డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు కోపంతో శుక్రుడు వృషపర్వుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. ‘‘రాజా! అధర్మం ఆచరిస్తే అది గోవులాగా వెంటనే ఫలితాన్ని ఈయదు. కాని మెల్లగా అధర్మం ఆచరించినవాని మూలాలను నాశనం చేస్తుంది. ఆ చేసిన పాపం తన యందుగాని, పుత్రులయందుగాని మనుమలయందు కాని తప్పక ఫలిస్తుంది.
వృషపర్వా! కచుడు బ్రహ్మచారి. నా శిష్యుడు. నాకు శుశ్రూష చేస్తున్న అతన్ని మళ్లీ మళ్లీ చంపించావు. ఇప్పుడు నీ పుత్రిక నా కూతురును చంపడానికి ప్రయత్నించింది. నీతో నేనిక ఉండలేను. నేనెప్పుడూ అసత్యం ఆడనని నీకు తెలుసు కదా!’’
అప్పుడు వృషపర్వుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘్భర్గవా! నీవు ఎన్నడూ అధర్మాన్ని కానీ అసత్యాన్ని కానీ ఆచరించలేదు. మమ్మల్ని అనుగ్రహించు. నీవు కోపంతో మమ్మల్ని వదలి వెళ్లిపోతే మేమంతా ఏమి కావాలి?మాకు వేరే గతి లేదు. నీవు నన్నువదలి దేవతల దగ్గరకి పోతే నేను అన్నీ వదలిపెట్టి అగ్నిలో ప్రవేశిస్తాను’’.
శుకుడి కోపం ఇంకా చల్లారలేదు. కోపంతో ఇలా అన్నాడు. ‘‘మీరంతా సముద్రంలో దూకుతారో లేక నానా దిక్కులకు పరుగెత్తుతారో నాకు తెలియదు. కానీ నా కూతురుకు జరిగిన అవమానాన్ని నేను సహించలేను. నా జీవితం నా కుమార్తె సంతోషంపై ఆధారపడి ఉంది. కనుక మీరు దేవయానిని ప్రసన్నురాలిని చేసుకోండి. మీ యోగక్షేమాలు నా మీద ఆధారపడి ఉన్నాయి’’.
అప్పుడు వృషపర్వుడు ఇలా అన్నాడు. ‘‘ఎంత సంపద ఉన్నప్పటికీ నాకు నీవే భగవంతుడివి. ఈశ్వరుడివి’’
శుక్రుడు ఇలా అన్నాడు. ‘‘దైత్యేంద్రా! నీకు ఉన్న సంపద కంతటికి నేనే ఈశ్వరుడినైతే దేవయాని ప్రసన్నురాలు కావాలి’’.
శుక్రుని మాటలకు వృషపర్వుడు అంగీకరించి అతనితోపాటు దేవయాని దగ్గరకు వెళ్లాడు. శుక్రుడు వృషపర్వుని మాటలు తన పుత్రికతో చెప్పాడు.
దేవయాని ‘‘తండ్రీ భార్గవా! రాజు యొక్క ధనానికి నీవు ఈశ్వరుడవు అయితే రాజే దాని గురించి నాకు స్వయంగా చెప్పాలి’’.
అప్పుడు వృషపర్వుడు ఆమెతో ఇలా అన్నాడు. ‘‘తల్లీ! నీవు మిక్కిలి కోపంగా ఉన్నావు. నీవు ఏది కోరితే అది నేను తీరుస్తాను. అది ఎంత దుర్లభమైనా సరే’’.
దేవయాని ఇలా అడిగింది. ‘‘కన్యా సహస్రంతో కూడిన శర్మిష్ఠను నేను దాసిగా కోరుకుంటున్నాను. నా తండ్రి నన్ను ఇచ్చిన చోటికి ఆమె కూడా రావాలి’’.
వృషపర్వుడు వెంటనే ధాత్రిని పిలిచి ‘‘వెంటనే వెళ్ళి శర్మిష్ఠను తీసుకొనిరా. దేవయాని ఏది కోరినా దాన్ని చెయ్యాలి (వంశాన్ని రక్షించడం కోసం వ్యక్తిని త్యాగం చేయాలి).’’
ధాత్రి శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇలా చెప్పింది. ‘‘శర్మిష్ఠా! లే! నీ జ్ఞాతులకు సుఖాన్ని కలిగించు. దేవయాని మాటలతో కోపగించుకున్న శుక్రుడు రాక్షసులను వదలిపెట్టి వెళ్లిపోతున్నాడు. ఆ దేవయాని ఏది కోరితే అది నీవు చేయాలి’’.
అప్పుడు శర్మిష్ఠ చింతించి ఇలా అన్నది ‘‘పద! ఆ దేవయాని దేన్ని కోరితే దాన్ని ఇప్పుడే చేస్తాను. నా పొరపాటు వల్ల, నా కోసం శుక్రుడు రాక్షసులను విడిచి పెట్టనక్కర్లేదు.’’
తర్వాత వేయిమంది కన్యలతో శర్మిష్ఠ వనానికి వెళ్లి దేవయానితో ఇలా చెప్పింది. ‘‘వేయిమంది దాసీలు గల నేను నేటి నుంచి నీ దాసీని. నీ తండ్రి నిన్ను ఇచ్చిన చోటికి నీతో కూడా వస్తాను’’.
అప్పుడు దేవయాని ఇలా అన్నది. ‘‘నేను స్తుతించేవానికి, యాచించేవానికి కూతురును. నీవు స్తుతింపబడే వాని కుమార్తెవు. నాకు నీవు దాసీవి ఎలా అగుదువు?
శర్మిష్ఠా! ఆర్తులైన నా జ్ఞాతులకు సుఖాన్ని కలిగించాలి. అందుకని నీ దాసీగా వచ్చాను. నీవు ఎక్కడికి వెళ్లితే అక్కడికి నిన్ను అనుసరిస్తాను’’.
శర్మిష్ఠ చెప్పిన మాటలతో దేవయాని తృప్తిచెంది తిరిగి తండ్రితో వృషపర్వుని నగరంలోకి ప్రవేశించింది.
కొంతకాలం తర్వాత దేవయాని చెలులతో క్రీడార్థం వనానికి వెళ్లింది. అక్కడ అంతా స్వేచ్ఛగా విహరించి, భక్ష్యాలను తింటూ తేనె త్రాగుతున్నారు. ఆ సమయంలో అక్కడికి యయాతి వేటకోసం వచ్చాడు. వారందరినీ చూశాడు. ఆభరణాలు అలంకరించుకొని ఆసనం మీద కూర్చున్న దేవయానిని, ఆమె పాదాలు వత్తుతున్న శర్మిష్ఠను చూచాడు. యయాతి వారితో ఇలా ప్రశ్నించాడు. ‘‘ఇన్ని వేలమంది కన్యలతో కలిసి మీరిద్దరు కన్యలు ఉన్నారు. మీరెవరు? మీ వంశాలేమిటి?’’
దేవయాని ‘‘ఓ రాజా! నేను చెప్తాను. ఆలకించు. నేను శుక్రాచార్యుని పుత్రికను. నా పేరు దేవయాని. ఈమె రాక్షసరాజు వృషపర్వుని కూతురు. నాకు సఖి - దాసి. నేనెక్కడికి వెళితే అక్కడకు వస్తుంది.’’
యయాతి ‘‘్భద్రా! ఈ రాక్షసరాజు కూతురు మరి నీకు దాసి ఎలాగైంది?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు.
దేవయాని ‘‘ఓ నరశ్రేష్ఠా! ఈ లోకంలో అన్నీ విధిననుసరించి జరుగుతాయి. కనుక ఇలాంటి వాటికి ఆశ్చర్యపడరాదు. ప్రశ్నించరాదు. నీ రూపం రాజువలె, మాట బ్రాహ్మణునివలె ఉంది. నీవు ఎవరవు? ఏ వంశంవాడివి?’’
యయాతి ‘‘నా పేరు యయాతి. రాజును. వేదాధ్యయనం చేశాను. నేను మృగాన్ని వేటాడుతూ ఇక్కడికి వచ్చాను. నాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వు’’.
దేవయాని ‘‘రెండు వేలమంది దాసీలతో ఉన్న దాసి అయిన శర్మిష్ఠతో పాటు నీకు స్వాధీనము అగుచున్నాను. నన్ను భార్యగా స్వీకరించు.’’
యయాతి ‘‘్భద్రా! నీకు కల్యాణమగుగాక! నేను నీకు పతిని అగుటకు అర్హుడను కాను. నీ తండ్రి బ్రాహ్మణుడు. క్షత్రియులకు అతనితో వివాహ సంబంధానికి అర్హత లేదు’’.
దేవయాని ‘‘నరశ్రేష్ఠా! పాణిగ్రహణం స్తల్రకు చాలా ముఖ్యమైనది. ఇంతకు మునుపు ఏ పురుషుడు నన్ను పాణిగ్రహణం చెయ్యలేదు. పూర్వం నీవే నా పాణిని గ్రహించావు. నేను నిన్ను వరిస్తున్నాను. ఋషిపుత్రుడవో, స్వయంగా ఋషివో అయిన నీవు నా చేతిని పట్టుకొన్న తర్వాత ఇంకొకరు నన్ను ఎలా తాకగలరు?’’
యయాతి ‘‘విప్రుడు కోపిస్తే ఆ కోపం ఇతరులను దహిస్తుంది. అది కోపించిన సర్పం కంటే అగ్నికంటే ప్రమాదమైనది. సర్పం కోపిస్తే ఒక్కడిని చంపుతుంది. కాని విప్రుడుకోపిస్తే అది రాజ్యాలనే అగ్నిలాగ దహిస్తుంది. కనుక కల్యాణీ! నీ తండ్రి అనుమతి లేకుండా నిన్ను వివాహమాడలేను’’
దేవయాని అతన్ని కొంచెంసేపు అక్కడ వేచి ఉండమంది. తన తండ్రికి వార్త పంపింది. భార్గవుడు వెంటనే వచ్చి రాజును చూశాడు. రాజు అతనికి వినయంతో నమస్కరించాడు. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి