డైలీ సీరియల్

పచ్చబొట్టు--26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బ్లూరంగు, తెల్లచొక్కా. ఆ బాబును నేను సరిగా చూడలేదయ్యా!’’
‘‘సరేలే! నువెళ్లి పనిచేసుకో!’’ అంటూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు.
***
అనే్వష్!
ఎలా ఉన్నానని నిన్ను అడగను. ఎందుకంటే ఎలా ఉన్నావో తెలుసు గనుక. స్వయంగా ఒక గంట నీ ప్రక్కన కూర్చుని నిన్ను చూసాను గనుక.
అవునోయ్! రాత్రి నీ మంచం ప్రక్కన కుర్చీ వేసుకొని రెప్ప మూస్తే నీ అందం ఎక్కడ మిస్ అయిపోతానో అన్నట్లు చూస్తూనే ఉన్నా!
స్టన్ అయ్యావు కదూ! దొరకకుండా తప్పించుకుంటుంటే ఏం మజా ఉంటుంది? ఇలా దొరికే అవకాశం ఇస్తూ నిన్ను ఆట పట్టిస్తుంటేనే నాకు బాగుంటుంది.
ఆ తాళాలవాళ్ళని ఎందుకు చెప్పు విసిగిస్తావు? పాపం ఏ పాపం తెలియనివాళ్ళు. కానీ చాలా దగ్గిర దగ్గిరకు వచ్చేస్తున్నావ్! నేనే జాగ్రత్తపడాల్సిన సమయం తెప్పిస్తున్నావ్!
నిన్ను కనిపెడితే చాలు.. నీ పోలీసు యంత్రాంగం కదలికలన్నీ తెలిసిపోతాయ్. ఏం లాభం అని నిరుత్సాహపడకు. దొరకనని నేను, పట్టుకోగలనని నువ్వూ ప్రయత్నిస్తేనే బాగుంటుంది గేమ్. ఏమంటావ్?
-నీ
పచ్చబొట్టు
ఉత్తరం చదువుతూనే అంత ఎత్తున ఎగిరిపడ్డాడు ఆశ్చర్యంతో.
తనింట్లోకి వచ్చి ఉత్తరం ఎలా తీసుకెళ్లిందా అని ఆలోచిస్తుంటే తన ఎదురుగా గంట కూర్చున్నానంటోందే! అంత మత్తు నిద్రలో ఉన్నాడా?
అప్పుడు స్ట్రైక్ అయిందతనికి. అంటే తనకు మత్తుమందు ఇచ్చిందన్నమాట. అందుకే ప్రొద్దున కాస్త మత్తుగా అనిపించింది. ఎంత సాహసవంతురాలు?
మొత్తానికి ఎలాగో తాళం సంపాదించింది. మహారాణిలా లోపలికి వచ్చి వెళుతోంది. విద్యకు మెలుకవ వచ్చినా బాగుండేది. తను పడుకుంటే మళ్లీ లేవదు. అంత ప్రశాంతంగా నిద్రపోతుంది.
పచ్చబొట్టు తన ప్రక్కనుంటే పట్టుకోలేకపోయాడు! ఇంతకంటే గొప్ప అవమానం ఇంకేం ఉంటుంది?
మత్తులో ముంచేస్తే పోలీసాఫీసరు అయినా, మామూలు వాడయినా ఒకటే. మోసం చేసింది పచ్చబొట్టు. ఇందులో అవమానంగా అనుకోవటానికి ఏం లేదు’’ అంతరంగం బల్లగుద్ది చెప్పింది.
అయినా మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాడు. ఏదో చెయ్యాలి. అప్పుడు కానీ తన మనసు శాంతించదు.
పసిడి బ్లూ అండ్ వైట్ కదా చెప్పింది. అది గౌతమ్ స్కూలు వాళ్ళ డ్రెస్సు. ప్రేయర్ టైమ్‌కి వెళ్లి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకుని పిల్లలను అడిగితే సరి అనుకుని గబగబా తయారై విద్యతో అర్జంట్ పని ఉందని బయటపడ్డాడు.
‘‘ఈ రోజు ఉత్తరం ఎవరైనా ఇచ్చారా?’’ అని అడిగాడు.
ఒక చిన్నబాబు చెయ్యి ఎత్తాడు, నేనే ఇచ్చానంటూ.
అతని దగ్గరకెళ్లి ‘‘నీకా ఉత్తరం ఎక్కడిది?’’
‘‘నేను ట్యూషన్‌కి వెళుతుంటే ఫోను వచ్చింది. మీ అరుగుమీద ఒక ఉత్తరం ఉంది. అది పోలీసు అంకుల్‌కి ఇచ్చెయ్యవా అని. ఊఁ..! అన్నాను. ఇచ్చాను. మీ ఇంటికి వస్తుంటే మీ ఇంట్లో అమ్మాయి నేనిస్తానని తీసుకుంది.’’
‘‘్ఫనులో మాట్లాడింది అమ్మాయా? అబ్బాయా?
‘‘తాతగారు!’’
‘‘తాతగారా!’’ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. మళ్లీ ఏ పబ్లిక్ బూత్ నుంచో చేయించి ఉంటుంది.
‘‘సరిగ్గా విన్నావా?’’
‘‘విన్నానండీ. నేను ఫోనులో ఎవరు మాట్లాడినా వాళ్ళు నా వయసా, ఆంటీనా, అంకులా, తాతయ్యా కనిపెట్టగలనండీ. కావాలంటే పరీక్షించుకోండి’’ ధీమాగా అన్నాడు.
ఈ కాలం పిల్లలు ఘటికులు. వీళ్ళ విషయంలో తలదూర్చకూడదు. తాను వచ్చిన పని అయిపోయింది.
ప్రిన్సిపాల్‌కి ధన్యవాదాలు చెప్పి బయటపడ్డాడు.
నోటిదాకా వచ్చిన పదార్థం తినకుండానే చెయ్యిజారిపోయినట్లనిపించింది. మహాతల్లి! ఇదంతా కూడా ఏ మూల నుంచుని చూసి నవ్వుకుంటోందేమో!’’ అనుకున్నాడు.
పచ్చబొట్టు ఇస్తున్న చైతన్యం అంతా ఇంతా కాదంటూ పత్రికలు ఘోష ఎక్కువగానే కనిపిస్తోంది. స్ర్తిలకు పచ్చబొట్టు ఆరాధ్యం అయిపోయింది. ఆమె స్ర్తి అని తెలిస్తే బ్రహ్మరథం పడతారు. ఆమెకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని ముందుకు వచ్చే సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. అలాగే శత్రువుల సంఖ్య కూడా. అది బయటకు రానిది.
వీటన్నిటితో తనకు సంబంధం లేదన్నట్లు సాగిపోతోంది పచ్చబొట్టు. ఓ సాడిస్ట్, ఓ దయలేని కొడుకు.. ఇలా మచ్చలు వేయాల్సిన లిస్ట్ ప్రిపరేషన్‌లో ఆమె ఒకటి.. రెండు.. నాలుగుతో ప్రారంభమైన ఈ హెచ్చరికలు వందలై.. వేలై.. ఓ ఉద్యమమై మగవారిలో అహంభావాన్ని పారద్రోలాలి. ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఇద్దరికీ ఒకటే నీతి అని తెలియచెప్పాలన్నదే ఆమె ఆశయం.
వ్యూహ చిత్రణలో కాసేపు విశ్రాంతి కావాలనిపించినపుడు అనే్వష్‌ని పలకరించటం మండు వేసవిలో చల్లటి నీళ్ళలో జలకాలాడినట్లు ఉంటుంది ఆమెకు. అందుకే అతన్ని ఎంచుకుంది. తనకూ ‘మిమిక్రీ’ వచ్చునని అతనికి తెలియదుగా. తాతగారేం ఖర్మ, చివరికి అతని గొంతుతో తాను స్టేషన్‌కి ఫోన్ చేసి ఆర్డర్స్ కూడా పాస్ చెయ్యగలదు. అది తెలిస్తే ఇంకా డంగ్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత తెలిసేట్లు చేద్దాం. ఇప్పుడే చెబితే తట్టుకోలేడు.
అదేమిటో అనే్వష్ తనకు పసివాడిలా కనిపిస్తాడు. గుండెల్లో పొదువుకోవాలనిపిస్తుంది. అతనిలో కరుకుదనం కన్నా సున్నితత్వమే తనకు కనిపిస్తుంది. భోజ్యేషు మాతా అన్నట్లు తల్లిగా, మిగతా అన్నీ కూడా తానే అవ్వాలని తీరని కోరిక. ఎప్పుడు తీరుతుందో? ఎప్పటికైనా తను సాధిస్తుంది. ఆ రోజు తొందరలోనే. తను కోరుకున్నదేదీ తనకు దక్కకపోవటం ఉండదు. ఆ రోజు కోసం ఎదురుచూడమే తన పని.
పాపం పోలీసులు మాత్రం తన కోసం ఏం పరుగులు పెడుతున్నారో! వాళ్ళకు క్షణం ఖాళీ ఇవ్వటంలేదు. ఊపిరి ఆడనివ్వటంలేదు. పచ్చబొట్టును పట్టుకోండి. ఇక మీవల్ల కాకపోతే చెప్పెయ్యండి.. సిబిఐకి అప్పగచెబుతామని కూడా అనేస్తున్నారు. అది జరిగేలోపే తన పని తను చేసేసి గుడ్‌బై చెప్పాలి.
అంతా సక్రమంగా జరుగుతుందా?
పచ్చబొట్టుకు వెనకడుగా? అంతరంగం వెన్ను తట్టింది. ధైర్యం విడనాడకు అని ప్రోత్సహించింది.
దానితో వెయ్యి ఏనుగుల బలం ఒక్కసారి తన్నావహించినట్లయింది పచ్చబొట్టుకు. తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్న స్నేహితురాళ్ళకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది.
తమ అనుబంధం ఈనాటిది కాదు. అది అందరికీ వింతే తెలుస్తే! చివరివరకూ సస్పెన్స్. పచ్చబొట్టుకు ముగింపు గీతం పాడే రోజు ఈ కథ వెలుగులోకి రావాలి. దానికి అదే సమయం.
తమ స్నేహ మధురిమ ఊసులు గుర్తొచ్చి ఆమె అందమైన పెదాలుపై చిరునవ్వుల పూలు పూసాయి.
***
అనే్వష్ స్కూలుకు ఎంక్వయిరీ నిమిత్తం వెళ్ళటంతో విద్య తానొక్కతే హాస్పిటల్‌కి వెళ్ళటానికి రెడీ అయింది. ఈ రోజైనా హాస్పిటల్‌కి నడిచి వెళ్లాలి. అదేదో తీరని కోరికలా తయారయ్యేట్లుంది. సరదాగా నడిచి వెళ్లాలని తనకు, కానీ వెళ్ళనివ్వరే! ఏ రిక్షావాడో, ఆటోవాడో అడ్డుపడతారు- ‘‘విద్యమ్మగారూ! మీరు నడిచి వెళ్ళటమేమిటని’’. తను కాదన్నా ఒప్పుకోరు. వెళ్లిపోరు. రోడ్డుమీద ఈ డిస్కషన్ ఎందుకని వెళ్లిపోతుంది. అలా ఈ రోజున్నా తన కోరిక తీరితే బాగుండును.
ఎన్నో ఉషోదయాలు, మరెన్నో సంధ్యా సమయాలు ఇలా వృధా అయిపోయాయి అనుకుంటూ రోడ్డుమీదకు వచ్చింది. ఇంతలో ఒక టాక్సీ వచ్చి ప్రక్కనే ఆగింది. చూడనట్లే ముందుకు కదిలింది,

-సశేషం

---యలమర్తి అనూరాధ 9247260206