డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు కశ్యపుడు వారితో ఇలా అన్నాడు
‘‘మహర్షులారా!
బ్రహ్మయొక్క ఆజ్ఞ వలన ఈ ఇంద్రుడు దేవతలకు రాజైనాడు. మీరు ఇప్పుడు ఇంకొక ఇంద్రుని కోసం సంకల్పిస్తే పరమేష్టి ఆజ్ఞ వ్యర్థమగును కదా! అలాగే మీ మాట కూడా వ్యర్థం కాకూడదు. కనుక బలసంపన్నుడైన ఇంద్రుడు జన్మించును. కాని అతడు పక్షీంద్రుడు అగుగాక! మీరు దయతో ఇంద్రుని అపరాధాన్ని క్షమించండి’’
అప్పుడు వాలఖిల్యులు ఇలా అన్నారు. ‘‘మా అందరి ప్రయత్నం ఇంద్రుని కోసం. మీ ప్రయత్నం పుత్రుని కోసం. ఇప్పుడీ కార్యం ఇలా సఫలవౌతుంది. దాన్ని మీరే గ్రహించండి.’’
అదే సమయంలో కశ్యపపత్ని వినత భర్తను సేవించడానికి వచ్చింది. అప్పుడు కశ్యపుడు ఆమెతో ‘‘దేవీ! నీ కోరిక తప్పక నెరవేరును. అతి బలవంతులైన వీరులు నీకు జన్మిస్తారు. వాలఖిల్యుల తప్ఫఃలం నా వరం కూడా అదే. నీ గర్భాన పుట్టేవీరులు పక్షులందరికీ ఇంద్రులుగా గౌరవింపబడుతారు’’ అని చెప్పి, ఇంద్రునితో ఇలా అన్నాడు ‘‘పురంధరా! ఈ బలసంపన్నులు ఇద్దరూ నీకు సహాయకులుగా ఉంటారు. వారి వల్ల నీకు ఏ హానీ జరుగదు. నువ్వే దేవతలందరికీ ఇంద్రుడివి. ఎన్నడూ బ్రహ్మర్షులను అవమానించకు. వారి దగ్గర వాక్కు అనే ఆయుధం ఉంది. అది నీ వజ్రాయుధం కంటే గొప్పది’’.
తరువాత వినతకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిలో అరుణుడు పెద్దవాడు. అతను వినత తొందరపాటు వలన అర్ధశరీరంతో పుట్టాడు. అతను సూర్యుని రథానికి సారథియైనాడు. రెండవ పుత్రుడు గరుత్మంతుడు. అతను పక్షీంద్రునిగా అభిషేకింపబడ్డాడు.
అటువంటి గరుడుడు అమృతం కోసం స్వర్గానికి వస్తున్నాడని తెలిసి, అమృతాన్ని రక్షించడానికి దేవతలందరూ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. అప్పుడు అక్కడికి గరుడుడు వచ్చాడు. అతన్ని చూడగానే దేవతలంతా వణికిపోయారు. అక్కడ విశ్వకర్మ అమృతరక్షణకు ఉన్నాడు. అతను రెండు ఘడియలపాటు పక్షీంద్రునితో యుద్ధం చేసి సంహరింపబడ్డాడు. గరుడుడు తన రెక్కలతో దుమ్ము రేపి స్వర్గలోకం అంతా దుమ్ము వ్యాపింపజేశాడు. దానికి దేవతలు అంధకారంలో ఉండిపోయారు. గరుడుడు తన ముక్కుతో దేవతల్ని చీల్చి చెండాడాడు. అప్పుడు వాయువు ఆ దుమ్మును చెదరగొట్టగా వారికి పక్షీంద్రుడు కనిపించాడు. వారందరు తమతమ అస్త్రాలతో అతనిపైకి యుద్ధానికి వచ్చారు.
గరుడుడు ఆకాశం నుంచే వారిని తన రెక్కలతో ఱొమ్ముతో ముక్కుతో వాళ్లను ఎదుర్కొన్నాడు. వారందరిని చెల్లాచెదరు చేశాడు. అతని దెబ్బలకు తట్టుకోలేక వారంతా అన్ని దిక్కులకు పారిపోయారు.
అప్పుడు గరుడుడు అమృతం దగ్గరికి రాగా అక్కడ అమృతం చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు. అగ్నికి తోడుగా వాయువు ఉన్నాడు. అప్పుడు గరుడుడు భీకరమైన రూపుదాల్చి అనేక వందల ముఖాల్ని కల్పించుకొని అనేక నదుల జలాలని పీల్చి అమృతం ఉన్న చోటికి వచ్చి ఆ అగ్నిపై నీటిని వెదజల్లి అగ్నిని చల్లార్చాడు.
తర్వాత అతను తన శరీరాన్ని కుంచింపజేసుకొని కిరణాలతో పాటు అమృతం దగ్గరకు వెళ్లాడు. అమృతం దగ్గర ఒక చక్రం ఉంది. అది అగ్నిలాగా మండుతున్నది. అమృతం హరించే వారిని ఆ చక్రం ఛేదిస్తుంది. గరుత్మంతుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి చక్రం యొక్క ఆకుల మధ్యలో ప్రవేశించాడు. ఆ చక్రం కింద రెండు భయంకరమైన పాములు అమృతరక్షణ కోసం ఉన్నాయి. గరుడుడు వాటి కళ్ళలోకి దుమ్ముకొట్టి ముక్కుతో పొడిచి వేసి వాటిని రెండు ముక్కలు చేశాడు. తర్వాత అతను అమృతపాత్రను తీసుకొని ఆ యంత్రాన్ని బ్రద్దలు కొట్టి ఆకాశంలోకి ఎగిరాడు. అమృతం దొరికినా అతను త్రాగలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతని ప్రవర్తనకు సంతోషించి అతనికి ప్రత్యక్షం అయ్యాడు. అతనితో ‘నీకు వరమివ్వాలని అనుకుంటున్నాను’ అని పలికాడు.
ఆకాశంలో తిరిగే గరుడుడు విష్ణ్ధ్వుజంపై ఉండే వరం కోరుకొన్నాడు. ఇంకా తనకు ముసలితనము మరణము రాకూడదని కోరుకున్నాడు. విష్ణువు ఈ రెండు వరాలు అతనికి అనుగ్రహించాడు. గరుడుడు అమృతంతో వాయువేగంతో వెళ్తూ ఉంటే కోపంతో ఇంద్రుడు అతనిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. గరుడుడు అతన్ని పరిహసిస్తూ ఇలా అన్నాడు. ‘‘ఇంద్రా! నీ వజ్రాయుధం దధీచి వెనె్నముకతో చేయబడింది. కనుక దాన్ని అవమానిస్తే మహర్షిని అవమానించినట్లే. ఆ మహనీయుని పట్ల గౌరవంతో ఒక ఈకను మాత్రం ఇస్తున్నాను. వజ్రాయుధం ననే్నవిధంగా బాధించలేదు’’.
ఈ సంఘటనను చూచి ఆశ్చర్యపడి ఇంద్రుడు ఇలా అన్నాడు. ‘‘పక్షిరాజా! నీ మహత్తరమైన బలం గురించి తెలుసుకున్నాను. నీతో స్నేహం చేయాలని కోరుతున్నాను. దానికి గరుడుడు అంగీకరించాడు. ఇంద్రుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘మిత్రమా! నీకు అమృతం అక్కరలేదు కదా! కనుక అమృతకలశాన్ని తిరిగి ఇచ్చెయ్యవలసింది. దాన్ని నీవు ఎవరికైనా ఇస్తే వారు మమ్మల్ని బాధించవచ్చు’’.
దానికి గరుత్మంతుడు ఇలా అన్నాడు ‘‘దేవేంద్రా! నేనొక కారణం చేత ఈ అమృతాన్ని తీసుకొని వెళ్తున్నాను. దీన్ని ఎవరినీ త్రాగనివ్వను. నేను ఎక్కడ ఉంచుతానో అక్కడినుంచి నీవు తీసుకొని పోవచ్చును’’.
ఇంద్రుడు సంతోషించి అతన్ని వరం కోరుకోమన్నాడు. గరుడుడు కద్రూపుత్రులు చేసిన అవమానాలు గుర్తుంచుకొని ‘‘నాకు సర్పాలు ఆహారం కావాలి’’అని కోరాడు.
ఇంద్రుడు ‘అట్లే అగును’ అని వెళ్లిపోయాడు.
తర్వాత గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి, సర్పాలను పిలిచి వారితో ఇలా అన్నాడు. ‘‘నాగులారా! మీరు కోరినట్లుగా అమృతాన్ని తెచ్చాను. ఈ కలశాన్ని దర్భలపై ఉంచుతున్నాను. మీరు స్నానం చేసి శుచులలై దీన్ని సేవించండి. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి