డైలీ సీరియల్

పచ్చబొట్టు-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చబొట్టుకి ఇదొక లెక్కా! డోంట్ కేర్ అనుకుంది మనసులో. దైవం అనుకూలిస్తే వీళ్ళంతా ఏం చెయ్యగలరు? ఈసారి మరో ప్లాన్‌తో తన పథకాన్ని అమలుపరిస్తే సరి. ఎత్తుపైఎత్తు వేస్తేనే కదా ఆటలో మజా!
ఎత్తుకుపైఎత్తు అనగానే అనే్వష్ గుర్తువచ్చాడు. తనని పట్టుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో?
హైదరాబాద్‌లో పచ్చబొట్టు పడింది అనగానే అక్కడికి పరుగెత్తాడు. తనకి వార్త తెలిసేటప్పటికి తను అక్కడే ఉంటుందా? అయినా ఎంక్వయిరీ మానటంలేదు. వెళ్లినవాడు నిరాశను తోడు తీసుకొని వస్తున్నాడు.
మళ్లీ ఇపుడు విజయవాడ పరుగో.. పరుగు. తనలా తిరుగుతుంటే ఎంత నవ్వు వస్తోందో? తనకి రోజుకో ఉత్తరం రాయాలనిపిస్తోంది. కానీ అదే అలవాటుగా మారితే ప్రమాదమని ఊరుకుంది కానీ మనసాగటంలేదు. దానికి సంకెళ్ళు వేసి ఆపాల్సివస్తోంది. ఎందుకిలా? ఎంత ఆలోచించినా అర్థం కావటంలేదు. ఎప్పటికప్పుడు అనే్వష్‌కి అన్నీ చెప్పేయ్యాలని మనసు ఎంత ఆతృతపడుతోందో? తను అలా తొందరపడితే ఇంకేం ఉంది? అంటూ స్మాష్. తను అనుకున్న ధ్యేయం నెరవేరలేదు.
ఇప్పటికే జనాలలో ఎంతో బెదురు కనిపిస్తోంది. అది అంచెలంచెలుగా పెరగాలి. ప్రతివారూ తమకి తామే బుద్ధి తెచ్చుకొనే పరిస్థితి తేవాలి. చెడు వైపు చూడాలంటే కలవరపడాలి. ఆ రోజు కోసమే తన ఎదురుచూపు. ఆ తర్వాతే అనే్వష్ ఎదుటపడాలి. నీ పరుగులు ఇకనైనా ఆపమని చెప్పాలి. ఆరోజు ఎప్పుడో?
ఇదంతా ఇష్టమేనా? ఇంకేదన్నానా? ప్రేమ సూచనలు కన్పిస్తున్నాయి. అలాంటి ఊహలు కూడా తప్పేమో? తనలాంటివారి నీడను కూడా అనే్వష్ హర్షించడేమో! అతనిపై ఆశలు పెట్టుకోవడం వ్యర్థం. కానీ తన మనసు తన మాట వినటం ఎప్పుడో మానేసింది. అది అనే్వష్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది.
ఈ కార్యక్రమం లేకపోతే అనే్వష్ ఎద గూటిలో ఏనాడో చేరిపోయేది. ఏదో అనే్వష్ తనని ఇష్టపడుతున్నట్లే ఊహించేసుకోవడం ఎంతవరకు సమంజసం? అయినా తన మాట వినేది ఎవరు?
తన మనసు, ఆలోచనలు వాటికిష్టమైన మార్గంలో. వాటికిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. ఎక్కడైనా ఎదురుదెబ్బ తగిలితే కానీ అవి ఆగవు.
అంతవరకూ తను ఈ విరహవేదన అనుభవించాల్సిందే.
వెంటనే భీష్ముడు గుర్తుకొచ్చాడు. తండ్రికోసం సంసార జీవితానే్న త్యాగం చేసిన ఘనాపాటి. జనం కోసం తనీ చిన్ని త్యాగం చెయ్యలేదా?
***
ఎక్కడ ఏ ‘క్లూ’ దొరికినా తను పచ్చబొట్టును సులభంగా పట్టుకోగలడు. అదే దొరకటంలేదు. హైదరాబాద్ వెళ్లినా ప్రయోజనం శూన్యం. అసలు తను వెళ్ళేటప్పటికి తన పని ముగించేసుకొని వెళ్లిపోతోందా? లేదా ఎవరి సహాయంతోనైనా చేస్తోందా? తప్పకుండా ఎవరిదో ఒకరిది హెల్ప్ తీసుకోవాల్సిందే! అయినా హైదరాబాద్ నుంచీ విజయవాడ రావటానికి ఎంత టైమ్ కావాలి? ఈ రకంగా ఆలోచించటం తన తప్పు. వేసిన తలుపులు వేసినట్లు ఉంటున్నాయి. పచ్చబొట్టు పడిపోతోంది. ఇంట్లో సభ్యులు తమకేమీ తెలియదంటున్నారు. విజయవాడ వచ్చినా, రూపేష్ ఇంటికి వెళ్లినా ఇదే సమాచారం. ఇదంతా ఎలా జరుగుతోంది? రూపేష్ ఇంటిని ఈ చివర నుంచీ ఆ చివరదాకా పరీక్షించాడు. వెనుకవైపు చిన్న వరండా తప్ప మరేమీ లేదు. అంతా క్లోజ్డ్. ఆవిడ తలుపులు తాళాలు కూడా వేసుకుంటాం అని చెప్పింది. చుట్టూ గోడ తప్ప మరే విధంగా వచ్చే అవకాశం లేదు. మొత్తం బిల్డింగ్‌లో అందరినీ ఎంక్వయిరీ చేసాడు. ముఖ్యంగా పక్కింట్లో ఉండే పోర్షన్ వాళ్ళని తన యక్ష ప్రశ్నలకు వాళ్ళకు విసుగు వచ్చిందే కానీ తనకు విసుగు రాలేదు.
కాళహస్తి వాసిని కాబట్టి తన ఊరిలోనే ఉందేమోనని అదనపు స్క్వాడ్‌ని పిలిపించి ఊరంతటినీ ఒకేసారి సోదా చేయించాడు. ఈ పచ్చబొట్టుకు సంబంధించిన పరికరాలు ఎవరింట్లోనైనా ఉంటాయేమోనని. ఆ ప్రయత్నమూ విఫలమైంది. ఇలా ఏ కేసులోనూ తను వెనుకబడలేదు. ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు. ప్రతి ఓటమి రెట్టింపు పౌరుషాన్నిస్తున్నా అంతరంగం నీరసపడుతోంది. దానిని ఉత్సాహపరిచే టానిక్ పడాలి. లేకపోతే బండి ఆగిపోతుంది.
తను ఎక్కవలసిన రైలు ఫ్లాట్‌ఫారమ్ మీకు వచ్చిందని అనౌన్స్‌మెంట్ వస్తోంది. మెట్లు ఎక్కుతూనే ప్రక్కకు చూసాడు. రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది. వాళ్ళమధ్య ఒకతను చిన్న పాపకు పచ్చబొట్టు పొడుస్తున్నాడు.
అంతే అతని మైండ్‌లో ప్లాష్ వెలిగింది.
అతని ప్రక్కన చేరాడు. ఆ మెట్లమీదే కూర్చొని ఎన్నాళ్లనుంచీ ఈ పని చేస్తున్నావ్ అని అడిగాడు.
‘‘చాలా సంవత్సరాల నుంచీ’’
‘‘ఈ మధ్యలో అమ్మాయిలు ఎవరైనా నీ దగ్గర పచ్చబొట్టు పొడిపించుకోవటానికి వచ్చారా?’’
‘‘పెద్ద, చిన్న, ముసలి, ముతక.. రోజుకి ఎందరో.. ఇరవై, ముప్ఫైమందిదాకా వేస్తుంటాను. లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది?’’
అప్పుడు అర్థమైంది అనే్వష్‌కు తను ప్రశ్న తప్పుగా వేసానని.
‘‘నీ పేరు?’’
‘‘పరమేశం’’
‘‘పోనీ ఎవరైనా అమ్మాయి నీ దగ్గర ఈ మధ్యలో పచ్చబొట్టు పొడవటం నేర్పమని వచ్చిందా?’’
‘‘లేదు బాబూ! అలాగ ఎవరూ రాలేదే?’’
‘‘బాగా ఆలోచించుకొని చెప్పండి’’.
‘‘లేదయ్యా!’’
‘‘బాగా గుర్తుందా?’’
‘‘అంతెలా మరిచిపోతాను?’’
‘‘చాన్నాళ్ళ క్రితం నుంచీ వేస్తున్నావన్నావు కదా? అయిదారేండ్ల క్రితం ఎవరైనా నేర్చుకోవాలని ప్రయత్నించారా?’’
‘‘లేదు బాబూ! ఎందుకిలా అడుగుతున్నావు?’’
‘‘ఊరికేలే!’’ అయినా తన పిచ్చిగానీ ఆ అమ్మాయి ఇక్కడే నేర్చుకోవాలని ఎక్కడుంది? ఈపాటికి ట్రైను వెళ్లిపోయే ఉంటుంది.
‘‘నువ్వు ఈ పని ఎక్కడ నేర్చుకున్నావ్?’’’
‘‘మా గురువుగారి దగ్గిర’’
‘‘ఆయనెక్కడుంటారు?’’
‘‘వించిపేట గాంధీ బొమ్మ దగ్గిర’’
అక్కడ కూడా ఒక ప్రయత్నం చేద్దామని వెళ్లాడు.
అక్కడా అదే సమాధానాలు. ఇక లాభం లేదని తిరుగు ప్రయాణం పట్టాడు. కాళహస్తి చేరేవరకూ అవే ఆలోచనలు.
ఎలా? ఎలా? ఆమెను పట్టుకోవడం?
ఎంత ధైర్యం లేకపోతే తనకే ఉత్తరం వ్రాస్తుంది?
ఈసారి కనిపెట్టలేకపోతున్నానని ఎగతాళి చేస్తుందేమో?
ఇప్పటికీ ప్రజలలో పచ్చబొట్టంటే క్రేజు పెరిగింది. అలాగే బడా బాబుల గుండెల్లో రైళ్ళూ పరుగెడుతున్నాయి. తప్పుడు పనులు మూడో కంటికి కనిపించకుండా చేసుకుపోయేవాళ్ళు కూడా ఇపుడు పచ్చబొట్టుకు భయపడుతున్నారు. తొందరగా పచ్చబొట్టును పట్టుకోమని హోమ్ మినిస్టర్‌కే ఆర్డర్లు వేస్తున్నారు. అవి పెరిగేకొలదీ తమకే ఒత్తిడి పెరుగుతుంది. అర్జెంట్ సమావేశాలు జరుపుతున్నారు. డిఐజి ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని పదే పదే హెచ్చరిస్తున్నారు.
ఈ మిస్టరీ వీడెదెప్పుడో? *** -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206