డైలీ సీరియల్

పచ్చబొట్టు--34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భలేవాడివే! అన్న ప్రేమను అయాచితంగా ఇస్తానంటే వదులుకుంటారా ఎవరన్నా?‘‘
‘‘అలాంటివారు ఉంటారేమో నాకు తెలియదు. నేను మాత్రం వదులుకోను‘‘
‘‘్థంక్స్‘‘ అన్నాడు.
‘‘మీరేం మాట్లాడటం లేదేమిటి అనే్వష్?‘‘
‘‘మీరంతా మాట్లాడుతున్నారుగా వింటున్నా!‘‘
ఇంతలో ‘‘చెల్లి! నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. నీ ఉడ్‌బి వదినగారు విద్య‘‘ అన్నాడు వినీల్.
‘‘నిజంగా! కంగ్రాచ్యులేషన్స్‘‘
‘‘నీకే మొదట చెప్పింది. ఇంకా ఎవ్వరికీ అనౌన్స్ చెయ్యలేదు‘‘.
‘‘యు ఆర్ లక్కీ అన్నయ్యా అంది మనస్ఫూర్తిగా.
అనే్వష్ గుండె చేసే చప్పుళ్ళను అదుపులో పెట్టుకోలేక సతమతమవుతున్నాడు.
విద్యకు ఒక విచిత్రమైన ఊహ మదిలో మెదిలింది. కానీ ఆ ఆలోచన తనకే నవ్వు తెప్పిస్తోంది. ఇక వీళ్ళకు చెబితే పిచ్చిదాన్నిలా చూస్తారు. దాన్ని నా గుండెలోనే దాచుకోనీ‘‘అనుకొంది మనసులో.
అనే్వష్ తృప్తి తమను ఇంటికి ఆహ్వానిస్తుందేమో అని చూస్తున్నాడు.
ఆ ఆలోచన ఆమెకు ఉన్నట్లే లేదు.
ఎందుకని?
‘‘ఈ కాస్త పరిచయానికే పిలిచేస్తారా? నీకేతై ప్రాణం కాపాడిందని అభిమానం. మరి ఆమెకు అలాంటిదేం లేదుగా‘‘ అంతరంగం సమాధానం.
‘‘ఆమెకు లేదని నీకేం తెలుసు? కాసేపు ప్రక్కకు వెళ్లిపో‘‘ బ్రతిమిలాడాడు.
వాళ్ళిద్దరితో మాట్లాడుతున్న ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు అనే్వష్.
కాసేపు మాట్లాడుకున్నాక ‘‘ఇలా రోడ్డుమీద ఎంతసేపు మాట్లాడుకుంటాం?కారులో కూర్చుందామా?‘‘ అడిగింది విద్య తృప్తిని.
‘‘లేదు లేదు. నాకు కాస్త పనుంది. మరోసారి కలిసినపుడు తప్పకుండా మీ మాట వింటాను. ఇప్పటికేం అనుకోవద్దు‘‘.
అప్పటికే అనే్వష్ చూపులు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇంక అతని ఎదురుగా ఉండే సాహసం చెయ్యద్దొంటోంది మనసు. దానికి తెలుసు ఏది మంచో? ఏది చెడో?
తమది బీద కుటుంబం. తమకంటే ఎక్కువలో వున్న అనే్వష్ వైపు మగ్గడం మంచిది కాదని అంతరంగం హెచ్చరిక. కానీ మనసు మాట వినదు కదా! దాని పని అది చేసుకుపోతోంది. వద్దు, వెళ్ళు అంటూనే మురిపెంగా అనే్వష్‌ని చూసుకుంటోంది.
‘‘చెల్లీ! ఈ జ్యూస్ తీసుకో!‘‘ అన్నాడు వినీల్.
ఇబ్బందిగా చూసింది తృప్తి.
‘‘ఎక్కడకు రమ్మన్నా రావుగా. అందుకే ఈ రోడ్డుమీదే ఆతిథ్యం. కాదనకూడదు అన్నయ్యనుగా!‘‘
ఆ మాటతో మాట్లాడకుండా తీసుకుంది. ‘‘సరే! పదండి! ఇది తాగేంతవరకూ కారులో కూర్చుందాం‘‘ అంది. అందరూ కారువైపు కదిలారు. అనే్వష్ అద్దాన్ని సరిచేసుకోవటం అందరూ గమనించినా గమనించనట్లే ఉన్నారు.
‘‘ఎప్పుడు వస్తారు మా ఇంటికి. డేట్ ఈ రోజే ఫిక్స్ చేసుకుందాం‘‘ పట్టుబడింది విద్య.
‘‘ఒక ఊరే కదా. ఎప్పుడయినా రావచ్చు. వచ్చేముందు ఫోన్ చేసి వస్తాను‘‘
‘‘నెంబరు ఇవ్వనా?‘‘
‘‘తెలుసు!‘‘
‘‘ఈసారి ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతయింది‘‘.
‘‘ఎలా?‘‘
‘‘ఎలా ఏమిటండి? 100కి ఫోన్ కొడితే అనే్వష్ గారి నెంబరు చెప్పరా?‘‘
‘‘ఓ అదా!‘‘ అనుకొన్నాడు అనే్వష్. అతని ఆలోచనలు ఆ ఒక్క క్షణంలో ఎంత దూరానికి ప్రయాణించాయో తలచుకుంటే అతనికే నవ్వు వచ్చింది.
‘‘అంత కష్టం ఎందుకు? సెల్ నెంబర్ నోటు చేసుకోండి. వెంటనే చెయ్యచ్చు‘‘ అని అన్నయ్య జేబులోంచి కాగితం, పెన్ను తీసుకొని రాసి ఇచ్చింది విద్య.
ఆ పేపరు వెనక అనే్వష్ ఏదో రాసుకున్నాడు.
‘‘చూసుకోండి. కావాల్సిందేమో!‘‘
‘‘చూసి అక్కర్లేదు‘‘ అన్నాడు.
జ్యూస్ త్రాగటం అయిపోవటంతో వినీల్ చేతికి గ్లాసు అందించి ‘‘మరిక నేను వెళతాను‘‘ అంది.
‘‘తృప్తీ! మీ ఇల్లు ఎక్కడో చెబితే దింపేసి వెళ్లిపోతాం‘‘ అన్నాడు వినీల్.
‘‘మీకా శ్రమ ఎందుకు? దగ్గిరే! నేను నడిచి వెళ్ళిపోగలను‘‘
‘‘ఇంటికి పిలవడం ఇష్టంలేనట్లుంది. ఇబ్బంది పెట్టకండి‘‘ అన్నాడు అనే్వష్. వినీల్ అలా అడగటం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆమె ఒప్పుకోకపోయినా‘‘
‘‘నేనే మీ ఇంటికి వచ్చి అందరినీ మా ఇంటికి తీసుకువెళ్తాను. ఓ.కె.‘‘ అంది వినీల్‌తో.
విద్యకు, అనే్వష్‌కు బాయ్ చెప్పి వెళ్లిపోయింది తృప్తి.

ఆరోజు రాత్రి అనే్వష్‌కి నిద్ర పట్టలేదు. ఆమె వాళ్ళింటికి ఆహ్వానించకపోవటం కన్నా ఇబ్బంది పడటం అతని మనసు ఒప్పుకోవటం లేదు. ఎలాగయినా ఆమె ఇల్లు కనిపెట్టాలి. లోపలికి వెళ్ళకపోయినా ఫరవాలేదు. పచ్చబొట్టును ఎలాగూ పట్టుకోటంలో ఫెయిల్ అవుతున్నాడు. కనీసం ఇందులో సక్సెస్ అవ్వాలని దృఢ నిశ్చయం తీసుకున్నాడు.
కాసేపు వినీల్‌ని కూడా సహాయం తీసుకుందామనిపించింది. అందులో అతనికి ఎన్నో సమాధానాలు చెప్పాలి? ‘‘ఎందుకు‘‘అంటే ఏం చెప్పగలడు? సో! ఈ సాహసం తనొక్కడే చేయాలి.
బిచ్చగాడి వేషం వేసాడు. ‘‘అమ్మా! ఆకలేస్తోంది. అన్నంపెట్టండి తల్లీ!‘‘ అంటూ గుమ్మం ముందు నిలబడటం. పొమ్మంటే ప్రక్క గుమ్మానికి వెళ్ళటం.
అయినా ఇంట్లో ఎందరో ఉంటారు. ఒక్కరేకదా బిచ్చం వెయ్యటానికి వచ్చేది. అలా తృప్తి రాకపోతే! చూద్దాం తనదృష్టం బాగుండి ఆమే వస్తే..
ఆ రోడ్డు చివరదాకా వెళ్ళాడు. ప్రక్కరోడ్డు మొదలుకి వచ్చి మళ్ళీ చివరిదాకా వచ్చాడు. ఏ ఇల్లూ వదిలి పెట్టటంలేదు. అరిచి అరిచి నోరు నొప్పి పెడుతోంది.
బిచ్చగాళ్ళను పని లేని వాళ్ళగా చూస్తాం. పాపం ఈ అరవటం కూడా ఒక పనే గదా? ఎన్ని ఇండ్లముందు అరిస్తే ఒక ఇంట అన్నం పెడతారో. అనుభవానికి వస్తేగానీ విషయం అర్ధంకాదన్నది ఇందుకేనేమో!
తిరిగితిరిగి కాళ్ళు నొప్పిపుడుతున్నాయి. అక్కడే అట్ల దుకాణం ఉంటే అక్కడకు వెళ్ళి నాలుగు అట్లు తీసుకొని తిన్నాడు.
‘‘ఇవే చివరి అట్లు. ఇంకో నిముషం ఆలస్యమయితే దొరికేవి కావు‘‘ అంది అట్లమామ్మ. ‘‘బ్రతికిపోయాను. ఆ దగ్గిరలో హోటళ్ళుకూడా లేవు. అమ్మా! తృప్తితల్లీ! ఎక్కడ దాక్కున్నావ్?‘‘
ఆ ఇళ్ళలోవాళ్ళు చేనేత పనినే వృత్తిగా చేపడతారు. ఆ వీధి అంతా వాళ్ళే. రోడ్లమీదే నేస్తారు. గుమ్మంముందే రాట్నాలు తిరుగుతుంటాయి. తర్వాత వాటిని మగ్గంమీద చీరగా మలుస్తారు. అదంతా చూడటానికి తమాషాగా ఉంది.
ఇంకాస్త ముందుకు వెళితే ‘కాసాగార్డెన్స్’ వెనకవైపుకు వచ్చేస్తాం. దాన్నికూడా చూసుకొని వెనక్కి వెళ్ళిపోవటమే!
లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని అడుగుముందుకేసాడు. క్వార్టర్స్ వైపు వెళ్ళే అడ్డదారి కనిపిస్తోంది. ఎందుకో తృప్తి ఈ ప్రాంతంలోనే ఉండాలనిపిస్తోంది. ఆ దారిప్రక్కన రెండు ఇళ్ళు ఉన్నాయి. ఇల్లు అనేకంటే గుడిసెలంటే బాగుంటుందేమో?
‘‘కడుపు కాలుతోంది అన్నంపెట్టు తల్లీ‘‘మళ్ళీ అరిచాడు.
అన్నం గినె్నతో రాబోతున్న కూతుర్ని ‘‘అన్నిటికీ నువ్వెందుకు తల్లీ! ఈ పని నేను చెయ్యగలనుకదా. నాకివ్వు అంటూ అతను అడిగి గినె్న తీసుకున్నాడు.
రెండు కాళ్ళతో దేక్కుంటూ వచ్చి తనకు అన్నాన్ని వేస్తున్న అతన్ని వింతగా చూస్తున్నాడు అనే్వష్. -సశేషం

-యలమర్తి అనూరాధ సెల్:9247260206