డైలీ సీరియల్

అన్వేషణ -55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కనకారావుగాడు ఇంకా నిద్రపోలేదన్న మాట..’’ అన్నాడు స్వగతంలా పరమేశ్వరం.
‘‘మనం లోపలికి ఎలా వెళతాం.. సెక్యూరిటీ గార్డు ఉంటాడుగా..’’ నెమ్మదిగా అడిగాడు కొండబాబు.
‘‘మా ఆఫీసుకు సెక్యూరిటీ గార్డు ఉండడు.. అదొక దండగ అని మా థామస్ బాసుగాడు పెట్టలేదు. పైగా కనకారావుగాడు పైనే ఏడుస్తాడుగా.. ఇప్పుడు మనం గేటు దాటి వెళ్లాలి.. కాసేపయ్యాక.. అంటే వాడు నిద్రపోయాక.. అంతసేపూ మనం ఇక్కడే నక్కి కూర్చోవాలి.. కొంచెం చలిగా ఉంది.. అయినా తప్పదు మరి..’’ చెప్పాడు పరమేశ్వరం.
ఓ పావుగంటకి పైన లైటు తీసేసినట్లు కిటికీ చీకటిగా కనిపించింది.
‘‘అంటే వాడు నిద్రకి ఉపక్రమించాడన్నమాట..’’ పరమేశ్వరం అన్నాడు. నలుగురూ అలెర్టుగా నిల్చున్నారు చీకటిలో. మరో పావుగంట గడిచిపోయింది.
‘‘ఒక్కొక్కడూ చప్పుడు చెయ్యకుండా గేటుదాటి లోపలికి వెళ్లండి...’’ చెప్పాడు పరమేశ్వరం. ఆ మాటకి ముందుగా కొండబాబు కదిలాడు.
‘‘అందరం వెళదామా?..’’ సంశయంగా అడిగాడు అనిరుధ్.
‘‘అవును.. నువ్వుండరా ఇక్కడ..’’ వెళ్ళబోతున్నకొండబాబు అనిరుధ్‌ని ఉద్దేశించి అన్నాడు. ఆ పని చెయ్యి అన్నట్లు అనిరుధ్‌కేసి చూశాడు పరమేశ్వరం.
కొండబాబు చప్పుడు చేయకుండా గేటుదాటి లోపలికి వెళ్ళాడు. తర్వాత ఆర్‌ఎంపి డాక్టర్ ప్రసాద్ గేటు దాటాడు. చివరిగా పరమేశ్వం వెళ్లాడు. అతడికి కాస్త కష్టంగానే అనిపించింది గేటుదాటడం తన లాల్చీ పైజమాతో. కొండబాబు దాదాపు అతడిని ఎత్తుకుని క్రిందకి దింపాడు.
నెమ్మదిగా ముగ్గురూ మేడమీదికి వెళ్లారు. పరమేశ్వరం చెప్పినట్లు తలుపుమీద చిన్నగా కొట్టి చటుక్కున ప్రక్కకి వచ్చేశాడు కొండబాబు. రెండు క్షణాలకు తలుపు తెరచుకుంది. కనకారావు ‘ఎవరూ’ అంటూ పిలిచాడు. ముందు ఎవరూ లేకపోవడంతో గాలికి ఏదో కొట్టుకుందిలే అనుకుని తలుపు వేసుకుని పడుకున్నాడు.
కాస్సేపయ్యాక మళ్లీ తలుపు తట్టి చటుక్కున ప్రక్కకి వచ్చేశాడు కొండబాబు. కనకారావు తలుపు తీశాడు ‘ఎవరూ’ అంటూ. ఎదురుగా ఎవరూ కనిపించకపోయేసరికి బయటికి వచ్చాడు. ముందుకు వెళ్లి పిట్టగోడ దగ్గర నిల్చుని రోడ్డుకేసి చూశాడు. గేటు తాళం పెట్టి ఉంది. ఎవరొస్తారు లోపలికి అనుకుని వెనుదిరిగాడు. అప్పటికే ముగ్గురూ లోపలికి దూరి గోడవార మంచంక్రిందగా నక్కి కూర్చున్నారు.
కనకారావు లోపలికి వచ్చి తలుపు వేసి మంచం ఎక్కాడు.. ‘్ఛ.. మందెక్కువయితే...ఇంతే.’ అనుకుని తిట్టుకుంటూ కళ్లు మూసుకున్నాడు. పది నిముషాలు గడిచాయి. చిన్నగా గుర్రు వినిపించింది. ముందుగా ఆర్‌ఎంపి డాక్టర్ ప్రసాద్ లేడు నెమ్మదిగా. తన బ్యాగ్‌లో కాగితం పొట్లంలో కట్టిన దూది తీశాడు. కనకారావు ముక్కు దగ్గర పెట్టాడు. కనకారావు మత్తులోకి వెళ్లిపోవటానికి చేసిన ఏర్పాటు అది.
పది నిముషాలు అయ్యాక మంచం క్రిందకు నక్కి కనకారావు కాలుమీద చిన్నగా గిచ్చాడు. వాడిలో చలనం లేదు- పనిచేసింది అన్నట్లు పరమేశ్వరంకేసి చూశాడు ప్రసాదు.
ముగ్గురూ పైకి లేచారు. అతడినుంచి బ్లడ్ తీశాడు డాక్టర్ ప్రసాద్. ముగ్గురూ చప్పుడు చెయ్యకుండా బయటికి వచ్చేశారు. అప్పటికప్పుడే వాళ్లు డాక్టర్ మధుకర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడినుంచి మధుకర్‌కి ఫోన్ చేసి చెప్పారు. అతడి సలహా మేరకు శాంపిల్‌ని అక్కడ డ్యూటీలో ఉన్న నర్స్‌కి ఇచ్చారు. ఆమెకు మధుకర్‌కి ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్పాడు.
అప్పుడు సమయం రాత్రి పనె్నండు గంటలవుతోంది. నలుగురూ లాడ్జికి వచ్చారు. పరమేశ్వరం ఇంటికి వెళతానన్నాడు. ఇప్పుడేం వెళతారు ఇక్కడే పడుకోండి అని కొండబాబు, అనిరుధ్ అనడంతో ఉండిపోయారు, ప్రసాదు.
‘‘గురూ ఇప్పుడు ఓ రెండు.. వేసుకుంటే బాగుంటుంది. కానీ సంపాదించడం చాలా కష్టం. సందుల్లో గొందుల్లో పోవాలి’’ అన్నాడు డాక్టరు ప్రసాద్.
‘‘ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ప్రసాదుగారూ తెస్తాను.’’ చెప్పాడు కొండబాబు.
‘‘నిజంగానా?’’ ఆశగా అడిగాడు ప్రసాద్.
‘‘నాకైతే అవసరం లేదు.. కానీ మా ప్రసాద్ కోరిక తీర్చాల్సిందే మరి.. కానీ..’’ పరమేశ్వరం మాట పూర్తికాకుండానే కొండబాబు లేచాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842