డైలీ సీరియల్

పచ్చబొట్టు-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీకు నేనున్నాను’’అంటూ ఆమెను తన వెచ్చని కౌగిలిలో బంధించాడు. ఆ ఏకాంతంలో అనుభూతుల అనుభవంలా ఆ రాత్రి కరిగిపోయింది. వాన ఆగిపోయింది. తెల్లవారిందన్నట్లు పక్షులు కిలకిలారావాలతో కనులు విప్పిన ప్రియ సిగ్గుతో చితికిపోయింది కానీ తను ఎంత తప్పు చేసింది?’’అని భీరువులా భయపడలేదు. ప్రేమ్ తనని పెళ్ళిచేసుకుంటాడనే ధీమా!
‘‘పద ప్రేమ్! మనం వెళదాం.’’
‘‘్థంక్స్! మన ఫస్ట్‌నైట్ ఇంత అందంగా జరుగుతుందనుకోలేదు.’’
‘‘సిగ్గు లేకుండా ఏం మాటలవి?’’అంటూనే సిటీ బస్ ఎక్కేసింది ప్రియ.
స్నేహితురాలింట్లో ఉండిపోయాననే చక్కని అబద్ధంతో ఆ తప్పును కప్పిపుచ్చింది. కానీ ఒక చిన్న అబద్ధం పది అబద్ధాలకు నాంది అన్నట్లు ఆమె గర్భం ధరించింది.
మొదటి నెల ‘మెన్సస్’ అవకపోతే ఎగిస్తుందేమో అని ఎదురుచూసింది. రెండవ నెల కూడా రాకపోవటంతో లేడీ డాక్టర్‌ని సంప్రదించింది. ఆవిడ రెండో నెల అని నిర్ధారించింది. ఇంకేముంది? కథ మామూలే!
ప్రేమ్‌తో ఈ విషయం ప్రియ చెప్పగానే ‘‘ప్రియా! చక్కగా అబార్షన్ చేయించుకో. కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఎందుకిలా చెబుతున్నానంటే రాత్రే అమ్మా, నాన్నలతో మన వివాహ విషయం చర్చించాను. వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. నిన్ను చేసుకుంటే వాళ్ళు చచ్చిపోతారట. మన ప్రేమకోసం అమ్మానాన్నలను చంపుకోమంటావా? నన్ను కని, పెంచి, ఇంత పెద్దచేసిన వారిని వదులుకోమంటావా? నువ్వే చెప్పు?’’
ప్రేమ్! ఆరోజు మనం కలిసేప్పుడు అడగాల్సింది. అప్పుడు చెప్పేదాన్ని సమాధానం. ఇప్పుడు నీలాంటి వాడికి సమాధానం చెప్పటం కూడా వేస్ట్ అని ఒక అసహ్యమైన చూపును అతనిమీద విసిరి బయటకు వచ్చేసింది.
‘‘అమ్మయ్య! ఒక్క డైలాగ్‌తో దీన్ని వదిలించేసుకున్నాను. నిజం తెలిస్తే అమ్మావాళ్ళు ఒప్పుకొనేవాళ్ళే! అయినా వాసన చూసేసాక ఆ పువ్వును మళ్ళీ ఎవరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. పిచ్చిది నిజమని నమ్మి వెళ్ళిపోయింది’’అంటూ తనూ లేచాడు వెళ్ళటానికి. పాంట్‌కి అంటిన దుమ్ము దులుపుకున్నాడు. ప్రియకు మంగళం పాడటం కూడా అలాంటిదే అతని దృష్టిలో.
సమాజం ప్రియకు మచ్చను అంటగట్టింది. కానీ ప్రేమ్ మాత్రం హీరోలా దర్జాగా తిరుగుతున్నాడు. చేసిన తప్పు ఇద్దరిది. కానీ శిక్ష మాత్రం ఒక్కరికే. ఆ ధైర్యమే ప్రేమ్‌ను ముందుకుసాగనిస్తోంది. ప్రియ లాంటివారు అతనికి ఎందరో! ప్రేమను నటించటం, వదిలేసుకోవటం రైలు ఎక్కి, దిగినంత సులభం చేసేసే వ్యక్తిత్వం. కానీ రోజులు ఒకలానే ఉండవు. ఎన్నో మార్పులు. ఎన్నో చేర్పులు.
చుట్టూ ఉన్నవాళ్ళు మగవాడని అతనికి పట్టం కట్టినా ఒకరు ఉన్నారు. అతని భరతం పట్టటానికి ఫలితం.
కుమిలిపోతున్న ప్రేమ మనసుకు శాంతనగా ప్రేమ్ బుగ్గపైన ‘పచ్చబొట్టు’ పడింది.
కళావిహీనమైన ఆమె కళ్ళలో కాంతి ఒక్కసారి తన్నుకొచ్చింది. అశాంతి చెలరేగిన ఆమె హృదయ సముద్రంలో తుఫాను ఆ గుర్తును చూడగానే శాంతించటం ప్రారంభించింది. ప్రశాంతంగా మారింది ఆమె అంతరంగం.
ఎవరు ఆ పచ్చబొట్టు పొడుస్తున్నారు? వాళ్ళు ఎవరయినా కానీ తప్పు చేసిన మగవాడిని వదిలి స్ర్తికి మాత్రమే కళంకాన్ని ఆపాదించే ఈ పాత చింతకాయ పచ్చడి ఆనవాయితీని అదరగొట్టి మగవాళ్ళలో మొదటిసారిగా భయాన్ని రుచి చూపించగలుగుతున్నారు. పచ్చబొట్టు ఎవరయినా వారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఆమె కనుకొనులలో భాష్పాలు. అవి కన్నీరు కాదు. ఆనందంతో తననుతాను అంకితమిస్తూ విడిచిన ఆనంద భాష్పాలు. అవి పచ్చబొట్టుకే అంకితం.
ఆరోజు పేపర్లులో పడిన పచ్చబొట్టు ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివిందో ఆమెకే తెలియదు. దాన్ని కత్తిరించి తన డైరీలో అతికించుకుంది. మళ్ళీ మళ్ళీ చదివింది. ఎన్నిసార్లు చదివినా తృప్తితీరటం లేదు. మళ్ళీ చదవాలనే అనిపిస్తోంది. మరోసారి ఆమె కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగెత్తసాగాయి.
***
హెచ్చరిక-2
హలో ఫ్రండ్స్,
మన రెండవ కలయిక మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే అమ్మాయిలను ప్రేమలోకి దింపి, శారీరక సంబంధం పెట్టుకొని, తల్లిదండ్రులను ఎదురించగలిగి, వాళ్ళు ఒప్పుకుంటారన్నా వాడిన పువ్వుని ప్రియురాలికి గుడ్‌బై చెప్పే పిరికి సన్నాసే మన సెకండ్ హీరో. పెళ్ళిచేసుకొనే దమ్ములేని హీరో ప్రేమ పాఠాలు వల్లించటం ఎందుకు? వల విసరటానికే! కడుపుచేయటం ఎందుకు? తన ప్రతాపం చూపటానికే. ఇన్నాళ్ళూ స్ర్తిని మాత్రమే నెల తప్పిందని, కాలు జారిందని దుయ్యబెట్టేది ఈ సమాజం. ఇప్పుడు నాణానికి రెండోవైపులా అతనికీ ఈ తిప్పలు తప్పవు. అందుకే పచ్చబొట్టును ప్రజెంట్ చేస్తున్నా! ఇక ఏ అమ్మాయి అతన్ని పెళ్ళిచేసుకుంటుంది? ‘పెళ్ళికళ తప్పిపోయిందే బాలా’ అంటూ జీవితాంతం అతను కుళ్ళికుళ్ళి ఏడవాల్సిందే.
ప్రేమించటంలో తప్పులేదు. ప్రేమను నటించటమే తప్పు. ప్రేమను పెళ్లిదాకా నడిపిస్తూ జీవితాంతం చేతులువదలని జంటే జంట. అదే నిజమైన ప్రేమ జంట.
ప్రేమికులు ఇలానే ఉండాలి. మరోలా ఉంటే నా గుప్పిటలో ఉక్కిరిబిక్కిరి అవక తప్పదు. జాగర్త!
అన్యాయం ఎక్కడుంటే అక్కడే ఈ పచ్చబొట్టు
గమనిక: ఈనాటి డూప్లికేట్ హీరో అడ్రస్:- బి.ప్రేమ్, రోడ్‌నంబర్-2, డోర్ నంబర్- 2-22/222, బంజారాహిల్స్, హైదరాబాదు.
***
మరోసారి మరోసారి కళ్ళు మూతలు పడేదాకా అలా చదువుతూనే ఉంది ప్రియ.
***
రోజూ తన అందమైన ముఖాన్ని అద్దంలో చూసుకొనే అలవాటు ఉన్న ప్రేమ్ జీవితంలో మొదటిసారి కెవ్వుమన్నాడు. ఎందరో అమ్మాయిలు నీ బుగ్గలెంత బాగుంటాయో అంటూ ముద్దులతో ముంచెత్తేవారు. అలాంటి తన అందమైన బుగ్గమీద తనను తప్పుడువాడినని తెలియజెప్పే ముద్ర, దారినపోయే ప్రతీవాడికీ అర్థమయ్యేలా ‘ఎక్స్’ మార్కు. ఇక తన ముఖం ఎలా బయటివారికి చూపించగలడు? ఈ పని చేస్తున్నవాళ్ళని పొడిచి పొడిచి చంపెయ్యాలి. లక్షలు, కోట్లు మూలిగే తనతో ఆటలా. అంతు చూస్తాను. వాళ్ళెందరయినా- ఒకరయినా వేలలో ఉన్నా నాశనం చేసేస్తాను. నాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నిరూపిస్తాను. మళ్ళీ ఎవరి నోటి వెంట పచ్చబొట్టు రాకుండా చేస్తాను. ఆవేశంతో ఎగిసి పడుతున్నాడు. పళ్ళు పటపటలాడిస్తున్నాడు. కళ్ళు జ్యోతుల్లా ఎర్రబడిపోయాయి.
తల్లీ తండ్రీ తనను గమనించకముందే పారిపోవాలని తన బీరువాలోవున్న నోట్ల కట్టలు, బట్టలు ఒక సూట్‌కేసులో సర్దేసుకొని వెళ్ళటానికి తలుపు తీసాడు.
ఎదురుగా తల్లి, తండ్రి పేపరుతో.
పచ్చబొట్టు పంపిన హెచ్చరిక ఎర్ర రంగులో.
ఆత్రంగా దానిని అందుకొని చదువుతూనే కుప్పకూలిపోయాడు.
గూర్ఖా అడ్డుకుంటున్నా తోసుకుని వచ్చేసారు జనం. వాళ్ళందరికంటే ముందుగా రిపోర్టర్స్. ముఖానికి చెయ్యి ఎంత అడ్డుపెట్టుకున్నా కెమెరాలు క్లిక్‌చేస్తూనే ఉన్నాయి.
ఇదంతా ఏమిటో అర్థంకాని అచేతనావస్థలో ప్రేమ్ తల్లిదండ్రులు.
జరుగుతున్నది ఇష్టం లేకపోయినా ఆపలేని స్థితిలో వారు.
*
-సశేషం

యలమర్తి అనూరాధ. 9247260206