డైలీ సీరియల్

పచ్చబొట్టు-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సరే!’’అంటూ ఫోన్ పెట్టేసాడు.
బయటకు వెళ్ళి ‘వినీల్’ని పిలిచింది.
‘‘మా అమ్మగారు ట్రైయిన్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. మా అన్నయ్య ఆమెను తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ మా నాన్నగారి పరిస్థితి కూడా బాగోలేదు. ఆయన్ని తీసుకొని మేము ‘‘నాయుడుపేట’’వెళ్ళాలి. మీరు వస్తారా?’’
వెంటనే ‘వస్తానండీ!’అని ఒప్పుకున్నాడు.
ఇంటిదాకా వస్తానన్న అతనిని, నాయుడుపేట వస్తాడో, రాడో కనుక్కోకుండా అన్నయ్యకి చెప్పాసానని మధనపడుతున్న ఆమె మనసు అతని మాటతో సర్దుకుంది.
నర్సులు ‘రామక్రిష్ణ ప్రసాద్’ని టాక్సీలోకి చేర్చారు.
ఇంతలో అనే్వష్ రావటంతో రెండు టాక్సీలు ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి.
వినీల్ వాళ్ళిద్దరి పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. ఒకరు చనిపోయి, మరొకరు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండటం. పగవాళ్ళకు కూడా రాకూడదీ పరిస్థితి. ఎందుకో అతనికి వారికి అండగా ఉండాలనిపిస్తోంది.
వాళ్ళను క్షేమంగా నాయుడుపేట చేర్చాడు.
కాళహస్తిలో బయలుదేరేముందే నానమ్మకు ఫోన్‌చేసి చెప్పాడు అనే్వష్.
ఆమెది పెద్ద వయసు. సడన్‌గా వెళితే తట్టుకోలేరేమోనని ముందుగానే తెలియజేసాడు. తాతయ్యముందు సంవత్సరమే చనిపోయారు. అక్కడకు వెళ్ళినా అన్నీతనే చూసుకోవాలి.
కారు ఆగగానే నాయనమ్మ ‘‘యశోధరమ్మ’’ ‘‘నాయనా! అనే్వష్! మనకెంత కష్టాన్నిచ్చాడురా భగవంతుడు’’ అంటూ వాపోయింది.
అచేతనంగా ఉన్న కొడుకును చూసి నీరుగారిపోయింది.
విద్యే ఆమెకు ధైర్యం చెప్పింది.
‘‘నానమ్మా! ఇప్పుడు మాకున్న పెద్దదిక్కువి నువ్వే! నువ్వే ఇలా అయిపోతే మేమేమయిపోతాం?’’
ఆ ఒక్క మాటతో కదిలిపోయిన ఆవిడ విద్యను కౌగిలించుకొని ఓదార్చింది. తల్లిపోయిన దుఃఖంలో వాళ్ళిద్దరిని పెద్దదానిగా తాను ఓదార్చాల్సిందిపోయి వాళ్ళతో చెప్పించుకోవటం బాగోదని ఆవిడకీ అనిపించింది. కానీ తన దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలి? ఉన్న ఒక్క కొడుకు మాటాపలుకులేకుండా పడి ఉంటే తను చూస్తూ ఉండాలా? ఇలాంటివి చూడాలనేనా ఇంకా దేముడు నన్ను బ్రతికించి ఉంచాడా?
లక్ష్మీదేవిలా నట్టింట్లో నడయాడే ‘సత్యవతి’ చాపచుట్టలా ఇంటికి చేరింది. ముందుగా చెప్పి ఉండటంవలన ఏర్పాట్లుఅన్నీ చేయించే ఉంచింది. ఊరు వాళ్ళు బంధువులు, దగ్గిరవారంతా ఫోనులద్వారా తెలుసుకొని వచ్చారు. విద్య రోదన నేపథ్యంలో ‘సత్యవతి’ కాటికి వెళ్ళిపోయింది. చేరిన నలుగురూ ఆమె గొప్పదనాన్ని కొనియాడుతూ ఎవరింటికివారు వెళ్ళిపోయారు.
వినీల్‌ని భోజనంచేసి వెళ్ళమని అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ చెప్పటంతో ఉండిపోయాడు. తర్వాత అతనికివ్వాల్సిన డబ్బుఇచ్చి థాంక్స్ చెప్పారిద్దరూ.
అప్పుడు వినీల్! సార్! మిమ్మల్నీ పరిస్థితులలో వదిలి వెళ్ళాలనిపించటం లేదు. విద్యగారి పరిచయం నాకు కొత్తగాలేదు. మీరున్నన్నాళ్ళూ నేనూ ఇక్కడే ఉంటాను.’’
‘‘అదేమిటండీ! మాకోసం మీరిక్కడ. వద్దువద్దు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. మీవాళ్ళు ఇబ్బందిపడతారు.’’
‘‘లేదు. నాకెవ్వరూ లేరు. నేనెక్కడున్నా ఒక్కటే. ఏదో ఒక ఊరిలో టాక్సీ నడుపుకొని పొట్టపోషించుకోవాల్సిందే. కష్టపడేవారికి ఏ ఊరయినా ఒకటే. ఇక్కడ మీకు ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది. వాటికి నేను అటెండ్ అవుతూ మిగిలిన టైములో బయట టాక్సీ తోలుకుంటాను.’’
‘‘సరే! మీ ఇష్టం! అలాగయితే ఒక షరతు. భోజనం మీరు మా ఇంట్లో చెయ్యాలి’’ అన్నాడు అనే్వష్.
‘‘అబ్బెబ్బె! అలాంటిదేం వద్దు. హోటల్ భోజనం, టాక్సీ నిద్ర నా కలవాటే. నన్ను మొహమాట పెట్టకండి.’’
అప్పటిదాకా వౌనంగా ఉన్న విద్య! భోజనానికీ మీరు మొహమాటపడితే మీ సర్వీసెస్‌ను మేము అందుకోవటం బాగుండదేమో!’’
చివరకు అతను సరేననక తప్పలేదు.
అలా ఆ ఆపద సమయంలో అతను వాళ్ళకు స్నేహితుడయ్యాడు.
రామక్రిష్ణప్రసాద్‌కి మరునాడు మెలుకువ వచ్చింది. కానీ ఆయన మనుషులలో పడలేదు. ‘‘సత్య ఏది? ఊరునించీ వచ్చిందా?’’అని అడిగి మళ్ళీ మైకంలోకి వెళ్లిపోయారు.
విద్యే ఆయనని చూసుకోసాగింది.
కబురు అందగానే అత్తయ్య, మామయ్య వచ్చారు.
అన్నయ్యను ఆ పరిస్థితులలో చూస్తుంటే ఆమెకు నోట మాటరావటంలేదు.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించిన ఆమె గుండె నిబ్బరం ఎక్కువే. అందుకే వెంటనే సర్దుకుంది.
అనే్వష్‌ని, విద్యను కంగారు పడవద్దంది. నాన్నకు బాగయిపోతుందని భరోసా ఇచ్చింది. ఆవిడను చూసాక అనే్వష్‌కి, విద్యకు ధైర్యంవచ్చింది. తమ మనిషి తమకు అండగా ఉన్నారనే ఊహే వారికి క్రొత్తఊపిరి పోస్తోంది.
చిన్నతనం నుంచీ అమ్మానాన్నల ప్రేమ అనే గొడుగుక్రింద సురక్షితంగా పెరిగారు వాళ్ళిద్దరూ. వృత్తిరీత్యా వాళ్ళు అఖండులు. కానీ ప్రవృత్తిరీత్యా పసిపిల్లలు. జీవితంలో అందరూ ఏదో ఒక క్షణాన వెళ్ళిపోవాల్సినవారే. అది తెలిసినా కన్నతల్లిని కోల్పోవటం ఎవరూ భరించలేరు. అలాగే భార్యను కూడా!
తండ్రికి తల్లి అంటే ఎంతో ప్రేమ. ఎప్పుడూ వారిద్దరూ ఒకరి వొడిలో ఒకరుపోవాలని కోరుకునేవారు. ఆ కోరిక తీరకపోయినా మూడురోజుల వ్యవధిలో ఆవిడ చనిపోయారని తెలియని స్థితిలోనే ఆవిడను చేరుకున్నారు ఆయన.
అందరి అంతరంగాలూ నిర్లిప్తమయ్యాయి.
ఆయనకు వచ్చే పెన్షన్‌తోనే సంసారం గడవాలనే వారు. అనే్వష్, విద్యల దగ్గిర డబ్బుతీసుకొనేవారు కాదు. తన సంపాదననే ఖర్చుపెట్టాలనే వారు. ఆరోజు నాన్నగారు వెళ్ళకుండా అమ్మను ఒక్కదానే్న పంపుతుంటే ఇద్దరూ పెద్ద లడాయి వేసుకున్నారు. మేము మీ బిడ్డలమే కదా. మాదగ్గిర ఎందుకు డబ్బుతీసుకోరని. మీరు పెంచితేనే కదా మేమింతవారమయి సంపాదిస్తున్నది అని.
ఎంత చెప్పినా వినలేదు. ఈ జీవాన్ని ఇలా వెళ్ళిపోనివ్వండి. పిల్లలకు మేము పెట్టాలే కానీ వాళ్ళ దగ్గిర తీసుకోకూడదని నా సిద్ధాంతం అని మరోసారి కచ్చితంగా చెప్పేసారు. అమ్మ అలా అనుకోకుండా చచ్చిపోతే నాన్నగారు డబ్బుతీసుకోవటం లేదని అప్పటిదాకా తిట్టుకున్న తాము పోనీలే అలా అక్కడికి వెళ్ళకపోవటం వలన నాన్నగారయినా దక్కారని రవ్వంత ఆనందాన్ని మనసు మూలలో ఎక్కడ అనుభవిస్తున్నది కూడా ఆయన చనిపోవటంతో ఆవిరయిపోయింది.
నిన్నటిదాకా అమ్మా, నాన్నలతో ఆనంద కుటీరం తమది. ఈరోజు విద్య, తనే. ఇంతలో ఈ జీవితంలో ఎన్ని మార్పులు?
పిచ్చితల్లి విద్యకు ఇక అన్నీ నేనే. దానికి ఏ కష్టమూ రానివ్వకూడదు. ఇక మీదట విద్యకు అమ్మను, నాన్నను నేనే! నా చిట్టితల్లికి ఏలోటూ రానివ్వను. మనసులోనే దృఢ నిశ్చయం చేసుకున్నాడు అనే్వష్.
అదే నిముషంలో విద్యకూడా ‘‘ఇకనుంచీ అన్నయ్యను కనిపెట్టుకొని ఉండాలని. అమ్మా, నాన్నా లేని లోటును తానే తీర్చాలని అనుకొంది. అన్నయ్యకు తను, తనకు అన్నయ్యలా కలిసిమెలిసి బాధను అధిగమించాలని ‘‘తనకుతనే నచ్చచెప్పుకొంది. ఇన్నాళ్ళూ చిలిపిగా కయ్యానికి కాలు దువ్వేదాన్ని ఇక సరదాకి కూడా అన్నయ్యను ఏడిపించకూడదని గట్టిగా తీర్మానించుకుంది.
తల్లి చనిపోయిందన్న విషయం తెలియకుండానే తండ్రి వెళ్ళిపోయాడన్నది వారి నమ్మకం అయితే ఆమె తనని వదిలి వెళ్ళిపోయిందన్న ఒకే ఊహతో కోమా స్థితిలోనే కన్నుమూసాడన్నది అసలు నిజం.
చివరి మాటలుకూడా తమకు లేవు.
చుట్టాలు నెమ్మది నెమ్మదిగా దిగసాగారు.
పరామర్శలు ప్రారంభమయ్యాయి.
యాంత్రికంగా పనులన్నీ జరిగిపోతున్నాయి.
తృప్తినుంచీ ‘కండొలెన్సస్’ రావటం అతనిని ఆశ్చర్యపరిచింది. ఆమెకూ తనకూ ఉన్న పరిచయం ఎంత? ఎంత గుర్తుగా తన విషయం తెలుసుకొని పంపింది? ఆమెకీ విషయాలు ఎలా తెలిసాయి? తను ఇన్‌స్పెక్టర్‌గా ఎందరికో తెలుసు. కానీ తృప్తి విషయంలో తన గురించి తెలుసుకొని ఉంటుందన్న సమాధానం ఎందుకో అతనికి తృప్తినివ్వటం లేదు.

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206