డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యయుగంలో దక్ష ప్రజాపతి కుమార్తెలలో కద్రువ, వినత అనే ఇద్దరిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి తండ్రి వివాహం చేశాడు. కశ్యపుడు తన భార్యలిద్దరికీ వరాలు ఇచ్చాడు. వారికి ఇష్టమయిన దానిని కోరుకో మన్నాడు. కద్రువ తనకు వేయిమంది బలం ఉన్న సర్పాలను పుత్రులుగా కోరింది. వినత కద్రువ పుత్రులకంటే బలవంతులు తేజస్సు కల ఇద్దరు కుమారులను కోరింది. కశ్యపుడు వారిద్దరి కోర్కెలను మన్నించి అలాంటి పుత్రులు వారికి కలిగేటట్లు వరం ఇచ్చాడు. వినత తనకు కద్రువ పుత్రులకంటే బలవంతులు పుట్టగలరని ఆనందించింది. కొంతకాలానికి వారిరువురూ గర్భాలు ధరించారు. అప్పుడు కశ్యపుడు వారితో ‘‘మీ గర్భాలను రక్షించుకోండి’’ అని చెప్పి తపస్సు చేసుకోవడానికి వనానికి వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత కద్రువ వేయి గుడ్లను, వినత రెండు గుడ్లను కన్నారు. వారు ఆ గుడ్లను నేతి కుండలలో పెట్టి కాపాడుతున్నారు. 500 సంవత్సరాల తర్వాత ఆ అండాల నుండి కద్రువకు వేయిమంది పుత్రులుగా పుట్టారు.కాని వినత అండాల నుండి ఎవ్వరూ పుట్టలేదు.
తన అండాలు పగలకపోవడం చూసి వినత సిగ్గుపడి ఒక అండాన్ని చితకకొట్టింది. అప్పుడు ఆ గుడ్డు నుండి శరీరం యొక్క పైభాగం మాత్రమే కలిగిన పుత్రుడు ఉదయించాడు. అర్ధ్భాగంతో జన్మించిన అతను తల్లితో ‘‘అమ్మా! నీవు తొందరపాటుతో, దురాశతో నన్ను అర్ధశరీరునిగా చేశావు. దీనికి ఫలితంగా నీవు నీ సవతికి 500 సంవత్సరాలు దాసిగా బ్రతుకుతావు. రెండో అండాన్ని కూడా చిదిపి అతన్ని కూడా అర్ధశరీరునిగా చేయకు. ఆ పుట్టబోయే కుమారుడు నీ దాసీత్వాన్ని తొలగిస్తాడు. కనుక ఆ అండాన్ని ఇంకొక 500 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడు. అతని పుట్టక కోసం ఎదురు చూడు’’.
ఈ విధంగా తల్లిని శపించి అతడు ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. అక్కడ అతడు సూర్యలోకం చేరి అతని అనుగ్రహం పొంది సూర్యరదసారథి అయ్యాడు. అతనే వినతాపుత్రుడు అనూరుడు.
తర్వాత కొంతకాలానికి వినతకు గరుడుడు జన్మించాడు. ఎంతో ఆకలిగా ఉన్న అతనికి బ్రహ్మ సరియైన ఆహారాన్ని కల్పించాడు.
పాలసముద్రాన్ని దేవదానవులు అమృతం కోసం మథించారు. అప్పుడు అందులో నుండి ఉచ్చైశ్రవమనే అశ్వం పుట్టింది.
ఆ దివ్యాశ్వం సముద్రతీరంలో విహరిస్తూ ఉండగా దూరం నుంచి కద్రువ వినతలు దాన్ని చూచారు. కద్రువ వినతతో ‘‘ఆ గుఱ్ఱం ఏ రంగులో ఉందో చెప్పు’’మంది. ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి