డైలీ సీరియల్

జరాసంధ వృత్తాంతం (మహాభారతంలో ఉపాఖ్యానాలు-30)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే ఆ ముక్కలు రెండూ ఒకే రూపాన్ని ధరించి బాలునిగా రూపొందాయ. ఆ రాక్షసి అతన్ని చూసి ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించగా ఆ బాలుని బరువు మోయలేక పోయంది. ఆ శివువు తన చిన్న పిడికిలి బిగించి ఏడవసాగాడు. పుత్రశోకంతో ఉన్న రాణులిద్దరు పాలతో నిండిన స్థనాలతో విచారవదనాలతో భవనం బయటకు వచ్చారు. పుత్రుని కోసం తపిస్తున్న రాజును దుఃఖంతో ఉన్న రాణులను ఆ రాక్షసి జర చూసి ఆ బాలకుని ముఖం చూచి ఇలా ఆలోచించింది. ‘‘నేను ఈరాజు రాజ్యంలో ఉన్నాను. ఇతను ధర్మాత్ముడు, మహాత్ముడు తనకు సంతానం కోరుకుంటున్నాడు అటువంటి రాజు కొడుకుని నేను చంపకూడదు.’’
ఇలా ఆలోచించి జర మానవ రూపంలో ఆ బాలకుని తీసికొని వచ్చి రాజుకిచ్చి ఇలా అంది’’- బృహద్రథా ఈ శిశువు నీ కుమారుడే. స్వీకరించు బ్రహ్మర్షి అనుశాసనంతో నీ ఇద్దరి భార్యలకు రెండు భాగాలుగా జన్మించాడు. దాదులు బయట వదిలివేస్తే నేను రక్షించాను’’.
కాశీరాజు పుత్రికలు వెంటనే ఆ శిశువుని ఎత్తుకుని పాలిచ్చారు. రాజు ఆనందంక్ష్మిఊ మనుష్య రూపంక్ష్మిఊ ఉన్న రాక్షసిని ఇలా అడిగాడు. ‘‘నీవెవరివి? ఏ దేవతవో అ్ఠ ఉంటావు’’.
రాక్షసి ఇలా అంది ‘‘రాజా నేను కామ రాక్షసిని. కాని నన్ను దానవ వినాశనం కోసం యువతిగా ఇంటి గోడలపై చిత్రిస్తే ఆ ఇంట అభివృద్ది ఉంటుంది. చాలాకాలం నుండి నీ ఇంట పూజలందుకుంటున్నాను. దానికి ప్రత్యుపకారం చేయాలని తలచాను. నీ కుమారుని ముక్కలను చూచి వాటిని కలిపాను. అతను ఒకటిగా జీవించాడు. ఇది నీ భాగ్యం వల్ల జరిగింది. నేను నిమిత్త మాత్రమే. ఈ బాలునకు ఉచిత సంస్కారాలను జరిపించు. నా పేరుతో ఇతడు ప్రఖ్యాతి పొందుతాడు. నేను ఏదైన తినగలను. నీ బాలుడొక లెక్కా. కాని నీ ఇంట నీవు నన్ను పూజించావు. కనుక నీ కుమారుని బ్రతికించి నీకిచ్చాను’’ ఇలా అని ఆమె మాయమైపోయంది.
రాజు బాలకునకు తగిన సంస్కారాలు జరిపించారు. రాక్షసికి గొప్ప ఉత్సవాలు చేశాడు. ‘‘జరచేత కలుపబడినాడు కనుక ఈ బాలకుడు జరా సంధుడన్న పేరు పొందుగాక’’ అని నామకరణం చేశాడు. అతను దినదినాభివృద్ధి చెందుతూ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ మహా బలశాలి తేజస్వి అయనాడు.
మరల కొంత కాలానికి చండకౌశికుడు మగధ రాజ్యానికి వచ్చాడు. బృహద్రథుడు తన మంత్రులతో పురోహితులతో భార్యా పుత్రులతో ఎదురు వెళ్ళి అనేక విధాలుగా ఉపచారాలు చేశాడు. ఆ సత్కారాలను స్వీకరించి ముని రాజుతో ఇలా అన్నాడు. ‘‘రాజా! నీ కుమారుని భవిష్యత్తు గురించి తెలుసు కో. నీ పుత్రుడు రూప, సత్త్వ బల తేజస్సులతో జన్మించాడు. అతనికి సామ్రాజ్యలక్ష్మి కూడా లబిస్తుంది. నీ పుత్రుని పరాక్రమంతో ఎవరు సమానులు కారు. ఎంత సేనలు, వాహనాలు ఉన్న రాజులైనా ఇతన్ని ఎదిరిస్తే ఓడిపోవలసిందే. ఇతను రుద్రుని ప్రత్యక్షంగా దర్శిస్తాడు’’ ఇలా చెప్పి చండ కౌశికుడు వెళ్ళిపోయాడు.
తర్వాత రాజు జరాసంధునకు పట్ట్భాషేకం చేసి భార్యలతో కలిసి తపోవనానికి వెళ్లిపోయాడు. జరాసంధుడు తన పరాక్రమంతో రాజులందరినీ తన అదుపలోకి తెచ్చుకున్నాడు. అతను చండకౌశికుడు ఇచ్చిన వర బలంతో రాజ్యం పాలించాడు. కంసునికి తన కుమార్తెలనిచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు కంసుని చంపటం వల్ల అతనికి కృష్ణునితో శతృత్వం కలిగింది. బలవంతుడైన అతను తన గదను తొంభై తొమ్మిదిసార్లు త్రిప్పి దానిని గిరి వ్రజం నుండి విసరగా అవి శ్రీకృష్ణుని రాజ్యంలో పడింది. జరాసంధునకు ఇద్దరు తెలివైన మంత్రులు ఉండేవారు. వారు ఏ ఆయుధం చేత చావరు. కనుక ఈ ముగ్గురినీ ఎదరించటానికి ఎవరూ సాహిసించలేదు.

- ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి