డైలీ సీరియల్

నహుషుని కథ (మహాభారతంలో ఉపాఖ్యానాలు--46)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు దేవతలు అందరు అగ్నిని ముందు పెట్టుకొని శచీదేవి వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు. ‘‘దేవీ! నీవు మహాపతివ్రతవు. నీవు నహుషుని దగ్గరకు వెళ్ళు. నిన్ను కోరిన ఆ పాపాత్ముడు నశిస్తాడు. ఇంద్రుడు తిరిగి స్వర్గ్ధాపతి అగును.’’
వారి మాటలు విన్న శచీదేవి దేవతలు కార్యసిద్ధికోసం నహుషుని దగ్గరకు వెళ్ళింది. ఆమెను చూచి నహుషుడు వివేకభ్రష్టత చెంది సంతోషించాడు. అతను శచీదేవితో ఇలా అన్నాడు. ‘‘ఓ సుందరీ నేను ముల్లోకాలకు అధిపతిని. నన్ను వివాహం చేసుకో’’.
అప్పుడు శచీదేవి ఇలా అంది. ‘‘సురేశ్వరా! నీవు కొంత కాలం ఆగు. ఇంద్రుడు ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. ఆయన విషయం స్పష్టంగా తెలిసిపోతే నీ దగ్గరకు వస్తాను.’’
ఆమె మాటలకు నహుషుడు ఆనందంతో ఒప్పుకున్నాడు.
ఇంద్రాణి మాటలు విన్న దేవతలు ఇంద్రుని కోసం వెతికారు. వారంతా కలిసి విష్ణువును ప్రార్థించారు. ఇంద్రుడు బ్రహ్మ హత్యాపాతకం నుండి బయటపడే మార్గం చూపమన్నారు. వారి మాటలు విన్న విష్ణువు ఇంద్రుడు తనను పూజిస్తే అతను తిరిగి తన పదవి పొందుతాడు. ఇక నహుషుడు తను చేస్తున్న పనులతోనే తన నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు’’ అని చెప్పాడు.
అప్పుడు దేవతలంతా ఇంద్రుడు ఉన్న చోటికి వెళ్ళారు. అతని బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టడానికి అశ్వమేధయాగం చేశారు. ఇంద్రుడు అదృశ్యరూపంలో తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. శచీదేవి ఇంద్రుని తలచుకొని దుఃఖిస్తున్నది. తర్వాత ఆమె ఉపశ్రుతిని పూజించి ఆమె సహాయంతో ఇంద్రుని వెతుక్కుంటూ నదులూ, వనాలు, పర్వతాలు వెదికి చివరకు ఇంద్రుని కనుక్కుంది. ఒక సరస్సు మధ్యలో ఉన్న పద్మనాళంలో సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుని చూచింది. ఆమె భర్తతో నహుషుని దుష్కృత్యాలు చెప్పింది. చివరకు తనను కోరుతున్న విషయం చెప్పింది.
అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు ‘‘ఇప్పుడు నహుషుడు నాకంటె బలవంతుడు. ఋషులు అతన్ని అలా చేశారు కనుక నీవే ఒక పని చేయాలి అతనితో ‘ఋషులు మోసే దివ్య వాహనంపై నా దగ్గరకు వస్తే నీ దానిని అవుతాను’ అని నహుషునికి వార్త పంపు’’.
అతని మాట ప్రకారం శచీదేవి నహునికి అలాగే వార్త పంపింది. ఇంద్రాణి మాటలకు నహుషుడు సంతోషించాడు. అలాగే ఋషులు మోసే దివ్యవాహనంలో ఆమె దగ్గరకు వస్తానని ఆపైన ఇలా ఆమెతో అన్నాడు. ‘‘సుందరీ ఋషులు మోసిన వాహనాన్ని ఇంతవరకు ఎవ్వరూ ఎక్కలేదు.
నీ కోరిక నాకు నచ్చింది. ఒకవేళ కోపించినా, దేవతలు, ఋషులూ గంధర్వులూ ననే్నమీ చేయలేరు. సప్తర్షులే కాదు బ్రాహ్మణులు కూడా నన్ను మోస్తారు. అప్పుడు సంపూర్ణంగా బ్రాహ్మణ ద్వేషి మదోన్మత్తుడు కాముకుడు దుష్టుడుగా మారిపోయి యమ నియమాలతో తపో దీక్షలో ఉన్న ఋషులను పిలిచి అవమానించాడు. వారిని పల్లకీని మోయవలసిందిగా ఆజ్ఞాపించాడు.
వివేకం నశిస్తే అజ్ఞానం ఆవరిస్తుంది. అజ్ఞానంతో అహంకారం ఎక్కువై ఎవరితో ఏం మాట్లాడుతు న్నామో తెలియదు. పైగా తాము తమ శక్తియుక్తుల వల్ల ఇప్పటి స్థితిని పొందామన్న అహంభావం పెరిగిపోతుంది. మదోన్మత్తులు అవుతారు. ఇప్పటి నహుషుని స్థితి కూడా అదే. అతడు అందరికన్నా మంచివాడని, నూరు అశ్వమేధ యాగాలు చేసాడని దేవతలు కొనియాడి ఇంద్రపదవినిచ్చారు.వారు ఇచ్చేటపుడు నేను ఈ ఇంద్రపదవికి తగనని వినయంగా చెప్పాడు. అపుడు నహుషుడు వివేకవర్దనుడు. తాను ఏమిటో దైవమేమిటో తెలుసుకొన్నవాడు.
అందుకే ఆనాడు ఇంద్రపదవి అంటే బాధ్యత అనుకొన్నాడు.
కానీ నేడు పదవి, బలం ఇవి నహుషునిలో మదాన్ని పెంచాయ. నిరంతరం అన్నింటికీ భగవంతు డు కారణుడు నేను నిమిత్త మాత్రుడిని అనుకొనే నహుషుని మనస్సు అందరికన్నా బలవంతు డనే అహంకారాన్ని నింపుకుంది. దానితో ఇదంతా నా వల్లనే జరిగిందన్న అజ్ఞానాన్ని పెరిగింది. అన్నింటి మీద నాకు హక్కు ఉందనుకొన్నాడు. దానితో అతనిలోని ఇంద్రియాలే అతనిని అంటే నహుషుని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయ. అతనిలో కామం పెరిగింది. విచ్చలవిడి తనం అబ్బింది. అప్సరసలు తనను సంతోష పెట్టడానికే ఉన్నారను కొనేంతగా ఇంద్రియాలకు దాసుడయ్యాడు. కామకోరికలున్నవారికి సిగ్గు లజ్జ భయం పెద్ద చిన్న అంతరాలు ఇవేవీ పట్టవు కదా. అందుకే శచీదేవిని చూడగానే మరింత దిగజారిపోయన నహుషుడు ఆమెను కోరుకున్నాడు. అపుడే నహుషుని పతనానికి అంకురం ఏర్పడింది.
నహుషుని దుర్మార్గపు ఆలోచన తెలసుకొన్న శచీదేవి దేవగురువు దగ్గరకు వెళ్ళి ఇంద్రుని వెతకమంది. దేవగురువు ఆమెను భయపడవలసిన అవసరం లేదని నహుషుని సర్వనాశనం త్వరలోనే జరుగునని మహర్షులను పల్లకీ వాహకులుగా నియమించి అతను తన పతనం కోరి తెచ్చుకున్నాడని ఆమెకు ధైర్యం చెప్పాడు. తర్వాత దేవగురువు ఇంద్రుని వెతుకుటకు అగ్నిని పంపాడు.
చివరకు బృహస్పతి అగ్నిని నీటిలో ప్రవేశపెట్టి మంత్రాలతో అతన్ని వృద్ధి చేశాడు. అగ్ని నీటిలో ప్రవేశించి ఇంద్రుడు సూక్ష్మ శరీరంతో తామరతూడులో ఉన్నట్లు కనుక్కొని వచ్చి గురువుతో చెప్పాడు.
అప్పుడు బృహస్పతి లోకపాలకులతో అక్కడికి వచ్చి ఇంద్రుని స్తుతించారు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షివచ్చి నహుష పతనం గురించి ఇలా చెప్పాడు. ‘‘దుష్టుడయిన నహుషుని మోస్తూ ఆ దేవర్షులు, బ్రహ్మర్షులు నహుషుని ఒక సంశయం అడిగారు. ‘బ్రహ్మ చెప్పిన గోప్రోక్షణమంత్రాలు నీకు ప్రమాణాలా? కాదా?’ అని. నహుషుడు ‘కావు’ అన్నాడు. అప్పుడు ఋషులిద్దరూ ఇలా అన్నారు. ‘‘నీవు అధర్మమార్గంలో నడుస్తున్నావు. ధర్మం నీకు తెలియదు. పూర్వం ఋషులు చెప్పినది మాకు ప్రమాణం.’’ ఇలా వారితో వాదిస్తూ వాదిస్తూ అతను నన్ను నెత్తిమీద కాలితో తన్నాడు. అలా చేయడంతో అతనిలోని తేజస్సు తగ్గిపోయింది. అప్పుడు నహుషునితో నేను ఇలా అన్నాను. ‘నహుషా! ప్రాచీన ఋషులు ఆచరించిన దాన్ని అజ్ఞానంతో దూషిస్తున్నావు, నన్ను తలమీద తన్నావు. మహర్షుల చేత పల్లకీ మోయించుకున్నావు. వీటితో నీ పుణ్యం తేజస్సు నశించిపోయాయి. నీవు పదివేల సంవత్సరాలు భూమిపై పాముగా జీవిస్తావు’’. నహుషుడు ధర్మజునితో మరల ఇలా చెప్తున్నాడు.
‘‘అప్పుడు ఆ మహర్షి కాళ్ళమీదపడి శాపవిముక్తి గురించి ప్రార్థించగా అతను యుధిష్ఠిరునివల్ల నాకు విముక్తి లభిస్తుందని తెలిపాడు. ఇప్పుడు ఆ విధంగానే జరిగింది.’’
అతను బ్రాహ్మణత్వాన్ని గురించి ఇలా చెప్పాడు. ‘‘సత్యం, ఇంద్రియ నిగ్రహం, దానం, తపస్సు, అహింస, ధర్మపరాయణ ఈ గుణాలు మానవునికి సిద్ధిని కలిగిస్తాయి. కాని జాతి, కులం సిద్ధి నివ్వవు’’
ఇలా చెప్పి నహుషుడు పాము శరీరాన్ని విడిచి మానవరూపం ధరించాడు. అప్పుడు అక్కడికి ఒక విమానం వచ్చి అగింది. నహుషుడు ఆ విమానంలోకి ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు.
--ఇంకావుంది...

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి