డైలీ సీరియల్

అన్వేషణ -48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చాలు పరంమేశ్వరంగారూ.. చాలా మంచి క్లూ ఇచ్చారు.. వాడి డాక్టర్ దగ్గరికి వెళదాం.. మన పని చేయడానికి ఎంత కావాలో బేరం సెటిల్ చేసుకుందాం..’’ అనిరుధ్ అన్నాడు కాస్త ఊపిరి పీల్చుకుని.
‘‘అలాగే.. ఆ డాక్టర్ బేరానికి లొంగే మనిషే.. మనిషి చూడ్డానికే ఓ గుంటనక్కలా ఉంటాడు.. ప్యూర్ మనీ మైండెడ్.. మీ పని అవుతుంది..’’ అని టైము చూసుకున్నాడు పరమేశ్వరం. ఎనిమిది గంటలవుతోంది. లిక్కర్ తెచ్చుకోవడానికన్నట్లు లేచాడు.
‘‘మీరు ఉండండి నేను తెస్తాను.. మీ బ్రాండు?’’ అనడిగాడు కొండబాబు చెప్పులు వేసుకుంటూ.
‘‘్ఫర్వాలేదు.. నే వెళ్లి తెచ్చుకుంటాను..’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘వెళ్లనివ్వండి.. ఇవ్వాళ మీరు మావాడికి కంపెనీ దొరికారు.. ఎందుకంటే నేను తీసుకోను.. అలాగని వాడొక్కడే తీసుకోలేడు..’’ చెప్పాడు అనిరుధ్. ఆ మాటకి పరమేశ్వరం ఏమీ మాట్లాడలేదు.. తన బ్రాండ్ చెప్పాడు. ఎంత కావాలో కూడా చెప్పాడు.
ఎనిమిదిన్నరకి కొండబాబు, పరమేశ్వరం కార్యక్రమం మొదలుపెట్టారు. అనిరుధ్ సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటూ కూర్చున్నాడు. దాదాపు గంటన్నర సాగిన ఆ కార్యక్రమంలో థామస్ గురించి అలా చెప్పుకొచ్చాడు పరమేశ్వరం. అతడు చేస్తున్న ఎక్స్‌పోర్టు వ్యాపారం ముసుగులో జరుగుతున్నవన్నీ చెప్పుకొచ్చాడు.
ఆ వ్యాపారాలకు థామస్‌కి కుడిభుజంలా పనిచేస్తున్న కనకారావు గురించీ చెప్పాడు. మందు తాగిన మనిషిలా ఏం లేడు. ఈ వ్యసనం తనకి చాలాకాలంగా ఉందని, ఎంత తీసుకున్నా, ఫర్వాలేదని, మాట తడబడ్డంగానీ, మనిషి తూలడంగానీ ఉండదని, ఇక్కడనుంచి హ్యాపీగా ఇంటికి, అంటే పదిహేను కిలోమీటర్లు నడచి వెళ్లిపోగలనని చెప్పాడు పరమేశ్వరం.
అతడు చెబుతున్న విషయాలు అబద్ధాలుగా అనిపించలేదు వాళ్లకి. ఎందుకంటే అప్పటికే అతడు చాలా తీసుకున్నాడు. కానీ మనిషిలో ఏ మార్పూ లేదు. మామూలుగానే మాట్లాడుతున్నాడు. రాజకీయాల గురించి మాట్లాడాడు. అంతర్జాతీయ విషయాలనూ చర్చించాడు. నిజానికి అవేమీ కొండబాబుకి తెలియవు. అనిరుధ్‌కి కొంత తెలుసు. ఎందుకంటే అతడు టీవీలో న్యూస్ చూస్తాడు. రోజూ ఇంగ్లీషు పేపరు చదువుతాడు.
పది గంటలకు లేచాడు పరమేశ్వరం వెళ్లడానికి. అప్పుడు సమయం పది గంటలయ్యింది.
‘‘మీ ఇల్లు చాలా దూరం అంటున్నారు.. ఈ నైట్‌కి ఇక్కడే పడుకోండి.. మార్నింగ్ వెళుదురుగానీ’’ అన్నాడు అనిరుధ్.
‘‘ఏం.. బాగా మందు పుచ్చుకున్నాననా?’’ అడిగాడు పరమేశ్వరం నవ్వుతూ.
‘‘అబ్బెబ్బె.. అది కాదండి.. దూరం కదాని..’’ కొండబాబు నసిగాడు.
‘‘్ఫర్వాలేదులెండి.. ఇంటిదగ్గర నాకోసం కాచుకుని కూర్చునే వాళ్లెవరూ లేరు.. ముసలి తల్లి ఉండేది.. నన్ను కష్టపడి పెంచింది. ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్ పిజి డిగ్రీ తెచ్చుకున్నాను. ఇంతకుముందు రెండు మూడు ఉద్యోగాలు చేశాను. అవేమీ నాకు తృప్తినివ్వలేదు. అన్ని ఉద్యోగాలూ ఇలాగే ఉంటాయని ఇందులో సెటిలయ్యాను.. తీరా నేను నాలుగు డబ్బులు సంపాదించేసరికి అనుభవించే యోగం లేక లాస్ట్ ఇయర్ మా అమ్మ వెళ్లిపోయింది’’ పైకి చూపిస్తూ చెప్పాడు పరమేశ్వరం.
‘‘ఇక భార్యాపిల్లలు.. లేనివాణ్ణి.. అంటే నా అలవాట్లూ.. పైజమా లాల్చీ.. ఈ సంచీ.. ఈ గడ్డం వగైరాలు నచ్చక, దర్జాగా లేనని, బైక్‌మీద సరదాగా తిప్పడంలేదని.. వెళ్లిపోయింది నాకు భార్యగా వచ్చిన ఆమె! మనసు పంచుకోవడం చేతకానప్పుడు ఆమె ఉంటేనేం.. వెళ్లిపోతేనేం చెప్పండి.. మళ్లీ పెళ్లిచేసుకోమన్నారు ఫ్రెండ్స్.. చేసుకోబుద్ధికాలేదు.. ఓ అక్క ఉంది.. ఎప్పుడూ నేను ఏం పెడతానా అని బీదార్పులు అరుస్తుంటుంది. వాళ్లకోసం నేను బాగా డబ్బు ఎందుకు సంపాదించాలి? నిజంగా నా అక్క కష్టాల్లో ఉంటే నేను కూలి పనిచేసైనా వాళ్లని ఆదుకుంటాను.. ఇవన్నీ చూశాక జీవితంమీద విరక్తి అని చెప్పలేనుగానీ, ఒకరకమైన ఏవగింపు వచ్చేసింది. ఇవన్నీ కొంపలు ములిగేంత కష్టాలేం కావు.. కానీ చికాకు పెట్టే న్యూసెన్స్ వ్యవహారాలు.. సంతోషాన్ని చంపేసే వ్యవహారాలు.. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఇంత తెలివైనవాడివి.. ఏదైనా బిజినెస్ పెడదాం రా అని.. నాకే ఇష్టం లేదు. వాళ్లు పెట్టుకున్నారు. అప్పుడప్పుడు నన్ను సలహాలు అడుగుతుంటారు. అంతే.. చాలా బోరు కొట్టించాను కదూ నా పర్సనల్ సోది చెప్పి..’’ అంటూ లేచి పరమేశ్వరం చెప్పులు వేసుకున్నాడు. ‘‘రేపు ఉదయం నైన్‌కి వస్తాను.. డాక్టర్ దగ్గరికి వెళదాం’’ అన్నాడు బయల్దేరుతూ.
‘‘అలాగే సార్’’ అన్నారు ఇద్దరూ.
కొండబాబు అతడితో బాటు క్రిందికి వచ్చి తనే ఆటో మాట్లాడి, డబ్బులిచ్చేశాడు పరమేశ్వరం వద్దంటున్నా వినకుండా.
***
ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. టంచన్‌గా రూముకొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు పరమేశ్వరం. కొండబాబు డోర్ తీశాడు. అప్పుడు చొక్కా వేసుకుంటున్నాడు అనిరుధ్. కొండబాబు ఇంకా ప్యాంటుతోనే ఉన్నాడు.
‘‘ఇంకా రెడీ కాలేదా?’’ అడిగాడు పరమేశ్వరం లోపలికొస్తూ.
‘‘టూ మినిట్స్ సర్.. ఈలోగా కాఫీ తాగండి’’ అంటూ బాయ్‌ని పిలిచి కాఫీ చెప్పాడు కొండబాబు.
పది నిముషాల్లో ముగ్గురూ సీతమ్మధార సెంటర్‌కి వచ్చారు. అక్కడ ఆటో దిగాక తాము వెళ్లాల్సిన ఆసుపత్రి వైపు చూపించాడు పరమేశ్వరం.
వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళేసరికి ఓ పదిమంది పేషెంట్లు వెయింటింగ్ హాల్లో ఉన్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్‌లోనే ఉంది. ఇవ్వాళ ఆసుపత్రులకైనా, కానె్వంటు స్కూళ్లకైనా అసలుసరకు కన్నా ఆర్భాటం ఎక్కువగా ఉంటోంది. ఆ ధోరణి అక్కడ కనిపించింది అనిరుధ్‌కి. కళ్లతోనే మిత్రుడు కొండబాబుకి సూచించాడు. కొండబాబు అవున్నట్లు భుజాలెగరేశాడు.
‘‘చూశారా! పైన పటారం లోన లొటారం అన్నట్లు... ఇప్పుడే ఆర్భాటం ఎక్కువైంది ప్రతిదానికీను.. ఆ మాటకొస్తే మా ఆఫీసూ అంతే. ఎవరేనా లోపలికి వస్తే చాలు.. ‘చెప్పండి సర్’ అంటూ మా రిసెప్షనిస్టు హొయలు ఒలకబోస్తుంది.. దాన్ని చూస్తే నాకు భలే ఒళ్లు మండుతుంది..’’ అనిరుధ్ మనసులో మాట గ్రహించిన వాడిలా అన్నాడు పరమేశ్వరం.
వాళ్లిద్దర్నీ కూర్చోమని చెప్పి పరమేశ్వరం రిసెప్షనిస్టు దగ్గరకెళ్లాడు. ఏదో మాట్లాడాడు రెండు నిమిషాలు. డాక్టర్‌గారు రాగానే పంపిస్తానన్నదామె. అతడు ఆ ఆసుపత్రికి నాలుగైదుసార్లు వచ్చాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842