డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానికి రాజు ఒప్పుకొని ఆమెను రాజమందిరానికి తీసుకువెళ్తానన్నాడు. ఇలా పలికి ఆమెను వివాహం చేసుకొని ఆమెతో నివసించసాగాడు. తర్వాత ‘‘నేను రాజధానికి వెళ్ళి నీ కోసం చతురంగ బలాలను పంపి నిన్ను సగౌరవంగా అక్కడికి తీసుకొని వెళ్తాను’’ అని పలికి వెళ్లిపోయాడు. కాని అతనికి మనస్సులో కణ్వ మహర్షి ఏం చేస్తాడో అన్న భయం ఉంది.
దుష్యంతుడు వెళ్లిన కొంతసేపటికి కణ్వమహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. శకుంతల సిగ్గుపడి అతని దగ్గరకు పోలేదు. మహర్షి అలా సిగ్గుపడుతున్న ఆమెతో ఇలా అన్నాడు. ‘‘తల్లీ! నీవు ఎందుకు సిగ్గుపడుతున్నావు? పూర్వంలా నా దగ్గరకు రావడం లేదు. కారణం చెప్పు’’.
అప్పుడు ఆమె ఇలా అన్నది ‘‘తండ్రీ! ఇలిలాత్ముడుజైన దుష్యంత మహారాజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అతన్ని వరించాను. నీవు అతన్ని శపించకు. అనుగ్రహించు. మిగిలినది నీవు స్వయంగా దివ్యదృష్టితో తెలుసుకో.’’
కణ్వ మహర్షి తన దివ్యదృష్టితో అంతా గ్రహించి శంకుతలతో ఇలా అన్నాడు.
‘‘ఆయుష్మతీ! నాకు చెప్పకుండా నీవు అతనితో ఉండడం ధర్మహాని కాదు. గాంధర్వ వివాహం క్షత్రియులకు ఉచితమైనదేనని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నీకు అతని వల్ల గొప్ప బలసంపన్నుడు అయిన పుత్రుడు జన్మించి ఈ భూమి నంతా పాలిస్తాడు. నీవు ఇప్పుడు దుష్యంతుని దేవేరివి. కనుక పాతివ్రత్యాన్ని పాటించు’’.
దుష్యంతుడు వెళ్లిన కొంతకాలానికి శకుంతల గర్భవతైందని కణ్వునికి తెలిసింది. ఆమె నిరంతరం రాజు పంపిన సైన్యము బ్రాహ్మణులు వచ్చి తనను సగౌరవంగా తీసుకొని వెళ్తారని తలుస్తోంది. ఈ విధంగా రోజులు, నెలలు, మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. శకుంతల సర్వ లక్షణ సంపన్నుడైన పుత్రుని ప్రసవించింది. అప్పుడు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. అశరీరవాణి ఆమె కుమారుడు చక్రవర్తి అవుతాడని పలికింది.
కణ్వమహర్షి బ్రాహ్మణులను సత్కరించాడు. ఆ బాలునికి జాతకర్మాది సంస్కారాలు యధావిధిగా జరిపించాడు. ఆ బాలుడు ఆశ్రమంలోనే పెరగసాగాడు.
అతను ధైర్యంగా సింహాలను, వ్యాఘ్రాలను, అడవి దున్నలను చెట్లకు కట్టివేసేవాడు. సింహాలపై పులులపై ఎక్కి తిరిగేవాడు.
ఒకసారి అతన్ని చంపాలని ఒక దైత్యుడు ఆ ఆశ్రమంలోకి వచ్చాడు. బాలుడు అతడిని తన బాహువులతో బంధించి మర్దించసాగాడు. దైత్యుడు ఆ బంధం విడిపించుకోలేకపోయాడు. అతని శరీర రంధ్రాలనుంచి రక్తం ప్రవహించి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత రాక్షసులు భయంతో ఆశ్రమంలోకి ప్రవేశించడం మానేశారు.
ఆశ్రమవాసులు అతను అన్నింటిని అణచగలడు కనుక సర్వదమనుడు అని పేరు పెట్టారు.
దుష్యంతుడు శకుంతలకిచ్చిన మాట ప్రకారం మనుష్యులని ఆమెకోసం పంపనే లేదు. శకుంతల ఎదురుచూసి, చింతతో కృశించిపోయింది. ఈ విధంగా పనె్నండు సంవత్సరాలు గడిచాయి. బాలుడు సకల శాస్త్రాలు వేదాలు అధ్యయనం చేశాడు. కణ్వమహర్షి ఇక అతనికి వరాజ్యానికి సరియైన సమయమని తలచి శకుంతలతో ఇలా అన్నాడు. ‘‘పుత్రీ! నీవు మనస్సు, వాక్కు, కర్మలచే నీ పతిని సేవించు. నీవు నీ భర్త దగ్గరకు వెళ్లడానికి అనుమతినిస్తున్నాను. అతను వచ్చి స్వయంగా తీసుకొని వెళ్లలేదని చింతించకు. నీ భర్త హితాన్ని కోరి అతని దగ్గరకు వెళ్లి సేవించు. నీ కుమారుని యువరాజుగా చూసి ఆనందించు. నా సంతోషం కోసమైనా నీవు పుత్రునితో కలిసి భర్త దగ్గరకు వెళ్ళు.’’
తరువాత అతను మనుమని దీవించి ఇలా అన్నాడు. ‘‘చంద్రవంశంలో పుట్టిన దుష్యంతుడు ప్రసిద్ధుడు. నీవు తల్లితో కలిసి అతని దగ్గరికి వెళ్ళి యువరాజ పదవి పొందు’’.
ఇలా వారిద్దరితో చెప్పి మహర్షి తన శిష్యులను పిలిచి శకుంతల ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు.
శకుంతల తండ్రికి నమస్కరించి పుత్రునితో సహా భర్త దగ్గరకు బయలుదేరింది. ఆమె అత్తవారింటికి వెళ్తూ ఉంటే పెంచిన ప్రేమ చేత మహర్షి దుఃఖించాడు. చక్కని ముఖం కలిగిన కుమారునితో ఆశ్రమవాసులతో శకుంతల దుష్యంతుని దగ్గరకు వచ్చి తన రాక గురించి తెలిపింది. దుష్యంతునిచే అనుమతింపబడి బాలసూర్యునిలాగా ప్రకాశిస్తున్న కుమారునితో లోపలికి ప్రవేశించింది. మునులందరు రాజుకు ఈ విషయం తెలిపి ఆశ్రమానికి తిరిగి వెళ్లారు.
శకుంతల పుత్రునితో రాజుకు నమస్కరించమని చెప్పి సిగ్గుతో తల వంచుకొని నిల్చుంది. బాలుడు రాజుకు నమస్కరించి వినయంగా నిలుచున్నాడు. రాజు ధర్మబుద్ధితో ఆలోచిస్తూ ఇలా అన్నాడు.
‘‘సుందరీ! నీవు ఏమి కోరి వచ్చావో చెబితే తప్పక చేస్తాను’’.
శకుంతల ఇలా అంది.
‘‘పురుషోత్తమా! అనుగ్రహించు. ఈ బాలుడు నాయందు నీకు జన్మించాడు. కణ్వాశ్రమానికి వచ్చినపుడు నీవు నాకిచ్చిన మాట గుర్తు తెచ్చుకో.’’
రాజు ఆమెను గుర్తించినా, గుర్తించనట్లు ప్రవర్తించి ఇలా అన్నాడు.
‘‘నీవు ఎవరికి సంబంధించినదానివో నాకు తెలియదు. నీతో నాకు గల ధర్మ అర్థ కామ సంబంధం గుర్తుకు రావడం లేదు. ఇక్కడ ఉండాలంటే ఉండు. వెళ్లాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్లు’’.
శకుంతల అతని మాటలకు ఎంతో బాధపడి నిశ్చలంగా ఉండిపోయింది. కొంతసేపటికి కోపంతో, ఎఱ్ఱని కన్నులతో దుఃఖంతో ఇలా అంది.
‘‘మహారాజా! అంతా తెలిసి కూడా నీవు ఏమీ తెలియనట్లు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా విషయంలో సత్యాసత్యాలు నీకు తెలుసు. నీ హృదయం సాక్షిగా మాట్లాడు. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి