డైలీ సీరియల్

పచ్చబొట్టు -- 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిపిల్లలాంటి ఆ మనస్తత్వాన్ని చూసి నవ్వుకున్నరిద్దరూ.
***
ఉదయం లేచిన దగ్గరనుంచీ టిఫినయ్యిందా? టిఫినయ్యిందా? అంటూ పదిసార్లు అడిగారు విద్యను.
‘‘అయిపోతోంది నానమ్మా!’’ విద్య సమాధానం.
‘‘నేను ఆలస్యంగా వెళ్లాలని లేట్ చేస్తున్నావేమో! నువ్వు తొందరగా చెయ్యకపోతే తినకుండానే వెళ్లిపోతాను’’.
ఇక లాభం లేదని చకచకా గరిటె తిప్పింది హాస్పిటల్‌లో కత్తెర తిప్పినట్లే.
టిఫిన్ అవగానే తిని చెయ్యి కడుక్కొని రిక్షా పిలుస్తావా? ఆటో పిలుస్తావా? ఏదో ఒకటి తొందరగా పిలవండి.
‘‘నేనుండగా వేరే వాళ్ళెందుకు నానమ్మా! పదండి నేను దింపుతాను’’ అంటూ ఆవిడ సంచిని భుజానికి తగిలించుకున్నాడు వినీల్.
‘‘వినీల్ నేనూ, అన్నయ్య కూడా వస్తాం నానమ్మను దింపటానికి’’.
‘‘రండి! అందరం కలిసే దింపుదాం’’.
‘‘బస్సులో వెళ్ళటం ఎందుకు నానమ్మా! నేను దింపేస్తాను కదా!’’
‘‘వద్దు వినీల్. ఒక్కదాకోసం నీకెందుకు శ్రమ. డబ్బు ఖర్చు కూడా. ఇక్కడ ఎక్కి ఒక్క కునుకు తీస్తే నాయుడుపేటలో లేవచ్చు’’.
వీళ్ళు బస్‌స్టాండ్‌కు వెళ్ళేటప్పటికి బస్సు రెడీగా ఉంది.
లోపలికి వెళ్లి కూర్చున్నాక స్థిమితపడ్డారావిడ.
‘‘నానమ్మా! సంచిలో కమలాలు వేసాను, దారిలో తినటాకి’’
‘‘అలాగే’’
‘‘జనార్దన్‌గారికి ఫోన్ చేసి చెబుతాను. ఇంటిదాకా తోడు ఉంటారు’’ అన్నాడు అనే్వష్.
‘‘లేదులే నానమ్మా! ఆయన్ని రానీ. ఆయనయితే మళ్లీ నిన్ను క్షేమంగా చేర్చానని కబురు అందిస్తారు’’.
‘‘ఇంతోటి కబురు నేనింటికి వెళ్ళగానే ఫోను చేసి చెప్పనా?’’
‘‘ఇప్పటిదాకా నీ మాట మేము విన్నాం. ఇక్కడనుంచీ మా మాట నువ్వు వినాలి’’.
‘‘సరే! చెబితే వినే రకాలు కాదు మీరు’’ ముద్దుగా విసుక్కున్నాడు.
‘‘వినీల్! వెళ్ళొస్తా!’’
‘‘మాకు చెప్పవా?’’
‘‘మీకూ చెప్తా భడవాయిల్లారా!’’ తన ఊరు వెళ్లిపోతున్నానన్న ఆనందం ఆమె కళ్ళనిండా.
ఎవరి ఊరికి వాళ్ళు వెళుతుంటే అంత ఆనందం ఉంటుందా అనిపించింది వాళ్లకు ఆవిడను చూస్తుంటే.
బస్సు కదిలి వెళ్ళేవరకూ ఆవిడ టా! టా! చెబుతూనే ఉన్నారు.
నానమ్మ వెళ్లిపోతుంటే ఇద్దరి కళ్ళలో నీరు తిరిగాయి.
వాళ్ళిద్దరినీ క్రిందనే దింపేసి ‘‘నేను వెళుతున్నాను’’ అన్నాడు వినీల్.
‘‘నానమ్మవల్ల నీకు పని ఆగిపోయింది కదూ’’ అంది విద్య.
‘‘దానిదేముంది? ఇపుడు ఖాళీ ఉందన్నా అలాంటి పెద్దలు వారి మాటలు దొరుకుతాయా!’’
ఆ నిధి దొరికినప్పుడే అందిపుచ్చుకోవాలి. నానమ్మ వల్ల నాకు ఆనందమే కానీ దుఃఖం లేదు. బై అంటూ వెళ్లిపోయాడు.
***
కోర్టులో విచారణ మళ్లీ ప్రారంభమయింది.
ఇంతలో కొత్త పాత్ర ప్రవేశించింది. జడ్జిగారిని మాట్లాడటానికి అనుమతివ్వమంది
ఆయన ఒప్పుకోవటంతో ఆమె బోనులోకి ప్రవేశించింది.
‘‘జడ్జి బాబూ! ఇదంతా నావల్లనే జరిగింది బాబూ. మేము పచ్చబొట్లు వేసుకునేవాళ్ళం. నా పేరు రంగి. ఆ రోజు మా మామ వచ్చి మన పిల్లోడు కనిపించటంలేదే అంటే, ఆ కంగారులో ఎవరైనా మా సామాన్లు కొట్టేస్తారేమోనని భయంతో ఆ బంగ్లాలోకి వెళ్లి కిటికీలో దాచుకున్నాను బాబూ. మా పిల్లోడు దొరికాక తీసుకోవచ్చనుకున్నాను. దీనివల్ల ఓ ఆడకూనకు శిక్ష పడుద్ది అని తెలిస్తే పెట్టేదానే్న కాదు. ఆ నోట ఈ నోట ఈయమ్మ సంగతి విన్నాను. నా సామానులు కనిపించకపోవటం, ఈ మాటలు వినటంతో స్టేషన్‌కి లగెత్తినా! వాళ్లే ఈడకు తీసుకొచ్చినారు బాబూ! ఆ సామాను నాది. ఈ అమ్మకేం సంబంధం నేదు. నాను చెబుతున్నానుగా’’.
జడ్జిగారు ఆమె చెప్పే మాటలు నిజమని విశ్వసించి రచయిత్రి రాధికను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేశారు. నిజాయితీగా వచ్చి నిజాన్ని ఒప్పుకున్నందుకు రంగిని అభినందించి కోర్టు స్వాధీనం చేసుకున్న పచ్చబొట్టు పరికరాలను ఆమెకు అందజెయ్యవలసిందిగా ఆదేశించారు.
పచ్చబొట్టు ఆమే అనుకొని వచ్చిన జనమంతా నిరుత్సాహంగా వెనుదిరిగారు. దేశాన్ని గాంధీగారు శాంతి మార్గంలో నడిపించినట్టు మంచివైపు నడకలు నేర్చిన పచ్చబొట్టును ఒక్కసారైనా చూడాలని ప్రతి ఒక్కరికీ కోరికగా ఉంది. ఆ రోజు ఎందరో ఆ విషయంలో బయటపడ్డారు.
వారితో నడుస్తూ వారి మాటలు విన్న ‘్భనుమతి’ మనసులోనే ఒక స్థిర నిశ్చయానికొచ్చింది. అది అమలు చేసే విధానం తెలుసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకుంది.
అప్పటికే పచ్చబొట్టుపై కేసు రీత్యా ఆమె మరో వారం రోజులలో కోర్టుకి లొంగిపోవాలని టీవీలలో, పేపర్లలో ప్రకటన చేశారు. అందరూ ఆమె లొంగిపోయే తరుణం కోసం కాదు కానీ, తమ సంసారాలు నిలబెట్టిన దేవతను చూసుకోవాలని ఉబలాటపడుతున్నారు. జడ్జిగారు శిక్ష వేస్తే తాము ఒప్పుకుంటారా? ఆ తప్పులో తామూ భాగం పంచుకున్నాం. శిక్ష వేస్తే అందరికీ వెయ్యమని.. వదిలేస్తే అందరినీ వదిలెయ్యమని గట్టిగా అడుగుదామని స్ర్తిలంతా కంకణం కట్టుకున్నారు.
అనే్వష్ మాత్రం పచ్చబొట్టు తనకు తానుగా లొంగిపోయేలోపే తాను పట్టుకోవాలని, గెలుపు తనదే కావాలని తపన పడుతున్నాడు. చూద్దాం! ఏం జరుగుతుందో!
***
ఆ రాత్రి అనే్వష్‌మీద విద్య అలిగింది. మాట్లాడలేదు. అనే్వష్ ఎంత బ్రతిమాలినా కరగలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. సారీ చెప్పినా వినటంలేదు. ఎలా విద్యను ఊరుకోబెట్టగలడు? కన్విన్స్ చేయటం ఎలా? ఎలా?
ఇంతదానికే ఇలా అయిపోయింది. రేపు పచ్చబొట్టు తనకు ఉత్తరాలు రాసిందని, తను ఆ విషయం చెప్పలేదని తెలిస్తే ఇంకేమన్నా ఉందా?
రాత్రి తను ఏదో సరదాగా తీసుకొన్నాడా విషయాన్ని. పచ్చబొట్టు విషయంలో విద్య ఇంత సీరియస్‌గా తీసుకుంటోందని తెలిస్తేను వేరేగా మాట్లాడేవాడు.
ఆమె పచ్చబొట్టు కాదని తెలుసు కాబట్టి విద్య చెప్పినదానికి ఒప్పుకున్నా పోయేది. సరదాకైనా అలా మాట్లాడలేకపోయాడు. విద్యకు తెలియదా తన మనస్తత్వం? ముక్కుకు సూటిగా వెళ్లటంవలన ఎన్నో ఎదురుదెబ్బలు తింటున్నాడు. బయటివారితో అయితే తప్పదు. ఇంట్లో కూడా ఇలా అయితే తట్టుకోగలడా?
సమయానికి వినీల్ కూడా ఇంట్లో లేడు. తను ఉంటే ఏదైనా ఉపాయం చెప్పేవాడేమో.
అమ్మో! చెల్లితో మాట్లాడకుండా తను ఉండగలడా? ఇలా జరుగుతుందని ఎప్పుడన్నా అనుకున్నాడా? ఇలా జరిగిందేమిటి? అసలంత కోపం ఎందుకొస్తోంది? తనేం తప్పు చేసాడు? చెప్పకుండా అలిగితే ఎలా?
ఆపద సమయంలో నారదుడు ప్రత్యక్షమైనట్లు వినీల్ వచ్చాడు.
‘‘వినీల్ వచ్చావా! ఇటురా అంటూ నిన్న జరిగినదంతా చెప్పాడు. విషయమేమిటో నెమ్మదిగా కనుక్కొని చెప్పు. నేను పైనుంటాను. తొందరగా రా. నువ్వు వచ్చేవరకూ నాకు టెన్షన్‌గానే ఉంటుంది.
‘‘విద్యా! విద్యా!’’ అంటూ లోపలికి వచ్చాడు వినీల్ ఏమీ ఎరగగనట్లే.
మాట్లాడలేదు విద్య.

-సశేషం

--యలమర్తి అనూరాధ సెల్:9247260206