డైలీ సీరియల్

పచ్చబొట్టు-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మంచి పని చేసావ్! పిల్లలకీ, నాకూ నువ్వులేక ఏమీ తోచటంలేదు. ఏదో తింటున్నాం. తిరుగుతున్నాం. అంతే!’’
‘‘సరే! ఉంటాను’’అంటూ ఫోను పెట్టేసిందావిడ. వీళ్ళందరి కంటే ఎక్కువ బాధ పడేది ఆవిడే! కళ్ళలో గిర్రున తిరుగుతున్న నీరును చీర కొంగుతో వత్తుకున్నారు.
మరదలు మాణిక్యం బాధపడింది అది చూసి.
‘‘మావల్లే నీకీ ఎడబాటు’’ అని.
‘‘అదేం లేదులే. ఇన్నాళ్ళయిందని కాస్త అనిపించిందంతే.’’
‘‘కాదులే. బొంబాయి ఎవడొస్తాడని ఎవరూ రారు. దూరాభారాలు, ఖర్చులు ఎవరినీ కాలు కదలనివ్వవు. అలాంటిది నువ్వు రావటం మా అదృష్టం. నువ్వు వచ్చాక మా ఇంటికే కళ వచ్చింది. సాయంత్రం నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు బోసిపోతుంది.’’
‘‘నాలుగు రోజులలో సర్దుకుపోతుంది.’’
‘‘ఆయన వచ్చి నిన్ను రైలు ఎక్కిస్తానన్నారు.
‘‘అలాగే నా బట్టలవీ కాస్త సర్దుకోవల్సినవి ఉన్నాయి. వెళ్ళి వాటిని సర్దుకుంటాను’’
‘‘సరే!’’ అందావిడ.
ఏదీ ఎవరికోసం ఆగదు. అలాగే ఆరోజు రైలు ఎప్పుడూ గంట, అరగంట ఆలస్యంగా వచ్చేది. కరెక్ట్ టైమ్‌కి వచ్చేసింది. తన ఆతృత దానికి కూడా తెలిసిందేమో అనుకొంది సత్యవతి.
‘‘పిచ్చితల్లి’’అనుకొంది ట్రయిన్. బయటకు చెప్పటానికి మాటలు రావుగా.
రెండురకాల ఫ్రూట్స్, పుస్తకాలు కొనిచ్చి రైలు కదిలేవరకూ ఉండి టాటా చెప్పి వెళ్ళిపోయారాయన. అనే్వష్ వాళ్ళకు ఫోన్‌చేసి అమ్మ బయలుదేరిందని చెప్పారు.
రైలులో కూర్చుందే కానీ ఆమె మనసు ఎప్పుడో ఇంట్లో వాలిపోయింది. భర్తతో పిల్లలతో కబుర్లలో పడిపోయింది.
జరుగుతున్న కాలాన్ని తోసేసి భవిష్యత్తులోకి వెళ్లిపోతోంది.
మనిషి అంతే. ఎంతకాలం బ్రతికినా ఇంకా ఎంతోకాలం బ్రతకాలనుకుంటాడు. రోగాలు, రొప్పులు ఉన్నా అమ్మా! అబ్బా అంటాడే తప్ప నన్ను తీసుకెళ్ళిపో అనడు. అందుకే భగవంతుడు ఎవరిని ఎప్పుడు పంపించాలో ఎవరిని ఎప్పుడు రప్పించుకోవాలో తనే రాసేసుకుంటాడు. అమలు చేసేస్తూ ఉంటాడు.
* * *
ఈరోజు లేచిన దగ్గరనుంచీ ఏమిటో మత్తుగా, అసహనంగా ఉంది. ఇద్దరు జేబుదొంగలను పట్టుకొన్నారు. ఊరిలో దొంగతనం జరిగిందంటే అక్కడికి వెళ్ళి వచ్చాడు. మనసంతా ఎందుకో చికాకుగా ఉంది. ఇది పోవాలంటే ఒక్కసారి భక్తకన్నప్ప కొండమీదకు వెళ్ళివస్తే సరి. అనుకున్నదే తడవుగా బయలుదేరాడు.
పచ్చబొట్టు పొడిచిన కేసులు నాలుగే అయినా సంచలనం మాత్రం పెద్దది. పై ఆఫీసర్లనుంచీ ఒత్తిడి పెరుగుతోంది. కావాలంటే అదనపు బలగాన్ని పంపుతామని, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళుచేస్తున్నారని సరిపెట్టుకున్నాడు. అన్నింటికంటే పచ్చబొట్టు తనచుట్టూ తిరుగుతుంటే తను పట్టుకోలేకపోవడమే తనకి ఎక్కువ బాధ కలిగిస్తోంది. ఊరంతా రైడింగ్ చేసినా ఫలితం దక్కలేదు.
రైలింగ్ దగ్గర చేరి క్రిందకు చూసాడు. ఊరంతా కనిపిస్తూ ఆ దృశ్యం ఎంతో బాగుంది. మనసు బాగుండకపోవటంతో దానిని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాడు. చల్లగాలి పరామర్శలు కూడా అతన్ని చల్లబరచ లేకపోతున్నాయి. అటుఇటు తిరుగుతున్నాడు. ఆలోచనలలో ఉన్న అతను నిలుచున్న స్థలంలో రైలింగ్ విరిగిపోవటం గుర్తించలేదు. ఒక్క నిముషం ఆలస్యమయితే అగాధాల అంచులను చేరే వాడే!
ఒక సున్నిత హస్తం సరైన సమయానికి ఇతరులకు లాగింది.
‘‘మిష్టర్ అనే్వష్! మీరు ఎంత కర్తవ్య దీక్షాపరులయినా ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవటం బాగోలేదు.’’
ఆరోజు తనని బస్‌దగ్గిర డాష్‌కొట్టిన అమ్మాయి. ఇక్కడ ప్రత్యక్షమవటం అతనికి వింతగా ఉంది.
‘‘్థంక్స్ మిస్-’’ పేరుతెలియక ఆగాడు.
‘‘నా పేరు తృప్తి.’’
‘‘తృప్తి భలే ఉంది పేరు అనుకుంటూ. ఇందాక ఆ అమ్మాయి తనను పేరుపెట్టి పిలిపించే ఈమెకెలా తెలుసు?’’
‘‘అరె! నా పేరు మీకు ఎలా తెలుసు?’’
‘‘మీకు మేం తెలియకపోవచ్చు కానీ మీరు మాకెందుకు తెలియదు. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ల పేర్లు ప్రజల పెదాల మీద ఎప్పుడూ నలుగుతూ ఉంటాయి. అలాగే మీరుకూడా!’’
‘‘ఈరోజు నా ప్రాణాన్ని కాపాడిన మీకు నేనేమిచ్చి ఋణం తీసుకోను?’’
‘‘ఈ లోకంలో ఎన్నో తీర్చుకోలేని ఋణాలున్నాయి. అలా ఈ ఋణాన్ని ఎప్పుడూ ఋణంగానే ఉంచండి. అవసరమయినప్పుడు నేనే మీదగ్గిరనుంచీ అడిగి తీసుకుంటాను ప్రొద్దుపోయింది మరి నే వెళ్ళొస్తాను.’’
ఆమెను ఆపాలని అనిపిస్తోంది. కానీ పెదాలు విడివడటం లేదు.
కారణం ఆమె అందం. ఓ పాలరాతి శిల్పంలా.. ఎవరో శిల్పి అత్యంత నైపుణ్యంతో చెక్కిన రూపం ఆమెది. కవులు వర్ణించే విల్లులాంటి కనుబొమ్మలు, మాట్లాడే చేపల్లాంటి కళ్ళు, సంపెంగ లాంటి ముక్కు, ముద్దొచ్చే పెదాలు, శంఖం లాంటి మెడ, సన్నజాజి తీగెలాంటి శరీరం.
‘‘ఓహ్! ఇంత అందమైన అమ్మాయిని మునుపెన్నడూ చూడలేదు. ఆరోజు బస్సు బయలుదేరిపోతూ ఉండటంతో అంతసరిగా గమనించలేదు. అదే హృదయ స్పందన. అదే ఆమెను గుర్తుచేసింది.
అతను ఆమె గురించి ఆలోచిస్తూ ఉండగానే ఆమె క్రిందకు దిగిపోయింది.
‘‘అరె! ఆమె అడ్రస్ కనుక్కోలేదే!’’
‘‘మిస్..మిస్..’’ అని పిలుస్తూ గబగబా మెట్లుదిగాడు.

ఆమె కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఎలా అదృశ్యమయింది?
ఆలోచిస్తూనే ఇంటి దారిపట్టాడు.
అప్పటిదాకా దాక్కున్నచోటునుంచీ బయటకువచ్చి సువర్ణ ముఖీనదికి వెళ్ళే ద్వారం వైపుగా సాగిపోయింది.
అనే్వష్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఉంటే ఆమె పట్టుబడిపోయేదే!
తృప్తి.. ఎంత తృప్తిగా ఉందో. ఆమెతో కాసేపే మాట్లాడినా తనకెంతో తృప్తిగా ఉంది. ఆమె కనుసన్నల్లోనే కదలాడాలని హృదయం తహతహలాడుతోంది. ఎందుకనో?
ఎవరీ తృప్తి? ఈ ఊరేనా? ఎప్పుడూ చూసినట్లు లేదే? ఎంక్వయిరీ చెయ్యాలి. పోనీ విద్యనడిగితే అమ్మో! అది ఆవలించకుండానే పేగులు లెక్కబెడుతుంది. వద్దులే. తనే ఈ విషయం కనిపెట్టాలి. ఎందరినో పట్టుకున్నవాడు ఆమె అడ్రస్ సంపాదించలేడా?
ఇంటికి చేరిన అతనికి మరో షాకింగ్ న్యూస్.
‘‘అన్నయ్యా! అమ్మ బయలుదేరిన ట్రైనుకి ఆక్సిడెంట్ అయిందట. చాలా మంది చచ్చిపోయారట. అమ్మ ఎలా ఉందో? నాన్నగారే ఫోనులో ఈ విషయం రిసీవ్ చేసుకున్నారు.’’
అది విన్న తర్వాత అలా ఉండిపోయారు. నేను మళ్ళీ మాట్లాడిస్తే అప్పుడు చెప్పారు. పిచ్చి చూపులు చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. ఇప్పుడే నీ సెల్‌కి రింగ్ చేద్దామనుకుంటున్నా!’’
‘‘ఏం భయం లేదు. నేను వచ్చేసాగా! ముందు నాన్నగారికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వు. ఈలోపు మనమిద్దరం ఆ ప్రదేశానికి వెళ్దాం. అమ్మకి ఏం అవ్వదు.
తను డాక్టర్‌నన్న విషయమే మరిచిపోయానని తెలుసుకొని సిగ్గిల్లింది విద్య. వెంటనే ఇంజెక్షన్ చేసి తలక్రింద దిండుపెట్టి ఆయన్ని ఫ్రీగా పడుకొనేట్లు చేసింది.
చిన్నప్పటి నుంచీ తమను పెంచిన అమ్మ ఇకలేదేమో అన్న ఆలోచనే తన మనసును మొద్దుబారేట్లు చేసింది. హాస్పిటల్‌లో ఎందరి చావులనో కళ్ళారా చూసిన తను తన తల్లి ప్రమాదంలో ఇరుక్కుందన్న విషయానే్న భరించలేక పోయింది. అటు తల్లి ప్రేమ. ఇటు కన్న తండ్రి కళ్ళముందే కదిలిపోతుంటే విచలితురాలయ్యింది.
ఎలా వచ్చి అనే్వష్ వెనుక కూర్చుందో ఆమెకే తెలియదు.
అనే్వష్ గంభీరంగా ఉండటంతో అతని ఆలోచనలు అంతుచిక్కటం లేదు.
కానీ ఇద్దరి హృదయాలలో ఆలోచనల ఘోష.
తమ తల్లి బ్రతికుండాలని వెయ్యి దేముళ్ళకు మ్రొక్కుకుంది విద్య. ఆ కాస్త సమయంలోనే.
కాళహస్తి చేరటానికి కాస్తముందు రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు విసిరివేయబడ్డాయి.
ఆ ప్రదేశమంతా శ్మశానంలా శవాలతో నిండిపోయింది. ఎవరిది ఏ శవమో కూడా గుర్తించలేనంత ఘోరంగా ఉంది పరిస్థితి.

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206