డైలీ సీరియల్

పచ్చబొట్టు-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరిద్దరూ అనే్వష్ వచ్చాక తింటారా? నాతో కానిస్తారా?’’
‘‘నీతోనే నానమ్మా! మామూలుగా అయితే అన్నయ్య వచ్చేదాకా ఉండి ముగ్గురం కలిసి చేస్తాం. ఈ రోజు నీ కోసం ముందే తినేస్తాం!’
‘‘్ఫర్వాలేదు. అప్పుడే ఏం తింటారు? అన్నయ్యతో తినండి’’
‘‘నువ్వు ఊరుకో నానమ్మా!’’ అంటూనే కంచాలు, మంచి నీళ్ళు పెట్టేసింది.
అన్ని సామానులు దగ్గిరకు చేర్చాక వినీల్‌ని వెళ్లి పిలుచుకొని వచ్చింది.
అందరూ కలిసి భోజనం చేస్తున్నారు.
‘‘విద్యా! ఇలా కబుర్లు చెప్పుకుంటూ తింటే ఎంత బాగుంటుంది? ఈమధ్య ఎవరింట్లో చూసినా ప్లేట్లలో అన్నం, కూర వేసుకొని టీవీల ముందు సెటిల్ అయిపోవటం.. అవి చూస్తూ గంటల తరబడి తినటం, ఒక మాటా మంతీ లేకుండా అవేం తిండ్లు? కాస్త అందరూ ఒక చోట చేరేది ఈ భోజనాలప్పుడే కదా!’’
‘‘నిజమే నానమ్మా! అందుకే మా ఇంట్లో టీవీ నామకఃగా ఉంటుంది. ఎప్పుడో ఓ అరగంట బోర్ కొట్టినపుడు, వార్తలు చూడాలనిపించినపుడు, రిలాక్స్ అవ్వాలన్నప్పుడు మాత్రమే దానిని పెడతాం. అదీ ఎవరైనా అరగంట మించి చూడం. అమ్మా వాళ్ళున్నప్పుడు కూడా అంతే!’’
‘‘ఎవరన్నా అలా చెబితే వింటారా? కొంతమంది హాలులో టీవీ ముందు మంచాలు వేసేసుకుంటున్నారు ఈ సీరియల్స్ చూడటానికి. ఏదో వండుకున్నాం అన్నట్లు వండెయ్యటం దాని ముందు కాపురం పెట్ట్టెయ్యటం, ఇరుగు పొరుగులతో మాటలు కూడా లేవు. అదేమంటే టీవీ చూడకపోతే సీరియల్స్ మిస్ అయిపోమూ’’ అంటున్నారు.
‘‘నానమ్మా! నా తోటి డాక్టర్ అసలు వాళ్లింట్లోంచి టీవీ తీసేసింది. ఇపుడు మనసుకు హాయిగా ఉంది అంటుందావిడ. పిల్లలు చదువుకోవటం మానేసి దాని దగ్గిరే కూర్చోవటం, వద్దంటే కోపం తెచ్చుకోవటం.. ఇలాంటి బాధలన్నీ టీవీ అమ్మెయ్యటంతో పోయాయని.
అపుడు వినీల్ కలగజేసుకుంటూ ‘‘అది సరైన మార్గం కాదేమో! టీవీలో విజ్ఞానాన్ని పెంచే ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. వాటిని పిల్లలకు దూరం చేస్తే ఎలా? ఏది మంచి ప్రోగ్రామో తెలుసుకొని, సెలెక్టెడ్‌గా చూడటం అలవాటు చేస్తే బెటర్ కదా!’’
‘‘‘ఈ కాలం పిల్లలు వినరు కదా వినీల్!’’
‘‘వినేట్లు చేసుకోవాలి. వాళ్ళతోనే మనకనుగుణంగా విషయాన్ని చెప్పించాలి’’’.
‘‘్భలేవాడివే. పెద్దవాళ్ళే దానికి దాసోహమంటుంటే ఇంక పిల్లలేం వింటారు వినీల్’’.
‘‘అదీ నిజమే. వాళ్ళను వద్దని పెద్దవాళ్ళు చూస్తుంటే ఇక వాళ్ళమాట వినమన్నా ఎవరు వింటారు?’’
‘‘్భజనం అయ్యాక అలా అరుగుమీద ఓ అరగంట కూర్చుంటే అటూ ఇటూ వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకరు పలకరిస్తూ కాలక్షేపమయ్యేది. ఇక్కడ ఆపాటి కాలక్షేపం కూడా లేదు. అంతస్థులెక్కేకొద్దీ మాటలాడే వాళ్ళే కరువయిపోతారు’’.
‘‘పోనీలే! ఆ వంకను కూడా టీవీకే అప్పచెప్పెయ్! ఎన్ని అంతస్థులయినా అది ఎక్కెయ్యగలదుగా’’.
‘‘్భలే చెప్పావే విద్యా’’ అన్నారావిడ.
‘‘ఆ! వినీల్! చెప్పటం మరిచిపోయాను. రేపు హాస్పిటల్‌లో ఓ ముఖ్యమైన ఆపరేషన్ ఉంది. ఇప్పటివరకు చిన్న చిన్న ఆసుపత్రులలో చేయనిది, రేపు మేము ప్రయోగం చెయ్యబోతున్నాం. అది సక్సెస్ అయితే జనం వేరే చోట్లకి పరుగెట్టడం తగ్గుతుంది. అందువలన రేపు భోజనానికి రాలేను. అక్కడే ఏదో టిఫిన్ తెప్పించేసుకుంటాను. నానమ్మకు నువ్వే కంపెనీ’’.
‘‘చెప్పేసావుగా! నేను చూసుకుంటాను’’
‘‘హాస్పిటల్‌కి ఇల్లు దగ్గిర కదా రోజూ భోజనానికి వచ్చేస్తున్నాను. ఇదివరకు అమ్మకోసం వెళ్ళేదాన్ని.. ఇపుడు నా కోసం నేనే వస్తున్నాను’’.
‘‘నానమ్మ ముందు మొహమాటపడుతోంది. ఇపుడు తన కోసం వస్తోంది’’ అనుకున్నాడు వినీల్.
‘‘ఏమైనా ఇంటి పట్టున భోజనం చేయటం, ఇంటివంట తినటం ఆరోగ్యానికి మంచిది’’ అని ఒక్క వాక్యంలో తేల్చిపారేశారు.
‘‘నేను ఇక్కడ శుభ్రం చేసేస్తాను. కాసేపు అలా కుర్చీలో కూర్చో నానమ్మా’’.
‘‘అలాగే! ఒక్కసారి రేడియో తెచ్చిపెట్టు. అది వింటుంటే బాగుంటుంది. ఇపుడు నేను ఒంటరిగా ఉంటే కబుర్లు చెప్పే నేస్తమదే’’.
విద్య ఆవిడకు రేడియో తెచ్చి ఇచ్చింది.
విద్య, వినీల్ కూడా చెరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.
‘‘చాలా ఇళ్ళల్లో రేడియో పనిచేయటం లేదట’’ నానమ్మ మాటలకు నవ్వి-
‘‘నిజమే కానీ, ఎంతోమంది రేడియో వినటానికి అలవాటుపడుతున్నారు, ఇపుడు కొత్తగా టీవీ ప్రోగ్రాములు బోర్ కొట్టి’’.
‘‘మన మాటలు ఏ టీవీ వాళ్ళయినా వింటే శత్రువులమని అనే్వష్‌తో చెప్పి జైల్లో తోయించేస్తారు. ఇది మాత్రం నిజం’’ అన్నాడు వినీల్ జోక్‌గా.
‘‘అన్నయ్య రావటం రోజురోజుకు ఆలస్యమయిపోతోంది. ఎక్కడ చూసినా గొడవలే. ఇదివరకు కుటుంబంలో గొడవలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. ఇపుడు అన్నీ ఒంటరి కాపురాలే. అందుకని ఆ గొడవలు కూడా పోలీసు స్టేషన్‌కే’’.
‘‘పోలీసు ఉద్యోగం చెయ్యాలంటే చాలా ఓర్పు, సహనం ఉండాలి. కోపాన్ని అదిమి పెట్టగలిగేట్లు గుణం లేకపోతే అందులో రాణించలేరు’’.
‘‘అన్నయ్య తొందరగా ఆవేశపడడు. నిదానంగా, శాంతంగా పరిష్కరించాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు’’.
‘‘సరే! నాకు నిద్రవస్తోంది. వెళ్లి పడుకుంటానని ఆవిడ వెళ్లిపోయారు.
విద్య, వినీల్ కబుర్లలో పడ్డారు.
***
పచ్చబొట్టు విచారణ ఆ రోజే. కోర్టు బయట లోపలా జనం. పోలీసులకు వారిని కంట్రోల్ చెయ్యటం కష్టంగా ఉంది.
అందరికీ పచ్చబొట్టును చూడాలని కోరికగా ఉంది. ముసలివాళ్ళు కూడా ఓపిక తెచ్చుకొని కోర్టుమెట్లమీద కూర్చున్నారు.
కోర్టులో విచారణ ప్రారంభమయింది.
లాయర్ ‘లారెన్స్’ ఆమెను ప్రశ్నించడం ప్రారంభించాడు.
ముందుగా భగవద్గీతపైన ప్రమాణం చేయించాడు.
ఇపుడు చెప్పండి. మీ పేరు-
‘‘రాధిక’’
‘‘మీ వృత్తి’’
‘‘రచయిత్రిని’’
‘‘ఏ ఊరు?’’
‘‘వైజాగ్’’
‘‘మరి మీరు యానం ఎందుకు వెళ్లినట్లు?’’
‘‘అక్కడి వాతావరణం, పద్ధతులు, అలవాట్లతో ఒక నవల రాద్దామనుకున్నాను. అక్కడే ఉండి రాస్తే నవల నేచురల్‌గా ఉంటుందని వచ్చాను’’.
‘‘మీరెప్పుడు నవల రాసినా అలాగే వెళతారా?’’
‘‘ఆఁ! కుదిరినంతవరకూ అలా వెళ్లి రాయటానికే ప్రయత్నిస్తాను’’.
‘‘మీరే పచ్చబొట్టు అని నేనంటాను? మీరేమంటారు?’’’ -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206