డైలీ సీరియల్

పచ్చబొట్టు-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అనుకోండి. నిజంగా నేనే పచ్చబొట్టునయితే, చాలా గర్విస్తాను. మేము రాయటంలో చూపే ఉద్యమ పటిమ నిజ జీవితంలో చూపెట్టలేకపోతున్నాం. కానీ పచ్చబొట్టు అలా కాదు. నిజ జీవితంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మగజాతి కళ్ళు తెరిపిస్తోంది. ఆ గొప్పతనం ఆమెదే. ఒకరి గొప్పదనాన్ని నేను నా కాపాదించుకోలేదు. నేను పచ్చబొట్టుని కాను’’.
‘‘మరి అలాంటపుడు పచ్చబొట్టు వేసే పరికరాలు మీ గదిలోకి ఎలా వచ్చాయ్?’’
‘‘ఏమో! అదే నాకు అర్థం గావటంలేదు. అవి నావి మాత్రం కావు’’.
‘‘శిక్ష పడుతుందని మీరు అబద్ధం చెబుతూ ఉండవచ్చుగా’’.
‘‘చట్టం నుంచీ తప్పు పని చేసి ఎన్నాళ్ళు తప్పించుకోగలం? ఈ రోజు కాకపోతే రేపు పట్టుబడమా? నాకలాంటి భయం లేదు’’.
యువరానర్! దొరికిన సాక్ష్యాధారాలు ఆధారంగా ఆమే పచ్చబొట్టు అని నిర్థారణయింది. ఆమెకు తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను.
లాయర్ ‘లక్షపతి’ రాధిక తరఫున వాదించటానికి జడ్జిగారి అనుమతి తీసుకున్నాడు.
‘‘మిలార్డ్! పచ్చబొట్టు పరికరాలు ఆమె గదిలో దొరికాయి కానీ ఆమె పచ్చబొట్టు పొడుస్తుండగా ఎవరూ చూడలేదు. అలా చూసామన్న సాక్ష్యామూ లేదు. అసలు పచ్చబొట్టే ఈ కేసులోంచి తప్పించుకోవాలని ఆ పరికరాలను ఆమె గదిలో పెట్టించి ఉండవచ్చు లేదా ఆమే పెట్టి ఉండవచ్చు. ఇన్నాళ్ళూ చిన్న ఆచూకీ గానీ, పరికరాలు కానీ కంటబడనిది ఇప్పుడెందుకు దొరికినట్లు. ఒక్కసారి ఆలోచించండి!’’ కాస్త ఆగి మళ్లీ
‘‘ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఎవరో ‘రాధిక’గారిని కావాలనే ఈ కేసులో ఇరికించారని అనిపిస్తోంది. నిజానిజాలు పూర్తిగా తెలుసుకొనేందుకు వీలుగా కేసు వాయిదా వేసి, తీర్పును మరో వారం రోజుల వరకూ వాయిదా వెయ్యవలసిందిగా కోరుతున్నాను’’.
ఆయన అభ్యర్థన మేరకు కేసు వారం రోజులకు వాయిదా వేయబడింది.
పచ్చబొట్టు ఆమె కాదని నిరూపింపబడేవరకూ ఆమే పచ్చబొట్టు అని అందరూ భావిస్తున్నారు.
****
వినీల్, విద్య యశోదమ్మగారిని ఆశ్రమానికి తీసుకువెళుతున్నారు. ఆ దారి అంతా ఏవో పల్లెటూరులో ప్రయాణిస్తున్నట్లుంది. చల్లటిగాలి రివ్వున వచ్చి వారిని పరామర్శించి వెళుతోంది.
సంధ్యాసమయం.. అరుణిమ అద్దుకున్న ఆకాశం. వెండి అంచులు అలంకారంగా నీలి మేఘాలు.. పరుగులు తీసే కనె్నపిల్లలా చిరుగాలి.. ప్రకృతి అందాలకు మురిసిపోతున్నారు అంతా.
ఆశ్రమం ముందు కారు ఆపాడు వినీల్. ముగ్గురూ లోపలికి వెళ్లారు.
యశోదమ్మగారు ఇక్కడ ముందు రూమ్‌లో ఈశ్వరుడి పటం ఉంటుంది. అది మూడు వైపులనుంచీ చూస్తే మూడు రకాలుగా కనిపిస్తుంది. రండి చూపిస్తాను. ఇప్పుడంటే త్రీ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఆ కాలంలో అవేమీ లేవుగా. మేము ఎంతో వింతగా చూసేవాళ్ళం.
నానమ్మ చెప్పినట్లే ఉంది ఆ ఫొటో. కనిపెట్టామని ఇప్పటివాళ్ళు గర్వపడుతున్నవన్నీ ఏనాడో పాతకాలం వాళ్ళు కనిపెట్టినవే!
ఆశ్రమంలో విద్యార్థులు పసుపు పచ్చటి వస్త్రాలు ధరించి ఒకప్రక్కగా లైనులో వెళుతున్నారు. ఆ బిల్డింగ్‌లోనే వారికి పాఠాలు బోధిస్తారు. ఇక్కడ వాతావరణం ఎంత బాగుంటుందో బోధన కూడా అంత బాగుంటుందని పేరు. క్రమశిక్షణకి ఈ ఆశ్రమానికి పెట్టింది పేరు. అందుకే ఎందరో విద్యార్థులు ఎక్కడెక్కడినుంచో వచ్చి ఇక్కడ అభ్యసిస్తారు.
తీసుకురావటం వరకు తమ వంతు. ఇక అంతా నానమ్మదే అని అర్థమైంది వాళ్ళిద్దరికీ. దారి పొడుగునా రంగు రంగుల పూలు.. మధ్యమధ్యలో పెద్ద వృక్షాలు.. అక్కడ లేని మొక్క లేదేమో అనే అనుమానాన్ని తెప్పిస్తున్నాయి.
ఆశ్రమమంతా చూడటానికి గంటపైనే పట్టింది.
‘‘ఎలాగూ వచ్చాంగా! ఆశ్రమ గురువుగారిని కలిసి నాలుగు మాటలు విని వెళతాం’’
‘‘అలాగే నానమ్మా! నువ్వేమంటే అదే! నువ్వెలాగంటే అలాగే!’’
గురువుగారి కుటీరం దగ్గరకు చేరారు.
‘‘గురువుగారిని కలిసి మాట్లాడాలని’’ అక్కడ ఉన్నావిడతో చెప్పారు.
‘‘కూర్చోండి. పది నిముషాలలో వస్తారని’’ చెప్పి ఆమె వెళ్లిపోయింది.
అక్కడే అరుగుమీద కూర్చున్నారు.
ఎదురుగా వున్న పూలు పలకరిస్తున్నట్లే ఉన్నాయి. గాలికి ఊగుతూ అవి చెప్పే కబుర్లు వింటుంటే కాలమే తెలియలేదు.
ఇంతలో గురువుగారు రానే వచ్చారు.
‘‘ఏ ఊరునుంచీ వచ్చారు?’’ అడిగారాయన.
‘‘నాయుడుపేట’’ నానమ్మ సమాధానం.
‘‘మీరు’’ మావైపు తిరుగుతూ అడిగారు.
‘‘ఈ ఊరే.. శ్రీకాళహస్తి’’ సమాధానమిచ్చారు.
‘‘ఇలాంటి పెద్దలముందు ఏం మాట్లాడితే ఏవౌతుందో అని వారిద్దరూ ఆచి తూచి మాట్లాడుతున్నారు.
నానమ్మకు ఆ భయం ఏమీ లేనట్లుంది. చక్కగా మాట్లాడుతోంది.
వారిద్దరి సంభాషణ పది నిముషాలపాటు కొనసాగింది.
చివరగా ఆయనకు ధన్యవాదాలు చెప్పింది నానమ్మ.
గురువుగారు లోపలికి వెళ్లిపోయారు.
నెమ్మదిగా బయటకు వచ్చాం.
ఆ వాతావరణాన్ని దాటిపోతుంటే తామెంత కలుషిత వాతావరణంలో బ్రతుకుతున్నామో అర్థమవుతోంది. సాయం సమయాన ఇలాంటి చోటికి రావటం ఆరోగ్యానికి ఎంత మంచిదో అర్థమైంది వాళ్ళకి.
కారు ముందుకు వెళ్తున్నా వారి ఆలోచనలన్నీ ఆశ్రమం చుట్టూనే తిరుగుతున్నాయి.
ఇంటికివచ్చాక ‘‘వినీల్! నీ పుణ్యమా అని ఆశ్రమ దర్శనం అయ్యిందయ్యా’’ అన్నారావిడ.
‘‘్భలేవారే నానమ్మా! మీ వలన మేము ఆశ్రమం చూడగలిగాం. లేకుంటే అక్కడ ఓ ఆశ్రమం ఉందన్న విషయమే మాకు తెలిసేది కాదు’’ అన్నాడు తను.
‘‘అవును నానమ్మా! ఆశ్రమం నాకు కూడా బాగా నచ్చింది. తీరిక దొరికినపుడు వెళ్లాలనిపిస్తోంది’’.
‘‘మంచిది. అప్పుడప్పుడు వెళుతూ ఉండండి’’.
‘‘అలాగే అన్నట్లు తల ఊపారిద్దరూ’’.
‘‘రేపే నా ప్రయాణం. ఏర్పాట్లు చెయ్యండి. ఇంక ఆగటం నావల్లకాదు’’.
అన్నయ్యతో చెబుతాను అంది విద్య.
‘‘ఇంక చెప్పటం ఏమీ లేదు. మీరు తీసుకెళ్ళకపోతే నేను బస్టాండ్‌కి వెళ్లి బస్సు ఎక్కేస్తాను’’.
‘‘‘వద్దులే! నువ్వన్నంత పని చెయ్యగలవు. నీకాశ్రమం ఎందుకు. మేమే పంపిస్తాం. ఈ రాత్రికి నువ్వు హాయిగా నిద్రపో. మిగతాదంతా మేం చూసుకుంటాం’’.
‘‘ఏం చూసుకుంటారో ఏమిటో! ఆ బస్సు ఎక్కాక కానీ మిమ్మల్ని నమ్మను. మళ్లీ నీ పెళ్లికి వస్తానుగా’’.
‘‘ఇప్పుడు మేము కాదంటే కదా! అసలు ఉండవన్నదానివి రెండు రోజులున్నావు. అదే మాకు ఆనందం. ఇంక నిన్ను ఇబ్బంది పెట్టం.. సరేనా?’’
‘‘ఆ! ఇప్పుడు నమ్మకం కలిగింది. హాయిగా నిద్రపోతాను’’ అంటూ వెళ్ళారావిడ. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206