డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని మాటలు విన్న ద్రౌపది ఇలా అన్నది. ‘‘్భమసేనా! నేను నా దుఃఖాన్ని మరిచిపోలేక నీ దగ్గర దుఃఖించాను. కాని యుధిష్ఠిరుని నిందించడం లేదు. కేకయ రాజకుమారి తనకంటే అందమైన నన్ను చూచి కీచకుడు ఎక్కడ మోహపడతాడో అని నిత్యం కలత పడుతోంది. కీచకుడు పాపాత్ముడు. నిత్యం నా దగ్గరకు వచ్చి నన్ను వేధిస్తున్నాడు. నేను వాడితో ‘కామాంధుడా కీచకా! నేను వీరులైన ఐదుగురు గంధర్వులకు పత్నిని. వాళ్లకి కోపం వస్తే నిన్ను చంపేస్తారు’ అనగా వాడు ‘నీ పతులకు నేను భయపడను’ అన్నాడు. సుధేష్ణ తన తమ్ముడికి మేలు చేయాలని నన్ను కీచకుని ఇంటికి వెళ్లి మదిర తెమ్మని పంపింది.
నేను వెళితే వాడు నన్ను లోబర్చుకోబోయాడు. వాడిని విడిపించుకొని నేను రాజసభలోకి పరుగెత్తగా ఆ దుర్మార్గుడు నన్ను అందరిముందు కాలితో తన్ని అవమానించాడు. అది విరాటరాజు, ఢఁంకుభట్టు అందరూ చూస్తూ ఉన్నారు. నేను రాజుని యుధిష్ఠిరుని నిందించాను. అయినా వారు కీచకుని ఏమీ చేయలేకపోయారు. ఆ కీచకుడు వట్టి నీచుడు. వాడు ధర్మాన్ని విడిచిపెట్టాడు. దురహంకారి. పరస్తల్రను చెరపట్టేవాడు. ప్రజల నుంచి ధనం కాజేస్తూ ఉంటాడు. అయినా రాజు రాణీ వాడిని ఏమీ అనరు. వాడు నా కోసం ఇలా ప్రయత్నిస్తూ ఉంటే మీ అజ్ఞాతవాసం ముగిసేలోగా నేను చచ్చిపోవడం ఖాయం. నీవు సదా నన్ను అవమానాల నించి కాపాడావు. ఇప్పుడు నన్నవమానించిన ఆ కీచకుడిని చంపు. రేపు సూర్యోదయం లోగా నీవు కీచకుడిని చంపకపోతే నేను విషం త్రాగి చస్తాను’’ అని చెప్పి ద్రౌపది దుఃఖంతో విలపించింది.
ఆమెను ఓదారుస్తూ భీముడిలా అన్నాడు. ‘‘ద్రౌపదీ! చింతించకు. ఈరోజే ఆ కీచకుడినీ వాడి బంధువులను సంహరిస్తాను. నీవు శోకమూ, దుఃఖమూ మాను. వాడితో నేటి రాత్రి మొదటిజాము నర్తనశాలకు రమ్మని చెప్పు. అక్కడ పగలంతా కన్యలు నాట్యం నేర్చుకొని రాత్రి ఇళ్లకు వెళ్లిపోతారు. కనుక అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడికి వాడిని రప్పిస్తే వాడికి వాడి తాతముత్తాతలను చూపిస్తాను. ఎవరికీ తెలియకుండా వాడికి ఈ సంకేతం అందజెయ్యి. వాడు అక్కడికి వచ్చేటట్లు చూడు’’ ఇలా వారిరువురూ మాట్లాడుకొని విడిపోయారు.
అప్పుడు ద్రౌపది ఇలా అంది ‘‘కీచకా! నీకిష్టమైతే నేనొక ఉపాయం చెబుతాను విను. నీవు నన్ను కలవాలంటే నీ సోదరికీ, రాజుకు, స్నేహితులకు ఎవ్వరికీ తెలియకూడదు. నా భర్తలు ఎంతో పేరున్నవారు. కనుక నిందకు భయపడ్తున్నాను. ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేస్తే నేను నీకు వశమవుతాను’’.
ఆనందంతో కీచకుడు అలాగే చేస్తానని ప్రమాణం చేయగా ద్రౌపది ఇలా అంది. ‘‘కీచకా! విరాటరాజు కట్టించిన నాట్యశాలలో రాత్రిసమయం లో ఎవ్వరూ ఉండరు. చీకట్లో అక్కడికిరా! గంధర్వులు చూడలేరు!’’
కీచకుడు ఇలా అన్నాడు. ‘‘సుందరీ! నేనొక్కడినే అక్కడికి వస్తాను. నీ పతులకు తెలియకుండా ఉండేలా నేను వస్తాను. గంధర్వుల వల్ల నీకెటువంటి భయమూ రాదు’’.
ఈ విషయం ద్రౌపది చెప్పిన తర్వాత కీచకుడికి కాలం ఆగిపోయినట్లు అనిపించింది. మృత్యువు సైరంధ్రి రూపంలో ఉందని అతను తెలుసుకోలేకపోయాడు. అతను ఇంటిలో గంధంపూసుకొని మాలలు, ఆభరణాలు ధరించి ద్రౌపదిని తలచుకుంటూ క్షణమొక యుగంలా గడిపాడు.
ద్రౌపది కీచకుని నర్తనశాలకు రాత్రికి రమ్మని చెప్పి వంటశాలకు వెళ్లి భీమునితో ఈ సంగతి చెప్పింది. ఆమె ఇలా అంది. ‘‘రాత్రికి ఒంటరిగా కీచకుడు నాట్యశాలకు వస్తాడు. వాణ్ణి అక్కడ చంపు. గర్వంతో వాడు గంధర్వులను లెక్క చేయడం లేదు. వాణ్ణి చంపి నా కన్నీరు తుడువు. నీ వంశ గౌరవాన్ని నిలబెట్టు’’.
అప్పుడు భీముడు ఇలా అన్నాడు. ‘‘హిడింబాసురుని చంపినప్పుడు ఎలాంటి ఆనందం కలిగిందో అదే ఆనందం కీచకుడిని చంపినపుడు పొందుతా ను. వాడిని చంపడానికి నాకు వేరొక సహాయం అక్కరలేదు. నేను సత్యాన్ని, ధర్మాన్ని, అన్నదమ్ముల్ని ముందుంచుకొని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపినట్లు నేను కీచకుడిని చంపుతాను. ఈ దేశప్రజలు వాడి పక్షాన వస్తే వాళ్లను చంపుతాను’’
ద్రౌపది భీమునితో ఇలా అంది. ‘‘ప్రభూ! నీవు కీచకుణ్ణి రహస్యంగా చంపు’’.
భీముడు ఆమె మాటలకు ఒప్పుకున్నాడు. రాత్రి అయింది. భీముడు నర్తనశాలలో ఒంటరిగా దాక్కొని కీచకుని కోసం ఎదురు చూస్తున్నాడు. కీచకుడు అలంకరించుకొని ద్రౌపది కోసం నర్తనశాలకు వచ్చాడు. అక్కడ శయ్యమీద ముసుగు వేసుకొని భీముడు కూర్చుని ఉన్నాడు. అతనే ద్రౌపది అనుకొని కీచకుడు అతనిపై చేయి
వేశాడు.
ద్రౌపదికి కీచకుడు చేసిన అవమానాన్ని తలచుకొని భీముడు కోపంతో రగిలిపో యాడు.
కామంతో, మదిరతో మత్తెక్కిన కీచకుడు భీముని చీకట్లో ద్రౌపదిగా భావించి ఇలా అన్నాడు. ‘‘సుందరీ! నా సర్వస్వము నీకిచ్చివేస్తాను. నా భవనంలో స్తల్రు నీవు నన్ను వరించడం చేత నన్ను అందగాడినని అంటున్నారు.’’
అప్పుడు భీముడు ఇలా అన్నాడు. ‘‘నీవు నిజంగా అందగాడివే. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు. స్ర్తిలు ఇష్టపడేవారిలో నీవంటివాడు ఇంకొకడు లేడు’’ అంటూ ఒక్కసారి లేచి పెద్దగా నవ్వుతూ మరల ఇలా అన్నాడు. ‘‘ఒరే! నీవు పెద్ద శరీరంతో ఒక పర్వతంలాగ ఉన్నావు. సింహం మదపుటేనుగును ఈడ్చినట్లు నిన్ను ఈడ్వడం మీ అక్క కూడా చూస్తుంది. నీవు చస్తే సైరంధ్రి ఏ బాధా లేకుండా ఉంటుంది’’ ఇలా అంటూ భీముడు కీచకుని జుట్టు పట్టుకొన్నాడు. అపుడు వారిద్దరికీ బాహుయుద్ధం జరిగింది. రెండు మదగజాలు పోట్లాడుకున్నట్లు వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరి నొకరు గోళ్లతో రక్కుతూ, పళ్లతో కరుస్తూ హింసించుకున్నారు. గోళ్లు, దంతాలే వారికి ఆయుధాలయ్యాయి. కీచకుడు మదగజంలాగ భీముడిని పట్టుకుంటే భీముడు అతన్ని ఒక తన్ను తన్నాడు. కీచకుడు భీముని నేలపై తోసివేయగా అతను లేచి కీచకునిపై యమునిలాగ పడ్డాడు. భీముడు కీచకుని గుండెపై బలంగా చేతులతో కొట్టాడు. దానితో కీచకుడు బలహీనుడయ్యాడు. అది చూసి భీముడు మరల అతని గుండెపై గుద్దాడు. అతని జుట్టు పట్టుకొని ఈడ్చి కాలితో తన్నాడు. తర్వాత అతను కీచకుని తన చేతులతో బంధించాడు. కీచకుడు బాధతో వికృతంగా అరిచాడు. అతని ప్రాణాలు క్రమంగా పోసాగాయి. భీముడు అతని కంఠాన్ని పట్టుకొని గట్టిగా నొక్కాడు. కీచకుని అవయవాలు అన్నీ ముక్కలైపోయాయి. భీముడు అతని మెడ పట్టి విరువసాగాడు. చావు దగ్గరపడుతున్న కీచకుణ్ణి చూచి భీముడు ఇలా అన్నాడు. ‘‘సైరంధ్రి పాలిటి కంటకుడు, నా సోదరుని భార్యను అపహరించినవాడు, దుష్టుడు అయిన కీచకుణ్ణి చంపి నేను ఋణవిముక్తుడిని అయి పరమశాంతి పొందాను’’ ఇలా అంటూ అతను కీచకుడిని నేలపై ఎత్తి పడేశాడు. అతన్ని కాళ్లతో తన్ని కాళ్లను మెడను విరిచేవాడు. కీచకుని ప్రాణాలు పైకెగిరిపోయాయి. భీముడు అతని శరీరాన్ని మర్దించి మాంసపిండంగా చేసి ద్రౌపదికి చూపాడు. ఆమెతో ఇలా అన్నాడు. ‘‘పాంచాలీ! చూడు! ఈ కామాంధుడిని ఏమి చేశానో! గుణశీలాలు కలిగిన నిన్ను కామించే వారికి ఇదే గతి పడుతుంది’’ ఇలా అని అతను కీచకుని శరీరాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఇలా పని పూర్తి చేసి అతను తిరిగి వంటశాలకు వెళ్లిపోయాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి