డైలీ సీరియల్

పచ్చబొట్టు-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పచ్చబొట్టు ఒక్కరు కాదు ప్రారంభం మాత్రమే నాది.. ఆ తర్వాత స్నేహితులు, ఆప్తులు.. మరెందరో పచ్చబొట్టుననుసరించారు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టలేం. అలాగే పచ్చబొట్టుకి సహాయం చేసిన వారినీ లెక్కించలేం’’.
‘‘ఇన్నాళ్లూ మీరు పట్టుబడకపోవటానికి కారణం?’’
‘‘మంచి ప్రశ్నవేశారు. ఆకావంలో సగం అంటూ ఆడవారిని మాటలలో అందలం ఎక్కిస్తూ నిజీ జీవితంలో కాలిక్రింద చెప్పులా అణగద్రొక్కే ఈ మగవారి మీద ఆడవారు తీసుకోవాలనుకున్న రివెంజ్ ఇది. అందుకే ఆడవారి నోట ఏ మాట దాగదన్న శాపాన్ని కూడా తుడిచిపెట్టెయ్యగలరని నిరూపించారు. నాకై నేను లొంగిపోయేదాకా మీరు నా ఛాయలకు కూడా రాలేకపోయారు. చివరి సెకనులో ఇన్స్‌పెక్టర్ అనే్వష్ మాత్రం కనుక్కోగలిగారు. ఆయనకు నా అభినందనలు. ఆయన కనిపెట్టడం, నేను లొంగిపోవడం ఒకేసారి జరిగాయి. అది ఏమి చెప్పింది? ఆడ మగా ఇద్దరూ సమానమే! గెలుపు, ఓటముల గురించి తన్నుకోవద్దని’’.
‘‘ఏ శిక్ష కావాలంటే అది వేసుకోవండి. నేను కాదనటంలేదే!’’’
లాయర్ మంగపతి ఒక్కసారి తన కోటు సవరించుకుని పచ్చబొట్టు పత్రికల్లో వచ్చిన నేరాలు చేసానని స్వయంగా ఒప్పుకుంటోంది కాబట్టి ఆమెను శిక్షించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను మిలార్డ్ అన్నాడు. ఆ మాట అతను అనగానే అక్కడ వున్న ఆడవారంతా ‘‘మేం ఒప్పుకోం. పచ్చబొట్టును శిక్షిస్తే మేం ఒప్పుకోం’’. కోర్టులో, బయటా ఒకటే మాట. ‘‘మేమంతా పచ్చబొట్టులమే.. మమ్మల్ని శిక్షించండి’’ అంటూ రెండు చేతులెత్తారందరూ!’’.
‘‘సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్’’ జడ్జి బల్లగుద్దటంతో నిశ్శబ్దమయ్యారు.
‘‘నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా మిస్ తృప్తీ’’ జడ్జి ప్రశ్నించటంతో-
‘‘లేదు సార్.. కావాలని కూడా అనుకోవటంలేదు. అసలు ఇదంతా నేనెందుకు చేయాల్సి వచ్చింది అనిమాత్రం నేనే చెప్పదల్చుకుంటున్నాను. దానికి మీరు అనుమతిస్తే చాలు..’
‘‘ప్రొసీడ్’’
‘‘మేము కాసా గార్డెన్స్ వెనుక వైపు ఉండేవాళ్లం. మా నాన్న వడ్రంగి పనిచేస్తారు. కానీ ఏనాడూ ఆయన తన సంపాదనలో మమ్మల్ని పోషించలేదు. పగలంతా సంపాదించినది రాత్రయ్యేటప్పటకి త్రాగి బ్రాందీషాపు వాళ్లకే సమర్పించి వచ్చేవారు. అమ్మే ఆ ప నీ, ఈ పనీ చేసి నన్ను చదివించింది. ప్రభుత్వ పాఠశాలలో నేను మూడవ తరగతి చదువుతున్న రోజులవి. కాసా గార్డెన్స్‌లో ఉండే ఉద్యోగుల పిల్లలు మా క్లాసులో ఆరుగురు ఉండేవారు. నాతో కలిపి ఏడుగురం. ఆడపిల్లలు మరో ముగ్గురు ఉండేవారు మా క్లాసులో. కానీ వాళ్లు మాతో కలిసేవారు కాదు. మేము ఏడుగురం మాత్రం విడిపోయేవాళ్లం కాదు. ఎక్కడికి వెళ్లినా కలిసే.. విడిగా వెళ్లాల్సి వస్తే మానేసేవాళ్లం కానీ విడిగా వెళ్లేవాళ్లం కాదు. మా బ్యాచ్‌లో ఒకరు ప్రిన్సిపాల్ కూతురు, ఒకళ్లు విడివో కూతురు, ఒకరు వెటర్నిటీ డాక్టరు కూతురు, ఒకరు గుమాస్తా కూతురు, ఒకరు బిడిఓ కూతురు, మరొకరు తోటమాలి కూతురు. అక్కడ ఆఫీసల్లో కేడర్లు వేరయినా అవి మా స్నేహానికి అడ్డురాలేదు. అందరం కలిసే ఉండేవాళ్లం. నేను ఆ కాసా గార్డెన్స్ ప్రక్కనే పుట్టినా, పెరిగింది తిరిగింది ఆ తోటల్లోనే.
స్కూలు నుంచివచ్చిన దగ్గరనుంచీ ఆడటం, చదవటం అన్నీ అక్కడే. తినటనాకి మాత్రమే ఇంటికి వచ్చేదాన్ని. వీళ్లు కాకుండా మరో ముప్ఫై కుటుంబాలలు అక్కడే క్వార్టర్స్‌లో ఉండేవి. చిన్నతనం నుంచీ వాళ్లందరినీ గమనిస్తూ ఉండేదాన్ని. ఎన్నో కుటుంబాలు.. ఎందరో పిల్లలం. అందరం కలిసే ఆడుకునేవాళ్లం.
ఒకనాటి రాజదర్బారును నిజం దర్బారు చేసేవాళ్లం మా ఆటల్లో. మేడమీద సింహాసనాలను అధిష్ఠించి రాజు, రాణి, మంత్రి వేషాలు వేస్తూ ఉండేవాళ్లం. అక్కడ ప్రాకిన రాధా మాధవీ లత పువ్వులు మమ్మల్ని మెచ్చుకుంటూ ఉండేది. నీళ్లు రాననపుడు రాణీగారు స్నానం చేసిన చెరువులోంచి నీళ్ళు టాంకులతో తెచ్చుకొనేవాళ్లం. పెద్ద పెద్ద గ్రౌండులన్నీ మా కాళ్ళకు నేస్తాలు. ఆఫీసు వెనుక గురివింద చెట్టు, ముందు ప్రక్క వ్యానులు ఏదీ వదిలిపెట్టేవాళ్లం కాదు. దెయ్యాలున్నాయని భయపెట్టే దెయ్యాల మడను కూడా వదిలిపెట్టేవాళ్లం కాదు. చెట్టు, పుట్ట ఎక్కేవాళ్లం, దిగేవాళ్లం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే బాల్యం ముద్రలు ఎప్పటికీ చెరిగిపోని గుర్తులని తెలియటానికే. బయట ఎంతలా గంతులేసేవాళ్లమో ఇంటికి చేరితే అంత బుద్ధిమంతులయిపోయేవాళ్లం. వంతులు వేసుకొని ఒక్కోరోజు ఒక్కొక్కరింట్లో అందరం కలిసి చదువుకొనేవాళ్లం. మాలో మేమే పోటీపడేవాళ్లం. అప్పట్లో కానె్వంట్ స్టడీస్ లేవు. ఎంత గొప్పవారైనా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొనేవాళుల్ళ. ఇంకో విశేషమేమంటే అక్కడ ఎక్కువ కుటుంబాలు ఉండటంతో పిల్లలు ఒకటవ తరగతి నుంచీ పోస్టుగ్రాడ్యుయేషన్ చదివేవరకూ ఉండేవారు. అందరూ అందరితో కలిసిపోయేవారు. చన్ని చిన్న కొట్లాటలు ఆటల్లో మామూలే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ కుటుంబాలుతో వున్న అనుబంధం చెప్పుకోదగ్గది. వారిమధ్యే పెరుగుతూ వచ్చాను. ఆ పెరగటంలో నేను ముఖ్యంగా గమనించింది- మగవారు ఏం చెబితే ఆడవారు అది వినటం, అంతమందిలో ఒక్కరు కూడా. ఆడవారు చెబితే మగవారు వినేవాళ్లు కనిపించలేదు. చిన్నతనంలో ఆ చిన్న విషయమే ఈ చిన్ని బుర్రకి భూతద్దంలో చూసినట్లు పెద్దదిగా కనిపించేది. ఎందుకలా? అని నన్ను ప్రశ్నించుకోవటం అక్కడే ప్రారంభమైంది. అది నాతోపాటే పెరిగి పెద్దదవుతోందనే విషయం చాలా సంవత్సరాలదాకా నాకు తెలియనే తెలియదు.
నేను ఆరో తరగతిలోకి వచ్చేవరకూ అందరం కలిసే ఉన్నాం. బాలికల పాఠశాలకు క్యారేజీలు పుచ్చుకొని మైలు దూరాన్ని మాటలతో తగ్గించేసుకుంటూ వచ్చేసేవాళ్లం. ఏడవ తరగతికి వచ్చేటప్పటికి నది పాయలులాగా విడిపోయాం. ఉద్యోగరీత్యా వచ్చే ట్రాన్సఫర్లు మమ్మల్ని భౌతికంగా వేరుచేసాయి. కానీ మానసికంగా మేమెప్పుడూ దగ్గిరవారమే.
ఎప్పుడూ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్లం. చిరునామా మారగానే వెంటనే ఉత్తరాలు రాసేవాళ్లు. ఫోన్లు వచ్చినా మా ఉత్తరాల పరంపర ఆగలేదు. రెండు సంవత్సరాల క్రితం అందరం కలిసి రెండు రోజులు ఒకే చోట ఉండాలని నిశ్చయించుకున్నాం. చిన్నప్పుడు విడిపోయిన వాళ్లం ఇనే్నళ్ల తర్వత కలిసాం. పారిస్‌లో ఉన్న ‘పారిజాత’ మాత్రం రాలేకపోయింది. కానీ వీడియో కెమెరా పంపించి మేమంతా ఆ రెండు రోజులు ఎలా గడిపామో సీడీ తీయించుకొని దాన్ని చూసి ఆనందించేది.
మా సరదా కబుర్లలో సరదాగా వచ్చిన చర్చ తీవ్రతను సంతరించుకుంది. చుట్టూ వున్న ఈ సమాజానికి ఏదో చెయ్యాలనిపించింది. అడుగడుగునా అత్యాచారాలు.. చిన్నప్పుడు మేము ఆడుకున్నట్లు ఇపుడు పెద్దవాళ్లు పిల్లలని బయటకు పంపలేకపోతున్నారు. కారణం ముసలివారి దగ్గరనుంచీ పిల్లలదాకా ఎందరిలోనూ నిక్షిప్తమైన వాంఛ. అదే అత్యాచారాలకు దారితీస్తోంది. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. అది మాకు ఘోరమైన తప్పులా అనిపించింది.
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206