకు తెలీదూ?’’
వరుణ్ బ్లాంక్‌గా చూసాడు అతడి వంక. ఏమని సంజాయిషీ ఇవ్వాలో అర్థం కావడంలేదు.
‘‘రోజూ జిమ్‌కెళతావురా నువ్వు’’ తీర్చిదిద్దునట్టున్న అతడి శరీరాన్ని గమనిస్తూ అడిగాడు.
వరుణ్ అవుననీ కాదనీ కాకుండా తలూపాడు. ఏం చెబితే ఏం గొడవొస్తుందోనని.
‘‘సీనియర్స్ ముందు సైట్ కొట్టినందుకు నీకు శిక్షేమిటో తెలుసా?’’
‘‘నీ బాడీ బిల్డింగ్ ప్రదర్శన కాలేజ్ మొత్తానికి చేయాలి.. చల్.. అండర్‌వేర్‌తో కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసిరా’’.
అతడు కంగారు పడిపోయాడు. ‘‘ప్లీజ్ అన్నా.. సారీ అన్నా.. తప్పైపోయింది. ఇంకెప్పుడూ అలా చేయను’’ అన్నాడు చేతులు జోడిస్తూ.
‘‘నో.. నో.. రూలంటే రూలే. కాలేజ్ చుట్టూ కాకపోయినా కనీసం ఇందాకా వెళ్ళారే ఆ అమ్మాయిల చుట్టూనేనా అండర్‌వేర్‌తో ఒక రౌండ్ తిరిగి రావాల్సిందే’’.
వరుణ్ అతడ్ని మళ్లీ బ్రతిమాలసాగాడు.
‘‘మాటలతో చెబితే వినే రకాలు కాదురా మీరు. మీకా శాస్తి జరగాలసిందే. వెళ్ళు.. ఆ అమ్మాయిలు మరీ దూరం వెడితే నీకే నష్టం’’ అతడి చేయి వరుణ్ ప్యాంట్‌మీద పడింది.
అంతలో అక్కడికి భరణి వచ్చాడు. అతని పక్కనే ఎవరో అమ్మాయి వుంది. ఒంటిమీద చొక్కాలు లేకుండా వున్న అబ్బాయిలు భరణితో వచ్చిన ఆ అమ్మాయిని చూసి కుచించుకుపోయినట్టుగా అయిపోయారు. ఆ అమ్మాయి మాత్రం అదేం పట్టించుకోనట్లుగా భరణీ చేయి పట్టుకుని దూరంగా ఎటో చూడసాగింది.
‘‘ఏంట్రా గొడవ?’’ అన్నాడు భరణి.
‘‘చూడన్నా వీడు.. మా ముందే అమ్మాయిలకి సైటు కొడుతున్నాడు’’.
భరణి వరుణ్‌ని పరిశీలనగా చూసాడు. ‘‘ఎవర్రా ఆ అమ్మాయి?’’ అనడిగాడు.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