డైలీ సీరియల్

అన్వేషణ -20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేనింటికెళ్లి తింటా నానమ్మా..’’ అన్నది సాయిరమ్య.
‘‘్ఫర్వాలేదు... చాన్నళ్లయ్యింది నానమ్మ వంట తిని...’’అంటూ ముగ్గురికీ కంచాల్లోపెట్టి తెచ్చి ఇచ్చింది అమ్మమ్మ. అలాంటప్పుడు అనిరుధ్ ఆమెకు సాయం చేద్దామన్నా ఒప్పుకోదు. కూర్చోరా పిచ్చి సన్నాసీ... అంటుంది.
‘‘ఏదైనా కానీరా.. అమ్మమ్మ కందిపచ్చడి సూపర్బ్‌రా.. పేటెంట్ రైట్ అమ్మమ్మదే..’’ ముద్ద నోట్లో పెట్టుకుని తిన్నాక అన్నాడు కొండబాబు.
‘‘పచ్చడిలో నంజుకోడానికి..’’ అని అనిరుధ్ అనబోతుంటే మూడు చిన్న గినె్నల్లో వంకాయ పెరుగు పచ్చడి తెచ్చి కంచాల్లో ఓ వారగా పెట్టింది అమ్మమ్మ.
‘‘‘అమ్మమ్మకి మనం చెప్పాల్రా.. నోట్లో మాట పూర్తి కాకుండానే వచ్చేసింది నంజుకోవడానికి..’’ కొండబాబు అన్నాడు.
‘‘నానమ్మా.. మమీ పంపిన కూర..’’ అంటూ నెమ్మదిగా గుర్తుచేసింది సాయిరమ్య.
‘‘వస్తున్నానే..’’ అంటూ కోడలు పంపిన కూర ముగ్గురికీ వేసింది.
‘‘అత్తమ్మ కూర బాగుందిరా..’’ కాస్సేపయ్యాక అన్నాడు కొండబాబు ఏమీ మాట్లాడకపోతే బాగుండదని. అవునని తలూపాడు అనిరుధ్. కానీ అతడికి అమ్మమ్మ కందిపచ్చడే బాగుంది.
కోడలు చేసిన వంట బాగుండదని, ఆమెకు అంత బాగా వంట చెయ్యడం రాదని అమ్మమ్మకి బాగా తెలుసు. ఆ కూర తింటూ అమ్మమ్మ ముఖ కవళికలు చూసిన ఆమె ముసిముసిగా నవ్వుకున్నది.
భోజనాలు అయ్యాక సాయిరమ్య కాస్సేపు కూర్చుని వెళ్లిపోయింది. ఇంటికి వెళతానని కొండబాబు కూడా లేవబోతున్న సమయంలో అనిరుధ్ ఫోను రింగయ్యింది. తీసి చూశాడు. వెంటనే కొండబాబుకి చూపించాడు.
‘‘హిమ!.. అంటే.. హిమజ?!.. మాట్లాడు.. మాట్లాడు..’’ అన్నాడు కొండబాబు నవ్వుతూ.
‘‘హలో..’’ అన్నాడు అనిరుధ్ ముందు గది దాటి రోడ్డుమీదకొస్తూ. కొండబాబు కూడా వచ్చాడు. స్పీకర్ ఆన్ చేశాడు అనిరుధ్.
‘‘నిన్న ఉదయం ఫోన్ చేశావ్.. మళ్లీ లేదు.. అంత బిజీనా.. నీ ప్రోజెక్టు వర్కు స్టార్టయ్యిందా..’’ అనడిగిందామె.
‘‘సారీ హిమా! ప్రొద్దునే్న చేద్దామనుకున్నాను.. ఏదో పనిలో పడి చెయ్యలేకపోయాను..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘ఛఛ! సారీ ఎందుకు అనిర్?.. ఆ మాత్రం అర్థం చేసుకోగలను.. ఊరికే ఫోన్ చేశాను.. వాట్ న్యూస్..’’
‘‘ప్రస్తుతానికైతే ఏమీ లేవు.. కానీ ఓ విషయం నీకు చెప్పాలి..’’
‘‘ఏమిటో అది?..’’
‘‘మా అత్తమ్మ.. చెప్పానుగా ఆవిడ క్యారెక్టర్.. ఏనాడూ గుక్కెడు కాఫీ కూడా సంతోషంగా ఇవ్వలేదు నాకు. అలాంటిది ఈ రాత్రి ప్రత్యేకంగా నాకోసం కూర పంపించింది..’’
‘‘అవునా!’’
‘‘అవును.. ఎయిత్ వండర్ కదూ!..’’
‘‘మీ అత్తమ్మకి పెళ్లీడుకొచ్చిన ఆడపిల్ల ఉందా?’’
‘‘అరె! బాగానే గెస్ చేశావే.. ఉంది సాయిరమ్య అని.. ఆమె తీసుకొచ్చింది.. బావకి మమీ పంపింది..’
‘‘అవును మరి.. ఎర్రగా బుర్రగా ఉండి.. వేలకు వేలు జీతం సంపాదించుకుంటున్న కుర్రాడిని ఎవరు వదులుకుంటారు మరి?!’’
‘‘సరిగ్గా నా ఫ్రెండు కొండబాబు కూడా ఇలాగే అన్నాడు..’’
‘‘అవునా!.. బుద్ధూ.. నీ బుర్రకి అది తోచలేదా మరి?’’
‘‘లేదు హిమా.. కొండబాబూ.. ఇప్పుడు నువ్వూ అంటుంటే అర్థమవుతోంది వాళ్ల ఆలోచన..’’
‘‘ఇంతకీ నీ మరదలు బావుంటుందా.. ఐ మీన్ అందగత్తేనా..’’ అని నవ్వి ‘‘కొంచెం అసూయతో అడుగుతున్నావన్నమాట..’’ అని మళ్లీ నవ్వింది హిమజ.
‘‘టుబి ఫ్రాంక్.. మగరాయుడులా ఉంటుంది..’’
‘‘పాపం’’
‘‘అదేంటి?’’
‘‘ ఛాన్స్ మిస్సయ్యావని..’’
‘‘లేదు.. ఛాన్స్ మిస్సవలేదు. నాకో అజంతా సుందరి దొరికింది..’’
‘‘అరె! కవిత్వం కూడా వచ్చేస్తోందే.. అయినా నా సావాసంలో నువ్వు బొత్తిగా పాడయిపోయావ్ అనిర్!..’’
‘‘అవును.. జడత్వం నుంచి కవిత్వం..’’
‘‘నిజం హిమా! నీ సాంగత్యంలో, నీ ప్రేమలో నాకు నేను చాలా షేప్ దిద్దుకున్నాను..’’ నిజాయితీగా అన్నాడు అనిరుధ్. నీ ప్రక్కన ఎవ్వరూ లేరా?’’
‘‘నా ఫ్రెండు కొండబాబు ఉన్నాడు.. నీ వాయిస్ వింటాడని స్పీకర్ కూడా ఆన్ చేశాను..’’
ఆ మాటకి హిమజ ఏమీ మాట్లాడలేదు. కొండబాబు చేత్తో నోటిమీద తట్టుకుని ‘ఎందుకు చెప్పావురా’ అన్నట్లు కళ్లెర్రజేస్తూ అనిరుధ్ భుజంమీద కొట్టాడు.
‘‘హిమా! సారీ..’’ అన్నాడు అనిరుధ్ ఆమె మాట్లాడకపోయేసరికి.
‘‘సారీ కొండబాబుగారూ.. ఏదేదో మాట్లాడేశాను..’’ హిమజ అన్నది నెమ్మదిగా. ఆ మాటకి ఏమనాలో కొండబాబుకి అర్థం కాలేదు.
‘‘్ఫర్వాలేదు హిమా!.. వాడు నాకు మంచి ఫ్రెండు..’’
‘‘ఆ సంగతి నాకు చెప్పావ్.. సరే.. తర్వాత ఫోన్ చేస్తాను..’’
‘‘కోపం వచ్చిందా..’’
‘‘ఛ! దేనికి కోపం.. పిన్ని భోజనానికి పిలుస్తోంది. అంతే.. బై.. బై కొండబాబుగారూ.’’ ఆమె ఫోన్ కట్ చేసింది.
‘‘స్పీకర్ ఆన్ చేసినట్లు చెప్పకుండా ఉండాల్సిందిరా.. ఆమె ఫీలయ్యినట్లుంది..’’ కొండబాబు అన్నాడు ఆదుర్దాగా.
‘‘అబ్బే అలా ఫీలయ్యే మనిషి కాదురా.. ఆమె చాలా పద్ధతయిన మనిషి.. ఆమె మాట తీరు వింటావని. నీకు వినిపించాలని అలా చేశాను.. అంతే..’’
కొండబాబు తలూపాడు. హిమజ మాట్లాడిన తీరు నిజంగానే అతడికి నచ్చింది. అనిరుధ్ ఒకమ్మాయిని ప్రేమించానని అన్నప్పుడు.. సిటీ అమ్మాయి ఎలా ఉంటుందో, అసలే మనవాడికి నోట్లో నాలుకలేదు.. అని కొంచెం ఆందోళన చెందాడు కొండబాబు.
అయితే హిమజ మాట తీరు విన్నాక అతడి ఆందోళన కొంతమేరకు తగ్గింది. అందచందాలకన్నా గుణగణాలే ముఖ్యమని నమ్మేవాడు కొండబాబు.
‘‘సరేరా రేపు మన పని ఏమిటి?’’ అని కొన్ని క్షణాలు అయ్యాక అడిగాడు కొండబాబుని అనిరుధ్.
‘‘రేపా.. ఒకడున్నాడు.. వాడిని కలుద్దాం.. రేప్రొద్దున ఏం చేద్దాం అన్నది..’’ చెప్పాడు కొండబాబు.
‘‘సరే!.. ఒకసారి రహీంపాషాని చూడాలిరా’’ అన్నాడు అనిరుధ్.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842