డైలీ సీరియల్

అనే్వషణ -- 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి గయ్యాళి, తండ్రి ఓ మూర్ఖుడు. వాళ్లిద్దరిదీ అన్యోన్య దాంపత్యం ఎంత మాత్రం కాదు. చిన్నతనంలో అవన్నీ అతడిని చాలా బాధించాయి. తన చదువు ఆగిపోయింది. వాళ్లు ఆపేశారో, తను మానేశాడో వాడికిప్పుడు సరిగా గుర్తులేదు. అల్లరి చిల్లరి జీవితం ఇపుడు ఒక రౌడీగా ముద్రవేసి నిలబెట్టింది. ఇపుడు వాడికే లోటు లేదు. ఏదైనా అనుభవించగలడు. ఏదైనా చేజిక్కించుకోగలడు. సినిమాల్లో చూపించినట్లు చుట్టు ఎప్పుడూ పదిమంది జనం. ఇదో మజా అయిన జీవితం అని మురిసిపోతుంటాడు. అయితే వాడికి తెలుసు, ఎప్పుడో ఎక్కడో తాను కూడా తను చంపిన వాళ్ళలాగే ఏదో కత్తికి బలికాక తప్పదని..
‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి?’’ అనడిగాడు కాస్సేపయ్యాక వెయిటర్ లిక్కర్ తెచ్చి గ్లాసులో పోసి సోడా కలిపి వెళ్లిన తరువాత ఓ గుక్క తాగి.
‘‘రహీంపాషా బ్లడ్ శాంపిల్ లేదా అతడి జుట్టునుంచి ఊడదీసిన వెంట్రుకలు కానీ కావాలి.. వెంట్రుకలు అంటే రాలి కిందపడినవి కాదు, తల నుంచి బలంగా లాగి తీసినవి. అతడికి తెలియకుండా ఈ పని చేసిపెట్టాలి’’ చెప్పాడు అనిరుధ్.
‘‘అవును.. ఇలాంటిదేదో ఈమధ్య పేపర్లో పడిందని చెప్పుకున్నారు..’’ వీరబాహు అన్నాడు.
‘‘ఒక రాష్ట్ర గవర్నర్ మీద ఒకామె కేసు పెట్టింది. తన బిడ్డకు ఆయనే తండ్రి అని.. ఆ కేసులో డిఎన్‌ఎ టెస్టుకు కోర్టు ఆదేశించింది’’ అనిరుధ్ వివరించాడు.
‘మరి మీరూ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు గదా?!’’ వీరబాహు అడిగాడు.
‘‘తెచ్చుకోవచ్చు.. కానీ అతడే అని నమ్మకం ఉన్నపుడు.. ఇక్కడ అలాక్కాదు.. బిడ్డను కన్న తల్లి చనిపోయింది. ఒకవేళ ఆమె బ్రతికి ఉన్నా పిచ్చిది.. ఏమీ చెప్పలేనిది.. అందుకే ఈ ప్రయత్నం.. ఫలానావాడే అని తేలితే అపుడు అఫీషియల్‌గా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవచ్చు..’’ అనిరుధ్ చెప్పాడు.
వీరబాహు ఆలోచనలో పడ్డాడు. రెండోగ్లాసు నింపుకున్నాడు. కొండబాబు బీరు ఒక్క గ్లాసే ఇంకా సగం కూడా తాగలేదు.
‘‘తీసుకోరా.. కూలింగ్ తగ్గిపోతే బావుండదు..’’ అని కొండబాబుని హెచ్చరించాడు, మంచింగ్ తినమని అనిరుధ్‌ని సౌంజ్ఞ చేశాడు వీరబాహు.
‘‘బాస్‌కి తెలియకుండా అంటే కష్టవేరా కొండబాబూ.. ఆడు జగజ్జంత్రీ..’’ వీరబాహు అన్నాడు కొంతసేపయ్యాక.
‘‘ఇది కష్టమైన పనే.. ఒప్పుకుంటాను. కానీ అఫీషియల్‌గా సేకరించడం కుదరదు. అందుకే నీ హెల్ప్ కోసం వచ్చాం’’ కొండబాబు చెప్పాడు.
‘‘దీనికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను వీరబాహు.. ఇక్కడ మనం క్లాస్‌మేట్స్‌మన్న విషయం మర్చిపో.. జస్ట్ ఇక్కడ నీ వృత్తిలో ఎలా వ్యవహరిస్తావో అలానే వ్యవహరించు.. నేను ఏమీ అనుకోను.. ఎంతయినా ఇస్తాను..’’ అనిరుధ్ చెప్పాడు నిర్మొహమాటంగా. అపుడు వీరబాహు ముఖంలో వచ్చిన మార్పుని గమనించాడు కొండబాబు.
‘‘బాస్‌కి తెలీకుండా బ్లడ్ తీయాలన్నా, ఆడి వెంట్రుకలు లాగాలన్నా.. ఆడికి మత్తుమందిచ్చి తియ్యాలి..’’ సాలోచనగా అన్నాడు వీరబాహు.
‘‘నువ్వెలాగైనా ప్రయత్నించు నాకు అది కావాలి.. ఎంతిమ్మంటావో చెప్పు?’’ అనిరుధ్ అన్నాడు.
‘‘డబ్బుదేం వుందిలే.. చూద్దాం..’’ వీరబాహు మరో పెగ్ తెమ్మని వెయిటర్‌కి చెప్పి అన్నాడు.
‘‘అలాక్కాదు.. నేను ఇందాకే చెప్పాను.. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ మరిచిపో అని.. ఇది నీ వృత్తి.. దాన్ని నేను గౌరవిస్తాను.. ఎంతో చెప్పు..’’ అనిరుధ్ అడిగాడు. దానికి కొండబాబు సమర్థింపుగా మాట్లాడాడు.
‘‘నువ్వు ఎంతిద్దామనుకుంటున్నావ్?’’ వీరబాహు అడిగాడు.
‘‘ఒరే వీరబాహూ.. మాకిలాంటివి అలవాటు లేవురా.. అస్సలు తెలీదు కూడా.. నేనెవర్నీ కొట్టించలేదు.. ఎవర్నీ చంపించలేదు.. మాకేం తెలుస్తుంది ఎంత ఖర్చవుతుందో.. నువ్వే చెప్పు మొహమాటం లేకుండా..’’ కొండబాబు చెప్పాడు.
‘‘సరే.. ఇరవై నాలుగ్గంటలూ రహీంపాషాని కనిపెట్టుకుని చూడాలి. అదనుకోసం.. ఎప్పుడు పనవుద్దో చెప్పలేం కదా.. ఓ లక్ష.. ఇస్తారా?’’ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూఅన్నాడు వీరబాహు. ఆ మాటకి అనిరుధ్ ముఖంలోకి చూశాడు కొండబాబు.
‘‘ఇస్తాను.. ఇప్పుడే ఇచ్చెయ్యనా?’’ అనిరుధ్ అన్నాడు.
‘‘వద్దులే.. ఎల్లుండి.. ఓ ఏభై ఇవ్వు.. మిగతాది పనయ్యాక ఇద్దువుగాని..’’ తాగడం పూర్తయ్యాక చెప్పాడు వీరబాహు.
‘‘అలాగే’’
‘‘ఎల్లుండి కొండబాబుకిచ్చెయ్.. ఆడు నాకందజేస్తాడు..’’
‘‘అలాగే’’
తర్వాత తినడానికి ఆర్డర్ ఇచ్చి తినేసి వెళ్లిపోయాడు వీరబాహు. అతడు వెళ్ళాక ఓ పావుగంట కూర్చుని వచ్చేశారు మిత్రులిద్దరూ.
‘‘లక్ష రూపాయలు ఎక్కువనిపించడంలేదా?’’ బండి స్టార్ట్ చేస్తూ అన్నాడు కొండబాబు.
‘‘లేదురా!.. వాడు చెప్పినట్లు ఒక మనిషి నుంచి బ్లడ్ వాడికి తెలియకుండా తీసుకోవడం అంత తేలికకాదు.. పైగా మనం చెప్పిన వ్యక్తి ఓ సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోకు..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘అవుననుకో.. అదీ నిజిమే..’’
‘‘్ఫర్వాలేదురా.. దీనికి నేను చాలా బడ్జెట్ వేసుకున్నాను..’’ అంటూ బైక్ ఎక్కి కూర్చున్నాడు అనిరుధ్.
***
‘‘మీ నానమ్మ ఏమందే సారుూ?..’’ అడిగింది ఆమె తల్లి భూదేవి.
‘‘ఏమంటుంది? ఏమీ అనలేదు.’’
‘‘బావతో మాట్లాడావా? నీతో బాగా మాట్లాడాడా?’’
‘‘ఆఁ.. బానే మాట్లాడాడు.. బావ జీతం నెలకి లక్ష రూపాయలట.. చెప్పాడు..’’
‘‘అంతుంటుందా?..’’ ఆశ్చర్యంగా అన్నది భూదేవి.
‘‘ఉంటుంది.. ఐటి ఉద్యోగాలకీ బాగా జీతాలుంటాయట.. మా ఫ్రెండు చెప్పిందిలే..’’
‘‘అయితే బాగానే సంపాదిస్తన్నడన్నమాట.. చేజార్చుకోవద్దు.. బావతో కాస్త జాగ్రత్తగా ఉండు..’’
‘‘బావా, నువ్వూ కూర్చుని మాట్లాడుకున్నారా?’’
‘‘అదే కొండబాబు కూడా ఉన్నాడు.. ముగ్గురం కలిసి భోజనం చేశాం. నానమ్మ పెట్టింది..’’
‘‘అనిరుధ్‌కి తోక ఆ కొండబాబుగాడు.. ఇరవై నాలుగ్గంటూ వాడికూడనే ఉంటాడులే..’’
‘‘నేను పంపిన కూర బావ తిన్నాడా..’’
‘‘ఆఁ.. నానమ్మ అందరికీ వేసింది..’’’
‘‘ఇంకేమన్నాడే అనిరుధ్... మా గురించేమన్నా అన్నాడా?’’’
‘‘ఊహుఁ...ఏం చేస్తున్నావ్ అనడిగాడు నన్ను... చెప్పాను..’’
‘‘ఏమాటకామాటే చెప్పుకోవాలవే అనిరుధ్ మంచివాడేనే... ముందుచూపు లేక నేను వాడిని సరిగా చూడలేదనుకో... అయినా వాడవేం పట్టించుకునే మనిషి కాదులే... ఇక్కడికెప్పుడొచ్చినా నన్నూ మీ నాన్ననీ చూడకుండా వెళ్లడు...’’ స్వగతంలా అనుకున్నది భూదేవి.
‘‘ఎన్నాళ్లుంటాట్ట?’’

- ఇంకా ఉంది

--సర్వజిత్ 9010196842