డైలీ సీరియల్

పచ్చబొట్టు--24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అయ్యయ్యో! అంతంత పెద్దమాటలు ఎందుకు? సాటిమనిషి ఆపదలో ఉంటే చూస్తూ వదిలేస్తామా? మానవసేవే మాధవసేవ అన్నారుగా పెద్దలు. అంతే. ఇంత చిన్నదానికి మునగచెట్టు ఎక్కించెయ్యకండి’’అంది నవ్వుతూ.
ఆరోజు థాంక్స్ చెబుదామంటే క్షణంలో మాయమయ్యారు.
‘‘అవును. చీకటి పడుతోందని. మీకు చెప్పే వెళ్ళానుగా!’’
‘‘నిజమే! నేనే ఏదో ఆలోచనల్లో ఉండిపోయాను.
అవునూ.. మీరూ.. ఇక్కడ.. కాసాగార్డెన్స్‌లో ఉంటున్నారా?
‘‘లేదండీ.. ఆ దగ్గరలో! మా చుట్టాలున్నారు!’’
అడ్రస్ చెప్పటం ఆమెకు ఇష్టం లేదేమోనని అంతటితో ఆ టాపిక్‌ని వదిలేసాడు అనే్వష్.
అన్నట్లు మరిచాను. ఇతను వినీల్. విద్యకూ, నాకూ కామన్ ఫ్రెండ్.
‘‘అయితే ఇకనుంచీ మీరూ నాకు ఫ్రెండే’’ అంది తృప్తి అతనిని ఆప్యాయంగా చూస్తూ.
ఇన్నాళ్ళూ విద్యను, అనే్వష్‌ని చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉండేది. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా ఎంతో సఖ్యతగా ఉంటారు. అలాంటి చెల్లిని నాకివ్వమని దేముడిని ఎన్నోసార్లు అడిగాను. ఇవ్వలేదని తిట్టాను కూడా ఈ మధ్యలో. అందుకే మిమ్మల్ని ఆయనే పంపించాడు. మీరు నాకు చెల్లి అయితే వీళ్ళిద్దరినీ మనం ఏడిపించవచ్చు’’.
‘‘యు ఆర్ వెల్‌కమ్ వినీల్ అన్నయ్యా! నేను రెడీ!’’
వినీల్ హృదయం ఆ మాటతో ఉప్పొంగిపోయింది. ఈ రోజు ఎంత సుదినం అనుకున్నాడు.
ఇద్దరు ముగ్గురై ముగ్గురు నలుగురయ్యారు ఇపుడు.
సెంటర్ రావటంతో దిగిపోయింది తృప్తి మళ్లీ కలుద్దాం అంటూ.
వాళ్ళ డాబా ముందు టాక్సీని ఆపాడు వినీల్.
విద్య అందుకోబోతున్న సూట్‌కేస్‌ని తన చేతుల్లోకి తీసుకుని ‘‘మీరు పదండి.. నేను తెస్తాను’’ అన్నాడు వినీల్.
అనే్వష్ ఒక సూట్‌కేసు తీసుకున్నాడు. నాన్నగారి బట్టలు ఎవరైనా బీదవారికిచ్చెయ్యమని నానమ్మకిచ్చి వచ్చారు.
తాళం తీసి తలుపులు తెరిచారు.
అంత హాలు బోసిగా ఉంది. హాలులో పడక్కుర్చీ ఖాళీగా కనిపించింది.
అందులో నాన్నగారు కూర్చుంటే ఆ కుర్చీకే అందం వచ్చేది.
మళ్లీ వాళ్ళిద్దరికీ దిగులు వచ్చింది. అయినా తమాయించుకున్నారు.
‘‘కూర్చోండి వినీల్!’’ మంచినీళ్ళు తీసుకువస్తానంటూ లోపలికి వెళ్లింది విద్య.
పై పోర్షన్‌కి వెళ్లి ఒక గినె్నడు మంచినీళ్ళు తెచ్చి ఇద్దరికీ ఇచ్చి తనూ తాగింది.
‘‘ఈ రోజు వంట కార్యక్రమం ఏమీ పెట్టుకోవద్దు. హోటల్ నుంచీ నేను క్యారేజీ తెస్తాను’’ అన్నాడు వినీల్.
‘‘అబ్బే! ఎందుకు మీకు శ్రమ. అన్నయ్య తెస్తాడు’’ అంది.
ఇతను ఎంతగా తమ గురించి ఆలోచిస్తాడు. తమ గురించి తాము కూడా అంతగా ఆలోచించుకోరేమో!
‘‘్భలేవారే! ఇంకా మన మధ్య ‘శ్రమ’ అనే పదానికి తావిస్తున్నారే!’’
‘‘అది కాదు’’ ఏదో చెప్పబోయింది.
‘‘మరిన్ని రోజులూ ఫుడ్ పెట్టి మరెంత శ్రమ తీసుకోలేదూ!’’
అనే్వష్‌వైపు తిరిగి, ‘‘అప్పుడే స్టేషన్‌కి వెళ్ళే పని పెట్టుకోకండి. ఓ మూడు గంటలు హాయిగా రెస్ట్ తీసుకోండి. క్యారేజ్‌తో నేను వచ్చేస్తాను. ఓకె..బై’’ అంటూ వెళ్లిపోయాడు.
భగవంతుడు ఆపదలో ఆదుకుంటాడు అంటారు. అంటే ఇదేనేమో!
ఈ సమయంలో తమకు ఓదార్పు, మంచి స్నేహితుడు ఎంతో అవసరం. అలాంటి సమయంలో వినీల్ పరిచయం తమ అదృష్టమే. అన్నాచెలెళ్ళిద్దరిలో అదే భావన.
సోఫాలో కూర్చున్న అనే్వష్ ఒడిలో చేరింది విద్య. దిగులుగా ముఖాన్ని దాచుకుంది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని ఉంది. ఎందరిమధ్యో దాచుకున్న ముఖాన్ని పటాపంచలు చేసుకోవాలి ఉంది. కానీ గొంతు దాటి మాట రానంటోంది. దుఃఖం.. భరించలేని దుఃఖం.. గొంతు పెగలనివ్వటంలేదు. అందుకే వౌనాన్ని ఆశ్రయించారు.
నెమ్మదిగా ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు అనే్వష్. అలా వాళ్ళిద్దరూ ఎప్పుడు నిద్రలోకి ఒరిగిపోయారో వాళ్ళకే తెలియదు.
కాలింగ్ బెల్ శబ్దానికి లేచాడు అనే్వష్. ప్రశాంతంగా నిద్రపోతున్న చెల్లిని నెమ్మదిగా సోఫా మీదకు చేర్చి వెళ్లి తలుపు తీశాడు.
వినీల్ క్యారేజ్ తీసుకువచ్చాడు. అంతా సర్దాక విద్యను లేపారు.
ఇంత మొద్దునిద్ర పోయానా అనుకుంటూ సిగ్గుపడుతూ లేచింది విద్య. రెండు నిముషాలలో వచ్చేస్తానని బాత్‌రూమ్‌లోకి తుండు తీసుకొని వెళ్లింది.
అయిదు నిమిషాలలో తాజా మల్లెపూవులా వచ్చేసింది. అప్పటికి అనే్వష్ కూడా రెడీ అయ్యాడు. ఈలోపు వినీల్ టీవీ చూస్తూ కూర్చున్నాడు.
అలసిన ఆ హృదయాలకు ఆ నిద్ర ఎంతో రిలీఫ్‌నిచ్చిందని వారి ముఖాలు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. కాస్త వెలుగు వారి ముఖాలలోకి ప్రవేశించింది. అది చూసి వినీల్ తృప్తిగా ఇక వీళ్ళిద్దరూ లైనులో పడతారు అనుకున్నాడు.
సీను ఎలా ఉంటుందోనని భయపడుతూ వచ్చాడు.
అందరూ కలిసి భోజనం చేశారు.
‘‘మీరిద్దరూ మరో రెండు రోజులు సెలవుపెట్టి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో’’
‘‘నో! బాబా! రేపే డ్యూటీలో జాయిన్ అవుతాను. అక్కడ పూర్తి చెయ్యాల్సిన పనులు మిగిలిపోవటంతో ఎలాగూ వెళ్లాలి. ఇప్పటికే ఆలస్యమయిపోతోంది. ఇంక కుదరదు. అదీ చెల్లి ఓ.కె అంటేనే’’ అంటూ చెల్లివైపు చూశాడు.
‘‘నేనూ అంతే అన్నయ్యా! అమ్మా, నాన్న లేని ఈ ఇంట్లో నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. రేపు నేను కూడా డ్యూటీలో జాయినవుతాను. మనం ఎంత ఎక్కువ పని కల్పించుకుంటే అంత మంచిది. అమ్మా, నాన్నలను ఎలాగూ తెచ్చుకోలేం. అలాగే వారి ఆలోచనలనూ ఆపలేం. వాటి గురించి ఆలోచించి దుఃఖం పెంచుకునే కంటే ఆ ఆలోచనలకు తావివ్వని పనిని ఆశ్రయించటమే మన పని అనిపిస్తోంది’’.
తన మనసులో ఏముందో అదే మాటల రూపంలో విద్య నోట వచ్చిందనుకున్నాడు అనే్వష్.
‘‘సరే! ఇంకేం! మేం ఎప్పుడూ ఆన్ డ్యూటీలోనే ఉంటాం’’ అన్నాడు నవ్వుతూ వినీల్.
అందరూ నవ్వుకున్నారు.
వాతావరణం తేలికపడింది అప్పుడు.
****
అనుకొన్నట్లుగానే మరునాడు డ్యూటీలో జాయినయ్యాడు అనే్వష్.
‘‘సార్! మీరు లేక మన స్టేషన్ రాజులేని రాజ్యంలాగయింది’’ అన్నాడు, హెడ్‌కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తూ.
‘‘ప్రొద్దునే్న పొగిడేస్తున్నావేమిటి?’’
‘‘అలాంటిదేం లేదండీ. పత్రికలు, ఊరూ, వాడా మిమ్మల్ని పొగిడేస్తుంటే మేం అంటే తప్పేమిటండీ?’’
ఇంతలో కానిస్టేబుల్ కాంతంవచ్చి ‘‘అంతర్జాతీయ దొంగల ముఠాను పట్టుకోవడం అంటే మాటలా? పట్టుకోలేదూ! ఇప్పుడు మాత్రం దొరకకుండా తెలివిగా తిరుగుతున్న పచ్చబొట్టును చటుక్కున పట్టెయ్యరూ!’’
‘‘సెలవు పెట్టారు కాబట్టి లేదంటే ఈ పాటికి ఆ పచ్చబొట్టు మన సెల్‌లో ఉండేదే’’ అన్నాడు మరో కానిస్టేబుల్ కనకం.
‘‘పిచ్చివాళ్ళు! అమ్మ, నాన్న చనిపోయారని సెలవు పెట్టానని తెలియక ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు. అది తెలిస్తే మళ్లీ వాతావరణం మారిపోతుంది. ఎమర్జన్సీ క్రింద సెలవు తీసుకున్నాడు’’.
‘‘బాబూ! అమ్మా, నాన్నగారు బాగున్నారా?’’ అడిగాడు రైటర్ రంగనాథం. ఆయన నాలుగు రోజులలో రిటైర్ అవబోతున్నారు.

-సశేషం

-యలమర్తి అనూరాధ సెల్:9247260206