డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదహారు మంది గొప్ప రాజులు మరణించి చాలా కాలమైనప్పటికీ వారు చేసిన దానాలవల్ల వారి శౌర్య పరాక్రమాల వల్ల ఈనాటికీ వారిని గుర్తు చేసుకుంటాము. ఈ ఉపాఖ్యానంలో ఆ పదహారు రాజులలో కొంతమంది రాజుల గురించి తెలుసుకుందాము.
1. సృంజయుని కధ
శైబ్యుడు అనే రాజు యొక్క కుమారుడు సృంజయుడు. అతనికి పర్వత నారదులు అనే ఋషులు మిత్రులుగా ఉండేవారు. వారు ఒకసారి అతన్ని కలువాలని అతని ఇంటికి వచ్చారు. ఆయన వారిని చక్కగా సత్కరించాడు. వారిద్దరూ అక్కడే ఉన్నారు. వారు ముగ్గురు కూర్చుని మాటలాడుతుండగా ఒక సౌందర్యవతి అయిన కన్య వారి దగ్గరకు వచ్చింది. తన పక్కన నిలిచిన ఆమెను రాజు ఆశీర్వదించాడు. నారదుడు నవ్వుతూ ‘‘ఈ సౌందర్యవతి ఎవరి పుత్రిక? ఈమె సూర్యకాంతియా? లేక హ్రీయా, శ్రీయా, కీర్తి, ధృత ఎవరు?’’ అని అడిగాడు.
దానికి రాజు ‘‘్భగవాన్! ఈమె నా కుమార్తె. నా నుండి వరం కోరుతున్నది’’ అని పలికాడు.
అప్పుడు నారదుడు ఆమెను తనకిచ్చి వివాహం చేయుమన్నాడు. దానికి సృంజయుడు ఒప్పుకొని ‘‘అలాగే ఆమెను నీ భార్యను చేస్తాను’’ అని పలికాడు.
దీనితో మిక్కిలి కోపించిన పర్వతుడు ఇలా అన్నాడు. ‘‘ద్విజా! ముందుగా నేను వరించిన కన్యను నీవు వివాహం చేసుకుందామని అనుకుంటున్నావు. కనుక నీవు నీ ఇష్టానుసారం స్వర్గానికి వెళ్లకుందువుగాక’’.
నారదుడు వెంటనే ఇలా అన్నాడు. ‘‘మనస్సులో సంకల్పించి మాటతో ప్రతిజ్ఞ చేసి, జలాన్ని తీసుకొని చేసే కన్యాదానం, వరుడు కన్యా పాణిగ్రహణం చేయటం, వైదిక మంత్రాలు చదవడం ఇవన్నీ జరిగితేనే వివాహం అనబడుతుంది. సప్తపదితో వివాహం పూర్తి అవుతుంది. కనుక ఈ కన్య మీద నీకు అధికారం లేదు. అయినా నీవు నన్ను శపించావు కనుక నేనుకూడా నిన్ను శపిస్తున్నాను. నీవు కూడా స్వర్గానికి వెళ్లలేవు’’.
తర్వాత రాజు మగ సంతతి కోసం యాగాలు చేయించి వారికి దానాలు ఇచ్చాడు. వారు అతనికి పుత్ర సంతతి కలగాలని దీవించారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు. ‘‘నీకు ఎలాంటి పుత్రుడు కావాలి?’’
అప్పుడు రాజు తనకు యశస్వి, కీర్తిమంతుడు, శత్రు నాశకుడు బంగారు గని కావాలి అని కోరుకున్నాడు. అలాగే జరుగుతుందని నారదుడు చెప్పాడు.
కొన్నిరోజులకు రాజుకు పుత్రుడు కలిగాడు. రాజు కోరినట్లు అతను బంగారపు గని అయ్యాడు. ఆ బాలుడు ఏడిస్తే కారే కన్నీరు బంగారం అయ్యేది. ఆ బాలునికి సువర్ణష్ఠీవి అని పేరు కలిగింది.
రాజుకు ధనం బాగా పెరిగింది. అతని భవనంలో సమస్తమూ బంగారం అయిపోయాయి. దోపిడీ దొంగలకీ విషయం తెలిసింది. వారు రాజభవనంలోకి ప్రవేశించి రాజకుమారుని ఎత్తుకుపోయారు. అతన్ని అడవికి తీసుకొని వెళ్లి అతని పొట్ట చించి చంపివేశారు. అందులో వారికి ఏ బంగారము కన్పించలేదు. ఆ బాలుని ప్రాణాలు పోవటం వలన వరం వల్ల బంగారం ఇచ్చే శక్తి పోయింది. దొంగలు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు.
ముని వరం చేత పుట్టిన పుత్రుడు మరణించటంతో రాజు దుఃఖంతో విలపించసాగాడు. ఈ సంగతి తెలిసి నారదుడు మళ్లీ అతని దగ్గరకు వచ్చాడు. రాజుతో ఇలా అన్నాడు - ‘‘మహారాజా! శోకాన్ని విడిచిపెట్టు. నీవు వివేకవంతుడివి. నువ్వెంత ఏడ్చినా మరణించిన నీ కుమారుడు బ్రతుకడు. కనుక మోహాన్ని వదులు. ఎందరో ధనవంతులు యజ్ఞాలు చేసిన పుణ్యాత్ములు మరణించారు’’ ఇలా నారదుడు పదహారు మంది గొప్ప రాజుల గురించి సంజయునికి చెప్పి ఇలా అన్నాడు. ‘‘రాజా! ఇప్పటికైనా నీ శోకం పోయిందా లేదా?’’
అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు - ‘‘మహర్షీ! మీరు చెప్పిన రాజుల చరిత్ర విన్న తర్వాత నా శోకం పోయింది. ఇప్పుడు చెప్పండి నేను ఏం చెయ్యాలో?’’
నారదుడు ఇలా అన్నాడు ‘‘్భగవదనుగ్రహం కలిగిన వారికి ఈ లోకంలో దుర్లభమైనదేదీ ఉండదు. దొంగలు నీ కుమారుని అన్యాయంగా చంపేశారు. కనుక నీ కుమారుని తిరిగి నీకిస్తాను’’ నారదుడు ఇలా అనగానే సృంజయుని కుమారుడు బ్రతికి వచ్చాడు. కుమారుని చూసి రాజు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. నారదుని ఎన్నో విధాలుగా సత్కరించి పూజించాడు.
2. సుహోత్రుని కథ
సుహోత్రుని దేవతలు కూడా కనె్నత్తి చూడగలిగేవారు కారు. అతను ఋత్విక్కులను, బ్రాహ్మణులను, పురోహితులను తనకు శ్రేయస్సు కలిగించే విషయాలు అడిగేవాడు. వారు చెప్పినట్లు నడుచుకొనేవాడు. ఆయన ధర్మప్రకారం ప్రజాపాలన చేసేవాడు. బాణప్రయోగంతో శత్రువులను జయించేవాడు. తన సద్గుణాలతో సమస్త ప్రాణులను సంతోషపెట్టేవాడు. అతని కాలంలో మ్లేచ్ఛులు, ఆటవికులు అతని రాజ్యంలో లేరు. అతని కోసం మేఘాలు బంగారాన్ని వర్షించాయి. ఆ సుహోత్రుడు కురుజంగాల దేశంలో య*్ఞం చేస్తూ అనంతమైన బంగారం బ్రాహ్మణులకు దక్షిణ రూపంలో ఇచ్చాడు. ఆ రాజు నిత్యనైమిత్తికాలు, కామ్యాలు అయిన యజ్ఞాలు చేశాడు. ఇవేకాక ఎన్నో అశ్వమేథాలు, రాజసూయ యాగాలు చేశాడు. అతను ధర్మ, జ్ఞాన, వైరాగ్యాలలో శ్రేష్ఠుడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి