డైలీ సీరియల్

పచ్చబొట్టు-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్త ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఒకసారి డస్ట్‌బిన్‌లో ఉంది చూసుకోండి అని ఫోన్, మరొకసారి మీ ఆఫీసు ముందు పిచ్చి అమ్మాయి విసిరే రాయిలో ఉందని కబురు, ఇంకోసారి మీ జేబులో ఉంది.. అన్నీ నిజాలే! ఎన్ని తెలివితేటలో!
నిజమే! వార్త ఇచ్చి ఇంత డేరింగ్‌గా పని ముగించుకొని వెళ్లటం అంటే మాటలా? ఎదురుగా రైలు దగ్గిరకు వస్తుంటే పట్టాలు మీద నడవటం లాంటిదే!
అసలు ఎంతసేపయిందో వచ్చి? తనని భలే ఏడిపిస్తోంది. పట్టు వదలని విక్రమార్కుడిలా బండిని వదిలేసి కాలినడకన తిరుపతి చేరాడు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఎక్కడా అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదు.
తనను తను తిట్టుకొని మళ్లీ బస్సులో తిరుమల బయలుదేరాడు. అందరూ దిగటం అయిపోయిందనుకొని అపుడే దిగుతున్న ఓ అమ్మాయికి తను ఎక్కుతూ డాష్ ఇచ్చాడు. ఎందుకో అతని హృదయం ఝల్లుమంది. దానిని తిట్టుకుంటూ ‘సారీ’ అండీ’’ అన్నాడు.
‘‘ఇట్స్ ఓకె! నో ప్రాబ్లమ్’’ అంటూ తన దానిమ్మ గింజల్లాంటి పలు వరుసతో ఒక చిరునవ్వు పారేసింది.
బ్రతుకు జీవుడా అంటూ సీటులో కూలబడ్డాడు.
ఆ అమ్మాయి తగలగానే ఎందుకలా తనకి కరెంట్ షాక్ తగిలింది? పచ్చబొట్టుకీ విషయం తెలిస్తే తనకి కూడా పచ్చబొట్టు వేసేస్తుంది. పోలీసులకీ పచ్చబొట్టు అంటూ పేపర్లు తెగ రాసేస్తాయి. దానితో పచ్చబొట్టు లెవెల్ మరో పదింతలు పెరిగిపోతుంది.
ఆ రోజంతా రెస్ట్ తీసుకోకుండా తిరుమల, తిరుపతి అంతా చుట్టబెట్ట. చీకటిపడ్డాక ఇంక పచ్చబొట్టు మరో గమ్యం చేరి ఉంటుందనుకొని ఇల్లు చేరాడు.
అన్నయ్య వాలకం చూడగానే కనిపెట్టేసింది విద్య.
పచ్చబొట్టు కనబడలేదని.
వయసు, రూపం, ఆడ, మగ తెలియకుండా ఎలా పట్టుకుంటాడు? ఒక ఫొటో అన్నా ఉంటే సులభంగా పట్టుకోవచ్చు. ఏమీ లేకుండా ఎలా? మందు లేని వ్యాధులతో జనాలు చచ్చిపోతుంటే తాము కూడా ఇలాగే విలవిలలాడిపోతారు.
అయినా ఆమెను పట్టుకోవాలని వీళ్ళకెందుకింత తాపత్రయం?
పచ్చబొట్టు మంచి పనులే కదా చేస్తోంది!
ఇలా కొన్నాళ్ళు ఆమెను ఆపకుండా కొనసాగనిస్తే మగవాళ్ళంతా మంచివాళ్ళుగా మారటం గ్యారంటీ! ఆమె పట్టుబడితే ఇంకేముంది? విచ్చలవిడితనం పెరిగిపోతుంది. మళ్లీ మగవాళ్ళ అహం తిరిగి లేస్తుంది.
భోజనాలయ్యక విద్య ‘ఏరా అన్నయ్యా! ఏంటి కబుర్లు’ అని అడిగింది.
‘‘ఏమున్నాయి? పచ్చబొట్టు దొరక్కపోవటమే ఓ పెద్ద కబురు’’
‘‘అలా నిరాశ పడిపోతావేం?’’ అప్పుడే పట్టుబడిపోతే ఆమె గొప్పతనం ఏముంది?’’
‘‘నిజమేరా! అంత తొందరగా పట్టుబడే రకంలా లేదు ఆమె’’
విద్య ఆశ్చర్యపోయింది అతని మాటకు.
‘‘అదేంటిరా! పచ్చబొట్టును నేనయితే అభిమానంగా ‘ఆమె’ అంటున్నాను. నీకు పచ్చబొట్టు ఆమె, ఆయనో తెలియదుగా. ఆమె అంటున్నావేమిటి?
తడబడ్డాడు అనే్వష్. ‘‘నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరో ఒకరు అవ్వాలిగా. అందుకే అలా అన్నాను’’.
‘‘సరే! నిద్ర వస్తోంది. వెళ్లి పడుకుంటాను’’ అంటూనే వెళ్లిపోయాడు విద్య ఏదో మాట్లాడే లోపే!
మంచం మీద పడుకున్నాడే కానీ నిద్ర రావటంలేదు.
రకరకాల ఆలోచనలు చుట్టుముడుతున్నయి. డబ్బుల్లేవన్న మాట తనను మిస్‌లీడ్ చేయటానికేమో అనిపించసాగింది. ఏమీ లేకుండా ఇన్ని పనులు ఎలా చేయగలదు? ఏదైనా తను మోసపోతున్నాడు. పచ్చబొట్టు చేతిలో మోసపోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.
అయినా మనసు ఆమెను కోప్పడటం లేదు. ఆరాధిస్తోంది. మొదట మొదట వున్న కోపం కూడా ప్రేమగా మారి ఉప్పెనై, వెల్లువై ప్రవహిస్తోంది. మళ్లీ ఓ ఉత్తరం రాయవచ్చుగా. బెట్టు చేస్తోంది కాబోలు. అడ్రెస్ తెలిస్తే తనే రాసేవాడు.
పోనీ నిద్రపట్టటం లేదు కాబట్టి ఇపుడు రాస్తే ఏం పోతుంది?
ఇన్ని తెలుసుకుంటోంది. తను ఉత్తరం రాసానని తెలుసుకుంటుందో లేదో చూద్దాం అని ఒక తెల్లటి పేపరు తీసుకొని పచ్చబొట్టుపైన తనకున్న భావాలన్నీ ఒలకబోసాడు.
అపుడు మనసు రిలీఫ్‌గా అనిపించింది.
దానిమీద పేపర్ వెయిట్ పెట్టి మూతలు పడుతున్న కళ్ళకు పని చెప్పాడు.
***
తెల్లవారి లేచి చూస్తే ఉత్తరం కనిపించలేదు.
వెంటనే పని అమ్మాయి మీద అనుమానం వచ్చింది.
‘‘విద్యా! విద్యా!’’ గట్టిగా అరిచాడు.
‘‘ఏమిటన్నయ్యా! అలా అరుస్తున్నావ్! వస్తున్నా!’’ అంటూ వచ్చింది.
‘పసిడి’ పనిలోకి వచ్చిందా?
‘‘లేదన్నయ్యా! ఈరోజు రానని ముందే చెప్పింది. వాళ్ళ వాళ్ళదేదో ఫంక్షన్ ఉందట. ఊరెళ్లి రేపు సాయంత్రానికి వస్తానని చెప్పింది. ఏం?’’
అయోమయంలో పడ్డాడు అనే్వష్.
‘‘నువ్వేమైనా నా రూమ్‌లోకి వచ్చావా?’’
‘‘లేదే. ఎందుకలా అడుగుతున్నావ్?’’
చెప్పాలా వద్దా? సంశయం.
‘‘ఏం లేదులే’’ అన్నాడు.
ఏం చెబితే పచ్చబొట్టుతో సమస్య వస్తుందో అని.
‘‘ఏమిటోరా! రాత్రినుంచీ అదోలా ఉన్నావ్! ఆ పచ్చబొట్టు నాకు కనిపించినా బాగుండును. ఒక్కసారి మా అన్నయ్యకి కనిపించు, నిన్ను పట్టుకోకుండా చూసే పూచీ నాది అని చెప్పేద్దును’’.
‘‘చివరలో ఆ క్లాసు ఏమిటి?’’
‘‘మరీ.. పచ్చబొట్టు దొరికినా ఎవ్వరూ పట్టివ్వరు- ఇంకా తప్పించటానికి ప్రయత్నిస్తారు గానీ’’
‘‘ఆమెకు ఎంతమంది మిత్రులున్నారో అంతకుపైగా శత్రువులూ ఉంటారని నా అంచనా.
‘‘చూద్దాం’’
‘‘నీ నోటితో పచ్చబొట్టు పట్టుబడుతుందని అనవే. నిజమవుతుందేమో!’’
‘‘అంటానికేం? దొరికితే వదలేస్తానని మాటిస్తే తప్పకుండా అంటాను’’.
ఆ మాట తానివ్వగలడా? వౌనం వహించాడు.
నవ్వుకుంటూ వెళ్లిపోయిది విద్య.
***
పచ్చబొట్టు వదిలిన చిన్నమాట ఎందరి హృదయాలనో కలవరపరిచింది. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కొందరు ఇండివిడ్యుయల్‌గా ప్రకటనలు గుప్పించారు తమ సహాయ హస్తం అందిస్తామని. ఆమెకు ధనం పంపే మార్గాన్ని సూచించమని.
ఫలితం ఏమీ కనిపించకపోవటంతో వారి వారి సంస్థల ముందు పోస్ట్ డబ్బాలాంటిది వ్రేలాడదీశారు. అందులో నోట్ల కట్టలు వేయడం ప్రారంభించారు. మధ్యతరగతి ఇళ్ళలో కూడా కిటికీల్లో కిడ్డీ బ్యాంకులు వెలిసాయి. వాటిని దొంగలెత్తుకుపోతారన్న భయం లేదు. వాళ్ళకీ పచ్చబొట్టంటే భయమే. ఇంకా తమవైపు ఆమె చూపు పడలేదని ఆనందిస్తున్నారు. ఏదో ఒక రోజు వేటు పడుతుందని భయమూ లేకపోలేదు.
నిజంగా పచ్చబొట్టు ఈ డబ్బు తీసుకుంటుందా? అలాంటి చోట కూడా నిఘా ఏర్పాటు చేస్తే.. అంతమంది పోలీసులెక్కడ? జనం తలుచుకుంటే తప్ప పచ్చబొట్టు దొరకదేమో.. పోలీసుల తర్జన భర్జనలు.
ఇందరిని ఇన్ని ఆలోచనలలో పడవేసిన పచ్చబొట్టు మాత్రం హాయిగా పడకకుర్చీలో పడుకొని అనే్వష్ రాసిన ఉత్తరాన్ని చదువుకుంటోంది.
ఎన్నిసార్లు చదివినా తనివి తీరటం లేదు. మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తోంది. అనే్వష్‌ని తికమక పెట్టాలని తను వాడిన మాట ఇంత జాలిని కలిగిస్తుందని తను ఊహించనే లేదు.
అందులో కొంత వాస్తవం, కొంత అవాస్తవం కలగాపులగమయ్యింది. చూద్దాం.. ప్రారంభం తనది, ముగింపు భగవంతుడిది. తన చేతిలో ఏముంది?
***
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206