డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా నోబుల్ బహుమతులు మెట్లుమెట్లుగా సంపాదించుకొంటూ వచ్చిన ఈ సిద్ధాంతాలు మన యోగ సిద్ధాంతంతో, ఉపనిషత్ సిద్ధాంతంతో ఎలా సమన్వయిస్తున్నాయో చూసినప్పుడు ఆశ్చర్యం కలుగక మానదు.
దత్తదర్శన గ్రంథంలో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి యోగోపదేశం చేసిన సందర్భంలో ఆ కథ యిలా వున్నది. కార్తవీర్యార్జునుడు ద్వైతాన్ని ఆశ్రయించిన సందేహంతో దత్తస్వామి దగ్గరకు వచ్చాడు. దత్తస్వామి అతనికి యోగోపదేశం చేశాడు. శక్తిపాతం చేశాడు. ఆ తరువాత కార్తవీర్యుడు సాధన చేశాడు. సాధన తరువాత కార్తవీర్యుడు వచ్చి తన అనుభవాన్ని గురువుకు యిలా విన్నవించుకున్నాడు.
దేశే కాలే పదార్థే వా చిదాత్మైకో విభాతి మే
చిదానందో మహాత్మేశ పదార్థో న్యో న విద్యతే॥
‘అంతా చిదానందమే కనుపిస్తోంది. ప్రతి వస్తువులో చిదానందమే కనిపిస్తోంది. చైతన్యం కంటే వేరే వస్తువు లేనేలేదు.’’
ఈనాటి భౌతిక శాస్త్రం అణుఖండాల చలనాన్ని గురించి పరిశీలించి, పరిశీలించి నోబుల్ బహుమతులు సంపాదించి చివరకు ఈ సిద్ధాంతం లోకే చేరటం మనకు కనిపించటం లేదు? నిన్నటి దాకా జడమనుకున్నది యివాళ విజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా చేతనమే అవుతోంది. ఉపనిషత్తులలో ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మ’’ ‘‘ఈ ప్రపంచమంతా బ్రహ్మపదార్థమే’’ అంటే చైతన్యమే అని నిశ్చయంగా ఘోషింపబడే ఉన్నది కదా!
ప్రపంచమంతా పరమాత్మ శరీరమే అనే భావన:
ప్రపంచమంతా పరమాత్మ శరీరమే అనే భావన విరాట్ రూపమనే భావన, వేదాలలో, భగవద్గీతలో కూడా వివరంగా వున్నది. దానిని గురించి మన దేశంలో ఎవరికీ వివరించవలసిన పనిలేదు. నవీన భౌతికశాస్త్రం రుూ సిద్ధాంతం వైపు ఎలా దూసుకువస్తోందో ఇప్పుడు గమనిద్దాము.
వెనుకటి చర్చలో పదార్థమూ, చైతన్యమూ ఎలా పరస్పరం ముడిపడి వున్నాయో తెలుసుకొన్నాం. అవి ముడిపడి వుంటే వాటిలో ఏది ముఖ్యమైనది? చైతన్యంలోంచి పదార్థం వస్తోందా? పదార్థంలోంచి చైతన్యం వస్తోందా? ఈ ప్రశ్న వైజ్ఞానికుల్ని బాధించసాగింది. 1932లో మాక్స్ ప్లాంక్ అనే వైజ్ఞానికుడు ‘నేను చైతన్యమే ముఖ్యమయినదని భావిస్తాను. చైతన్యంలోంచే పదార్థం ఉద్భవిస్తుంది’ అని ప్రకటించాడు. వైజ్ఞానికుడు ష్రోడింగర్ ఈ ప్రశ్నను మరింత నిజాయితీతో పరిశీలించాడు. ఆయన పరిశోధన మూలంగా ‘ష్రోడింగర్ కాట్’ అనే ఒక సిద్ధాంతం ఆవిర్భవించింది. సామాన్య భాషలో చెప్పాలంటే రుూ సిద్ధాంత తాత్పర్యం యిలా వుంటుంది. ‘ప్రతి మనిషి ప్రతిక్షణం లోనూ, అనేక రకాల ప్రపంచాలను చూస్తూవుంటాడు. అవన్నీ సత్యాలే. కానీ, వాటిలో ఒకటి మాత్రమే అతడు ఎన్నుకుంటాడు.’’ దీనినే ‘బహు ప్రపంచ సిద్ధాంత’మని పిలుస్తున్నారు. రుూ సిద్ధాంతాన్ని మన వేదాంతం ఏనాడో చెప్పడాన్ని మనం గమనించాలి. ‘దృక్ దృశ్య వివేకః’ అనే గ్రంథం ఒకటున్నది. దానిలో యిలా వున్నది.
రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్తు మానసమ్‌
దృశ్యా ధీవృత్తయ స్సాక్షీ దృగేవ న తు దృశ్యతే॥
‘ఒక వస్తువు కనిపిస్తోంది. అది దృశ్యం. దానిని చూచే ద్రుక్కు ‘కన్ను’. ఈ కన్ను చూస్తోందని తెలుస్తోంది. అంటే రుూకనే్న ఒక దృశ్యం. దీన్ని చూచే దృక్కు మనస్సు. మనస్సులో భావాలు వస్తున్నాయని తెలుస్తోంది. అంటే మనస్సే దృశ్యం. దీన్ని చూసే ద్రష్ట ఏవరు?’’ రుూ శ్లోకాన్నిబట్టి మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. మనం ప్రపంచంలో ఏది చూశామనుకొన్నా, మన మనస్సు ఎలా చూపిస్తోందో అలా చూస్తున్నాం. అంటే మనం చూచే ప్రపంచం అంతా మన మనస్సు యొక్క బహిరంగ రూపమే అన్నమాట. మరి అసలు చూచే వాడెవడు? అతడు కనుపించడు.
ఒక ఉదాహరణ చెప్పుకొందాం. ఒక గుడిలో ఉత్సవం జరుగుతోంది. ఒక భక్తుడికి ఆ దేవతామూర్తిలో దైవచైతన్యం కనిపిస్తోంది. శిల్పికి శిల్ప సౌందర్యం కనిపిస్తోంది. దొంగలకు ఆభరణాలు కనిపిస్తున్నాయి. బాలలకు తెలియని వింత కనిపిస్తోంది. సామాన్యులకు అలంకార సౌందర్యం కనిపిస్తోంది. అందరూ చూస్తున్నారు. అందరి చూపు సత్యమే! వారి మనస్సు చూపిస్తున్నట్లు వారు చూస్తున్నారు. కాని ఎవడికి వాడు తను చూస్తున్నదే సత్యమనుకుంటున్నాడు. బహు ప్రపంచ సిద్ధాంతం చెప్పేది యిదే.
మొదట్లో ఐన్‌స్టీన్ అనిశ్చిత సిద్ధాంతానికి వ్యతిరేకి, కాని క్రమంగా ఆయన మారి, పోడోలోస్కీ, రోసెస్ అనే మరో యిద్దరితో కలిసి ఉ-్గ ప్రభావం అనే నూతన సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. దీని సారమేమంటే ఈ ప్రపంచమంతా ఒక అంతస్సంబంధంతో కూడుకొని వున్నది. ఏదీ విడిపోయి లేదు- అని. దీని తరువాత బెల్స్‌థీయోరం అనే సిద్ధాంతమొచ్చింది. తరువాత యిది ప్రయోగాలలో కూడా నిరూపణయ్యింది.
ఈ సిద్ధాంతం ఏం చెబుతుందంటే ‘‘రెండు ఏకజాతి అణువులు 7,8లక్షల మైళ్ళ దూరంలో వున్నాసరే అవి ఏదో అనిర్వచనీయమైన రీతిలో ఒకదానికొకటి ముడిబడి వున్నాయి’’. ఇది వేదాంత వాక్యమైతే చిత్రం లేదు. కాని యిది సైన్సు వాక్యం. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.
ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి