డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుక నా కుమారుడు అయన ఔర్యుడే మిమ్మల్ని అనుగ్రహించవలసినవాడు. మీరంతా తలలు దించుకుని అతని ముందు నిలబడితే అతను మిమ్మల్ని క్షమిస్తాడు.’’
అప్పుడు రాజులంతా ఔర్యుని ముందు శిరస్సులు వంచి తమని క్షమించి అనుగ్రహించమని ప్రార్థించారు. అప్పుడు అతనికి వారిపై కోపం పోయ ఔర్యుడు వారిని అనుగ్రహించాడు. ఆ విప్రఋషి తల్లి తొడలు చీల్చుకొని పుట్టాడు. కనుక అతనికి ఔర్యుడనే పేరు వచ్చింది. తర్వాత రాజులంతా తమ తమ చూపును పొంది వెళ్లిపోయారు. తర్వాత ఔర్యముని సర్వలోకాలకు పరాభవం చేసి భృగువంశ ఘనతను చాటాలని తలచాడు. భృగువంశస్థులకు జరిగిన హానికి ప్రతిక్రియ చేయాలనుకొన్నాడు. అందుకోసం అతను ఘోర తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సుతో అతను ఎదిగి, తేజస్వియై తన పితరులకు ఆనందం కలిగించాలని తీవ్రంగా తపిస్తూ అతను దేవతలతో, అసురులతో, మానవులతో ఉన్న లోకాలను తపింప చేశాడు. అతని పితరులు అతన్ని తమ వంశవర్థనునిగా గుర్తించి పితృలోకం నుండి వచ్చి అతనితో ఇలా అన్నారు. ‘‘కుమారా! నీ తీవ్ర తపస్సుయొక్క ప్రభావాన్ని చూశాం. ఈ లోకాలని అనుగ్రహించు, క్రోధాన్ని నియంత్రించు. క్షత్రియులంతా మమ్ములను హింసించి వధించినప్పుడు, భృగువంశ బ్రాహ్మణులమైన మేము అసమర్థులమై ఆ వంశవధను చూస్తూ ఊరుకున్నామని భావించరాదు. ఆ ఆయువు అయపోతుంది. దానితో మేము భేదానికి గురి అయ్యాం. ఆ స్థితిలో మేమే స్వయంగా క్షత్రియులు మమ్ముల్ను సంహరించడానికి అంగీకరించాం. శతృత్వాన్ని పెంచటానికి మేమే ఒక భృగువింట్లో ధనాన్ని దాచి పెట్టాం మాపై క్షత్రియులకు కోపం కలగాలన్నదే మా కోరిక. లేకపోతే స్వర్గానికి పోవాలనుకున్న మాకు ధనంతో పనేమిటి? సాక్షాత్తు కుబేరుడే స్వయంగా మాకు ధనరాసులు తెచ్చినాడు. మమ్మల్ని ఏ విధంగాను మృత్యువు కబళించనందువల్ల మేమంగా ఈ విధంగా చేశాం. ఆత్మహత్య మహాపాపం కదా? అందుకని ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇప్పుడు నీవు చేస్తున్న పని మాకు ప్రియమైనది కాదు. సర్వలోకాలను పరాభవించడం ఘోర పాపం. ఆ పాపం నీలాంటి తపస్సంపన్నుడు చేయరాదు. కనుక నీమనస్సు ఈ కార్యం నుండి మరల్చుకో. క్షత్రియులను చంపవద్దు. లోకాలను సంహరించకు తపస్సువలన కలిగిన నీ తేజస్సు దూరం చేసే ఆ క్రోధాన్ని విడిచిపెట్టు’’.
వారి మాటలు విని ఔర్వుడు వారితో ఇలా అన్నాడు. ‘‘తండ్రులారా! కోపంలో నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు. కోపాన్ని సఫలం చేయకపోతే అది ననే్న దహిస్తుంది. నేను తల్లి తొడలో ఉన్నప్పుడే ఈ క్షత్రియులు భార్గవులను చంపుతూ ఉంటే వారు చేసిన ఆర్తనాదాలను విన్నాను. ఈ అధములైన క్షత్రియులు గర్భస్థ శిశువులని కూడా చూడక భృగు వంశస్థులని చంపడంతో నాకు ఆగ్రహం కలిగింది. నా తల్లులు పూర్ణ గర్భిణులు. నా పితరులు భయంతో పరుగులెత్తారు. ఆ భృగుపత్నులు క్షత్రియులు శరణు కోరినా వారికి రక్షణ దొరకలేదు. అప్పుడు నా తల్లి నన్ను తొడలో న్ను దాచి కాపాడింది. పాప కర్మల్ని నిరోధించగలవాడు ఉంటే ఈ లోకంలో పాపకృత్యాల్ని ఎవరూ చేయరు. ఇతరులు చేస్తున్నది పాపమని తెలిసీ దాని శక్తి ఆపకుంటే అతనికి పాపకర్మ ఫలం అంటుతుంది.
రక్షించే సమర్ధులైన క్షత్రియులు నా పితరులను రక్షించక హింసించారు. అందుకని నాకు వారిపై ఆగ్రహం కలిగింది. వారిని దండించగల శక్తి నాకున్నది. నేను శిక్షించే సమర్ధుడనై కూడా ఊరుకుంటే లోకులకు పాప భయం పోతుంది. నాకు వీరి పాపాల వలన తీవ్ర భయం కలుగుతుంది. ఆ క్రోధం వలన నాలో అగ్ని జ్వాలలు పుట్టి ఈ లోకాలను మ్రింగుతాయి. నేను దానిని నిరోధిస్తే ఆ తేజస్సు ననే్న దహిస్తుంది. కనుక లోకాలకూ నాకూ మేలు కలిగేటట్లు మీరు నన్ను ఆదేశించండి.’’
అప్పుడు ఆ పితరులు ఇలా అన్నారు. - ‘‘కోపం వలన నీలోపుట్టిన అగ్ని లోకాలనే దహిస్తుంది. కనుక దాన్ని నీటిలో విడిచిపెట్టు. అప్పుడు నీకు మేలు కలుగును. లోకాలన్నీ నీటిలోనే ప్రతిష్టించబడి ఉన్నాయ. సమస్త రసాలు జలమయమే. ఈ జగత్తు అంతా జలమయమే. నీవు తపస్సంపన్నుడవు. ద్విజుల్లో శ్రేష్ఠుడవు. నీవు నీ క్రోధాన్ని నీటిలో నిలుపు. అప్పుడు ఆ క్రోధాగ్ని నీటిని దహిస్తుంది. లోకాలు జలమయం కనుక నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. లోకాలు నష్టపోవు.’’
అప్పుడు ఔర్వుడు తన క్రోధాగ్నిని సముద్రంలో వదిలిపెట్టాడు. ఆ అగ్ని పెద్దదిగా ఉన్న అశ్వముఖాకృతితో సాగర జలాలను త్రాగుతూ ఉంటుంది. ఆ బడబాగ్ని తన నోటి నుండి ఆ అగ్నిని కక్కుతూ సాగర జలాలలను త్రాగుతూ ఉంటుంది. ఇది ఔర్యుని చరిత్ర. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి