డైలీ సీరియల్

పచ్చబొట్టు--21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ళు రెండూ పోయి మొండెంతో ఉన్న ఒక శవం, ఒక చేయి ప్రక్కనే పడి ఉన్న మరో శవం. చేతులు లేని మొండాలు కొన్ని ఉన్న ఆ స్థలంలో తమ తల్లికోసం ఆత్రంగా వెతుకుతున్నారు ఆ అన్నాచెల్లెళ్ళు.
వృత్తిరీత్యా వారిద్దరికీ శవాలను చూడటం మామూలే. కానీ ఈరోజు తమ తల్లికోసం శవాలలో వెతకటం వాళ్ళకు దుర్లభంగా ఉంది.
‘‘అన్నయ్యా! ఇటు చూడు’’అంది విద్య ఒక ప్రక్కగా చూపిస్తూ.
అక్కడ ఒక శవం నుజ్జునుజ్జు అయిపోయింది. మెడను పట్టేసిన నక్లెస్ తప్ప శరీరంలో ఏ అవయవమూ వాటి ఆకృతిలో లేవు.
‘‘అన్నయ్యా! ఆ నెక్లెస్ అమ్మదే.’’
అంతే! ఇద్దరూ ఒక్కసారి ఆమె శవం దగ్గిర చేరారు.
‘‘చెల్లీ! ఒకరో, ఇద్దరో తప్ప అందరూ మరణించారని మెసేజ్ వస్తే అందులో అమ్మ ఉండాలని వంద దేవుళ్ళకి మ్రొక్కుకుంటూ వచ్చాను. దేముడు నా మొర వినలేదురా!’’
అతని కనుపాపలలో సన్నటి కన్నీటి తెర.
విద్యకు కన్నీరు ఆగటం లేదు.
అపురూపమైన అమ్మ. ఇంత కుంకుమ బొట్టుతో జీవకళ ఉట్టిపడే అమ్మ ఇలా నిర్జీవంగా చూడలేకపోతోంది. తమకిక తల్లిలేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతోంది.’’
‘‘అన్నయ్యా! నేనిది భరించలేను’’అంటూ భోరుమంది.
‘‘చెల్లీ! ఏడవకమ్మా! అమ్మ ఇక మనకు లేకపోవచ్చు. కానీ అమ్మతో గడిపిన తీపి అనుభవాలు మనతోడుగా ఉండి జీవితాంతం నడిపిస్తాయి. ధైర్యంగా ఉండాలి. లే!’’అంటూ ఆమెను దగ్గరగా తీసుకొని తల నిమురుతూ ఓదార్చాడు. ఆ ఓదార్పులో తనను తనే ఓదార్చుకుంటున్నాడు. తామిద్దరినీ ఓదార్చవలసిన తండ్రి పరిస్థితి ఎలా ఉందో తమకు ఇంకా తెలియదు. ఈ వయసులో ఆయన ఈ వార్తను తట్టుకోగలడా? ఏమో!
‘‘పద! వెళ్దాం. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక అమ్మను ఇంటికి తీసుకువస్తాను. అందరం కలిసి నాన్నమ్మ గారింటికి వెళ్దాం. ఈలోపు నువ్వు ఇంటికివెళ్ళి ఎవరి సహాయమన్నా తీసుకొని నాన్నగారిని హాస్పటల్‌కి తీసుకువెళ్ళు. పిలిస్తే వచ్చి చూస్తారు కానీ ఆయన ఉన్న పరిస్థితులలో డాక్టర్లు మనింటికి వచ్చేకన్నా మనం హాస్పటల్‌కి వెళ్ళటమే మంచిది. నేనొచ్చేవరకూ నువ్వు నాన్నగారి దగ్గిరే ఉండు.
‘‘అలాగే అన్నయ్యా!’’
‘‘ఆ! విద్యా అలాగే నీవీ, నావీ బట్టలు, నాన్నగారివి ఇంకో సూట్‌కేస్‌లో సర్దేసెయ్! మళ్ళీ ఎప్పుడు వస్తామో. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.’’
‘‘మరి నువ్వు లీవ్ చెప్పద్దా?’’
‘‘అదంతా నేను చూసుకుంటాను. ముందు మూడురోజుల లీవ్ గ్రాంట్ చేయించుకుంటాను. తర్వాత మెడికల్ సర్ట్ఫికెటే మీ హాస్పిటల్ నుంచీ తీసుకొని పొడిగించుకోవచ్చు. అవన్నీ ఇప్పుడెందుకు? కష్టాలొచ్చినప్పుడే బ్రేవ్‌గా ఉండాలి. ఓ.కే. క్విక్.’’
‘‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఒక్కసారి అమ్మను అలాచూసి తట్టుకో లేకపోయాను. ఎంత డాక్టర్‌నయినా డాక్టర్‌ని కదా! నా గురించి వర్రీకాకు. ఇంటికి బయలుదేరేముందు ఒకసారి హాస్పిటల్‌కి ఫోన్ చెయ్యి’’ అని చెప్పి స్టేషన్ బయటకు వచ్చింది.
అటుగా వస్తున్న ఒక ఆటోని ఆపి పోనివ్వమంది. అతనికి వెయిటింగ్ ఛార్జీ ఇస్తానని ఒక అరగంట ఆగమని చెప్పి పైకి వెళ్ళింది.
తండ్రి ఇంకా మత్తులోనే ఉన్నాడు. ఆసుపత్రికి వెళ్ళేవరకూ ఆయన మత్తులో ఉండటమే బెటర్. ఆయన్ని ఒకసారి చూసి లోపలికి వెళ్ళి ముగ్గురివీ బట్టలూ, బ్రష్‌లూ సూట్‌కేస్‌లలో సర్ధింది. బీరువాలో డబ్బులు తీసి పర్సులో పెట్టుకుంది.
వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ కనెక్షన్ కట్ చేసింది. అమ్మ ఉండగా తననీరూమ్‌లోకే రానిచ్చేది కాదు. మళ్ళీ ఆమె కళ్ళలో గిర్రున తిరగనున్న కన్నీళ్ళను ఆపుకుంటూ పైనుంచే టాక్సీడ్రైవర్‌ని పైకి రమ్మని పిలిచింది.
అతను వెంటనే పైకి వచ్చాడు.
‘‘నాన్నగారు మైకంలో ఉన్నారు. కాస్త సాయంచేస్తారా మిస్టర్.’’
‘‘వినీల్ అండీ నా పేరు.’’
అతని సహాయంతో ఆయన్ని ఎలాగో టాక్సీలోకి చేర్చారు.
హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం, డాక్టరుకి చూపించడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. డాక్టర్లు ఆయన్ని లోపల పరీక్షిస్తున్నారు. బయట కుర్చీలో కూర్చుంది.
ఇలా జరుగుతుందని ఏనాడన్నా ఊహించామా? నాన్నగారికి హార్ట్ ప్రాబ్లెమ్‌లా ఉంది. తనది గైనకాలజీ. రిజల్ట్‌వచ్చేదాకా ఎదురుచూడటం తప్ప తానేమీ చెయ్యలేదు.
ప్రొద్దుననుంచీ ఒకటే టెన్షన్‌తో తిరుగుతూ ఉండటంతో ఆమె కళ్ళు మూసుకుంది రిలాక్స్ అవటానికన్నట్లు. అప్పుడు గుర్తొచ్చింది టాక్సీడ్రైవర్‌కి డబ్బులివ్వలేదని.
‘‘అరె! అదేమిటి? అలా వెళ్ళిపోయాడు. తను హడావిడిలో మరిచిపోయి ఉండవచ్చు. అతనయినా అడిగి తీసుకెళ్ళి ఉండాల్సింది.
‘‘ప్చ్! ఏమిటిలా చేసింది?’’అయినా ఒక్కసారి బయటకివెళ్ళి చూసి వద్దామనుకుంది.
అక్కడ ఎవ్వరూ లేరు. తప్పు తనదే. ఎక్కడివాడో అతను. ఈసారి కనబడినప్పుడు తప్పకుండా డబ్బులిచ్చెయ్యాలి’’ అనుకొంది మనస్ఫూర్తిగా. అసలింత మొహమాటస్థుడిని తనింతవరకూ చూడలేదు’’ అనుకొంటూ, ఆమె లోపలికి వెళ్ళబోతుండగా వెనకనుండీ ‘ఏమండీ’అన్న పిలుపు వినిపించింది.
చూస్తే టాక్సీ డ్రయివర్.
‘‘ఓ! మీరేనా! మీకోసమే చూడటానికి వచ్చాను. ఇందాక నా బాధలో పడి మీకు బిల్ ఇవ్వటం మరిచిపోయాను. డబ్బులు తీసుకోండి’’అని ఇవ్వబోయింది.
నేను బిల్‌కోసం రాలేదు. మీకు టాక్సీ అవసరం ఉంటుందేమోనని వెయిట్ చేస్తున్నానని చెప్పటానికి వచ్చాను.
‘‘అలాగా మీరనవసరంగా పార్టీలు మిస్ అవుతారేమో.’’
‘‘ఏం ఫరవాలేదు. ఇప్పుడు నాకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రాత్రంతా టాక్సీ తోలాను. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. మిమ్మల్ని, మీ నాన్నగారినీ ఇంటిదగ్గిర దించేసి వెళ్ళిపోతాను.’’
‘‘సరే! మీ ఇష్టం’’అని లోపలికి వెళ్ళింది విద్య.
‘‘టాక్సీడ్రైవర్‌తో ఇంత గౌరవంగా మాట్లాడిన ఆమెను వదిలి వెళ్ళబుద్ధి కావటంలేదు. వినీల్ అని తన పేరుచెప్పగానే ‘వినీల్‌గారూ!’ అని ఆమె పిలవటం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు.
అందుకే ఇలా ఉండిపోయాడు. వినయం, విధేయత, విద్య మూడింటిని కలబోసుకున్న ఇలాంటి అందాల రాశికోసం జీవితాంతం చూసినా జీవితం ధన్యమయిపోతుంది అనుకుంటూ సీటులో జారగిలపడ్డాడు.
* * *
‘‘విద్యమ్మగోరూ! డాక్టరుగారు పిలుస్తున్నారండీ’’ నర్స్ చెప్పి వెళ్ళిపోయింది.
పరుగులాంటి నడకలో ఆపరేషన్ థియేటర్‌కి చేరింది.
‘‘డాక్టర్! ఎనీథింగ్ సీరియస్.’’
‘‘సీరియస్ అంటే సీరియస్ అనీ చెప్పలేం. కాదనీ అనలేం విద్యా! మీ అమ్మగారు చనిపోయారేమో అన్న వార్తనే మీ నాన్నగారు తట్టుకోలేకపోయారు. ఇక చనిపోయారని తెలిస్తే అసలు బ్రతికే ఛానే్స లేదు. కోమాలో ఉన్నారు. ఆ కోమాలోంచీ బయటపడవచ్చు లేదా ఆ కోమాలోనే చనిపోవచ్చు.’’
‘‘డాక్టర్! మరో మార్గంలేదంటారా?’’
‘‘లేదు విద్యా! దీనికి ట్రీట్‌మెంట్ లేదు. ఇది చాలా సెన్సిటివ్ పర్సన్స్‌కి వచ్చే జబ్బు. ఒకరంటే ఒకరికి విడదీయరాని బంధం ఉన్న జంటలలోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వారు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేరు.’’
‘‘వేరే ఎక్కడికయినా తీసుకెళితే ప్రయోజనం ఉంటుందంటారా?’’ అడగకూడదనుకుంటూనే అడిగేసింది.
‘‘అలాంటి ఏదైనా ఉంటే మీకు చెప్పనా విద్యా?’’
‘‘సారీ. అండీ మనసాగక అడిగాను. పోనీ హాస్పిటల్‌లోనే ఉంచమంటారా డాక్టర్?’’
‘‘అక్కర్లేదు విద్యా! నాన్నగారిని అమ్మతోపాటూ తీసుకువెళ్ళటమే మంచిది. నేనెందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో!’’
‘‘అలాగే డాక్టర్!’’
అప్పుడే అనే్వష్‌నుంచీ ఫోన్ వచ్చింది.
‘‘చిన్నా నాన్నగారికెలా ఉంది?’’
‘‘నాన్నగారిని కూడా తీసుకువెళ్ళమంటున్నారన్నయ్యా’’ అంటూ పరిస్థితి అంతా వివరించింది.
‘‘సరే ఏంచేస్తాం. ఇంకో టాక్సీ మాట్లాడుకొని నువ్వు, నాన్నగారూ అందులో, అమ్మా నేను ఇందులో వెళ్ళిపోదాం. బయలుదేరే ముందు ఫోన్ చెయ్యమన్నావని చేస్తున్నాను. రడీగా ఉండు. వచ్చేప్పుడు నేనే ఇంకో టాక్సీ మాట్లాడి తీసుకువచ్చేస్తాను.’’
‘‘అక్కర్లేదన్నయ్యా! ఇందాక నేను ఎక్కి వచ్చిన టాక్సీ అతను వస్తానన్నారు. నువ్వు తొందరగా వచ్చెయ్.’’
*

--యలమర్తి అనూరాధ సెల్:9247260206