డైలీ సీరియల్

పచ్చబొట్టు -- 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్చరిక -3
హాయ్ ఫ్రెండ్స్!
ముచ్చటగా మన మూడో కలయిక ముక్కుపచ్చలారని యువకుడు.. పదిహేడు సంవత్సరాలు కూడా లేవు. కానీ స్ర్తి అంటే లేదు గౌరవం. తన తల్లి మాత్రం బంగారం. ప్రక్కింటి వాళ్ళు అతని దృష్టిలో బజారువాళ్ళు. ఈ దేశంలో స్ర్తిని గౌరవించని వాళ్లకిదే శాస్తి. పరాయి ఆడపిల్లను వయసును బట్టి చెల్లిగా, అక్కగా, తల్లిగా, వదినగా పూజింపని ఏ వ్యక్తికైనా ఇదే శిక్ష.
స్ర్తిని గౌరవించండి. గౌరవం పొందండి. ఇదే మన నినాదం.
నేను తప్పు ఎత్తిచూపిస్తే, దండన మీ చేతిలోకి తీసుకుంటున్నారు. నా ఈ సాహసానికి ఆ మాత్రం ఊపిరి పోస్తే చాలు. ఆ కాస్త ధైర్యంతో ఊరు, వాడ అన్నింటా నేనే ఉంటా! అన్యాయాన్ని ఎదుర్కొంటా! పిలవకనే ప్రత్యక్షమవుతా.
మీ
పచ్చబొట్టు
గమనిక: రూపేష్ అడ్రస్: డోర్ నెం.3-3-333, మాచవరం, విజయవాడ-3
***
ఊర్మిళ ఈ విషయంలో రాజీపడలేకపోతోంది.
ఈ రూపేష్ వాళ్ళు ఇదివరకు సత్యన్నారాయణపురంలో ఉండేవాళ్ళు. అక్కడ తన స్నేహితురాలు ఉండేది. అది మూడంతస్థుల బిల్డింగ్. అందులో పనె్నండు పోర్షన్లు. రకరకాల మనుషులు. రకరకాల మనస్తత్వాలు. ఫస్ట్ఫో్లర్‌లో కాపురం ఉంటున్న వాళ్ళు ముగ్గురు. రూపేష్ వాళ్ళ నాన్న సాయినాధ్ మునిసిపాలిటీలో పనిచేసేవారు. బాగా లంచాలు రావడంతో డబ్బుకు లోటు ఉండేది కాదు. అందులో ఒక్కడే కొడుకు. ఇంకేముంది, అతనికి ఏది కావాలంటే అది ఇచ్చి గారాబం చేసారు. తలకోసి ఇమ్మన్నా ఇచ్చంత ప్రేమ వారిది. అలాంటి మాటలు వినడానికి కూడా బాగుండవు. కానీ వాళ్ళిద్దరూ మాత్రం తెగ సంబరడిపోతారు. తల్లి అంటే ఇష్టమే కానీ ఆవిడ మాట కూడా ఖాతరు చేయడు. వాళ్ళ ప్రక్క పోర్షన్‌లోనే అరుంధతి ఉండటంతో తనకన్ని విషయాలు తెలిసేవి. అరుంధతి భర్త మాధవరావు పోస్ట్ఫాసులో పనిచేస్తారు. వాళ్ళిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. అనవసరంగా ఒకరి జోలికి పోరు. రూపేష్ సంగతి తెలిసి అతనితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేవారు. అయినా అతను ఏదో రకంగా తగువు పెట్టుకోవాలని చూస్తూనే ఉండేవాడు. అలాగే ఒక రోజు అరుంధతితో పెద్ద లడాయి వేసుకున్నాడు.
వాళ్ళ గుమ్మం ముందుకు వచ్చేట్లు ఇనుప కమీలు పెట్టాడు. తియ్యమంటే తియ్యడు. గబుక్కున చూసుకోకుండా నడిస్తే పడిపోతామని చెప్పినా వినడు. వరండా అందరిదీ అయి ఉండవచ్చు కానీ ఎవరి స్థలం వారిదే కదా! ఒక చోట ఉండేవాళ్ళం హక్కుల గురించి ఎందుకని మర్యాదగా చెబితే వినకుండా మొండికేసేవాడు. వాటిని ప్రక్కకుపెడితే మళ్లీ గుమ్మానికి ఎదురుగా పెట్టడం. ఇక అది భరించలేక ఇంటిగలవాళ్ళకి చెప్పింది. వాళ్ళు అసలే మెతకవాళ్ళు. రూపేష్‌తో గొడవ పెట్టుకోలేక కామ్‌గా ఊరుకున్నారు.
ఇక రోజు ఇద్దరిమధ్య మాటా మాటా పెరిగింది.
మీద మీదకు వస్తున్న అతనిని ఆపటానికి అరుంధతి ప్రయత్నించింది.
అంతే వాళ్ళ అమ్మ నా పిల్లాడ్ని చంపేస్తోంది రాక్షసీ అని అరిచింది.
‘‘ఈ రూపేష్ అంటే ఎవరనుకుంటున్నావో ఏమో! మీ అంతు చూస్తాను’’ అని బెదిరించాడు.
‘‘పెద్దమగాడివి వచ్చావులే’’ అంది.
‘‘మగతనం చూపమంటావా?’’ అన్నాడు రూపేష్.
‘‘్ఛ! ఛీ! ఎంత అసహ్యకరమైన మాట. కాలేజీలో చదువుతున్న అతను, తల్లి అంత వయసులోవున్న తనని అనాల్సిన మాటేనా?’’
ఆశ్చర్యపోయింది తను.
అన్నింటికన్నా గొప్ప విషయం అంతమాటన్న కొడుకుని ‘‘రారా! నాన్నా! వాళ్ళతో గొడవలొద్దు, మా బాబువిగా’’ అంటూ బుజ్జగించి మరీ తీసుకెళ్తున్న ఆ తల్లిని చూస్తే జాలేసింది.
అప్పటిదాకా చోద్యం చూస్తున్న ప్రక్క పోర్షన్ వాళ్ళు లోపలికి వెళ్లిపోయారు.
అరుంధతి ఎంతో అవమానంగా ఫీల్ అయింది.
ఒక్కరు.. ఒక్కరంటే ఒక్కరు కూడా అతనిది తప్పు అని చెప్పలేదు. ఇలాంటి వారు ఈ భారతావనికి బరువుగాదా అని తన దగ్గర వాపోయింది.
ఎవరికివారు తన దాకా వస్తేగానీ అనుకోరు. ఆలోచించరు. పట్టించుకోరు. ఇలా అయితే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది?
ఆరోజు తను అరుంధతి వాళ్ళింటికి వెళ్లడంతో ఇదంతా చూసింది. తను మాట్లాడబోతే అదే అడ్డుకుంది. ఒక్కరు తిరగబడితే చాలదే! అందరిలో ఆ రివల్యూషన్ రావాలి. అప్పుడు ఈ రూపేష్ లాంటి వారు అయిపూ పత్తా లేకుండా పోతారు అంది.
ఈ రోజు తనూ ఆ పరిస్థతులలోనే!
ఇలా ఎందరు రూపేష్ ప్రవర్తనకు బలి అవ్వాలి?.
అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇంకెక్కడ ఇల్లు దొరకనట్లు తన ప్రక్కన చేరారు.
కొడుకు రంగంలోకి రానంతవరకూ ఆవిడ బాగానే వుంటుంది. అతనితో యుద్ధం ప్రారంభమయితే తప్పా, ఒప్పా ఆలోచించదు. అటు చేరిపోతుంది.
తలచుకుంటుంటే మనసు రగిలిపోతోంది.
ఆ రోజు పేపరు చదివి ఉంటే ఆమె ఆవేదన కాస్త చల్లారాదే!
అందరూ కొని చదవలేరుగా!
అలా గుమ్మంలో దిగాలుగా కూర్చుంది ఊర్మిళ. ఇంట్లోకి వెళ్లి పనిచేసుకోబుద్ధి కావటంలేదు.
అప్పుడే నిద్రలేచిన రూపేష్ వరండాలోకి వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ ఎగతాళిగా చూసాడు ఊర్మిళ వంక.
అవును. తన భర్త చేతకానివాడిలా చేతులు ముడుచుకు కూర్చుంటే అలాకాక ఎలా చూస్తాడు అన్న ఆలోచన పూర్తికాకముందే ఆమె కళ్ళు విశాలమయ్యాయి. కారణం రూపేష్ బుగ్గమీద పచ్చబొట్టు.
అప్పటికే తోటివారి ద్వారా పచ్చబొట్టు గురించి, చేసే పనుల గురించీ విన్నందున ఆనందంతో చప్పుట్లు చరిచింది.
తెల్లబోయాడు రూపేష్.
ఆమె అంతరంగ ఘోష అప్పటికి గానీ చల్లబడలేదు.
‘‘ఏమయిందీ ఆంటీకి, ఏదో విచిత్రాన్ని చూసినట్లు చూస్తోంది’’ అనుకున్నాడు.
అప్పటికే వీధిలోని జనమంతా ఇంటిముందు మూగారు.
వింతగా రూపేష్‌ని చూడసాగారు.
‘‘ఆ మచ్చే వీడి రౌడీతనాన్ని రూపుమాపుతుంది’’ అని ఒకరు-
‘‘పేట్రేగిపోయేవాడు పెద్ద మగాడినని. ఇపుడు రోడ్డుమీదకు వస్తే తెలుస్తుందని’’ మరొకరు-
అర్థమరుూ్య అర్థం కానట్లుగా ఉంది రూపేష్ పరిస్థితి.
ఇంతలో రూపేష్ స్నేహితుడు ఉమేష్ ‘‘ఒరేయ్! నీ బుగ్గమీద పచ్చబొట్టు పడ్డాదిరోయ్’’ అని అరిచాడు వెనకాలనుంచీ.
అంతే.. గిరుక్కున వెనుతిరిగి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
అద్దంలో తన ముఖాన్ని తనే చూసుకొని నీరుగారిపోయాడు.
ఆ ఒక్క గుర్తు అతనిలో అహంకారాన్నంతా తుడిచేసింది.
***
ఎంతో పకడ్బందీగా పోలీసులు వల పన్నినా పచ్చబొట్టు వార్త చేరడం, ప్రచురించడం పెద్ద గందరగోళానే్న సృష్టించింది. హెడ్ ఆఫీసుకే వార్త వస్తుందన్న వారి ఊహ తారుమారయింది. విజయవాడలో ఆ వార్త చేరబడటం, రిలీజ్ అవటంతో ప్రచురణ ఉన్న ప్రతి ఆఫీసు దగ్గిరా నిఘా ఏర్పాటుచేశారు.

-సశేషం

--యలమర్తి అనూరాధ 9247260206