డైలీ సీరియల్

అన్వేషణ -33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తను రిక్షా తొక్కేటప్పుడు, సంసారం కోసమని, కూటికోసమనీ, ఇలా ఏదో కారణాలు చెప్పి పడుపు వృత్తికి లాడ్జిలకు వచ్చే యువతులు ఇపుడు నారాయణకి గుర్తుకొస్తున్నారు. లవ్వు పేరు చెప్పి తన కూతుళ్లు ఎప్పుడేనా అలా లాడ్జిలకు వెళుతున్నారా వాళ్ల లవర్స్‌తో.. అన్న ఆలోచన వచ్చినపుడు నారాయణ వళ్ళు గగుర్పొడుస్తుంది. అతడు అలాంటి గగుర్పాటులో వున్నపుడే రహీం నుంచి ఫోనొచ్చింది.
‘‘హలో నారాయణా!.. ఏంటి భాయ్ కబుర్లు?’’ అనడిగాడు.
వాళ్లిద్దరూ ఎప్పుడేనా ఫోన్లు చేసుకుంటారు. తన రియల్ ఎస్టేటు వ్యవహరాల్లో లేఅవుట్ పర్మిషన్లు వగైరా విషయాల్లో రహీం సహాయం అప్పుడప్పుడు తీసుకుంటుంటాడు నారాయణ.
‘‘ఏం ఉన్నాయ్ రహీం.. చల్తాహై.. విశేషాలైమైనా ఉన్నాయా?’’ నారాయణ అడిగాడు.
‘‘ఉన్నాయ్.. ముప్ఫయ్యేళ్ల క్రిందటి విశేషం.. ఇపుడు మన చుట్టూ తిరుగుతోంది..’’
‘‘ఏంటీ?! ముప్ఫయ్యేళ్ల క్రిందటి విశేషమా.. ఏంటబ్బా అది..?’’ నారాయణ ఆశ్చర్యపోయాడు
తాము నలుగురూ ఓ పిచ్చిదానిపై అత్యాచారం చేసిన ఆ సంఘటనను రహీం పాషా గుర్తుచేశాడు. ఆమె కొడుకు ఇపుడు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించాడు.
‘‘నిజమా?!’’ ఆశ్చర్యంగా అన్నాడు నారాయణ.
‘‘నిజం.. నాకు సంబంధించి ఆ టెస్టు జరిగిపోయింది. మ్యాచ్ కాలేదు.. అంటే వాడికి నేను తండ్రిని కాను.. మీ ముగ్గురిలో ఎవడో ఒకడు కావచ్చు..’’ చెప్పాడు రహీం.
‘‘నువ్వు మ్యాచ్ కాలేదా?!.. మేం ముగ్గురిలో ఎవడో ఒకడు వాడికి.. వాడికి.. బాప్‌రే.. ఇదెక్కడ గొడవ?... ముప్ఫయ్యేళ్ల క్రిందటి సంఘటన.. నేనెప్పుడో మర్చిపోయాను..’’
‘‘కానీ వాడు మర్చిపోలేదు..’’
‘‘ఇంతకీ వాడెవడు?.. ఎక్కడుంటాడు?’’
‘‘ఎక్కడుంటాడో తెలీదు.. వాడి పేరు మాత్రం అనిరుధ్‌ట.. డాక్టర్ చెప్పాడు.’’
‘‘డాక్టర్!.. ఏ డాక్టర్?’’
‘‘డాక్టర్ హేమంత్ అని.. డయాగ్నస్టిస్ట్.. వాడేదో ఆశించి ఫోన్ చేశాడు.. కానీ ఆ కుర్రాడి అడ్రస్ తెలీదన్నాడు.. బహుశా డిఎన్‌ఎ టెస్టుకి ఆ కుర్రాడి దగ్గర బాగానే గుంజి ఉంటాడు..?’’
‘‘ఆ డాక్టర్ నీకు బాగా తెలుసా?’’
‘‘తెలీదు.. నా డాక్టర్ కె.వి.రావు.. ఏం?’’
‘‘ఏం?’’
‘‘ఏం లేదు.. వెళ్లి మాట్లాడదామని..’’
‘‘మాట్లాడ్డానికేముందిలే.. ఇవ్వాళ డబ్బులిస్తామంటే ఎవరైనా ఏదైనా చేస్తున్నారు.. మనీయే ఇంపార్టెంట్.. మనమేనా అంతే కదా?’’ అన్నాడు రహీం నవ్వి.
‘‘ఆ కుర్రాడి ఫోన్ నెంబరు కూడా తెలీదా?’’
‘‘తెలీదన్నాడు డాక్టర్’’
‘‘అవునూ.. ఆ పిచ్చిదాని ఇలెక్కడ?..’’
‘‘ఏమో.. ఇప్పుడెవరికి తెలుసు.. అప్పుడు మన పని ముగించుకుని మళ్లీ మనం నాలుగు రోజులు సిటీలో లేం కదా!.. తర్వాత మనం దాని గురించి పట్టించుకోలేదు..’’
‘‘అవును..’’
‘‘కానీ మనం రేప్ చేసిన ఫలితంగా దానికో కొడుకు పుడతాడనిగానీ, ఆడు ఇప్పుడిలా డిఎన్‌ఎ టెస్టు అంటూ వస్తాడని మనం అనుకున్నామా? మనమే కాదు ఎవరూ అనుకోరు..’’ ఓ విషపు నవ్వు నవ్వాడు రహీం ఫోన్‌లో.
‘‘సరే! ఇప్పుడేం చేద్దాం?’’
‘‘ఏం చెయ్యాలన్నది మీ ముగ్గురూ నిర్ణయించుకోవాలి..’’ రహీం అన్నాడు నవ్వుతూ.
‘‘అరె మేమే నిర్ణయించుకుంటాం బాబూ.. ఏం చెయ్యాలని?’’
‘‘నేనేం చెప్పను?’’
‘‘అరె రహీం భయ్యా.. సలహా చెప్పరా బాబూ..’’
‘‘నేనైతే లేపేస్తాను..’’
‘‘లేపెయ్యడమా?’’
‘‘మరి?.. మనలో ఎవరిదన్నా వాడి డిఎన్‌ఎతో మ్యాచ్ అయితే వాడు కోర్టుకెళితే.. వీడే నాకు తండ్రి అని?.. అప్పుడు సొసైటీలో మన పరువు పోతుంది..’’
‘‘అవునవును పేపర్లు, చానళ్లు కంపు కంపు చేసేస్తాయి..’’ నారాయణ కంగారుగా అన్నాడు.
‘‘అందుకే వాడిని లేపెయ్యండి..’’
‘‘అలాగే.. థామస్‌గాడితో మాట్లాడుతాను.. వాడు ఎక్కడ చచ్చాడో.. పూటకో ఫోను మారుస్తాడు వాడు..’’ విసుక్కున్నాడు థామస్‌మీద.
‘‘వాడు వైజాగ్‌లో ఉన్నాడంట..ట్రై చెయ్యి.. ఉంటాను మరి. అవసరమైతే ఫోన్ చెయ్యి..’’ ఫోన్ పెట్టేశాడు రహీం పాషా..
చాలాసేపు నారాయణ అచేతనంగా కూర్చుండిపోయాడు తన ఆఫీసు రూములో. సాయంత్రం ఆరు గంటలు దాటుతుండడంతో స్ట్ఫా ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. పావుగంటకి ఒక్క రాగిణి మాత్రం ఉన్నది. మిగిలిన వాళ్లు వెళ్లిపోయాఠు. మామూలుగా బాస్ నారాయణ వెళ్లాక ఆమె వెళుతుంది, వాచ్‌మెన్‌ని పిలిచి తాళాలు వేయించి.
‘‘సర్!..’’ మరో పావుగంటకి బాస్ నారాయణ రూములోకి వచ్చి పిలిచింది రాగిణి ఇక వెళదామా అన్నట్లు.
‘‘డ్రైవర్ ఉన్నాడా?’’ అనడిగాడు నారాయణ.
‘‘ఉన్నాడు’’ చెప్పిందామె.
‘‘వాడిని వెళ్లిపొమ్మను కారు కీ ఇచ్చి..’’
రాగిణి బయటకి వచ్చి కారు డ్రైవర్‌కి ఆ విషయం చెప్పింది. వాడు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. రాగిణి కూడా చిన్నగా నవ్వింది.
అంటే నారాయణ ఏం చెయ్యబోతున్నాడో ఆమెకు బాగా తెలుసు.. కారు డ్రైవర్‌కీ తెలుసు. నారాయణ ఆ రాత్రి అంటే ఏడు గంటల ప్రాంతంలో తనే కారు డ్రైవ్ చేసుకుంటూ రాగిణి ఇంటికి ఆమెతో వెళ్లబోతున్నాడని డ్రైవర్‌కీ, రాగిణికీ అర్థమయ్యింది. రాగిణితో తన బాస్‌కి సంబంధాలున్నాయని డ్రైవర్‌కీ, ఆఫీసులో మరొకళ్లకీ మాత్రమే తెలుసు.
రాగిణికి పెళ్లయ్యింది. కానీ భర్త ఏమయ్యాడో ఎవరికీ తెలిదు. ఆమెకు దాదాపు నారాయణ వయస్సే ఉంటుంది. ఒకే ఒక్క కూతురు. పెళ్లి చేసి పంపేసింది. ఇప్పుడామె డెబ్బయ్యేళ్ల తల్లిని తోడుగా పెట్టుకుని, నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటోంది. అనివార్యంగా ఆమె నారాయణకి చేరువయ్యింది.
ప్రస్తుత సమాజంలో ఇవన్నీ మామూలేనని ఆమె సరిపెట్టుకుంది. ఆమె తల్లీ సరిపెట్టుకుంది. అది తెలిసినవాళ్లూ చూసీ చూడనట్లు సరిపెట్టుకున్నారు తమకెందుకులే అని.
రాగిణి బ్రతకనేర్చిన మనిషి. తను పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫ్లాట్లు కొంచెం తక్కువ ధరకి ఇరుగు పొరుగువాళ్లచేత కొనిపించింది. అలా వాళ్లని మంచి చేసుకుంది. అందుకని ఆమె ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అదో గొప్ప విషయంగానే చెప్పుకుంటారు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842