డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి దేవలోకంలో దేవతల మధ్య ఒక చర్చ జరిగింది. ‘‘్భలోకంలో ఉశీనరుడి పుత్రుడు గొప్ప దానగుణము కలవాడు. అతనిని పరీక్షించి సత్యం తెలుసుకోవాలి’’ అని. అలా పరీక్షించడానికి ఇంద్రుడు, అగ్ని బయలుదేరారు. అగ్ని పావురం రూపం ధరిస్తే ఇంద్రుడు డేగ రూపం ధరించి ఆ పావురాన్ని తరుముకుంటూ పోయాడు. అప్పుడు పావురం శిబి దగ్గరకు వచ్చి అతని ఒడిలో వ్రాలింది. దాని మాంసం కొరకు డేగ దాని వెంట వచ్చింది. అప్పుడు శిబి ఆస్థాన పురోహితుడు రాజుతో ‘‘డేగను చూచి ప్రాణభయంతో ఈ కపోతం నీ దగ్గరకు ప్రాణరక్షణకై వచ్చింది. కాని పావురం ఒడిలో వ్రాలడం మృత్యుప్రదం, అరిష్టమని అంటారు. కనుక శాంతికై ధనదానం చేయండి’’ అన్నాడు.
అప్పుడు పావురం భయంతో ఇలా అంది ‘‘ఈ డేగను చూచి ప్రాణభయంతో నీ దగ్గరకు వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నాను. నేను నిజానికి ఒక మునిని. ఈ రూపాన్ని మార్చుకున్నాను. నేను స్వాధ్యయనం చేసి బిక్కచచ్చిపోయాను. నేను తపస్విని, బ్రహ్మచారిని, ఇంద్రియనిగ్రహం కలవాడిని. వేదాంగాలను క్షుణ్ణంగా పఠించాను. అటువంటి నన్ను డేగ ఆకలి తీరడానికి దానం చేయడం అన్యాయం. నన్ను డేగ కివ్వవద్దు. నేను పావురాన్ని కాను.’’
అప్పుడు డేగ రాజుతో ఇలా అన్నది. ‘‘జీవుడు వేరు వేరు రూపాలను వేరు వేరు జన్మలలో ధరిస్తూ వుంటాడు. ఏదో జన్మలో నీవు కూడా పావురంగా జన్మించి ఉంటావు. అందుకే దానిని ఆదరించి నాకు ఆహారం లేకుండా చేస్తున్నావు. అలా నీవు చేయకూడదు’’.
డేగ, పావురాలు మనుష్యభాషలో ఇంత చక్కగా మాట్లాడటం విని శిబి ఆశ్చర్యపోయాడు. వీరి పట్ల ఎలాంటి న్యాయం చేయాలి?
‘‘్భయంతో తనను శరణుకోరిన వారిని శత్రువులకప్పగించితే వాని రాజ్యాలు సకాలంలో వర్షాలు కురియక క్షామం వస్తుంది. నాటిన గింజలు మొలకలెత్తవు. ఆ రాజుకు రక్షణ అవసరమైనపుడు ఏ విధమైన రక్షణా అతనికి లభించదు. అతని సంతానం చిన్న వయసులోనే మరణిస్తారు. అతని పితరులకు ఉత్తమగతులుండవు. అతనికి స్వర్గంలో స్థానభ్రష్టత్వం కలుగుతుంది. కనుక ఓ శే్వనరాజమా! ఈ పావురానికి బదులు ఎద్దుమాంసాన్ని అన్నంతో వండి నీకు అర్పిస్తాను. తర్వాత కాలంలో కూడా నీ ఇష్టమైన చోట నీవు ఉండు. అక్కడికే నా వంశస్థులు మాంసాన్ని తెచ్చి ఇస్తారు’’ అన్నాడు శిబి చక్రవర్తి.
