డైలీ సీరియల్

అన్వేషణ -31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవున్రా.. వాడు లక్ష తీసుకున్నాడన్నమాటేగానీ, పాపం అనుభవించలేదు..’’ అనిరుధ్ అన్నాడు వీరబాహు మృతికి సానుభూతిగా.
‘‘సరే!.. వాట్ నెక్స్‌ట్?’’ కొండబాబు అడిగాడు.
‘‘కథ మళ్లీ మొదలుపెట్టాలి..’’
‘‘ఇక్కడే ఉన్న నారాయణ?!’’
‘‘ఊ.. వీడినుంచి పని ఎలా చెయ్యాలి?’’
‘‘చూద్దాం.. మనసుండాలేగానీ ఏదో దారి దొరక్కపోతుందా?’’ ఆశావహంగా అన్నాడు కొండబాబు.
‘‘హాయ్ బావా! ఇంట్లోనే ఉన్నావా?..’’ కొండబాబుతో అనిరుధ్ ఏదో అనబోతూంటే రయ్‌మని వచ్చింది సాయిరమ్య.
పలురింపుగా చిరునవ్వు నవ్వాడు అనిరుధ్.
‘‘నీకే.. అమ్మ పంపింపిది... పూతరేకులు.. ’’ అంటూ క్యారీబ్యాగ్‌లోంచి పూత రేకులు బయటికి తీసి చూపించింది. సమాధానంగా అనిరుధ్ నవ్వాడు. ఇంతలో అమ్మమ్మ బయటికి వచ్చింది. సాయిరమ్యని చూసి- ‘‘రావే సారుూ.. ఏంటి తెచ్చావ్?’’ అంటూ లోపలికి తీసికెళ్లింది.
‘‘నీమీద ప్రేమెక్కువైపోయిందిరా బాబూ..’’ గుసగుసలాడుతున్నట్లు అన్నాడు కొండబాబు.
ఈ తలనొప్పేంటిరా నాకు అన్నట్లు చిన్నగా నుదురుకొట్టుకున్నాడు అనిరుధ్. ఇంతలో ఫోన్ రింగయ్యింది. తీసి చూశాడు హిమజ!.. ఆమెతో మాట్లాడి రెండు రోజులయ్యింది. చటుక్కున బయటికివచ్చి.. ‘‘హలో’’ అన్నాడు. ఆ వెంటనే ‘‘సారీ హిమా!’’ అనీ అన్నాడు.
‘‘సారీ ఎందుకు?..’’ హిమజ అడిగింది.
‘‘రెండు రోజులుగా నీకు ఫోన్ చెయ్యలేదు కదా.. అందుకు..’’
‘‘అవును!.. ఎందుకు చెయ్యలేదు మరి?’’
‘‘మూడు రోజులుగా టెన్షన్..’’
‘‘టెన్షన్!.. ఎందుకట?’’
‘‘్ఫస్ట్ వికెట్.. టెస్టు..’’
‘‘వికెట్?!..’’
‘‘అదే హిమా.. నా పనిలో మొదటి రోగ్.. రెండో రోగ్ ఇక్కడే ఉన్నారని చెప్పానుగా.. మొదటి రోగ్ బ్లడ్ టెస్టు చేయించాం.. నెగెటివ్.. మ్యాచ్ కాలేదు.. రిపోర్టు ఎప్పుడొస్తుందా అన్న టెన్షన్‌లో ఉన్నాను.. వచ్చింది.. మ్యాచ్ కాలేదు.. వీడు నాకు బీజం వేసిన దుర్మార్గుడు కాదు.. ఐయామ్ నాటె ముస్టిం..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘ఓ!.. ఒక వికెట్ పడిపోయిందన్నమాట.. పని ఫాస్ట్‌గానే అవుతోంది..’’ ఆమె ప్రశంసాపూర్వకంగా అన్నది.
‘‘రేపట్నుంచి మళ్లీ పని మొదలుపెట్టాలి..’’
‘‘సరే! సరే.. మీ మరదలు సాయిరమ్య ఏమంటోందబ్బా?.. కవ్విస్తోందా?.. అసూయగా అడుగుతున్నానన్నమాట..’’ నవ్వుతూ అన్నది.
‘‘ఇప్పుడే వచ్చింది.. పూతరేకులు తెచ్చింది కూడా..’’
‘‘అబ్బో!.. నాకు చాలా ఇష్టం అనిర్ పూతరేకులు..’’
‘‘కొరియర్‌లో పంపనా..’’
సమాధానంగా నవ్వేసిందామె. ‘‘ఇంకేమిటి విశేషాలు?..’’
‘‘మొన్న మా మామయ్య వచ్చి అమ్మదగ్గర చాలా అభిమానం కురిపించేశాడు. పాపం నన్ను తన అల్లుడిని చేసేసుకుంటాట్ట.. కట్నకానుకలు మా అమ్మమ్మ ఎలా చెబితే అలాగేనట.. వింటుంటే అసూయగా ఉందా?!’’
‘‘ఉండదా మరి?!.. బాగా అసూయగా ఉంది.. ఇంతకీ అమ్మమ్మ ఏమన్నది.. సెంటిమెంటులో పడిపోయిందా కొంపదీసి?!’’
‘‘లేదు.. ఊరికే జరిగిన విషయం చెప్పిందంతే.. ననే్నం ఒత్తిడి చెయ్యలేదు ఇంతవరకూ.. ఇకముందూ చేస్తుందని అనుకోను..’’
‘‘ఎందుకలా అనుకుంటున్నావ్?’’
‘‘గతం ఆమె ఎన్నటికీ మర్చిపోదు.. వాళ్లు ప్రవర్తించిన తీరు ఆమె అప్పుడప్పుడు గుర్తుచేస్తూనే ఉంటుంది.. అందుకని..’’
‘‘మీ అమ్మమ్మనొకసారి చూడాలని ఉంది అనిర్..’’ రెండు క్షణాలు వౌనంగా ఉన్న తర్వాత అన్నది హిమజ.
‘‘చూపిస్తాను హిమా! నా పని అయాపోయాక నేనే స్వయంగా నిన్ను తీసుకొచ్చి అమ్మమ్మకి చూపిస్తాను.. మన పెళ్లికి అమ్మమ్మ సంతోషంగా ఒప్పుకుంటుంది.. నాకా నమ్మకం ఉంది హిమా!’’
‘‘హోప్ సో.. అనిర్.. వారం రోజులనుంచీ నువ్వు కనపడకపోతే నాకు చాలా బోర్‌గా ఉంది బాబూ.. ఒకసారి వచ్చి వెళ్లకూడదా?’’ గోముగా అడిగిందామె.
‘‘వస్తాను హిమా.. నాకూ అలానే ఉంది.. నీ వడిలో పది నిముషాలు పడుకోవాలని ఉంది..’’ అన్నాడు బేలగా.
‘‘పిచ్చి అనిర్.. నువ్వు పైకి గంభీరంగా కనిపిస్తావో అంత బేలతనంగా ఉంటావు..’’ అని నవ్విందామె. సమాధానంగా అతడూ నవ్వాడు.
‘‘ఇప్పుడేం చేస్తున్నావ్?.. నేనూ మా కొండబాబూ కూర్చున్నాం.. ఇంతలో సాయిరమ్య వచ్చింది. అదే మాట్లాడుకుంటున్నాం.. నువ్వు ఫోన్ చేశావ్.. నాకు పూత రేకులు పెట్టాలని మా మరదలు గుమ్మంలో ఎదురుచూస్తోంది హిమా!’’
‘‘అవును కదా!.. వెళ్లు మరి.. నా వాటా కూడా నువ్వే తినేయ్.. బై..’’ అంటూ నవ్విందామె. నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు అనిరుధ్. తను తమాషాకి అన్నట్లుగానే ప్లేటులో పూతరేకులు పెట్టి ముందు గదిలో తనకోసం ఎదురుచూస్తోంది సాయిరమ్య.
***
కొందరి జీవితం చాలా తమాషాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీడు ఎందుకూ పనికిరాడనుకున్నవాడే అనూహ్యంగా అందరూ ఆశ్చర్యపడేలా జీవితంలో ఎదిగిపోతాడు. ఎలా ఎదిగాడన్నది సమస్య కాదు. ఎదుగులే ముఖ్యం. అందుకు గొప్పగా చదువూ చట్టుబండలూ అవసరం లేదు. మాటకారితనం చాలు. నలుగురిని బుట్టలో వేసుకునే చాకచక్యం చాలు. ఒకళ్లిద్దరిని నమ్మించగలిగితే మరో ఐదుగురిని బుట్టలో వేసుకోవచ్చు.
అందుకు నారాయణే ఉదాహరణ! సిటీలో వాడి జీవితం ఒక రిక్షా కార్మికుడిగా ప్రారంభమయ్యింది. కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే అతడి తండ్రి కొడుకుని ఆ వృత్తిలో దింపకుండా పోనీ చదివిద్దాం అనుకున్నాడు. వీధిబడిలో చేర్చాడు. ఐదో తరగతి వరకూ వాడు బడికి బాగానే వెళ్లాడు.
తన కొడుకు కలెక్టరో మరేదో ఐపోతాడని నారాయణ తండ్రి ఏనాడూ అనుకోలేదు. ఆఫీసులోనన్నా ప్యూను ఉద్యోగమన్నా దొరికితే చాలునని అనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే కనీసం టెన్త్ క్లాస్ వరకైనా చదివిద్దామనుకున్నాడు.
ఐదో తరగతి వరకూ నారాయణ బడికి బాగానే వెళ్లాడు. ఆ తర్వాతే వాడికి సహవాసాలు ఎక్కువయ్యాయి. బడి ఎగ్గొట్టి కృష్ణానదికి వెళ్లి ఈతకొట్టడం, పార్కులమ్మట తిరగడం నేర్చుకున్నాడు స్నేహితులతో కలిసి. సంవత్సరాంతపు పరీక్షల్లో పాసవడాలు, ఫెయిలవడాలు లేవు కనుక ఆరోక్లాసుకు వచ్చాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842