డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరాసంధుని యుద్ద నిశ్చయం చూసి శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘రాజా! మా ముగ్గురిలో ఎవరితో నీవు యుద్దం నిశ్చయంచుకున్నావు? మాలో ఎవరు యుద్ధానికి సిద్ధం కావాలి?’’ అప్పుడు అతను భీమునితో యుద్దం చేస్తానని పలికాడు. తర్వాత అతను క్షత్రియ నియమాలను అనుసరించి యుద్ధానికి సిద్ధమైనాడు. అతను కిరీటం తీసివేసి కేశాలు బంధించి, భీమునితో ఇలా అన్నాడు. ‘‘్భమా! నీతో యుద్ధం చేస్తాను. శ్రేష్ఠుని చేతిలో ఓడినా మంచిదే’’.
భీమసేనుడు కూడా శ్రీ కృష్ణుని చేత స్వస్తి వచనాలు పొంది జరాసంధునికి ఎదురు నిలిచాడు. వారిద్దరు ఒకరినొకరు జయంచాలనే కోరికతో బాహువులే శస్త్రాలుగా తలపడ్డారు. ఒకరికొకరు ముష్టిఘాతాలతో బంధించడానికి ప్రయత్నించారు. ఒకరినొకరు మెడపై చెక్కిళ్లపై కొట్టిన దెబ్బలతో ఆ ప్రదేశం అంతా పిడుగు పడినట్లయంది. సింహాల వలె గర్జిస్తూ శరీరాన్ని శరీరంతో, చేతులను చేతులతో శరీరాలను పట్టి దూరంగా విసురుకొన్నారు. ఇద్దరూ మల్ల విద్యలో ప్రవీణులు కనుక వారికి ఎదుటి వారిని పడవేసే విద్య తెలుసు.
మల్ల యుద్ధంలో ఉన్నతమైన పృష్ఠ్భంగ అనే విద్య ఇరువురికీ తెలుసు. కనుక ఆ విద్యను ఇద్దరూ ప్రదర్శించారు. అలాగే రెండు భుజాలతో ఛాతీపై, పొట్టపై కొట్టి మూర్ఛ తెప్పించే పూర్ణకుంభ విద్యను ప్రదర్శించారు. అనేక విధాలుగా ఇద్దరూ ఒకరినొకరు పీడించుకొన్నారు. ఈ అద్భుత మల్లయుద్ధం చూడడానికి నగర ప్రజలు అక్కడ గుమిగూడారు. ఇలా వారి మధ్య యుద్ధం దివారాత్రాలు త్రయోదశి నాటి దాకా కొనసాగింది. ఆ మరునాడు మగధ రాజు అలసిపోయ యుద్ధం నించి మరలాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు భీమునితో ఇలా అన్నాడు. ‘శత్రువు అలసి ఉన్నప్పుడు అతన్ని ఎక్కువగా పీడించడం మంచిది కాదు. అలా చేస్తే అతను మరణించ వచ్చు కనుక జరాసంధుని బాధించకు. అతనితో చేతులతో మాత్రమే యుద్దం చెయ్య’’ ఇతను నీ చేతే చంపబడాలి. కనుక వాయువును తలచుకొని ఇతనితో యుద్ధం చెయ్య. కృష్ణుని మాటలువిని భీమసేనుడు జరాసంధుని చేతులతో ఎత్తి గిరగిరా త్రిప్పాడు. అలా త్రిప్పి అతను శ్రీ కృష్ణుని వైపు చూడగా, కృష్ణుడు ఒక గడ్డిని రెండుగా చీల్చాడు. అది సంకేతంగా తీసుకొని భీముడు జరాసంధుని గిరగిరా త్రిప్పి భూమిపై పడవేసి ఒక పాదాన్ని తొక్కిపెట్టి అతన్ని రెండుగా చీల్చాడు. కాని ఆ రెండు భాగాలు ఒకటైపోగా అతను లేచి మరల యుద్ధం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య అప్పుడు భయంకరమైన ద్వంద్వయుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు మరల గడ్డిపోచను చీల్చి ఆ ముక్కల్ని ఎదురెదురుగా విసిరి వేశాడు. భీమసేనుడు అది గ్రహించి జరాసంధుని రెండుగా చీల్చి విపరీత దిశలో విసిరివేశాడు. అప్పుడు ఆ భాగాలు మరల అతుక్కోలేదు. అతని శరీరం నుండి మాంసం రక్తపుముద్దలు బయటపడ్డాయ. శరీరం రెండుగా విడిపోయంది. ఈ భయంకర దృశ్యం చూసి మగధ వాసులందరూ భయపడి అటూ ఇటూ పరుగులు పెట్టారు.
అప్పుడు ఆ ముగ్గురు వీరసింహాలు జరాసంధుని మృతదేహాన్ని రాజ ద్వారం దగ్గర విడిచి వెళ్ళిపోయారు. కృష్ణుడు రథాన్ని అలంకరించి అందులో భీమార్జునులని కూర్చుండబెట్టి కారాగారంలో ఉన్న రాజులందరినీ విడిచిపెట్టాడు. కృష్ణుడు రధసారథిగా ఉండి భీమార్జునులుతో కలిసి తిరిగి ప్రయాణం అయ్యాడు. అప్పుడు బంధ విముక్తి పొందిన రాజులందరు శ్రీ కృష్ణుని ఇలా స్తుతించారు. ‘‘మహాబాహూ! భీమార్జునుల బలం మీ వెంట ఉన్నది. దేవకీనందనా! ఇంతకాలం ఈ పర్వతగుహలో బందీలుగా ఉన్న మేము అత్యంత దుఃఖంలో కాలం గడిపాము. మీరు మమ్మల్ని ఈ ఆపదనుండి రక్షించి ధర్మరక్షణ చేశారు. మీ కోసం ఏ సేవైనా చేస్తాము’’ కృష్ణుడు వారితో ఇలా అన్నాడు. ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి రండి వచ్చి సహాయం చేయండి.’’
తర్వాత జరాసంధుని పుత్రుడు సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై బడి శరణు వేడి, ఇలా అన్నాడు. ‘‘పురుష సింహమా! నా తండ్రి దహన సంస్కారాలు చేస్తాను. మీ ముగ్గురి నుండి అనుజ్ఞ పొంది యథేచ్ఛగా సంచరిస్తాను.’’ శ్రీకృష్ణుడు అతనికి ఇలా అనుజ్ఞనిచ్చాడు. ‘‘నీవు నీ తండ్రికి అంత్యేష్టి సంస్కారాన్ని జరిపించు’’ అతని మాటలు విన్న సహదేవుడు చందనపు కర్రలతో చితి పేర్పించి దానిపై జరాసంధుని శవాన్ని ఉంచి దహనం చేశాడు. తర్వాత అనేకమైన పశువులు, గుఱ్ఱాలు, పట్టువస్త్రాలు ధర్మజునికి వారి ద్వారా పంపాడు శ్రీకృష్ణుడు అతన్ని మగధకు రాజుగా పట్ట్భాషిక్తుని చేసి మిత్రునిగా స్వీకరించాడు. తర్వాత కృష్ణార్జునులు భీమసేనుడు జరాసంధ వధ చేసిన ఉత్సాహంతో ఇంద్రప్రసా థనానికి మరలిపోయాడు. ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి