డైలీ సీరియల్

అన్వేషణ -13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుమూర్తిగారూ..’ అని బజ్జీలు తిన్నాక పిలిచాడు అనిరుధ్.
తనను అంత గౌరవంగా పిలవడంతో ఆశ్చర్యంగా చూశాడు గురుమూర్తి. అనిరుధ్‌ని అప్పుడప్పుడు చూసిన గుర్తేగానీ అంతగా తెలీదతడికి.
‘దాదాపు ముప్ఫైఏళ్ళ క్రిందట ఇక్కడ ఓ పిచ్చి అమ్మాయిపై రేప్.. అంటే అత్యాచారం జరిగింది గుర్తుందిగా..’ అన్నాడు అనిరుధ్.
కొద్దిక్షణాలు అనిరుధ్‌ని నిశితంగా చూసి- ‘ఇప్పుడా సంగతెందుకు?’ అనేసి సామాను సర్దడంలో భార్యకి సహకరించబోయాడు గురుమూర్తి.
‘ఇప్పుడు కావాల్సి వచ్చింది.. మీకు తెలిసి ఉన్నంతవరకు ఆ వివరాలు చెప్పగలరా..’ అన్నాడు అనిరుధ్.
‘ఎప్పటిమాట.. పాతికేళ్ల పైమాట.. అయినా ఆ సంగతి నీకెందుకు?..’ చేస్తూన్న పని ఆపి అడిగాడు గురుమూర్తి.
‘నేను ఆ పిచ్చి అమ్మాయి కొడుకుని గనక!’ ఏ మాత్రం తొణక్కుండా నిర్మొహమాటంగా చెప్పాడు అనిరుధ్.
ఆ మాటకి ఒక్కసారిగా బిగుసుకుపోయాడు గురుమూర్తి. నోరెల్లబెట్టాడు. నోట్లో వున్న బజ్జీ జారి క్రిందపడింది. నోట మాట రాలేదు. అనిరుధ్‌ని తేరిపార చూసింది గురుమూర్తి భార్య.
‘అవును బాబాయ్! మాణిక్యం అమ్మమ్మ మనవడు అనిరుధ్.. ఆవిడ కూతురు పిచ్చి పద్మ కొడుకు..’ కొండబాబు వివరంగా చెప్పాడు గురుమూర్తికి.
‘నువెళ్లు... తర్వాతొత్తా..’ అని భార్యతో చెప్పాడు గురుమూర్తి. సామాను సర్దిన తోపుడు బండి తోసుకుంటూ ఆమె వెళ్లిపోయింది.
ఆ ప్రక్కనే వున్న డ్రెయినేజీ తూము మీద కూర్చున్నాడు గురుమూర్తి. ‘రా కూర్చోండి’ అన్నట్లు ఇద్దరికీ ప్రక్కన చూపించాడు గురుమూర్తి. అతడికి అటూ ఇటూ అనిరుధ్, కొండబాబు కూర్చున్నారు.
‘ఏం జేత్తన్నావ్?’ అనిరుధ్‌ని అడిగాడు గురుమూర్తి.
‘హైదరాబాద్‌లో ఉద్యోగం..’
‘బాగా సంపాదిత్తన్నావన్నమాట?!..’
‘అవును బాబాయ్.. నెలకి ఎనభై, తొంభై వేలు జీతం..’ కొండబాబు చెప్పాడు.
‘పాతికేళ్ల పైబడ్డనాటి మాట.. నేనూ అప్పుడు రిక్షా తొక్కేవోడిని.. పాపం పిచ్చి పద్మ అమాయకురాలు.. రోడ్లమ్మట గంతులేస్తూ తిరిగేది.. ఆళ్లమ్మొచ్చి ఇంటికి లాక్కెళ్తా ఉండేది.. ఆమె కళ్లు గప్పేసి వొచ్చేసేది. వయసొచ్చిన పిల్ల.. పిచ్చిది.. రిక్షావోళ్లతోనూ, ఆటోవోళ్లతోనూ కబుర్లు సెప్పేది. ఆళ్లు దీనితో పరాసికాలాడేవోరు. దగుల్భాజీ యెదవలు.. దాన్ని తాకరాని చోట తాకి గుల తీర్చుకునేవోళ్లు. పాపం పిచ్చిది. దాన్నొదిలెయ్యండిరా అని నేనంటే, నన్ను ఆడంగోడా పోరా.. పో.. అని గేలి సేసేటోళ్లు.. వయస్సులోవుండాది. పిల్ల పెటపెటలాడిపోతుండాది.. ఆళ్లకి ఉచితానుచితాల్లేవ్.. ఓ రోజు వాన కురుత్తున్నాది.. అప్పుడు పిచ్చి పద్మ వాన్లో గెంతులేతుంటే తడుత్తావ్ అంటూ దాన్ని ఆటోలోకి లాగారు ఆటోవాడు.. ప్రక్కనున్న మరో ఆటోవాడూను.. ఆళ్లిద్దరికీ మరో ఇద్దరు రిక్షావోళ్లు తోడయ్యారు. పది నిమిషాలకు ఆటోలో దాన్ని తీసుకుపోయారు. ఆ తర్వాత ఏం జరిగుంటాదో సెప్పక్కర్లేదు.. గంటా రెండు గంటలకి తీసుకొచ్చి దాన్నొదిలారు. పిచ్చిది గెంతులేస్తూ యెల్లిపోయింది. అప్పుడు వాన తగ్గి తుంపర పడుతోంది..’ గురుమూర్తి చెప్పడం ఆపాడు.
అనిరుధ్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. వంట్లో రక్తం సలసల మరుగుతోంది. అతడి ప్రక్కకొచ్చి కొండబాబు కూర్చుని ఓదార్పుగా భుజంమీద చెయ్యివేశాడు.
‘వాళ్లెవరు?’ అనిరుధ్ అడిగాడు. గురుమూర్తి ప్రశ్నార్థకంగా చూశాడు అతడివైపు.
‘అదే ఆటోలో తీసికెళ్లినవాళ్లు..?’ అనిరుధ్ అడిగిన తీరుకి గురుమూర్తి కంగారు పడ్డాడు. కాస్త భయపడ్డాడు కూడా.
‘నారాయణ, కనకారావు, థామస్.. రహీం.. వీళ్లలో థామస్‌గాడు పరమ నీచుడు. వాడికి అమ్మా, అక్కా, పెళ్లాం తేడా తెలీదు.. కనకారావుగాడు యెదవన్నర యెదవ. రహీం, థామస్ ఆటో తోలేవోళ్లు..’
‘ఇప్పుడాళ్లు పెద్దోళ్లయిపోయారు.. రహీంగాడు కార్పొరేటర్... నారాయణగాడు భూములు అమ్మడం, కొనడం యాపారం.. కనకారావవెక్కడున్నడో తెలీదు.. థామస్‌గాడు ఏంజేత్తన్నాడో కూడా తెలీదు.. యిశాకపట్నంలో ఉన్నాడని చాన్నాళ్ల కిందటెవరో సెప్పేరు..
చెప్పడం అయిందన్నట్లు గురుమూర్తి లేచాడు. అనిరుధ్ కూడా లేచి గురుమూర్తి జేబులో ఐదొందల నోటు పెట్టి అతడికి నమస్కరించి బయల్దేరాడు.
***
‘‘వాళ్ళెవరో తెలియకపోయినా వాళ్ల పేర్లు తెలిశాయి. కానీ, ఆ నలుగురిలో నేను ఎవరి రక్తం పంచుకు పుట్టానో ఇపుడు తేల్చుకోవాల్సి వుంది. అప్పుడు నేను హిందువునవుతానో, ముస్లింనవుతానో, క్రిస్టియనవుతానో.. నా కర్మ ఎలా రాసి ఉందో చూడాలి..’’ గురుమూర్తి చెప్పిన విషయాలన్నీ హిమజకి వివరించిన తర్వాత నిర్వేదంగా అన్నాడా అనిరుధ్.
‘‘ఏయ్ అనిర్! అంతగా డీలాపడకు.. నువ్వు హిందూ అయినా, ముస్లిం అనా, క్రిస్టియన్ అయినా నాకనవసరం. నువ్వు నావాడివి అనిర్ నేను నీ దాన్ని. నీ కులం ఏమిటో, నీ గోత్రం ఏమిటో తెలుసుకుని నేను నిన్ను ప్రేమించలేదు. నీకు దగ్గర కాలేదు. నీ వ్యక్తిత్వానికి దగ్గరయ్యాను. నీ బిహేవియర్‌కి దగ్గరయ్యాను. నువ్వు అంతగా నిర్వేదం చెందకు’’ అంటూ అనునయించిందామె. అతడు చిన్నగా తలూపాడు.
‘‘అలా పుట్టిన నేను ఈ స్థాయికి ఎదగడం వెనకాల కొందరి మహానుభావుల ఆపన్నహస్తం వుంది హిమా!... టెన్త్‌క్లాస్ వరకూ అమ్మమ్మ చాలా కష్టపడింది. ఆ తర్వాత సీతారామారావుగారు అని ఓ పెద్దాయన ఇంటర్‌లో నాకు చాలా సహాయం చేశారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్. గవర్నమెంటు కాలేజీలోనే చదువుకున్నాను. చదువు తప్ప నాకప్పుడు వేరే ధ్యాస ఉండేది కాదు..
ఏదో పట్టుదల నన్నావహించింది. ఇంటర్ ఫీజులు, పుస్తకాలు అన్నీ ఆయనే నాకు సమకూర్చారు. ఎంసెట్‌లో నాకు ర్యాంకు రావడంతో సీతారామారావుగారే తన స్నేహితుల్ని ఐదారుగుర్ని వాకబు చేసి నాకు ఇంజనీరింగ్ ఫీజులు కట్టేందుకు చాలా సహాయం చేశారు. ఆయన పిల్లలు యుఎస్‌లో ఉంటున్నారు. నా విషయం తెలియగానే వాళ్లూ నా చదువుకి డబ్బు పంపారు. నేను ఇంజనీరింగ్ పూర్తయ్యక, ఉద్యోగంలో చేరాక నా మొట్టమొదటి నెల జీతంతో సీతారామారవు దంపతులకు బట్టలు పెట్టి కాళ్లకి మొక్కాను.. ఆనాడు ఆయన కళ్లల్లోనీళ్లు తిరిగాయి.. ‘ఒక ప్రయోజకుడిని నేను తయారుచేశాను నాయనా..’ అని నన్ను మెచ్చుకున్నారు..’’ ఏదో తాదాత్మయంలో ఉన్నట్లు చెప్పాడు అనిరుధ్.
‘‘అలాంటి మహానుభావులు ఉన్నారు కనుకనే ఇంకా ధర్మం ఈ మాత్రమేనా మిగిలి ఉంది అనిర్,!..’’

- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842‘