డైలీ సీరియల్

పచ్చబొట్టు-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్వాత వివరంగా ప్రేమ్ ద్వారా జరిగిందంతా తెలుసుకున్నారు.
అయిపోయింది.. అయిపోయింది. ఆ అమ్మాయిని తీసుకురా.. పెళ్లిచేసుకో అని చెప్పారు.
ససేమిరా ఒప్పుకోలేదు. కోర్టులో ‘పచ్చబొట్టు’ మీద కేసు వేసాడు. అయినా కోట్లు ఉన్న అమ్మాయి, లక్షల కట్నాన్ని ఆశించిన అతను ఒక్కసారి నింగినుంచి నేలకు దబ్బున ఎవరో పడేసినట్లు జారటం అరాయించుకోలేకపోతున్నాడు.
అతని మనసులో ఒక వ్యూహం రూపుదిద్దుకుంటున్నాడు.
కానీ దాన్ని పటాపంచలు చేస్తూ ప్రియను తీసుకొచ్చి ప్రేమ్ మెడలు వంచి పెళ్లిచేశారు.
ఒకటి పరువు, మరొకటి సంస్కారం. తమవల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని నిశ్చయంతోనే వారీ పనికి పూనుకున్నారు.
ఏది ఏమైనా ‘పచ్చబొట్టు’ వలన ఒక జంట పచ్చని కాపురంకి పచ్చజెండా ఊపారు. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకెన్ని చూస్తామో!
***
పచ్చబొట్టు వ్యవహారం తమ ఊరిలోనే ప్రారంభమవటంతో సహజంగా అనే్వష్‌కి ఒత్తిడి పెరిగింది. పదే పదే పై ఆఫీసర్ల నుండీ విచారణ ఎక్కువవటమే కాకుండా ప్రయత్నాన్ని ముమ్మరం చెయ్యమని ఆజ్ఞలు విడుదలవుతున్నాయి. హైదరాబాదు, కాళహస్తి ప్రక్క ప్రక్కనే ఉన్నట్లుంది వైర్‌లెస్ సెట్ల పుణ్యమా అని.
ఈ విషయంలో అందరికంటే ముందు తానే ఉండాలనుకునే మనస్తత్వం అనే్వష్‌ది. ఇది తనకొక ఛాలెంజ్ కూడా! ఆ వార్త విన్నదగ్గిరనుంచీ అదే పనిలో వున్నాడు. స్కూలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు.
జ్యోతి క్లాస్‌రూమ్‌ని పరీక్షించాడు. చుట్టుప్రక్కల పరిసరాలను కూడా.. దూరంగా ఓ గోడ. ఆ గోడకి డిజైను. ఆ చిల్లుల నుంచీ పరీక్షగా చూస్తే తప్ప గదిలో ఏం జరిగేది తెలియదు. అయినా అక్కడికి వెళ్ళాడు. అదో కట్టెల అడితి. అక్కడ యజమాని నుంచీ పనివాళ్ళదాకా ఎవ్వరినీ వదలి పెట్టలేదు. అందరి నుంచీ ఒకటే సమాధానం. మాకేం తెలియదని. మరి పచ్చబొట్టుకి పరమానందమే ఈ పని చేసాడని ఎలా తెలిసింది? ఎవరైనా చూసి చెప్పారా?
పోనీ ఇదంతా వదిలేసినా పరమానందానికి పచ్చబొట్టు ఎవరు పొడిచారు? ఎప్పుడు జరిగిందీ పని? ఒకసారి వాళ్ళింటికి వెళితే సరి.
పరమానందం భార్య భానుమతి వచ్చి తలుపు తీసింది.
‘‘పరమానందం ఉన్నాడా?’’ అని చూపించిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.
‘‘లేదండీ! ఈ విషయం జరిగాక పనిలోంచి తీసేసారు. ఎక్కడకు వెళ్లినా పని ఇవ్వటంలేదు’’.
తనను అరెస్టు చేసినా కండిషనల్ బెయిల్ తెచ్చుకొని బయటపడ్డాడు.
ఆ రోజు జనాలు కొడుతుంటే ప్రాణం పోతుందేమోనని ఒప్పుకున్నాను కానీ నాకీ రేప్‌తో సంబంధం లేదని బుకాయించటం ప్రారంభించాడు.
కోర్టులో కేసు తేలేదాకా తను ఏం చెయ్యలేడు.
‘‘మీకెంతమంది పిల్లలు?’’
‘‘ఇద్దరండి’’
‘‘ఏం చదువుతున్నారు?’’
‘‘ఒకడు ఏడు చదువుతున్నాడండీ, రెండోవాడు నాలుగు చదువుతున్నాడండీ’’
‘‘ఆ రోజు పరమానందం ఎక్కడ పడుకున్నాడు?’’
‘‘మామూలుగా ఇంట్లోనే పడుకుంటాడండీ. కాకపోతే మధ్యరాత్రి కరెంట్ పోతే ఆరు బయట పక్కేసుకొని పడుకున్నాడండీ’’ అని చెప్పింది.
ఇక ఆమెనుంచి రాబట్టే విషయాలు ఏమీ లేవనిపించింది. తన భర్త తిరుగుబోతని అంతకుముందే చెప్పి ఉండటంతో వస్తానని బయటపడ్డాడు.
పరమానందం భార్యతో ‘పచ్చబొట్టు’మీద కేసు వేయించాడు తనకన్యాయం జరిగిందని.
ఈ దర్యాప్తు ఇలా కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో పచ్చబొట్టు అనుభవం. ఇక పోలీస్ యంత్రాంగమంతా అలర్ట్ అయిపోయింది. మఫ్టీలో అన్ని పత్రికాఫీసుల దగ్గర పోలీసులనుంచే ఏర్పాటు జరిగింది. ముందు ఏ విషయమయినా అక్కడితోనే ప్రారంభమవుతుందని వారి ఊహ. కానీ వారి ఊహలను తలక్రిందులు చేసే తెలివితేటలు పచ్చబొట్టువని తెలుసుకోవడానికి కాస్త టైము పడుతుంది.
ఇది జరిగాక అనే్వష్‌మీద కాస్త ఒత్తిడి తగ్గింది. అయినా అనే్వష్ ఊరుకోడుగా. ఒకదాన్ని పట్టుకుంటే వదిలే రకం కాదు. తన విషయంలో ప్రయత్న లోపాన్ని అతను ఏనాడూ సహించడు. కానీ తుది, మొదలు, మధ్య తెలియని పచ్చబొట్టునెలా పట్టుకోవడం?
ఆలోచనలోనే ఇంటికి చేరాడు.
తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టగానే గులాబీ రంగు కవరు దర్శనమిచ్చింది.
సెల్ వచ్చాక ఉత్తరాలే కరువయిపోయాయి. తనకి ఎవరు ఉత్తరం రాసారబ్బా అనుకుంటూ అటువైపు ఇటువైపు తిప్పి చూసాడు. స్టాంపు ముద్రలే లేవు. ఫ్రమ్ అడ్రస్‌లో పేరు లేదు. కవరు విప్పి చదవటం ప్రారంభించాడు. అది చదువుతుంటే అంతులేని ఆశ్చర్యానందాలలో మునిగిపోయాడు.
***
హాయ్! హాండ్‌సమ్! హౌ ఆర్ యు?
నేనెవరా అని అప్పుడే ముద్రల కోసం వెతికేసుకున్నావా? మరి పోలీసు ఆఫీసర్‌వి కదా! అలాగే ఉండాలి. క్రింద నేనెవర్నో చూసేసావా? అయిపోయావు. ఎందుకు ఆ కళ్ళలో అంత ఆశ్చర్యం? అవును. నేను పచ్చబొట్టునే. చెడ్డవాళ్ళకే నేను చెడ్డవాణ్ణి. మంచివాళ్ళకు మంచిదాన్ని. అందుకే నీకు సహాయం చేద్దామని ఈ పలకరింపు.
నన్ను పట్టుకుంటావా? దొరకనుగా! నాకై నేను లొంగిపోతే ఆ ఛాన్సు మాత్రం నీదే! నమ్మవా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏమిటంత ఇది అనుకుంటున్నావా? ఏమో! తెలియదు. నువ్వంటే నాకిష్టం. అంతే. ఇంకంటే నేనేం చెప్పలేను.
నాదో రిక్వెస్ట్. నువ్వన్నీ మీ చెల్లికి చెప్పేస్తావుగా. నా విషయం మాత్రం చెప్పకేం! ప్లీజ్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ చెల్లికి నేనంటే బోలుడంత ఇష్టం. అది నాకు తెలుసు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఈ విషయం మనిద్దరిమధ్యే ఉండాలి. మాట ఇచ్చేసినట్లే! మాట తప్పావో నా నుంచీ నీకు కరస్పాండెన్స్ ఉండదు. గుర్తుంచుకో!
ఒప్పేసుకుంటున్నావ్ కదూ! గుడ్ గయ్!
ఇప్పటికి టాటా
నీ
పచ్చబొట్టు
***
అరె! ఏమిటిది? పచ్చబొట్టు తనకి ఉత్తరం వ్రాయటమా. విచిత్రమే. తనంటే ఇష్టమా! ఎంత ఆత్మీయంగా ఉంది ఉత్తరం? ఎంత అమాయకంగా ఉంది ఆమె మనసు. అలాంటి సున్నిత మనస్కురాలా ఇంత పెద్ద ఉద్యమానికి నాంది పలికింది? అంటే పచ్చబొట్టు స్ర్తినే అన్నమాట. ఒక విషయానికి తెరపడినట్లే. ఇంకా ఎనె్నన్ని విషయాలు తెలుస్తాయో. అడ్రస్ ఇస్తే- తన ఆలోచనలు చెప్పేవాడే! అయినా దొంగ పోలీసులకు అడ్రస్ చెబుతాడా? చిరునామా తెలిస్తే తను ఊరుకుంటాడా? ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నాడు?
అసలు పచ్చబొట్టు ఇలా తన దగ్గిరకే వచ్చి పలకరిస్తుందని కలలో అన్నా అనుకున్నాడా? విద్యకు చెప్పకుండా ఉండగలడా? చెప్పొద్దని ఎందుకు చెప్పింది? చెబితే ఇంకేమీ ఉండదని బెదిరింపు. చెల్లికి చెబితే తనకెలా తెలుస్తుంది? ఏమైనా అతీంద్రియ శక్తులున్నాయా?

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206