డైలీ సీరియల్

అన్వేషణ -58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒరేయ్ కొండబాబూ.. పద్మని నేను అనుభవించిన మాట నిజమే.. ఒకసారే.. కానీ..’’ ప్రకాశం బెరుకుగా కొండబాబుకే వినిపించేటట్లు చెప్పాడు.
‘‘అయితే ఇపుడు నువ్వు కామ్‌గా ఎవరికీ తెలీకుండా డిఎన్‌ఎ టెస్టుకి ఒప్పుకో.. జస్ట్ అవునా కాదా అని నిర్థారించుకోవడానికే.. ఆ తర్వాత సమస్యేం ఉండదు.. ఆ గ్యారంటీ నేనిస్తాను.. ఒకవేళ నీ డిఎన్‌ఎతో అనిరుధ్ డిఎన్‌ఎ మ్యాచ్ కాలేదనుకో.. అసలు సమస్యే లేదు..’’ చెప్పాడు కొండబాబు.
ప్రకాశం ఆలోచనలో పడ్డాడు.
‘‘చూడు బాబాయ్.. అసలు తనకి తండ్రెవరో తెలుసుకోవటానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనిరుధ్. అంతకుమించి అతడేం ఆశించడంలేదు..’’ మళ్లీ కొండబాబే చెప్పాడు.
‘‘పోనీ నేనొప్పుకుంటే చాలా?..’’ అడిగాడు ప్రకాశం.
‘‘చాలదు.. కచ్చితంగాతేలాలి.. అలా ఎవడినో నాకు తండ్రిగా చెప్పుకోవటం నాకిష్టంలేదు..’’ గంభీరంగా చెప్పాడు అనిరుధ్.
అతడు చెప్పిన తీరు ప్రకాశానికి ఎందుకో తెలీదు భయంగా అనిపించింది. ఇపుడు తాను కాదన్నా వాళ్ళిద్దరూ తనను తన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని కూడా అతడికి అర్థమయ్యింది.
‘‘పదండి..’’ అన్నాడు ఇంతదూరం వచ్చాక ఏదైతే అదవుతుందని.
అతడిని తీసుకుని కొండబాబు, అనిరుధ్ డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో మాట్లాడి ప్రకాశాన్ని చూపించారు. తర్వాత చేయాల్సిన పనులన్నీ డాక్టర్ శ్రీనివాస్ చకచకా చేశాడు.
ప్రకాశాన్ని పంపేసి, ఇద్దరూ ఇంటికొచ్చారు. ముందుగదిలో కూర్చున్నాక హిమజకి ఫోన్ చేశాడు అనిరుధ్. వైజాగ్‌లో చివరగా జరిగిన పరిణామాలన్నీ చెప్పాడు. ఇక్కడ కొత్తగా వెలుగులోకి వచ్చిన ప్రకాశం ఉదంతం గురించి చెప్పాడు.
‘‘ఇదే లాస్ట్ హిమజా! దీని ఫలితం ఎలాగున్నా ఇంక ఈ అనే్వషణకి ఫుల్‌స్టాప్ పెడతాను.. ఇంక దాని గురించి పట్టించుకోను.. హిమజా! నువ్వు వెంటనే బయల్దేరి ఇక్కడికి వచ్చెయ్.. ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలని ఉంది. వచ్చెయ్ హిమా!’’ అన్నాడు బేలగా.
‘‘వస్తున్నాను అనిర్!.. నాకూ నిన్ను చూడాలని ఉంది. మరీ మొన్నటినుంచీ అనిపిస్తోంది.. ఈ రాత్రి బస్సుకే వస్తున్నాను.. రిసీవ్ చేసుకో...’’ అన్నదామె.
***
ఉదయం ఆరుగంటలకి హిమజ వచ్చింది. అనిరుధ్ బస్సు డిపోకి వెళ్లాడు. ఆటోలో ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ముందురోజు రాత్రి అమ్మమ్మకి మా ఫ్రెండు ఒకామె వస్తుందని చెప్పాడే కానీ అంతకుృ మించిన వివరాలు చెప్పలేదు.
హిమజ రాగానే అమ్మమ్మకి రెండుచేతులూ జోడించి నమస్కరించింది. అనిరుధ్ ఆమెను పరిచయం చేశాడు. పేరు చెప్పలేదు. ఎక్కడో చూసినట్లు అనిపించింది కానీ గుర్తురాలేదు అమ్మమ్మకి. ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకుని ఆహ్వానించింది.
హిమజ కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసివచ్చింది. దేముడి పీఠం దగ్గర కూర్చుని పది నిముషాలు ధ్యానం చేసింది. పూజ చేసింది. ఆమె అలా చేస్తుంటే అమ్మమకి మనస్సులో ఏవేవో ఆలోచనలు మెదిలాయి. తన మనవడు ఫోన్‌లో చూపించిన అమ్మాయిలాగా ఉంది అనుకున్నది.
ఆమె ధ్యానం, పూజ అయ్యాక, టిఫిన్ పెట్టింది. కాఫీ ఇచ్చింది. అప్పుడు అమ్మమ్మని పిలిచాడు అనిరుధ్. అమ్మమ్మా ఈమె గురించే నేను నీకు చెప్పాను.. పేరు హిమజ! మేమిద్దరం ఇష్టపడ్డాం... నేను ఈమెనే పెళ్లిచేసుకుంటానే అమ్మమ్మా..’’ అన్నాడు.
‘‘మానాయనే ఎంత మంచి అమ్మాయిని తెచ్చుకున్నావురా. ఇందాకటినుంచీ ఆలోచిస్తున్నానుగానీ గుర్తుకు రావడంలేదు. నువ్వు నీ ఫోన్‌లో ఫొటో చూపించావుకదరా.. నా మతిమరపు ఏడ్చినట్లే ఉంది.. నా మనవరాలు చాలా బాగుందిరా.. ఆమె పూజ చేస్తుంటే అనుకున్నాను, ఇలాంటి అమ్మాయి నా మనవడికి భార్యగా రావాలని.. వచ్చిందిరా.. చాలా సంతోషంరా అనిరూదూ.. కొండబాబుకీ, వాళ్లమ్మకి చెప్పరా.. సంతోషిస్తారు..’’ అన్నదామె హిమజ దగ్గరగావచ్చి ఆమెను పొదివి పట్టుకుని ఆత్మీయంగా దగ్గరికితీసుకుంటూ.
మరో అరగంటకి కొండబాబు భార్య సావిత్రిని తీసుకుని వచ్చాడు. నిన్న రాత్రి హిమజని రమ్మని అనిరుధ్ మాట్లడుతున్నపుడు అతడు అక్కడే ఉన్నాడు. అందుకే ఆమెను చూడ్డానికి సతీసమేతంగా వచ్చాడు కొండబాబు.
(ఇంకా ఉంది)
=======================================================================
అడవిలో..
పోలీసుల తుపాకుల ధనాధన్..
ఎటుచూసినా రక్తం అంటిన ఆయుధాలు..
ఖండఖండాలుగా మానవ శరీర భాగాలు..
బూడిద కుప్పలూ..
పీనుగులూ..
పైన తిరిగే రాబందులూ..
శవాలపై ఈగలూ.. కమురువాసనా..
క్షతగాత్రుల ఆర్తనాదాలు..
గూడుకట్టే శ్మశాన నిశ్శబ్దం..
అలా ఓ కాళరాత్రి కాలగర్భంలో కలిసిపోయింది.. తెల్లవారింది..
భూగోళానికి మరోవైపు సత్యాలను శోధించి వచ్చిన కర్మసాక్షి కారడవిలోకి తొంగి చూశాడు..
కానీ పరిసరాల్లో ఎక్కడా అడవిపుత్రుల జాడలేదు..
అడవిపూల సుగంధాల ఆనవాళ్ళు లేవు..
గాలి కలుషితమైంది..
అడవి వెనె్నల మురికిపడింది..
వన్యమృగాల సంచారం లేదు..
కొండదేవర కొలువున్న నల్లగొండ
ఆక్రమణకు గురైంది..
దేవర వలసపోయాడు..
అజ్ఞాతవాసం చేస్తున్న కొండగుహలే ఇప్పుడు
రెడ్డినాయక్ తండా..
స్వార్థపరుల చేతిలో మాయమవుతున్న
అడవి తండాల చరిత్ర..
తరతరాల చరిత్ర..
అంతులేని చరిత్ర..
చదవండి.. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే
గోపరాజు నాగేశ్వరరావు కలం నుంచి జాలువారిన "‘అనంతం’ సీరియల్.. అతి త్వరలో...

సర్వజిత్ 9010196842