డైలీ సీరియల్

అన్వేషణ -60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లు ఇంటి గుమ్మం ఎక్కుతుండగా బైక్‌మీద కొండబాబు, ప్రకాశం వచ్చేసరికి అతడికి పరిస్థితి అర్థం కాలేదు. ఏదో జరిగిందని మాత్రం అతడి మనస్సు కీడు శంకించింది.
భార్యని పిలిచాడు. భూదేవి గబగబా వచ్చి చూసింది. అప్పటికే ముందు గదిలోకి వచ్చారు తల్లి మాణిక్యమ్మ, మేనల్లుడు అనిరుధ్, హిమజ, సావిత్రి, ఆమె అత్తగారు. వాళ్ల వెనకనే ముఖం వేళాడేసుకుని ప్రకాశం వచ్చాడు కొండబాబుతో.
‘‘నీతో మాట్లాడదామని వచ్చాను..’’ అన్నాడు అనిరుధ్ మేనమామవైపు సూటిగా చూస్తూ. అతడి ధోరణి సత్యానికి మరీ ఆశ్చర్యం కలిగించింది.
‘‘ఏ విషయం..?’’ అడిగాడు సత్యం లేని బింకాన్ని తెచ్చుకుంటూ. మనసు పొరల్లో ఏదో లీలగా అతడిని కెలుకుతోంది.
‘‘మొన్నటిదాకా నేను కులం గోత్రం లేనివాడిగా మీ అందరి దృష్టిలో అవమానాలు పాలయ్యాను..నువ్వు నన్ను పీక నులిమి చంపెయ్యమని అమ్మమ్మకి సలహా ఇచ్చావ్.. కానీ నేను కులం, గోత్రం లేనివాడిని కాదు మామయ్యా..’’ అనిరుధ్ అన్నాడు ఏ భావమూ ముఖంలో ప్రదర్శించకుండా.
‘‘ఇప్పుడవన్నీ ఎందుకు?.. అయినా అది నిజమే కదా..’’ సత్యం అన్నాడు.
‘‘కాదు!.. నిజంకాదు.. నాకు నాన్న ఎవరో ఇపుడు తెలిసింది.. ఆ దుర్మార్గుడు మీ బావమరిది..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘ఏమిటి నువ్వు మాట్లాడేది?.. నీకేమన్నా పిచ్చెక్కిందా?’’ అంతెత్తున లేచింది భూదేవి.
‘‘లేదు.. పిచ్చెక్కలేదు.. ఇప్పుడు చాలా నిజాలు తెలిశాయి.. చెప్పు ఆ నిజాలేమిటో..’’ అంటూ ప్రకాశాన్ని ముందుకు తోశాడు అనిరుధ్.
ప్రకాశం తలవంచుకుని నిల్చున్నాడు.
‘‘వౌనంగా ఉంటే కాదు.. చెప్పు బాబాయ్.. ’’ కొండబాబు ప్రకాశం ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు గద్దించినట్లు.
‘‘అవును బావా.. పద్మని నేను చెరిచాను.. ఫలితంగానే వీడు పుట్టాడు.’’ తల వంచుకునే చెప్పాడు ప్రకాశం.
‘‘ఆళ్లెవరో ఎదవపని చేస్తే పుట్టాడు వీడు.. నీకేంటి సంబంధం’’ భూదేవి అరిచినట్లు అన్నది.
‘‘ఇదిగో.. వీడే నాకు నాన్న అని డాక్టర్ ఇచ్చిన రిపోర్టు.. అంటే డిఎన్‌ఎ పరీక్ష.. అంటే నా వంట్లో వున్న కణాలు, మీ తమ్ముడి ఒంట్లో వున్న కణాలు ఒకటే అని తేల్చి చెప్పిన రిపోర్టు.. నేను కులం తక్కువవాడిని కాదు అత్తమ్మా.. మీ తమ్ముడు చేసిన ఓ నీచమైన పనికి పుట్టినవాడిని.. ఈ విషయం చెబుదామనే వచ్చాం.. చూడు మామయ్యా.. ఈ అమ్మాయి హిమజ.. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. నేను ఎవరో, ఏమిటో తెలిసి కూడా నన్ను కావాలని వచ్చిన అమ్మాయి. నా ఉద్యోగం చూసి, నా జీతం చూసి రాలేదు.. కులం తక్కువవాడు నీకు అల్లుడు కావడం నీ మర్యాదకి భంగం కదా..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘్భదేవీ! నన్నూ, నా కూతుర్నీ నానా మాటలూ అన్నావే.. కానీ నీ తమ్ముడు చేసిన పనేమిటి.. ఒక మతిస్థిమితం లేని అమ్మాయిని లొంగదీసుకుని కడుపు చేశాడు.. దుర్మార్గుడు కాక మరేమిటి? సిగ్గులేదట్రా.. దగుల్బాజీ వెధవా!... మీ అక్క పెద్ద నీతిమంతుల కుటుంబం అంటూ మాట్లాడుతుంది మా దగ్గర.. ఇదేనా మీ నీతి?’’ అమ్మమ్మ నోటికొచ్చినట్లు దులిపేసింది దొరికిన అవకాశాన్ని వదలకుండా. ఆమెకు కోడలు అహంకారంమీద ఎప్పటినుంచో చాలా కోపంగా ఉంది.
సత్యానికి తల కొట్టేసినట్లయింది. బావమరిది ప్రకాశాన్ని చాచిపెట్టి చెంపదెబ్బ వేశాడు. భూదేవికి కూడా తల తీసేసినట్లయ్యింది.
‘‘్ఛ! దరిద్రుదా.. ఒళ్లు కొవ్వెక్కి చచ్చావా? పోనీ తమ్ముడివి కదా ఇంట్లో ఉండనిస్తే నాకు తలవంపులు తెస్తావా, తలకుమాసినవాడా.. ఛీ! తమ్ముడి ముఖంమీద ఉమ్మేసినంత పనిచేసి విసవిసా లోపలికి వెళ్లిపోయింది భూదేవి.
ఇంక అక్కడ ఘర్షణ వాతావరణం అలముకుంటోందని గ్రహించిన కొండబాబు- ‘‘పదరా అనిరుధ్.. ఇంతకన్నా వాళ్లకి సిగ్గుచేటైన విషయం మరేం లేదు.. పద..’’ అంటూ బయటికి తీసుకెళ్లాడు. ఆ వెనుకే అందరూ బయటికి వచ్చేశారు.
అరగంటలో ఇంటికొచ్చేరు. అంతా ముందుగదిలో కూర్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడుకోవడంలేదు. ఏదో స్తబ్దత. ఈ విషయాలన్నీ వైజాగ్‌లోని పరమేశ్వరానికి ఫోన్ చేసి చెప్పాడు కొండబాబు.
‘‘అవునా!.. మొత్తానికి సాధించాడు అనిరుధ్..నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పు కొండబాబూ.. ఇపుడు నేను హ్యపీగా హైదరాబాద్ వచ్చేస్తున్నానని కూడా చెప్పు..’’ అన్నాడు పరమేశ్వరం.
కొండబాబు ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చాడు. అక్కడ వాళ్లంతా ఇంకా అలాగే కూర్చుని ఉండడం చూసి భార్య సావిత్రివైపు చూశాడు అర్థవంతంగా. ఆ చూపులు అర్థం చేసుకున్నదో ఏమో ఆమె-
‘‘అన్నయ్యా.. ఇంక నీ సందేహాలన్నీ తీరిపోయాయి.. తొందరగా పెళ్లిచేసుకుని మాకు పప్పన్నం పెట్టెయ్యి..’’ వాతావరణాన్ని తేలికపర్చేందుకన్నట్లు అన్నది సావిత్రి.
‘‘అవున్రా అనిరుదూ.. పెళ్లికూతురు రెడీగా ఉంది.. మా కోడలు చెప్పినట్లు తొందరలోనే ఆ మూడు ముళ్లూ వేసేసి మాకు పప్పన్నం పెట్టెయ్యరా..’’ కొండబాబు తల్లి చెప్పింది నవ్వుతూనే.
‘‘ఒరే! కొండలూ.. రేపు పంతులుగారిని పిలవరా ముహూర్తాలు కనుక్కుందాం..’’ అమ్మమ్మ అన్నది.
‘‘అమ్మమ్మా!... హిమజ నాన్నగారితో మాట్లాడాలి. అపుడు ఆ తతంగమంతాను..’’ అనిరుధ్ అన్నాడు నెమ్మదిగా.
‘‘ఆ విషయం కొండబాబు చూసుకుంటాడులేరా..’’ చెప్పిందామె!
‘‘అవును కదా!.. హిమజ అన్నది. అంతా నవ్వేశారు.
-శుభం
====================================================================
అడవిలో..
పోలీసుల తుపాకుల ధనాధన్..
ఎటుచూసినా రక్తం అంటిన ఆయుధాలు..
ఖండఖండాలుగా మానవ శరీర భాగాలు..
బూడిద కుప్పలూ.. పీనుగులూ.. పైన తిరిగే రాబందులూ..
శవాలపై ఈగలూ.. కమురువాసనా..
క్షతగాత్రుల ఆర్తనాదాలు.. గూడుకట్టే శ్మశాన నిశ్శబ్దం..
అలా ఓ కాళరాత్రి కాలగర్భంలో కలిసిపోయింది..
తెల్లవారింది..
భూగోళానికి మరోవైపు సత్యాలను శోధించి వచ్చిన
కర్మసాక్షి కారడవిలోకి తొంగి చూశాడు..
కానీ పరిసరాల్లో ఎక్కడా అడవిపుత్రుల జాడలేదు..
అడవిపూల సుగంధాల ఆనవాళ్ళు లేవు..
గాలి కలుషితమైంది.. అడవి వెనె్నల మురికిపడింది..
వన్యమృగాల సంచారం లేదు.. కొండదేవర కొలువున్న నల్లగొండ
ఆక్రమణకు గురైంది.. దేవర వలసపోయాడు..
అజ్ఞాతవాసం చేస్తున్న కొండగుహలే ఇప్పుడు
రెడ్డినాయక్ తండా..
స్వార్థపరుల చేతిలో మాయమవుతున్న
అడవి తండాల చరిత్ర.. తరతరాల చరిత్ర.. అంతులేని చరిత్ర..
చదవండి.. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే
గోపరాజు నాగేశ్వరరావు కలం నుంచి జాలువారిన ఆనంతం
సీరియల్... రేపటినుంచి...

సర్వజిత్ 9010196842