డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు శివుడు శివగణాలతో ఒక హిమాలయ శిఖరంపై నిలుచున్నాడు. శివుడు చూసిన వారు ఆహా కైలాస వాసా కపర్ధి అని స్తుతించారు. గంగను ధరించడానికి నిలబడ్డ శివుని చూసి గంగామాత ఓహో నన్ను భరించగలిగే మొనగాడివా అని అనుకొంది. ఎలా భరించగలడో చూద్దాములే అనుకొంది. గంగ మనసు తెలసుకున్న శివుడు వూ వూ... ఇదా గంగా మనసు అనుకొన్నాడు. సర్వం ఈశ్వరమయం అయతే అందులోని ఉండేదే గంగ కదా. అంతలోనే అంత అహంకారం పొడచూపితే ఆ త్రినేత్రుడు వూరుకొంటాడా? మిక్కిలి వేగంగా గంగ శివుని తలపై పడుతున్నది. మితిమీరిన వేగంతో గంగా ఉరుకులు పరుగులతో శివుని జటాజూటం నింపాలని చూస్తోంది. కాకపోతే ఎంత ఉత్తుంగ తరంగాలతో ప్రవహించి వచ్చినా ఆ గంగా మాత శివుని జటా జూటం నుంచి ఒక్క చుక్క కూడా ఇవతలకు ఠాలేకపోయంది. సుళ్లు తిరుగుతూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయ. కానీ గంగను భగీరథుడు చూడలేకపోయాడు. నా తపస్సు అంతా వృథా అవుతోంది అనుకొన్నాడు. వెంటనే పరమశివుని స్తుతించాడు. అంతలో గంగ తన తప్పు తెలుసుకొంది. అహంకారం దూరం చేసుకొంది. పరమేశ్వరుడిని వేడుకుంది. తన తప్పును కాయమంది. భక్త సులభుడు అయన భోళాశంకరుడు శాంతించాడు. గంగశివుని జటనుంచి వెలువడింది. ఆ గంగా మాత సుళ్ళు తిరుగుతూ ఉవ్వెత్తున ఎగుస్తూ పరవళ్లు పెడుతూ భువిమీదకు అవతరించింది. ఆ గంగా అవతరణను చూడడానికి వచ్చిన మానవుడు, సిద్ధులు, సాధ్యులు, తాపసులు, గంధర్వులు, కినె్నరులు, కింపురుషాదులు అందరూ గంగలో మునుగుతున్నారు. లేస్తున్నారు. నెత్తిన చల్లుకుంటున్నారు. శరీరాలన్నింటినీ గంగతో తడుపుకొంటున్నారు. పతిత పావనుడు అయన శివుడు పతితి పావని అయన గంగా అంటూ అందరూ గంగను, శివుని స్తుతిస్తున్నారు. భగీరథుని ఆనందం మితి మించిది. ఆహా నేటితో మా పితరులు ముక్తి పొందుతారు కదా. అనుకొంటూ భగీరథుడు ముందుకు నడుస్తున్నాడు. అతని వెనుక గంగామాత నడుస్తున్నది. జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది. ఆ తల్లి జహ్ను ఆశ్రమాన్ని కూడా ముంచి వేస్తుంది. జహ్ను ఈ సంగతి గ్రహించి గంగను మింగివేసాడు. భగీరథునికి గంగ కనిపించ కుండా పోయంది. జరిగింది తెలుసుకొని భగీరథుడు జహ్ను మహర్షిని ప్రార్థించాడు. అతను శాంతించి తన కుడి చెవినుంచి గంగా ప్రవాహాన్ని వదిలిపెట్టాడు. అప్పట్నుంచి గంగనుజాహ్నవి అని కూడా పిలిచాడరు.
జాహ్నవిగా మారిన గంగలో తిరిగి మునులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, నాగులు స్నానాలు చేస్తున్నారు. పెద్దపెద్ద సుడులతో, ఉరుకులతో పరుగులతో భగీరథుని వెంట నడిచింది. అతని పితరుల భస్మరాశులపై ప్రవహించింది. గంగ సగర పుత్రులపై ప్రవహించిన వెంటనే వారి ప్రేతత్వం పోయంది. వారికి ఉత్తమ గతులు కలిగాయ. వారంతా స్వర్గారోహం చేశారు.
అట్లా భగీరథుడు మహా తపస్సు చేసి తన వంశస్థులను పుణ్యాత్ములను చేశాడు. గంగ ఇలా మూడు లోకాల్లో ప్రవహించడంవలన త్రిపద సంచారిణిగా పేరుపొందింది. భగీరథుని పుత్రిక గా కీర్తిపొంది భాగీరథి అయంది. ఈ గంగా స్నానం నేడు కూడా ఎంతో పవిత్రమైంది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి