డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -- 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంతనోపాఖ్యానం
==========

రాజు యదువు తన ముసలితనాన్ని స్వీకరించలేదు కనుక అతనికి రాజ్యార్హత లేదని చెప్పాడు.
తర్వాత అతడు తుర్వసుని ఇలాగే అడిగాడు. తుర్వసుడు కూడా ఒప్పుకోలేదు. అతను కూడా రాజ్యార్హత పొందలేదు.
ఇదే విధంగా శర్మిష్ఠ కుమారుడైన ద్రుహ్యుని అడిగాడు. ద్రుహ్యవు కూడా ఇష్టపడలేదు.
చివరకు పూరువును రాజు అర్థించాడు. ‘‘పూరూ! నా ముసలితనాన్ని స్వీకరించు’’. పూరువు అతని మాటను అంగీకరించి తండ్రి ముసలితనాన్ని స్వీకరించాడు.
అప్పుడు రాజు అతనికి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యయాతి యువకుడు, పూరువు ముసలివాడు అయ్యారు.
యయాతి అన్ని సుఖాలను అనుభవించాడు. దేవతలను యజ్ఞాలతోను, పితృదేవతలను శ్రాద్ధాలతోను, బ్రాహ్మణులను కోరినవి ఇచ్చి, వైశయులను రోణతో, శూద్రులను దయతో చూసి అందరినీ సంతృప్తి పరచాడు. అలా వేయి సంవత్సరాలు గడిచిన పిదప పూరువు వనం అతనికి తిరిగి ఇచ్చివేసి అతన్ని రాజున చేసి వానప్రస్థానికి వెళ్లాలని తలచాడు.
అప్పుడు బ్రాహ్మణప్రముఖులు వచ్చి పెద్దవాడైన యదువును విడిచి చిన్నవాడిని రాజుగా ఎలా చేస్తావు? అని ప్రశ్నించారు.
యయాతి ఇలా అన్నాడు ‘‘జ్యేష్ఠకుమారుడైన యదువు నా మాటను వినలేదు. నా ఆజ్ఞను పాటించలేదు. తండ్రి మాట విననివాడు కొడుకే కాడు. తల్లిదండ్రుల మాటను విని ఆచరించేవాడు వారికి హితుడు, అనుకూలుడు. అలా ప్రవర్తించేవాడే నిజమైన పుత్రుడు.
మిగిలిన పుత్రులూ నా మాటను ఉల్లంఘించారు. పూరుడు ఒక్కడే నా మాటను ఆచరించాడు. గౌరవించాడు. అతడు చిన్నవాడు అయినా నా ముసలితనాన్ని స్వీకరించాడు. నా మాట విన్నవాడే రాజ్యానికి అర్హుడని శుక్రుడే వరమిచ్చాడు’’ ఇలా పౌరులతో పలికి యయాతి పూరునికి రాజ్యాభిషేకం చేసి తాను వానప్రస్థం స్వీకరించాడు.
తర్వాత యదువుకు యాదవులు,
తుర్వసువుకు యవనులు,
ద్రుహ్యునికి భోజులు,
అనువుకు మ్లేచ్ఛజాతివారు జన్మించారు.
పూరుని వల్ల పౌరవ వంశం ఏర్పడింది. ఆ వంశంలోనే కౌరవులు, పాండవులు జన్మించారు.
యయాతి వానప్రస్థంలో కఠోర నియమాలు పాటిస్తూ తపస్సు చేసి స్వర్గం చేరుకున్నాడు.
( యయాతి చరితము సమాప్తం )

శంతనుని కథ
పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడనే రాజు ఉండేవారు. అతడు సత్యం, ధర్మం తప్పక రాజ్యపాలన చేశాడు. వేయి అశ్వమేద యాగాలను చేశాడు. అందువల్ల అతనికి స్వర్గప్రాప్తి కలిగింది.
ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని సేవించడానికి బ్రహ్మలోకం దగ్గరకు వెళ్లారు. వారితో మహాభిషుడు కూడా ఉన్నాడు. అదే సమయానికి నదీమతల్లి అయిన గంగ కూడా బ్రహ్మను సేవించడానికి అక్కడకు వచ్చింది.
అప్పుడు గాలి వీచడం వల్ల గంగ వస్త్రం తొలగింది. దేవతలందరూ వెంటనే తలలు వంచుకున్నారు. కాని మహాభిషుడు ఏమాత్రం జంకులేకుండా ఆమెవైపు చూశాడు. ఇది చూచి బ్రహ్మకు కోపం వచ్చి అతన్ని ఇలా శపించాడు. ‘‘దుర్బుద్ధీ! నీవు మానవ లోకంలో మరల పుట్టి మళ్లా పుణ్యకార్యాలను చేసి ఇక్కడకు వస్తావు. నీ మనస్సుకు ఆనందం కలిగించిన ఈ గంగయే మానవ లోకంలో నీకు భార్య అవుతుంది. ఎప్పుడు నీకు ఈ గంగ మీద ఆగ్రహం కులుగుతుందో అప్పుడు ఆమెకు శాపవిముక్తి కలుగును గాక!’’
అప్పుడు మహాభిషుడు ఆలోచించి తపస్సంపన్నుడైన ప్రతీప మహారాజును తనకు తండ్రిగా కోరుకున్నాడు. గంగ విచారంతో ఉన్న మహాభిషుని చూస్తూ అక్కడి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో గంగ అష్టవసువులను చూసింది. వారు చాలా దిగులుతో ఉన్నారు. గంగ వారి దిగులుకు కారణమడిగింది.
అప్పుడు వసువులు గంగానదితో ఇలా అన్నారు. ‘‘తల్లీ! మేము చేసిన చిన్న తప్పుకు వసిష్ఠ మహర్షి కోపించి మమ్మల్నందరినీ మానవులుగా జన్మించాలని శపించాడు. కనుక నీవు మాపై దయతో మానవకాంతగా జన్మించి మాకు జన్మనివ్వాలి. మేము సాధారణ మానవకాంతలకు జన్మించలేము.’’
వారి ప్రార్థనను అంగీకరించి సరేనంది. గంగ వారిని ఇలా అడిగింది ‘‘మానవులలో మీకు తండ్రి కాగల అర్హుడెవ్వరు?’’
అప్పుడు వసువులు ఇలా అన్నారు ‘‘ప్రతీప మహారాజు పుత్రుడు అయిన శంతనుడు మాకు తండ్రి కాదగినవాడు.’’ అప్పుడు గంగ ఇలా అంది ‘‘ఓ పుణ్యాత్ములారా! నా ఉద్దేశం కూడా అదే. ఆ మహారాజు కోర్కెను తీర్చి మీ కోరికను నెరవేరుస్తాను’’.
వసువులింకా ఇలా పలికారు. ‘‘ఓ త్రిలోకగామినీ! మేము పుట్టగానే మమ్ములను నీటిలో పడవేయాలి. దానితో మాకు నిష్కృతి లభిస్తుంది. దానికి గంగ ‘‘అలాగే చేస్తాను కాని రాజుకు ఒక్క పుత్రుడైనా మిగలాలి కదా!’’ అన్నది.
అప్పుడు వసువులు ఇలా అన్నారు ‘‘మేమంతా మా తేజస్సులోని ఎనిమిదవ భాగాన్ని ధారపోస్తాము.

(ఇంకావుంది)

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి