Others

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. దైవము తల్లిదండ్రి తగు దాత గురుండు సఖుండు నినె్నకా
భావన సేయుచ ఉన్నతరిఁ బాపము లెల్ల మనోవికార దు
ర్నావితుఁ జేయుచున్నవి కృపామతివై నను గావుమీ జగ
త్పావన మూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: దశరథ రామా! లోకాన్ని పవిత్రం చేసే స్వరూపం గలిగిన రామా! నేను దైవంగాను, తల్లిదండ్రులుగాను, గురువుగాను, స్నేహితుడుగాను భావిస్తూ ఉండగా దోషాలు, పాపాలు నా మనస్సులో మారుపాటు గావించి సంచలనం గలిగించి దుష్ట్భావాలు కలిగించి నన్ను చెరుపుచున్నవి. లోకంలోని పాపాలను పోగొట్టె స్వరూపం గలవాడవు. కనుక నా పాపాలను నిర్మూలించి నన్ను కాపాడుమా!
వ్యాఖ్యానం: గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవం, దాత అనేవి సప్తప్రాకారాలు గల రక్షకము. ఇదే ఏడుగడ. లోకాన్ని సృష్టిచేసి దానిని ఎల్లప్పుడు రక్షచేసేవాడు కాబట్టి భగవానుడు దైవమైనాడు. లోకాన్ని మాతృదేవి వలె కాపాడేవాడు కాబట్టి తల్లియైనాడు. పితృస్థానంలో ఉండి యోగక్షేమాలు , బాగోగులు చూసేవాడు కనుక తండ్రియైనాడు. అవసరమైనప్పుడు తగిన వస్తువులను తగిన సమయంలో సమకూరుస్తాడు. కనుక దాతయైనాడు. విద్యాబుద్ధులు నేర్పించి, విచక్షణాజ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గురువైనాడు. ఆపద సమయంలో తగిన సాయాన్ని అందిస్తాడు కనుక సఖుడైనాడు. ఇన్నివిధాల భగవంతుని భావించుకున్నపుడే భక్తునికి ఆయన మీద గల భక్తి వ్యక్తమవుతుంది.