అప్పుడు డేగ ఇలా అంది. ‘‘నాకు ఏ ఎద్దుమాసం అక్కరలేదు ఈ పావురం మాంసమే కావాలి. ఇంకేదీ వద్దు. దేవతలు దీనినే నాకు ఆహారంగా ఈరోజు ఇచ్చారు. కనుక దీనినే నాకు ఇచ్చేయి’’.
రాజు మరల ఇలా అన్నాడు - ‘‘వృషభాన్ని ఇష్టపడకపోతే నీకోసం మంచి గొడ్డుటావును వెతికిస్తాను. దానిమాంస నీకోసం వండుతారు. అంతేకాని ప్రాణభయంతో రక్షణ కోరి నా దగ్గరకు వచ్చిన కపోతాన్ని విడువను. ప్రాణమైనా ఇస్తాను కాని దీన్ని ఇవ్వను. నీకు ఏ మాంసం కావాలో చెప్పు. నీకు ఎలా కావాలంటే అలా చేస్తాను’’.
అప్పుడు డేగ ఇలా అంది. ‘‘ఓ రాజా! పావురానికి సమానమైన మాంసం నీ కుడి తొడ నుండి కోసి ఇవ్వు. అప్పుడు పావురాన్ని రక్షించినట్లూ అవుతుంది, నీ ప్రతిజ్ఞ నిలుస్తుంది, నా కోరిక తీరుతుంది’’.
డేగ మాటలు విన్న శిబి త్రాసు తెప్పించి ఒక దానిలో పావురాన్ని కూర్చోబెట్టి రెండవ దానిలో తన తొడ మాంసం వేయగా పావురమే బరువుగా ఉన్నది. ఇంకా తొడమాంసం కోసి వేసినా పావురమే బరువు తూగింది. అప్పుడే శిబి తానే వెళ్లి త్రాసులో కూర్చున్నాడు. అతడు త్రాసులో కూర్చోగానే ‘‘నిజంగా పావురాన్ని నీ ప్రాణాలిచ్చి రక్షించావు’’ అని డేగ ప్రశంసించి అదృశ్యమైంది.
అప్పుడు శిబి పావురంతో ఇలా అన్నాడు. ‘‘పావురమా! నేను, నా వంశస్థులు నిన్ను పావురంగానే భావిస్తున్నాము. మరి ఆ డేగ ఎవరు? ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ ఇలా చేయలేరు. కనుక దయచేసి నాకు సమాధానం చెప్పు’’.
అప్పుడు పావురమిలా అంది. ‘‘ఓ రాజా! నేను వైశ్వానరాగ్నిని. శచీపతి అయిన ఇంద్రుడే ఈ డేగ. నీవు గొప్ప త్యాగమూర్తివి. నా శరీరాన్ని రక్షించడానికి నీ శరీరం నుండి మాంసం కోసి ఇచ్చావు. అక్కడ పడిన మచ్చ సుగంధాలు వెదజల్లుతుంది. నీ కుడి ప్రక్కనుండి నీకు కుమారుడు జన్మిస్తాడు. అతను కపోతరాముడు. అతను ఎంతో కీర్తితో ప్రకాశిస్తాడు’’ అని చెప్పి అదృశ్యమైనాడు.
ఒకసారి ఒక బ్రాహ్మణుడు శిబి దగ్గరికి వచ్చి తనకు ఆకలిగా ఉంది భోజనం కావాలని అడిగి మరల ఇలా అన్నాడు. ‘‘నీ కుమారుని చంపి వంట చేయించి పాత్రల్లో పెట్టి వాటిని నెత్తిపై పెట్టుకొనిరా’’.
శిబి అదేవిధంగా చేసి ఆ బ్రాహ్మణుడి కోసం వీధులలో వెతకసాగాడు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు క్రోధంతో రాజగృహాన్ని, కోశాగారాన్ని, ఆయుధాగారాన్ని తగలబెడ్తున్నాడు. శిబి మారుమాటాడక అతని దగ్గరకు వచ్చి ‘‘స్వామీ! భోజనం సిద్ధంగా ఉంది, భుజించండి’’ అని బ్రతిమాలాడు. ఆ బ్రాహ్మణుడు శిబితో ‘‘నీవే దీనిని ఆరగించు’’ అన్నాడు.
శిబి మనస్సులో ఏ ఆలోచన లేకుండా గినె్నలోని మాంసాన్ని భుజించసాగాడు. అప్పుడు బ్రాహ్మణుడు అతని చేయి పట్టుకొని ఇలా అన్నాడు. ‘‘నీవు కోపాన్ని జయించావు. బ్రాహ్మణుల కివ్వలేనిదంటూ నీ దగ్గర లేదు’’. ఇలా అని శిబిని ప్రశంసించాడు.
శిబి తల పైకెత్తి చూడగానే కుమారుడు కన్పించాడు. బ్రాహ్మణుడు మాయమయ్యాడు. ఆ స్థానంలో బ్రహ్మ నిల్చుని ఉన్నాడు. రాజును ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.
అతని మంత్రులు అంతటి సాహస కార్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అప్పుడు శిబి ఇలా అన్నాడు. ‘‘నేను కీర్తి కోసం కాని, సంపద, భోగాల కోసం కాని దానాలు చేయడం లేదు. పాపాత్ములు ఈ లోకంలో నడవలేరు. అందుకని ఇదంతా చేస్తున్నాను. సత్పురుషులు నడిచే మార్గం ఇదే కనుక నేను నా బుద్ధిని ఈ మార్గంలో నడిపిస్తున్నాను. మా వంశస్థులు ఈ మార్గానే్న అనుసరించారు. నేను అదే మార్గాన్ని అనుసరిస్తున్నాను’’.
ఈ నాటికీ దానగుణానికి ముందు శిబి పేరు చెప్పి తర్వాత తక్కినవారిని గురించి చెప్తారు.
నకర్మణా న ప్రజయా ధనేన
త్యాగే నైకే అమృతత్వ మానశుః
వరేణ నాకం నిపాతం గుహాయామ్
తిభ్రాజితే తద్యతయోవిశంతి
మహాభారతమైనా, ఏసాహితీ ప్రక్రియా లోనైనా మనిషికిచ్చే ఉపదేశం త్యాగం చేయడమే. మహాభారతంలో ఉదంకుని ఉపాఖ్యానమైనా, సర్పయాగ ఘట్టమైనా నలదమయంతుల కథ ఐనా, అసలు ఏ ఘట్టమైనా, అది పెద్దకథ అయనా చిన్న కథ అయనా సఠే - ముగింపుకు వచ్చేసరికి మనిషికి ఇచ్చే ఉపదేశం మాత్రం ఒకటే. అదే త్యాగం చేయడం. త్యాగగుణం ద్వారానే మనిషి మహనీయుడుగా, దివ్యత్వంతో తేజరిల్లుతాడు. శరీరాన్ని వదిలివేసినా వాని పేరు కొండలు, గుట్టలు, నదులు, నదాలు ఉన్నంత వరకూ ఆ పేరు జనుల గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. కనుక మనిషి స్వార్థాన్ని విడనాడి సొంతలాభం కొంత మానుకొని చేసుకొని ఎదుటివానికి ఉపయోగ పడితే అదే అసలైన మనిషి జీవిత సార్థకత అని పెద్దలు తమతమ అనుభవాల ద్వారా చెబుతున్నారు. అట్లాంటి కథలో వాసి ఉన్నకథ శిబి చక్రవర్తి. శిబి దేవతల మెప్పునే పొందుతాడు. ధర్మమార్గంలో సత్యమార్గంలో నడిచేవారు కలియుగంలోనైనా సరే దివ్యత్వాన్ని కలిగి ఉంటారు అని అనేక సంఘటన ద్వారా నేటికీ తెలుస్తూనే ఉంది. కనుక మనమూ ఈ శిబి నడవడిని అలవాటు చేసుకొందాం. భారతీయుల్లో ని మహానీయ గుణమైన త్యాగానికి పెద్దపీట వేద్దాం.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి