డైలీ సీరియల్

అన్వేషణ -49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి హఠాత్తుగా తన బాస్ థామస్‌కి ఆఫీసులో కళ్లు తిరిగితే తనే అతడిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అపుడు పరమేశ్వరాన్ని చూడగానే నక్సలైట్‌ని చూసినట్లు డాక్టర్ మధుకర్‌కి కంగారు పుట్టింది.. అతడి వేషం చూసి.
ఆ తర్వాత ఓ ఫ్రెండ్‌కి బాగులేకపోతే తెలిసిన డాక్టర్‌కదాని అక్కడికే తీసుకొచ్చాడు. అప్పుడూ డాక్టర్ మధుకర్ కంగారుపడ్డాడు. అలా మరో రెండుసార్లు అతడు పరిచయమయ్యాడు పరమేశ్వరానికి.
మరో పావుగంటకి డాక్టర్ మధుకర్ వచ్చాడు. వస్తూ వెయిటింగ్ హాల్లో వున్న పేషెంట్లని చూశాడు. అక్కడ లాల్చీ పైజమా, గడ్డంతోవున్న పరమేశ్వరాన్ని చూశాడు. ఒకళ్లిద్దరు పేపెంట్లని చూశాక పరమేశ్వరాన్ని రమ్మన్నాడు డాక్టర్ మధుకర్.
ముగ్గురూ లోపలికి రావడంతో వారిలో పేషెంటు ఎవరో తెలీక అయోమయంగా చూశాడు డాక్టర్
‘‘ట్రీట్‌మెంటుకోసం రాలేదు డాక్టర్‌గారూ.. మీ ఫీజు వగైరా అన్నీ పే చేశాం.. ’’ అన్నాడు పరమేశ్వరం నవ్వుతూ.
‘‘ఓకె.. ఓకె.. బట్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ..’’ అన్నాడు డాక్టర్ మధుకర్ ముగ్గుర్నీ కూర్చోమని చెయ్యి చూపిస్తూ.
అతడి వయస్సు అంచనా వేయడం కష్టం. పరమేశ్వరం చెప్పినట్లు చూడ్డానికి గుంటనక్కలాగానే ఉన్నాడు. లూజు ప్యాంటుమీద లూజు షర్టు ఇన్‌షర్ట్ చేశాడు. తలలో వెంట్రుకలు బాగా పల్చబడిపోయాయి. ఉన్న మేరకు బాగా నల్లరంగు వేశాడు.
‘‘మాకు ఓ డిఎన్‌ఎ టెస్టు చేయించి పెట్టాలి..’’ చెప్పాడు పరమేశ్వరం కుర్చీలో కూర్చున్నాక.
‘‘దాని అవసరం ఏమొచ్చిందిప్పుడు?..’’ అంటూ నవ్వాడు మధుకర్. కానీ అతడు నవ్వినట్లు అనిరుధ్‌కి, మూలిగినట్లుంది.
‘‘ఓ త్రాష్టుడు.. ఒకమెని మోసగించి కడుపు చేశాడు. పాపం ఆమెకు కొడుకు పుట్టాడు. ఎలాగో పెంచి పెద్ద చేసింది. ఇపుడా త్రాష్టుడు వాడిని కాదంటున్నాడు.’’
‘‘జస్ట్ రీసెంట్లీ.. ఓ మాజీ గవర్నర్ ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నాడు..’’ గుర్తుచేశాడు డాక్టర్ మధుకర్.
‘‘అవును.. సరిగ్గా అలాంటిదే.. కానీ.. ఇది మాకు కొంచెం సీక్రెట్‌గా చేయించి పెట్టాలి..’’ చెప్పాడు కొండబాబు.
‘‘సీక్రెట్‌గానా?!’’
‘‘అవును డాక్టర్!.. వాడే ఆమె కొడుక్కి తండ్రి అని టెస్టులో తేలితే... అప్పుడు వాడిమీద లీగల్‌గా ప్రొసీడ్ అవుతుంది. లేదంటే ఆమె ప్రాణానికే ప్రమాదం కదా..’’ పరమేశ్వరం చెప్పాడు లాజిక్‌గా.
డాక్టర్ మధుకర్ ఏమీ మాట్లాడలేదు కొంతసేపు. టేబుల్‌మీద వెయిట్‌ని గిరగిరా తప్పుతూ ఉన్నాడు.
‘‘ఇందుకు మీకు ఏం కావాలో చెప్పండి.. ఫర్వాలేదు.. ఇది మీకూ మాకూ మధ్యన జరిగే వ్యవహారం.. ఎవరికీ తెలీదు..’’ పరమేశ్వరం అన్నాడు.
‘‘అవును సర్.. ఆమె మంచి కోసమే మేం ఇలా చేస్తున్నాం.. మీరు ఏం తీసుకుంటారో ఫర్వాలేదు సర్.. చెప్పండి..’’ కొండబాబు అన్నాడు ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ.
‘‘సీక్రెట్‌గా అంటే.. అది నేరం కదా!..’’ డాక్టర్ అనుమానం వ్యక్తం చేశాడు.
‘‘లీగల్‌గా ఆలోచిస్తే అది నేరమే సర్.. కానీ ఆమె మంచికోసమే ఇలా చేస్తున్నాం డాక్టర్‌గారూ.. ఆ టెస్టులో అతడే అని కన్‌ఫర్మ్ అయిందనుకోండి.. అపుడు ఆమె లీగల్‌గా ప్రొసీడ్ అవుతుంది.. కోర్టు అప్పుడు డిఎన్‌ఎ టెస్టుకు ఆదేశిస్తుంది. అతడే అని తెలీకుండా ప్రొసీడ్ అయితే కచ్చితంగా ఆమె ప్రాణానికి ప్రమాదం తప్పదు సర్... ఎందుకంటే అవతలి వ్యక్తి పలుకుబడి ఉన్నవారు..’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘మీరు ఈ టెస్టు చేయించారని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి చెప్పం.. మీకేం కావాలో చెప్పండి..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘ఇంతకీ ఆ వ్యక్తి.. అదే డిఎన్‌ఎ టెస్టు చెయ్యాల్సిన వ్యక్తి ఎవరు?’’ అడిగాడు డాక్టర్ మధుకర్.
‘‘మీకు బాగా తెలుసు.. మీ పేషెంటే.. థామస్..’’ పరమేశ్వరం చెప్పాడు డాక్టర్‌నే సూటిగా చూస్తూ.
‘‘్థమస్?!..’’
‘‘అవును! థామస్.. కనుకనే మేం మీ దగ్గరకొచ్చాం.. ఈ సహాయం మీరు చేసి పెడతారన్న ఆశతో.. ఒక అభాగ్యురాలికి మీకు చేతనైనంత సాయం చేస్తారన్న ఆశతో..’’
పరమేశ్వరమే అన్నాడు సూటిగానే డాక్టర్ ముఖంలోకి చూస్తూ.
అతడి చూపులు తప్పించుకున్నాడు డాక్టర్ మధుకర్. ఎందుకంటే అతడు నక్సలైట్లతో సంబంధాలున్న వ్యక్తిలా అనిపిస్తాడు ఆయన కంటికి.
‘‘కానీ, అతడికి తెలిస్తే!?’’ మధుకర్ అనుమానం వ్యక్తం చేశాడు.
‘‘ఎలా తెలుస్తుంది?.. మేం చెప్పం.. మీరు చెప్పరు?..’’ పరమేశ్వరం అన్నాడు.
‘‘మీకెంత కావాలో చెప్పండి..’’ కొండబాబు అన్నాడు ఎంతకీ అతడు అవుననకపోవడంతో.
‘‘ఎంతిస్తారు?’’ అనడిగాడు డాక్టర్ మధుకర్.
‘‘మీరెంతంటే అంత?..’’ అనిరుధ్ అన్నాడు.
ఎంత చెప్పాలో డాక్టర్‌కి అర్థం కాలేదు. ఎంత చెబితే ఏమనుకుంటారో, ఒకవేళ వాళ్లిద్దామనుకుంటున్న దానికంటే తక్కువవుతుందేమోనన్న మీమాసంలో కొట్టుమిట్టాడు కాసేపు.
‘‘్ఫఫ్ట్థీజెండ్!’’ చటుక్కున చెప్పాడు అనిరుధ్. ఆశ్చర్యంగా చూశాడు అతడివైపు పరమేశ్వరం. కొండబాబు ఆ మాటకి డాక్టర్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు.
కాస్సేపటికి మధుకర్ ముఖం విప్పారింది. డన్ అన్నట్లు గుప్పెడు ముడిచి బొటనవ్రేలు పైకి చూపాడు.
‘‘్థంక్స్ సర్’’ అన్నాడు అనిరుధ్.
‘‘ఎప్పటిలోకా అవుతుంది?’’ పరమేశ్వరం అడిగాడు.
‘‘నేను రెడీయేగా.. థామస్ నా క్లినిక్‌కి రావాలి.. అపుడు అతడినుంచి మనకి కావలసింది సేకరించాలి..’’ డాక్టర్ చెప్పాడు.
‘‘అదే థామస్ మీ దగ్గరికి తరచుగా వస్తుంటాడని విన్నాను.. జనరల్‌గా ఎప్పుడొస్తాడు..’’ పరమేశ్వరం అడిగాడు.
‘‘యాక్సువల్‌గా అయితే ఇవ్వాళ రేపట్లో రావాలి బిపి చెక్ చేయించుకునేందుకు. టేబ్లెట్లు వేసుకుంటున్నాడు. అయినా అతడికి బిపి కంట్రోల్ కావడంలేదు.. లెట్ ఇట్ బి.. ఎప్పుడొచ్చినా మీ డిఎన్‌ఎ టెస్టుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను..’’ మధుకర్ చెప్పాడు.
‘‘మమ్మల్ని ఎప్పుడు కలవమంటారు?’’ పరమేశ్వరం లేస్తూ అడిగాడు.
‘‘సాయంత్రం.. కాదంటే టుమారో ఈవెనింగ్.. చెప్పానుగా ఇవ్వాళో, రేపో అతడు రావచ్చని..’’ డాక్టర్ మధుకర్ చెప్పాడు.
ముగ్గురూ లేచారు వెళ్లడానికి. డాక్టర్‌కి విష్ చేశారు.
‘‘సో...’’ అర్థోక్తిలో ఆగిపోయాడు మధుకర్. అనిరుధ్‌కి అర్థమైంది డాక్టర్ ఉద్దేశ్యం. జేబులోంచి పది వేల రూపాయల కట్ట తీసి ఇచ్చాడు.
మిగిలింది పనయ్యాక ఇస్తారు కదా! అన్నట్లు చూసి ఆ డబ్బు డ్రాయర్ సొరుగులో పెట్టుకున్నాడు డాక్టర్ మధుకర్.
డాక్టర్ రూములోంచి బయటకు వచ్చిన తర్వాత వెయిటింగ్ హాల్లో అనిరుధ్‌ని కూర్చోమని చెప్పి కొండబాబుని వెంట బెట్టుకుని లోపలికెళ్లాడు. అక్కడ లేబ్‌లో వున్న నర్స్‌ని గుర్తుపట్టి పిలిచాడు. ఆమె చెవిలో గుసగుసలాడాడు.
‘‘డాక్టర్ మనల్ని మోసం చెయ్యడని గ్యారంటీ ఏమిటి?.. అందుకే నర్స్‌కి కూడా మన విషయం చెప్పాను.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842