డైలీ సీరియల్

పచ్చబొట్టు-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలని. కానీ కుదరలేదు. రిక్షా రంగయ్య తప్పదన్నాడు. సరే సాయంత్రమన్నా ఆ కోరిక తీర్చుకుందామనుకొంది. కానీ మళ్లీ టాక్సీ ఆగటం ‘విద్యగారూ, విద్యగారూ’ అని వెనక నుంచీ వినీల్ గొంతు ఆమె కాళ్ళకు బంధం వేసాయి.
అప్పుడు ప్రక్కకు తిరిగిన విద్య, ‘హాయ్! వినీల్! మీరా! ఎవరో అనుకున్నాను’ అంది.
‘‘రండి! డ్రాప్ చేస్తాను’’ అన్నాడు.
‘అలాగే’ అంటూ లోపలకెక్కి కూర్చుంది.
‘‘ఎంత అన్నగారి ముద్దుల చెల్లెలయినా ఒకసారి ఈ దీనుడికి మిమ్మల్ని దింపే అవకాశం ఇవ్వచ్చుగా!’’
‘‘ఏమిటండీ మీరు మరీనూ! ఏదో మా క్రింద పనిచేస్తున్నట్లు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడతారేం!’’
విరిసీ విరియని హైబ్రిడ్ గులాబీలా తాజాగా ఉన్న విద్యను చూస్తూ ‘‘ఎంత గొప్పవాడయినా మీ వ్యక్తిత్వం ముందు దిగదుడుపే’’
‘‘నా గురించి ఏం తెలుసు మీకు?’’
‘‘అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి మెతుకులన్నీ చూస్తామా? ఒక్క మెతుకు చాలదూ! అలాగే మీ గొప్పతనాన్ని గ్రహించటానికి ఈ ఇరవై రోజుల పరిచయం చాలదా?’’
‘‘ఏమో! నేను చాలదనే అనుకుంటాను. మన మనసేమిటో మనకే అర్థం కాదు. ప్రతిక్షణం దాని ఆలోచనలు మారుతూనే ఉంటాయి. అలాంటిది ఎదుటివారి మనసును, అందులోని వారి భావాలను చదవటం కష్టమే!’’
‘‘డాక్టరుగా మీరు మీ పేషెంట్ల ఫీలింగ్స్‌ని ఈజీగా పట్టేస్తారుగా’’
‘‘అవి మనసు ఫీలింగ్స్ కావు. శారీరకమైన బాధతో వచ్చేవి. అవి ఇట్టే పట్టెయ్యవచ్చు’’.
అంటే ‘‘ఎదుటివారి హృదయపు ఆలోచనలు మీ కర్థంగావంటారు. నన్ను నమ్మమంటారు! సరే! అలాగే నమ్మేస్తాను’’ అన్నాడు ఆమెనే ఆరాధనగా చూస్తూ.
‘‘అర్థం కావంటే అర్థం కావని కాదు. పూర్తిగా అర్థం కావని మాత్రం ఒప్పుకుంటాను. అది ఎవరైనా ఒప్పుకోవలసిన విషయమే. వినీల్ అంగీకరించినట్లు తల ఊపాడు.
‘‘ఆ! ఆ! వినీల్! మన ఇల్లు దాటిపోతోంది’’.
‘‘అరె! అపుడే వచ్చేసిందా?’’ మనసులో అనుకోబోయి పైకే అనేసాడు.
‘‘రండి! టీ త్రాగి వెళ్దురుగానీ’’ అంది విద్య.
‘‘మీకేమీ అభ్యంతరం లేకపోతే గుడికి వెళదామా? ఒక గంటలో వచ్చేద్దాం, నేను ఇంటి దగ్గిర దింపి వెళ్లిపోతాను.
అలాగే. గుడికి మా ఇల్లు చాలా దూరం. కందిపోతాను నడిస్తే. ఉండండి, పైకి వెళ్లి అన్నయ్యకి స్లిప్ వ్రాసి పెట్టివస్తాను. లేకపోతే కంగారు పడతాడు’’ అంది.
ఆ మాటతో వినీల్ హృదయంలోపల ఉండను.. బయటకు వచ్చేస్తానని మొరాయిస్తోంది ఆనందంగా. అసలు విద్య రానంటుందని మనసు మొండి చేస్తుంటే హృదయమే ధైర్యం చెప్పింది. దానిని అభినందించకుండా ఉండలేకపోయాడు.
పైకి వెళ్లి టేబుల్‌మీద స్లిప్ పెట్టి దాని మీద పేపర్ వెయిట్ పెట్టింది.
ప్రియమైన అన్నయ్యా!
వినీల్ గుడికి వెళదామన్నారు. వెళుతున్నాను. గంటలో వచ్చేస్తాను, నువ్వు వస్తే వెంటనే అక్కడికి వచ్చెయ్!
ప్రేమతో
నీ
చెల్లి
నెమ్మదిగా మెట్లు దిగి వస్తున్న విద్య స్వర్గం నుంచీ తన కోసమే ప్రత్యేకంగా వస్తున్న దేవకన్యలా ఉంది అనుకొన్నాడు వినీల్.
ఆమె మనసులో తనకెలాంటి స్థానం ఉందో ఈరోజే తేల్చుకోవాలి అనుకొన్నాడు.
తనకి నేనంటే ఇష్టముంటే ఎంత బాగుండును? తనను అంగీకరిస్తే ఈ జీవితంలో తనకంటూ ఎవ్వరూ లేరన్న బాధ దూదిపింజలా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఆమె అందరినీ మరిపించగల అమృతవర్షిణి.
అసలే ఆమె అమ్మపోయిన దుఃఖంలో ఉంది. ఈ సమయంలో ఆమెను ప్రశ్నిస్తే సమాధానం సరిగ్గా రాదేమో- అంతరంగం హెచ్చరికతో ఆలోచనలో పడ్డాడు.
పరుగెత్తి పాలు త్రాగేకన్నా నిలబడి నీళ్ళు త్రాగమన్న పెద్దలే ఆలస్యం అమృతం విషం అన్నారు. అందుకే తను తొందర పడటం.
ఇద్దరూ అమ్మవారిని, ఈశ్వరుని దర్శం చేసుకొని వచ్చారు.
‘‘ఎక్కడ కూర్చుదాం?’’ అడిగింది విద్య అతనిని.
‘‘అలా కొండమీదకు ఎక్కుదామా? ఇప్పటిదాకా అలసిపోయి ఉన్నారు, ఎక్కలేరేమో’’ అని సందేహంగా అడిగాడు వినీల్.
అక్కడయితే జనం పల్చగా ఉంటారు. కాబట్టి తన మనసులో భావాలు సులభంగా బయటపెట్టవచ్చని.
‘‘నా గురించేం ఆలోచించక్కర్లేదు. మా అన్నయ్యకీ, నాకూ కాస్త చల్లగాలి తోడు కావాలంటే ఈ కన్నప్ప కొండే ఎక్కుతాం. ఇక్కడ ఒక గంట కూర్చుంటే రోజంతా పీల్చిన ఆర్ట్ఫిషియల్ గాలి అంతా మన నుంచీ పారిపోతుంది. మనసంతా ప్రశాంతంగా తయారవుతుంది. మా ఇద్దరికీ ఈ ప్రదేశం అంటే ఎంతో ఇష్టం’’
‘‘నీకేది ఇష్టమయితే అదే నాకూ ఇష్టం’’ అనుకున్నాడు మనసులో వినీల్.
ఇద్దరూ మెట్లు ఎక్కటం ప్రారంభించారు.
పైకి ఎక్కేకొలదీ క్రింద గుడి ఆవరణ అంతా అందంగా కనిపిస్తోంది. చుట్టూ చక్కని ప్రకృతి, ఎటు చూసినా కన్నుల విందే. మెట్లు కూడా ఎక్కటానికి అనువుగా వుంటాయి. ఎవరో పాప మెట్లు లెక్కపెట్టుకుంటూ ఎక్కుతోంది. చిన్నప్పుడు తాము కూడా అలాగే చేసేవారు.
వినీల్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. తన ఆరాధన బయటపెట్టాలంటే బిడియంగా ఉంది. ఒక ఫ్రెండ్‌లాగా ఉండాలంటే దిగులుగా ఉంది. ఆమె అందానికి, విద్యకు తగినట్లు ఏ ఫారిన్ రిటర్న్ డాక్టరునో తీసుకురాగలడు. అలాంటప్పుడు ఈ బీద టాక్సీ డ్రైవర్‌ని ప్రేమిస్తుందా? ఆమెకు బీద, గొప్ప తారతమ్యాలున్నాయా?
తన మనసులో భావాలు చెప్పకుండా కనీసం ఇలా ఫ్రెండ్‌గానన్నా ఉండవచ్చు, బయటపెట్టి దూరంగా నెట్టబడేకంటే-
రెండు వ్యతిరేక భావాల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాడు.
ఇంతలో చల్లటి పిల్లగాలి ఇద్దరినీ పరామర్శించి వెళ్లింది.
ఆ అనుభూతిని ఇద్దరూ హాయిగా అనుభవిస్తున్నారు.
‘‘కనీసం ఆ చల్లగాలిని నేనయినా బాగుండేది’’ అనుకున్నాడు మనసులో.
అలా కబుర్లు లేకుండానే పైకి చేరారు.
ఎక్కువగా కొండమీదకు జనం ఎక్కరు. ఎప్పుడయినా యాత్రా బస్సు వచ్చిందంటే మాత్రం ఇక్కడ ప్రశాంతత ఎగిరిపోతుంది.
పైకి చేరారు.
‘‘్భక్తకన్నప్ప విగ్రహం చాలా బాగుంటుంది కదండీ’’ అంది విద్య.
‘‘అవునండీ’’ అన్నాడు.
పొడి పొడిగా ఉన్నాయి అతని మాటలు.
బయలుదేరినపుడు ఉన్న ఉత్సాహం అతనిలో ఇప్పుడు లేదు.
అతని మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది అనుకొంది విద్య. అవి తన గురించేనని మాత్రం ఆమె ఊహించలేదు.
అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళను దాటి వెనక వైపు ఉన్న రైలింగ్ వద్దకు వచ్చారు.
‘‘ఊరంతా చక్కగా కనిపిస్తుంది కదండీ ఇక్కడినుంచీ’’ అన్నాడు వినీల్.
‘‘అవును.. క్రింద రోడ్డుమీద వెళ్ళే కార్లు, బస్సులు కీ ఇస్తే వెళ్ళే బొమ్మల్లా కనిపిస్తూ ఉంటాయి. ప్లేగ్రౌండ్‌లో ఆటలాడుకొనే బొమ్మల్లా సరదాగా చూడటానికి బాగుంటాయి’’.
అప్పుడే చీకట్లు క్రమ్ముతూ ఉండటంతో దీపాలన్నీ ఒక్కసారి వెలిగాయి. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206