డైలీ సీరియల్

అన్వేషణ - 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలాగే.. చేయించాలి.. పరంగారు చెప్పింది నిజమే!.. ’’ అనిరుధ్ అన్నాడు.
‘‘కానీ కనకారావు ఏ ఆసుపత్రిలోనూ దొరకడు... వాడి విషయంలో మనం కొంచెం సాహసం చెయ్యాలి మరి..’’
‘‘అంటే?!..’’ కొండబాబు, అనిరుధ్ అడిగారు.
‘‘వాడు ఉండేది ఆఫీసు పైన రూములో.. మనం ఎలాగో వాడి రూములోకి ప్రవేశించి వాడికి తెలీకుండా మన పని కానివ్వాలి.. వేరే ఎక్కడా వాడు దొరకడు... వాడు మందుకొట్టేదీ, అమ్మాయిల్ని తెచ్చుకుని ఎంజాయ్ చేసేదీ అన్నీ అక్కడే. రాత్రి తప్ప, పగలు మిగిలిన సమయమంతా వాడు ఆఫీసుకే అంకితం..’’ వివరించాడు.
‘‘అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం?’’ ఏం చెయ్యాలో ఆలోచించి చెబుతాను...’’ చెప్పాడు పరమేశ్వరం.
‘‘సరే.. పదండి రూముకెళదాం...’’ కొండబాబు అన్నాడు ఆటో పిలుస్తూ.
‘‘ఇంటికెళతాను...’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘వెళుదురుగాని.. ముందు రూముకెళ్లి ప్రశాంతంగా కాసేపు కూర్చుందాం.. ఎందుకోగాని మావాడు అప్‌సెట్ అయ్యాడు’’ కొండబాబు చెప్పాడు.
ఆ మాటకి పరమేశ్వరం ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఆటో ఎక్కి కూర్చున్నాడు.
***
మిగిలిన సమయమంతా వాడు ఆఫీసుకే అంకితం..’’ వివరించాడు.
‘‘అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం?’’ కొండబాబు అడిగాడు.
‘‘జస్ట్ నాకు కొంచెం సమయమివ్వండి.. ఏంచెయ్యాలో ఆలోచించి చెబుతాను..’’ చెప్పాడు పరమేశ్వరం.
‘‘సరే.. పదండి రూముకెళదాం..’’కొండబాబు అన్నాడు ఆటోపిలుస్తూ.
‘‘ఇంటికెళతాను...’’ పరమేశ్వరం చెప్పాడు.
‘‘వెళుదురుగాని.. ముందురూముకెళ్లి ప్రశాంతంగా కాస్సేపు కూర్చుందాం.. ఎందుకోగాని మావాడు అప్‌సెట్ అయ్యాడు’’ కొండబాబు చెప్పాడు.
ఆ మాటకి పరమేశ్వరం ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఆటో ఎక్కి కూర్చున్నాడు.
****
రాత్రి పది గంటల సమయంలో హిమజ ఫోన్ చేసింది అనిరుధ్‌కి. అంతకు అరగంట ముందే పరమేశ్వరం వెళ్లిపోయాడు.
‘‘ఏంటి అనిర్?.. రెండు రోజులుగా ఫోన్ లేదు.. వాట్ హాపెన్డ్.. ఆర్ యూ ఆల్ లైట్?’’ అడిగిందామె.
‘‘అయామ్ ఓకె.. హిమా...’’ అని రెండు రోజులుగా జరిగిన పరిణామాలు వివరించాడు హిమజకి.
ఆమె రెండు క్షణాలు వౌనంగా ఉండి అన్నది: ‘‘ఇక మిగిలింది ఒక్కడేనా.. మీ కొత్త ఫ్రెండు పరంగారు చెప్పినట్లు జరిగే అవకాశం ఉండొచ్చునని నాకూ అనిపిస్తోంది అనిర్!.. అంటే... ఆ మిగిలినవాడు కావచ్చు.. కాకపోవచ్చునని..’’
‘‘వాడూ కాకపోతే..?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘కాకపోతే!.. అక్కడితోనీ అనే్వషణ ఆపేయ్ అనిర్..’’
అనిరుధ్‌కి ఏం మాట్లాడాలో తోచలేదు. అసలు ఈ పనిలో ముందుకెళ్లాలో వద్దో కూడా అతడికి ఏమీ పాలుపోవడంలేదు. ఆ మాటే చెప్పాడామెకు.
‘‘అదే నేను చెప్పేది కూడా అనిర్!.. ఇక చాలు.. చాలా ప్రయత్నించావ్.. ఆపెయ్.. మనం పెళ్లి చేసుకుందాం.. అన్నీ మర్చిపోవయి హ్యాపీగా ఉందాం..’’ అన్నదామె.
‘‘అంతేనా?.. నా తండ్రి అన్న పదం నాకు ఒక మిస్టరీగానే ఉండిపోతుందా ఈ జన్మకి..?’’ అర్థంలేని ప్రశ్నవేశాడు.
‘‘ఇంకా ఒక ప్రయత్నం ఉందన్నావ్ కదా.. అది పూర్తిచెయ్యి.. అప్పుడూ నీకు తెలియకపోతే.. ఇక వదిలెయ్..’’
‘‘ఆ పనే చేస్తాను హిమా!.. లాస్ట్ ఎటెమ్ట్..’’
‘‘ఇంకేమిటి విశేషాలు?..’’
‘‘ఏమున్నాయ్ హిమా?.. నిద్ర లేని రాత్రిళ్ళు.. నీకు దూరంగా ఉంటున్నానన్న అదో వెలితి..’’
‘‘అర్థం చేసుకోగలను అనిర్.. కొన్ని రోజులే కదా?!.. కొండబాబు బావున్నారా?’
‘‘ఆ.. వాడే నాకిక్కడ కొండంత అండ.. వాడికితోడు.. పరమేశ్వరం.. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు హిమా..’’
‘‘అవునుకదా...’’
‘‘మంచివాళ్లకి అంతా మంచే జరుగుతుంది అనిర్!..’’
‘‘కానీ.. నా జన్మ విషయంలో మాత్రం ఒక చెరుపుకోలేని మచ్చ..’’ గద్గ్ధికంగా అన్నాడు అనిరుధ్.
‘‘వద్దు అనిర్!.. అలా బాధపడొద్దు.. కర్మ సిద్ధాంతం ప్రకారం నడుచుకుందాం.. ఎప్పుడో ఏ జన్మలోనో ఏదో పొరపాటు చేశావ్.. ఆ ఫలితమే ఇది అని సరిపెట్టుకుందాం.. భరిద్దాం అనిర్!.. ఒక చిన్న పీడకలగా భరిద్దాం..’’ అనునయించిందామె.
‘‘అంతే హిమా!.. అంతే!’’
‘‘ప్లీజ్.. మామూలుగా మాట్లాడు అనిర్!.. మొన్న మా నాన్న వచ్చారు ఇక్కడికి.. ఊరికే నన్నూ, బాబాయ్‌ని చూద్దామని.. అప్పుడు నీ విషయం చెప్పాను.. కులగోత్రాలు అడగొద్దన్నాను.. అదెలా అమ్మలూ అన్నారు. మంచి సంస్కారమున్న వ్యక్తి నాన్నా.. గొప్ప కులంలో పుట్టినవాళ్లు కూడా అంత సంస్కారం కలిగి ఉండరని చెప్పాను.. ఆయన ఏమీ మాట్లాడలేదు.. బాబాయ్‌కి చెప్పారు.. నిన్ను చూసి, నీతో మాట్లాడమని.. బాబాయ్ మాటమీద మా నాన్నకి నమ్మకం ఎక్కువ ఏదీ తొందరపడకుండా, బాగా ఆలోచించి చేస్తాడని.. నువ్వు ఎప్పుడొస్తావా అని నేనూ, బాబాయ్ ఎదురుచూస్తున్నా అనిర్!’’ ఒక్కొక్క అక్షరం వత్తి పలుకుతూ చెప్పిందామె.
అనిరుధ్ వెంటనే ఏమీ మాట్లాడలేదు. వౌనంగా ఉండిపోయాడు.
‘‘అనిర్!..ఏమిటి మాట్లాడవ్?’’ అనడిగిందామె.
‘‘సంస్కారం నాది కాదు హిమా!.. మీ నాన్నగారిది.. ఆయన మంచి నీకూ ఆ మంచి సంస్కారం అబ్బింది..’’ అన్నాడు.
‘‘పోనీ అలాగే అనుకో.. మాలాటివాళ్లకి నువ్వు దొరికావు..’’ అన్నదామె చిన్నగా నవ్వి. అనిరుధ్ కూడా చిన్నగా నవ్వేశాడు.
మరో రెండు నిముషాలు మాట్లాడి ఆమె ఫోను పెట్టేసింది. టీవీచూస్తూ కూర్చున్న కొండబాబు టైము చూసి టీవీ కట్టేశాడు.
‘‘ఏరా పరమేశ్వరంగారు రేపు ఎప్పుడొస్తారన్నారు? ఆయన వెళ్లేప్పుడు నేను బాత్‌రూములో ఉన్నాను.. ఏమన్నా చెప్పారా?’’ అనడిగాడు అనిరుధ్‌ని కొండబాబు.
‘‘ఉదయం వస్తానన్నార్రా.. బ్రేక్‌ఫాస్ట్‌కే రమ్మన్నాను.. వస్తానన్నారు.. కనకారావు విషయం మాట్లాడదాం అన్నారు..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘వాడి విషయంలో ఏదో ప్లాన్ వెయ్యాలన్నారాయన..’’ ఆ మాటకి అనిరుధ్ సమాధానం చెప్పలేదు. ఎటో చూస్తూ ఉండిపోయాడు.
‘‘ఇదేవౌతుందనుకుంటున్నావ్ నువ్వు?’’ కాస్సేపయ్యక అడిగాడు అనిరుధ్, కొండబాబుని.
‘‘నాకేం అర్థం కావడంలేదురా!.. కాకపోతే పరమేశ్వరంగారన్నట్లు ఏదైనా జరగచ్చనిపిస్తోంది..’’
‘‘అంటే.. వీడూ కాక.. మరొకరెవరైనా.. అనా..?’
‘‘ఊ...’’
‘‘నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడంలేదు నాకు...’’ ఒక విధమైన చీదరింపుగా అన్నాడు అనిరుధ్.

- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842