డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాగ్రత సాధనకు మరో ముఖ్యమైన అంశం ప్రశాంతి. ఈ ప్రశాంతి మన చేతిలో వుండదు. ఉంచుకోగలిగితే ఏకాగ్రత బాగానే వుంటుంది. దీని సాధన పైన చెప్పిన క్రమశిక్షణ కంటే కూడా కష్టమైనది. ఏకాగ్రతకు మరో ముఖ్యాంశం మృదుహృదయం. హృదయం మృదువుగా వున్నప్పుడు ఏకాగ్రత త్వరగా సిద్ధిస్తుంది. క్రమశిక్షణ, ప్రశాంతి, మృదుత్వం ఈ మూడూ మూడు రసాయనాల వంటివి. వీటి సమ్మేళనంతో చేసే వైజ్ఞానిక ప్రయోగమే ‘పూజ’. ఇందులో ఇష్టదేవత కేవలం ఆధారం మాత్రమే. దైవం మీద గల విశ్వాసం మనస్సుకి సులభంగా ప్రశాంతినిస్తుంది. ఆ దేవతామూర్తిలో, పూజ పరికరాలలో వున్న సౌందర్యం మనస్సుకు మృదుత్వాన్నిస్తుంది. పూజ కోసమై వుపయోగించే పదాలు, శ్లోకాలు, మంత్రాలు క్రమబద్ధమైన లయలో నడుస్తాయి. కనుక మనస్సుకీ, శరీరానికీ కూడా మిలటరీ మార్చ్ వంటి క్రమశిక్షణ అలవడుతుంది. పూజా ప్రయోగంలో జరిగేదిదే. ప్రయోగశాలలో రసాయనాలను అజాగ్రత్తగా కలిపితే అనుకున్న ఫలితం రాదు. పూజా ప్రయోగంలోనూ అంతే. పైన చెప్పుకున్న అంశాలను శ్రద్ధగా మేళవించటం అభ్యసించాలి. అది చిన్నప్పటినుంచే రావటం మంచిది. చిన్నతనంలో పెద్దలుచేసే పూజను పిల్లలు చూస్తారు. చిన్నప్పటినుంచీ ప్రయోగశాల అలవాటైన విద్యార్థి టెస్టుట్యూబులను చూసి భయపడడు. కంగారుపడి పగలగొట్టడు. పూజ చూడడం నేర్చిన పిల్లవాడు క్రమంగా, అతి సునాయాసంగా, పూజా ప్రయోగంలోకి ప్రవేశిస్తాడు. అతని ఆలోచనా పద్ధతి, క్రమశిక్షణతో ప్రశాంతితో నిండి వుండటం సహజ పరిణామంగా లభిస్తుంది. లభించిన ఈ క్రమశిక్షణను అతడు దేనికి వినియోగించుకుంటాడు?
ఈ ప్రశ్నతో పూజకు పెద్దగా సంబంధం లేదు. పూజ అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగించడం వరకే దాని పని. కానీ పూజ క్రమశిక్షణతోపాటు, ప్రశాంతిని కూడా కలిగిస్తుంది. కనుక పూజ చేసే వాడి నిర్ణయాలు సామాన్యంగా సౌమ్యంగా వుంటాయి. అందువల్ల అతడు సమాజానికి ఎక్కువ ఉపయోగకారిగా వుంటాడు. అలాంటి వారివల్ల సమాజంలో సహకార గుణం పెరుగుతుంది. కనుక మనం సమాజంలో క్రమశిక్షణ, ప్రశాంతి మాత్రమేకాక పరస్పర సహకారం కలగటం కోసం పూజను ప్రోత్సహించాలి.
పూజకు సమయాసమయాలు వున్నాయా? అసలు పూజలు ఎన్ని రకాలు?
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్ష్మించుచున్ సంతత
శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతా స్వాదసం
ధానుండై మఱచెన్ సురారి సుతు డేతద్విశ్వమున్ భూవరా॥
(్భగవతంలో ప్రహ్లాద చరిత్రలోనిది రుూ పద్యం.)
(ఏదైనా త్రాగుతున్నా, తింటున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, హాస్యాలాడుతున్నా, యిటూఅటూ తిరుగుతున్నా, చివరకు నిద్రపోతున్నా సరే ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యానం మానలేదని ఈ పద్యానికి తాత్పర్యం.) దీని ప్రకారం భక్తుడు సర్వకాల సర్వావస్థలోనూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ స్మరిస్తూ వుండవలసిందే.
ధ్యానం లాగానే పూజ కూడా నిజానికి మానసికమైన ప్రక్రియయే. చాలా మంది పూలు విసరటం, దీపాలు తిప్పటం, పూజ అనుకుంటూ వుంటారు. నిజానికి మానసిక భావనతో కూడుకొని లేకపోయినట్లైతే కేవలం పూలు విసరటం పూజ కానే కాదు. ఐతే, మానసికంగా భావనను అభ్యాసం చేయటానికి బహిరంగమైన పూలు విసరే ప్రక్రియ సహాయకారిగా పనిచేస్తుంది.
మనస్సనే ప్రయోగశాలలో జరిగే వైజ్ఞానిక ప్రయోగమే పూజ అనే చెప్పుకొంటున్నాం మనం. ఐతే, పూజ బహిరంగంగా జరిగే ప్రక్రియకదా, అది మానసికమెలా అవుతుంది? అనే ప్రశ్నకు సమాధానం కూడా కొంతవరకూ చెప్పుకున్నాం. ఆ విషయానే్న ఇంకా వివరించుకుందాం.
అందుకే పూజ ప్రధానంగా రెండు విధాలు. ఒకటి మానసిక పూజ, రెండు బహిరంగ పూజ. నిజానికి మానసిక పూజే అసలు పూజ. అంటే ఎదురుగా విగ్రహంతో నిమిత్తం లేకుండానే మనసులో దేవతామూర్తిని సజీవంగా భావించుకొని ఆయన కాళ్ళు కడుగుతున్నట్లు, స్నానం చేయిస్తున్నట్లు, భోజనం తినిపిస్తున్నట్లు ఇలా భావించుకుంటూ పోవటమే మానసిక పూజ. ఇది సగుణ ధ్యానానికి మరో రూపన్నమాట.
ఐతే, కేవలం మానసికంగా ఇంత కల్పన చేయటానికి, దానికి కావలసిన వివరాలన్నీ అణువణువునా మనస్సులో భావించుకోవడానికి తీవ్రమైన మనోబలం వుండాలి. ఇది కొంత లోపించినప్పుడు దీనికి సహాయం చేసేందుకోసం బహిరంగ విగ్రహ పూజను యేర్పరిచారు. ఇందులో ప్రత్యక్షంగా ఇష్టదేవతామూర్తి ఎదురుగా వుంటుంది. కాళ్ళు కడుగుతున్నాను అన్నప్పుడు, ఆ పాదాలమీద ఉద్ధరిణితో నీళ్లు పోస్తాము. స్నానం చేయిస్తున్నప్పుడు నిజంగానే ఆ విగ్రహం మీద నీళ్ళు పోస్తాము. నైవేద్యం చేస్తున్నానన్నప్పుడు తిను బండారాలను విగ్రహానికి ఎదురుగా పెడతాం. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర.
0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి