డైలీ సీరియల్

పచ్చబొట్టు-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే ప్రేమించలేదని వెంటబడి శ్రీలక్ష్మిని చంపేసిన మనోహర్‌లు. ఇలాంటివి ఎన్నో? ప్రేమించేవారికన్నా ప్రేమించబడి మోసపోబడుతున్న ఆడవారు ఈలోకంలో ఎందరో?
ఇక్కడితో ఆగుతోందా? నానాటికీ విదేశీ సంస్కృతి ప్రబలిపోతోంది. ఇపుడు మనం మనమే కానీ, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ మారిపోయాయి. ఇంకొన్నాళ్లు పోతే అవి మరిచిపోతాం కూడా. అలా జరగకూడదనిపించింది.
మన సంప్రదాయాలకి ప్రపంచ వ్యాప్తంగా విలువ ఎందుకొచ్చింది? ఒకే భార్య, ఒకే వివాహం, ఏకపత్నీవ్రతం పాటించడమే. ఎవరు ఇప్పుడది పాటిస్తున్నారు. ఇద్దరిని, ముగ్గురిని మెయిన్‌టెయిన్ చేస్తున్నామని పబ్లిక్‌గా చెప్పుకుంటున్నారు. ఇదే జరిగింది.. ఇదే కొనసాగితే మన విలువలు పడిపోవా?
స్ర్తిలను గౌరవించమని పెద్దలు ఘోషపెడుతుంటే ఆడవారంటే ఎక్కడ చూసినా చిన్న చూపే! సంపాదించినా, సంపాదించకున్నా వారికి లభించేది ఒకటే గౌరవం. ఎందుకలా? ఆడ, మగ ఇద్దరూ సమానం అనుకుంటే సమస్యలుండవు. హక్కులుండవు. ఉండేవి ఆప్యాయత, అనురాగాలే. ఈమధ్య అవి కూడా పలచబడిపోతున్నాయి. ముఖ్యమైన కారణం టీవీ. రకరకాల ఛానెల్స్ అందుబాటులోకి వచ్చేసి సమయాన్ని తినేసి అనుబంధాలను మింగేస్తున్నాయి.
విదేశీయులు మన అలవాట్లకు ముచ్చటపడుతుంటే మనం వారి అలవాట్లవైపు మొగ్గు చూపుతున్నాం. ఇలాంటివాటికి ఎక్కడో ఆనకట్టవెయ్యాలి. తప్పదు.
లేదంటే ఆ ప్రళయంలో అందరూ మట్టికొట్టుకుపోతాం. ఎవరికీ ఎవరూ మిగలం. ఆ రోజు రాకూడదని మేము కలిసినపుడు ఏదైనా చెయ్యాలని కంకణం కట్టుకున్నాం. కలిసి కృషి చెయ్యాలనుకున్నాం. చిన్నప్పుడు మేమంతా కలిసి సరదాగా నేర్చుకున్న ‘పచ్చబొట్టు’ని మా సాధనంగా ఎన్నుకున్నాం. దానికయ్యే ఖర్చు పారిస్‌లో వున్న నా స్నేహితురాలు ‘పారిజాత’ సమకూర్చింది. సరంజామా మరో స్నేహితురాలు ‘సరిత’ మూడో కంటికి తెలియకుండా అందజేసింది. మరో స్నేహితురాలు ‘శ్రీ’ పోలీసు యంత్రాంగంలో విశేషాలన్నీ ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండేది. అందరం విడిపోతూ కూడా కలిసి ఈ పనిని సాధించాలనుకున్నాం. రోజూ కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం.
ఒక రోజు వర్షం పడ్డ రాత్రి కరెంట్ పోవడంతో లాంతారు దగ్గిర కూర్చున్న నాకు ఆ నీడ ఎక్స్‌లా కనిపించడం, అదే సమయంలో రేడియోలో పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట రావడంతో కర్తవ్యం స్ఫురణకి వచ్చింది. అంతే ఇక ఆగలేదు. పచ్చబొట్టుతోనే అనుకున్న కార్యాన్ని సాధించాలనుకున్నాను. సాధించాను.
ఆ రోజు మా నాన్న మంచం ఎవరికో తయారుచేసి పెట్టాలని కలప కావాలంటే అడితికి వెళ్ళాను కావలసిన కలప తేవడానికి. పని ముగించుకొని వచ్చేముందు కెవ్వున కేక వినిపించింది అదీ లీలగా. వెళ్లి చూద్దును గదా. ఈ పరమానందం! అదే ఫణి.. పసిపాపపై జరుపుతున్న అత్యాచారం. అపుడే బయటపెట్టేదాన్ని. అనవసరంగా ఆ పాప జీవితం అవమానాల పాలు చెయ్యడం ఇష్టం లేక ఊరుకున్నాను అప్పటికి. కానీ శాశ్వతంగా కాదు. అందుకే నా మొదటి విక్టిమ్ అతనయ్యాడు.
పచ్చబొట్టు ఒక్కచోట కాదు అంతా ఉందనే భ్రమ కల్పించి జనాలను భయపెట్టి దారిలోకి తీసుకురావాలనుకున్నాం. అందుకే హైదరాబాద్‌లో ‘హైందవి’ ప్రేమ్‌ని ఎంచుకొని పచ్చబొట్టు పొడిచింది. అది అతనికి అత్త కూతురే. అలాగే విజయవాడలో ‘వైదేహి’ రూపేష్‌కి బుద్ధి చెప్పింది. సన్నని బాల్కనీ పట్టుకొని ప్రక్క ఇంట్లోకి ప్రాణాలు ఫణంగా పెట్టి వెళ్లింది.
తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుందామని వెళ్లిన నాకు ఆ జంట కనిపించింది అనుకోకుండా. వేటు వేసాను. అతనిది కలకత్తా. నా నుంచి తప్పించుకోవాలని ఇక్కడకు వచ్చి నాకు దగ్గిరై నా పనిని తేలిక చేసాడు.
ఢిల్లీలో ‘కాంతి’ కృష్ణమూర్తి పని పట్టింది. అదీ క్వార్టర్స్‌లో ఉండటంవలన ఆ పనిని తేలికగా చేయగలిగింది. ఎంపిక కూడా సరిగ్గా చేసుకుంది.
మార్కాపురంలో ‘మల్లిక’ తల్లిదండ్రులకు వృద్ధాశ్రమం పాలు చేసిన భూషణ్ అహంకారంపైన ముద్రవేసింది.
మన దేశంలోనే జరుగుతున్నట్లు కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ ముద్ర ప్రభావం పడాలని అనుకున్నాం. ‘పారిజాత’ పారిస్‌లో విజయ్‌కుమార్ ద్వారా పచ్చబొట్టుని నిలబెట్టింది.
ఆ తర్వాత సహకారం ప్రజలనుంచే రావాలని కోరుకున్నాం. మాకు సహకరించే వాళ్ల లిస్ట్ తయారుచేసుకున్నాం. వాళ్ళకి రహస్యంగా పచ్చబొట్టు వేసే విధానం, పరికరాలు అందజేసాం. అక్కడనుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేమున్నాం అంటూ ఎందరో పచ్చబొట్టు వెలిసారు. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206